మణికి పట్టపగలే చుక్కలు.. నోరు మూసుకుంటా ప్లీజ్‌ అంటూ ఎమోషనల్‌ | Bigg Boss Telugu 8: Prithvi Sing a Love Song for Vishnu Priya | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: చెత్త ఫెలోస్‌.. మణికి నరకం చూపిస్తున్నారు! గొడవల మధ్యలో లవ్‌ ట్రాక్‌ ఒకటి..

Published Thu, Sep 26 2024 4:17 PM | Last Updated on Thu, Sep 26 2024 4:29 PM

Bigg Boss Telugu 8: Prithvi Sing a Love Song for Vishnu Priya

ఇప్పటిదాకా కంటెస్టెంట్లు తాము ఎలిమినేట్‌ కాకుండా మరిన్ని వారాలు హౌస్‌లో ఉండేందుకు ఆటాడారు. ఇప్పుడేమో బయట నుంచి వచ్చే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ పెట్టిన రెండు ఛాలెంజ్‌లలో కాంతార ఒకటి గెలిచి 12 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను కాస్తా 11కి తీసుకొచ్చింది. ఈ సంఖ్యను ఇంకా తగ్గించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్‌.

లవ్‌ సాంగ్‌..
పట్టుకుని ఉండు, పగిలిపోతుంది అని మూడో టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పృథ్వీ, నబీల్‌ హోరాహోరీగా పోరాడారు. చివరికి పృథ్వీ శక్తి టీమ్‌ను గెలిపించాడు. ఈ టాస్క్‌ మధ్యలో బిగ్‌బాస్‌.. పృథ్వీని ఓ పాట పాడమన్నాడు. అతడు లవ్‌ సాంగ్‌ పాడగా ఇది ఎవరికోసమో? అని నబీల్‌ అడిగాడు. అందుకు పృథ్వీ క్షణం ఆలోచించకుండా విష్ణుప్రియ పేరు చెప్పాడు. ఇంకేముంది.. ఆ మాటకు విష్ణు సిగ్గుపడుతూనే తెగ మురిసిపోయింది.

త్యాగం చేయలేదన్న మణి
మరో ప్రోమోలో గెలిచిన శక్తి టీమ్‌.. కాంతార టీమ్‌లో ఒకరిని తొలగించాలన్నాడు. అందుకు వాళ్లంతా స్ట్రాంగ్‌ ప్లేయర్‌ నబీల్‌ను సైడ్‌ చేశాడు. ఈ నిర్ణయం కాంతార టీమ్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలో పెద్ద రభసే జరిగింది. అసలు మీ టీమ్‌లో నుంచి మణిని ఎందుకు తీసేశారని ప్రేరణ అడగ్గా అతడే త్యాగం చేశాడని సోనియా అంది. అవునా? అని ప్రేరణ ప్రశ్నించగా లేదని మణి బోర్డు తిప్పేశాడు. 

నోరు మూసుకుని కూర్చుంటా
దీంతో సోనియా, యష్మి.. అతడికి చుక్కలు చూపించారు. నీ అంతట నువ్వే తప్పుకుంటానన్నావ్‌, ఇప్పుడేమో మాట మారుస్తూ అందరినీ బ్యాడ్‌ చేస్తున్నావని ఫైర్‌ అయ్యారు. దీంతో మణి.. ఏదీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటా అని ఎమోషనల్‌ అవుతూ మైక్‌ నేలకేసి కొట్టాడు. నలుగురు కలిసి మణిపై ఎగబడటం చూసిన ప్రేరణ.. వారిని చెత్త ఫెల్లోస్‌ అని తిట్టింది. మరోవైపు సీత. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్‌ ప్లేయర్స్‌ గేమ్‌లో ఉండాలంది. నిజమే, కానీ ఆ మాటను ఎవరైనా పట్టించుకుంటారో? లేదో!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement