పని ఒత్తిడి.. అన్ని చోట్లా ఉంది. వెండితెర ప్రపంచం అందుకు మినహాయింపు కానేకాదు. బుల్లితెరలోనూ ఈ ఒత్తిడి అధికంగానే ఉందంటోంది నటి క్రిస్టల్ డిసౌజ. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నా సంపాదన రోజుకు రూ.2,500. రోజులో కేవలం 12 గంటలు మాత్రమే షూట్ చేయాలి వంటి నిబంధనలు అప్పట్లో లేవు.
60 గంటలపాటు షూటింగ్
అలా నేను ఓసారి నాన్‌స్టాప్‌గా 60 గంటలపాటు షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో చాలాసార్లు సెట్‌లోనే కిందపడిపోయాను. అప్పటికీ వాళ్లు వదల్లేదు. నాకు మెడిసిన్ ఇచ్చి మళ్లీ షూట్‌లో జాయిన్ అవమని చెప్పేవాళ్లు. కనీసం హాస్పిటల్‌కు వెళ్లేంత సమయం కూడా ఇచ్చేవారు కాదు. అది నాపై చాలా ప్రభావం చూపింది. నా వల్ల కాకపోయినా అది నా పని కాబట్టి చేయక తప్పలేదు.
సీరియల్స్, సినిమాలు
ఏదేమైనా టీవీ ఇండస్ట్రీ నన్ను స్ట్రాంగ్‌గా మార్చింది. పారితోషికం కూడా మెరుగ్గానే ఉండేది. ఐదారేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నా కూడా నా ఇంటిని నడపగలను అని చెప్పుకొచ్చింది. కాగా క్రిస్టల్ డిసౌజ.. ఏక్ హజరాన్ మే మేరి బెహ్నా హై సీరియల్‌తో ఫేమస్ అయింది. 2018లో చివరగా బేలన్ వాలి బాహు సీరియల్‌లో నటించింది. చెహ్రె మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఈ మధ్యే విస్ఫోట్ సినిమాతో ఆకట్టుకుంది.
చదవండి: చెత్త ఫెలోస్.. మణికి నరకం చూపిస్తున్నారు! గొడవల మధ్యలో లవ్ ట్రాక్ ఒకటి..
Comments
Please login to add a commentAdd a comment