
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా పంచుకుంది. తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా.. ఈ బుల్లితెర భామ యే హై మొహబ్బతీన్ బాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది.
తాజాగా షేర్ చేసిన వీడియోలో బేబీ బంప్‌తో కనిపించింది. కాగా.. ఆమె హసన్ సర్తాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో ఆమె స్వస్థలమైన జైపూర్‌లో వివాహం చేసుకుంది. షిరీన్ మీర్జా ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. బాలీవుడ్‌లో యే హై చాహతీన్, బహుత్ ప్యార్ కర్తే హై, యే కహా ఆగయా హమ్, ధర్మక్షేత్ర్ లాంటి సీరియల్స్‌లో నటించింది.