Bollywood Actress
-
నాపై ట్రోలింగ్.. ఆ ఒక్క పని చేస్తే చాలు: సారా అలీ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది. -
మనకు మరో ఆలియా భట్ అవసరం లేదు: అర్జున్ రెడ్డి హీరోయిన్
బాలీవుడ్ భామ షాలిని పాండే తెలుగువారికి సుపరిచితమైన పేరు. విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే సినిమాలతో మెప్పించింది. అయితే గతేడాది మహరాజ్ చిత్రంతో నటించిన ముద్దుగుమ్మ.. ఇటీవల జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనను ఆలియా భట్‌తో పోల్చడంపై కూడా మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలని కోరుకుంటానని తెలిపింది. అంతేకానీ మరొకరితో తనను పోల్చడం సరికాదని హితవు పలికారు. మనకు మరో ఆలియా భట్ అవసరం లేదని షాలిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.షాలిని మాట్లాడుతూ.. "మనకు మరొక అలియా అవసరం లేదు. ఎవరూ మరో ఆలియా భట్ కాకూడదు. ఎందుకంటే ఆమె చాలా అద్భుతంగా ఉంది. కేవలం ఆమె సినిమాల వల్ల మాత్రమే కాదు. తెరపై మాత్రమే కాదు.. నేను వ్యక్తిగతంగా అలియా భట్‌ను అభిమానిస్తాను. అందువల్లే నేను మరో ఆలియా భట్ కావాలనుకోవడం లేదు. నాకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎవరైనా నన్ను షాలిని లాగే చూడాలని కోరుకుంటున్నా. అది నాకు చాలు.' అని అన్నారు. కాగా.. రణ్వీర్ సింగ్ సరసన జయేష్‌భాయ్ జోర్దార్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన షాలిని.. తెలుగులో అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయింది. -
ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బంధువుల పెళ్లిలో ఐశ్వర్య- అభిషేక్.. ఇకనైనా ఆపేస్తారా?
బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అభిషేక్ సినీ ఇండస్ట్రీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడు కావడంతో ఏ చిన్న విషయమైనా అందరిదృష్టి వారిపైనే ఉంటుంది. గతంలో వీరిద్దరిపై పలుసార్లు విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ జంట త్వరలోనే విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.అయితే గత కొద్ది నెలలుగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇటీవల తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని పూణెలో తన కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి వివాహానికి తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నుంచైనా సోషల్ మీడియా వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.కాగా.. అభిషేక్ - ఐశ్వర్య రాయ్ 2007లో వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరి కుమార్తె ఆరాధ్య జన్మించింది. గతేడాది డిసెంబర్లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఆరాధ్య వార్షిక కార్యక్రమానికి కూడా జంటగా కలిసి వచ్చారు. దీంతో విడాకుల వార్తలకు చెక్‌పెట్టేశారు. కొత్త ఏడాది జనవరిలో న్యూ ఇయర్ వేకేషన్ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో కూడా కనిపించారు. వరుసగా ఐశ్వర్య దంపతులు కలిసి హాజరు కావడంతో ఇకపై విడాకుల వార్తలకు చెక్ పడినట్లే.ఇక సినిమాల విషయానికొస్తే అభిషేక్ చివరిసారిగా బి హ్యాపీలో కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి హౌస్‌ఫుల్- 5లో కనిపించనున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోయే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం కింగ్‌లో విలన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే చివరిసారిగా పొన్నియన్ సెల్వన్- 2లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. -
ఇంటికి చేరుకున్న అతియా శెట్టి.. కేఎల్ రాహుల్ వారసురాలికి ఘనస్వాగతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈనెల 24న పాప తమ జీవితంలోకి అడుగుపెట్టిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత పలువురు సినీతారలు, అభిమానులు అతియా శెట్టి దంపతులకు అభినందనలు తెలిపారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బిడ్డతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. పూలు, కుంకుమతో తనకు స్వాగతం పలికి ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అతియా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోటోలో 'ఓం' దేవుడి పేరును కూడా ప్రస్తావించింది.కాగా.. అతియాశెట్టి, కేఎల్ రాహుల్ గతేడాది నవంబర్ 2024న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రెండు వారాల క్రితమే అతియా శెట్టి తన ప్రసూతి ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు కేఎల్, అతియా 2019లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో జనవరి 2023లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సన్నిహితులు, బాలీవుడ్ సినీతారలు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సునీల్ శెట్టి ఖండాలా ఫామ్‌హౌస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. -
నా డబ్బులతో పారిపోయారు.. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు: సింగర్ ఆవేదన
బాలీవుడ్ సింగర్ నేహ కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్లారు. కానీ ఆమె ఆ ఈవెంట్‌కు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా చేరుకున్నారు. ఆ తర్వాత లేట్‌గా రావడంపై అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు సింగర్. ఆయితే నేహాకు ఈవెంట్ ఆర్గనైజర్స్ మాత్రం ఊహించని విధంగా షాకిచ్చారు. ఈవెంట్ ముగిశాక నేహా కక్కర్‌కు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఈ విషయాన్ని నేహా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.నేహా కక్కర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నేను మెల్బోర్న్ కన్సర్ట్ను ప్రేక్షకులకు పూర్తిగా ఉచితంగా ప్రదర్శన ఇచ్చానని మీ అందరికీ తెలుసా? నిర్వాహకులు నా డబ్బుతో పారిపోయారు. నా టీమ్‌కు కనీసం ఆహారం, హోటల్, నీరు కూడా ఇవ్వలేదు. నా భర్త, అతని స్నేహితుల వెళ్లి వారికి ఆహారం అందించారు. అయినా కూడా మేము స్టేజ్‌పైకి వచ్చాం. మేము ఆలస్యంగా వచ్చామని మాకు డబ్బు ఇవ్వలేదు. అంతేకాకుండా నిర్వాహకులు నా మేనేజర్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు' అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కన్సర్ట్కు హాజరైన కొంతమంది కక్కర్‌పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు ఆలస్యం రావడంపై నిరాశ వ్యక్తం చేశారు.అభిమానులకు కృతజ్ఞతలు..అయితే సింగర్ నేహా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు జరిగిన విషయం గురించి మాట్లాడిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాసుకొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు నా కచేరీకి హాజరైన ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by Neha Kakkar (@nehakakkar) -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ముంబయిలో ఆమె కారును ఓ బస్సు ఢీకొట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ఐశ్వర్య బాడీ గార్డ్స్ వెంటనే కారులో నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్యరాయ్ కారులో లేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.ఐశ్వర్యరాయ్ కారును బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కారుకు ఎలాంటి తీవ్రమైన నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటి తర్వాత కారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.అక్కడ పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని జుహుకి చెందిన ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యరాయ్ అభిమానులు కాస్తా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆమె క్షేమం గురించి పలువురు ఆరా తీశారు.కాగా.. ఐశ్వర్యరాయ్ చివరిసారిగా పొన్నియిన్ సెల్వన్: పార్ట్- 2లో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో ఆమె ఉత్తమ నటిగా ప్రధాన పాత్ర (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం 2023లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
తండ్రైన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి
బాలీవుడ్ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని పోస్ట్ చేశారు.కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో 'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహంఅయితే కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది అవనీత్ కౌర్ (Avneet Kaur). అయితే అప్పటికి, ఇప్పటికీ అవనీత్ చాలా మారిపోవడంతో తను ఏదైనా సర్జరీ చేయించుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టింది. అవనీత్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి నేను కెమెరా చూస్తూనే పెరిగాను. చాలామంది నా గురించి విచిత్రంగా మాట్లాడుతుంటారు. ప్లాస్టిక్ సర్జరీ.. గట్రా!చిన్నప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడెలా అయింది.. చాలా మారిపోయింది. కచ్చితంగా తన ముఖానికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంది అంటుంటారు. ఈ తరహా కామెంట్లు చదివినప్పుడు కోపమొస్తుంది. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో నేను చిన్న పిల్లను. ఎదుగుతూ ఉండేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు నాకు 23 ఏళ్లు. చిన్నప్పటిలా ఎలా ఉంటాను?కేవలం అది మాత్రమే..నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. ఏ ఫిల్లర్స్ వేయించుకోలేదు. కాకపోతే ముఖానికి ఫేషియల్ మాత్రం చేయించుకుంటాను. చర్మసంరక్షణ కోసం ఆమాత్రమైనా చేయాలి కదా! చర్మం వదులుగా కాకుండా బిగుతుగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అవనీత్ కౌర్ జన్మస్థలం పంజాబ్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల నుంచి సినిమాల దాకా..‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్’, ‘డాన్స్ కీ సూపర్ స్టార్స్’, ‘ఝలక్ దిఖ్లా జా 5’ తదితర డ్యాన్స్ షోలలో పాల్గొంది. ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో యాస్మిన్ పాత్రతో ఫేమస్ అయింది. అలా మర్దానీ సినిమాలో నటించింది. ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’, 'టీకూ వెడ్స్ షెరూ', 'లవ్‌కీ అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి -
ప్రభాస్‌కి అన్నయ్యగా..?
ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించనున్నారట. అది కూడా ప్రభాస్‌కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. తనదైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట సందీప్. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్.ఇందులో యాక్షన్ ఓ రేంజ్లో ఉంటుందని భోగట్టా. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్లో సంజయ్ దత్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి సంజయ్ అయితే పక్కాగా సరితూగుతారన్నది దర్శకుడి ఆలోచనట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. మరి ‘స్పిరిట్’లో సంజయ్ దత్ భాగం అవుతారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
జాన్వీ కపూర్ ఫాదర్‌తో ఎవరైనా పెట్టుకుంటారా?.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ మూవీని 2023లో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రనిర్మాత సూర్య దేవర నాగవంశీ, డైరెక్టర్ కల్యాణ్ శంకర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరిని సంగీత్ శోభన్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. వీరి మధ్య జరిదిన సరదా సంభాషణలో బోనీకపూర్ అంశం తెరపైకి వచ్చింది. బోనీ కపూర్‌తో జరిగిన డిబేట్లో ఆయనను కొంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడారని వార్తలొచ్చాయి. ఇంతకీ అక్కడ అసలేం జరిగిందని సంగీత్ శోభన్ ప్రశ్నించారు.దీనిపై నాగవంశీ స్పందిస్తూ..'అసలు అక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడితే.. జాన్వీ కపూర్ లాంటి అమ్మాయికి ఫాదర్ ఆయన. అలాంటి వ్యక్తితో ఎవరైనా గొడవ పెట్టుకుంటారా? అలాంటి వ్యక్తిని ఎవరైనా డిస్రెస్పెర్ట్ చేస్తారా? అది కూడా ఆలోచించకుండా నేను బోనీ కపూర్‌ను గౌరవించలేదని అంటున్నారు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు.కాగా.. ముంబయిలో జరిగిన నిర్మాతల డిబేట్లో బాలీవుడ్, దక్షిణాది సినిమాల విషయంలో గతంలో నాగవంశీ మాట్లాడారు. నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యలను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఖండించారు. -
'ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యా'.. మహిళపై ప్రియాంక చోప్రా ప్రశంసలు
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ మూవీతో బిజీగా ఉంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఒడిశా షెడ్యూల్ పూర్తి కావడంతో ప్యాకప్ చెప్పేశారు. దీంతో చిత్రబృందంతో పాటు ప్రియాంక చోప్రా ముంబయికి ప్రయాణమైంది. అయితే తాజాగా ఇవాళ షూటింగ్ లోకేషన్ నుంచి వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తుండగా దారిలో ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే అందులో ప్రియాంక చోప్రా ఓ వీడియోను కూడా పంచుకుంది. ఓ మహిళను చూసి తాను ఇన్స్పైర్ అయ్యానని తెలిపింది. ఆమె తనలో స్ఫూర్తి నింపిందని కొనియాడింది. అందుకే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకోవాలనిపించిందని తెలిపింది.(ఇది చదవండి: SSMB29 ఒడిశా షెడ్యూల్ పూర్తి.. ఫొటోలు వైరల్)వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..'నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈరోజు ఎందుకో నాకు చాలా స్ఫూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్లేక్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నా. వైజాగ్ ట్రాఫిక్‌లో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చా (పచ్చి) జామపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెంటనే ఆమెను ఆపి మీ జామపండ్లన్నింటికీ ఖరీదు ఎంత? అని అడిగాను. ఆమె 150 రూపాయలు అని చెప్పింది. నేను తనకు 200 రూపాయల నోటు ఇచ్చా. కానీ ఆమె నాకు చిల్లర ఇవ్వడానికి ప్రయత్నించింది. వద్దు.. దయచేసి మీరే ఉంచుకోండి అని తనతో అన్నా. ఎందుకంటే జీవనోపాధి కోసం ఆమె జామపండ్లు అమ్మింది. కానీ ట్రాఫిక్‌లో గ్రీన్ సిగ్నల్ పడేలోపే ఆమె తిరిగి వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అంటే ఆ మహిళ నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది' అని పంచుకుంది.ఈ వీడియోతో పాటు ఎస్ఎస్ఎంబీ29 సెట్లో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ది స్కై ఈజ్ పింక్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇది 2019 లో విడుదలైంది. ఇటీవల సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ప్రస్తుతం మహేశ్ బాబు మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్‌లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
తండేల్‌ను వెనక్కి నెట్టిన ఎమర్జన్సీ.. సిల్లీ ఆస్కార్ అంటూ కంగనా కామెంట్స్!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో కంనగా ఇందిరా గాంధీ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఓటీటీలో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ సినిమాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. నాగచైతన్య మూవీ తండేల్, అజయ్ దేవగణ్ ఆజాద్ సినిమాలను వెనక్కి నెట్టేసింది.ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్స్ ఎమర్జన్సీ చిత్రాన్ని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. ఈ చిత్రాన్ని భారత్ నుంచి ఆస్కార్ పంపాలని పోస్ట్ చేశాడు. వీటికి సోషల్ మీడియా వేదికగా కంగనా రిప్లై ఇచ్చింది. ఇన్‌స్టా లో ట్వీట్స్‌ను షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందించింది. అమెరికా లాంటి దేశం ఇలాంటి సినిమాలను గుర్తించడానికి ఇష్టపడరు. వారు అభివృద్ధి చెందుతున్న దేశాలను అణచివేస్తారు. అదే ఈ ఎమర్జన్సీలో చూపించాను. వారి సిల్లీ ఆస్కార్ అవార్డ్‌ను వాళ్ల వద్దే ఉంచుకోనివ్వండి. మాకు నేషనల్ అవార్డులు ఉన్నాయని నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది.బాలీవుడ్ చిత్ర నిర్మాత సంజయ్ గుప్తా కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ రోజు నేను ఎమర్జెన్సీ మూవీని చూశాను. చాలా స్పష్టంగా చెప్పాలంటే.. నేను ముందుగా అంచనా వేసినట్లుగా ఈ సినిమాను ప్లాన్ చేయలేదని అన్నారు. ఈ సినిమాలో కంగనా నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. దీనికి కంగనా బదులిస్తూ 'సినిమా పరిశ్రమ తన ద్వేషం, పక్షపాతాల నుంచి బయటపడాలి.. మంచి పనిని ఎప్పటికీ గుర్తించాలి సంజయ్ జీ.. మీరు ఆ అడ్డంకిని బద్దలు కొట్టినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది.కాగా.. నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం విడుదలైన ఎమర్జెన్సీ మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ సినిమాల జాబితాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అజయ్ దేవగన్ ఆజాద్, నాగ చైతన్య తండేల్ చిత్రాలను అధిగమించింది. ఈ చిత్రం కంగనా రనౌత్ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి విధించిన 21 నెలల ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మిలింద్ సోమన్, దివంగత నటుడు సతీష్ కౌశిక్ కూడా నటించారు. ఈ మూవీని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. -
అమిర్ ఖాన్‌తో డేటింగ్.. తొలిసారి అలా కనిపించిన గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయసులో అమిర్ ఖాన్ రిలేషన్లో ఉన్నానంటూ ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన తన ప్రీ బర్త్ డే ఈవెంట్లో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మీడియా ముందు అందరికీ పరిచయం చేశాడు. దీంతో అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే తాజాగా అమీర్ ఖాన్‌తో రిలేషన్ తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది గౌరీ. అమిర్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కనిపించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్..కాగా.. ఇటీవల ముంబయి నిర్వహించిన ప్రెస్మీట్లో గౌరీతో తన రిలేషన్‌షిప్‌ను అమీర్ ఖాన్ ధృవీకరించారు. దాదాపు ఏడాదిగా తాము డేటింగ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆమెకు ఆరేళ్ల పాప కూడా ఉందని తెలిపారు. గత 25 ఏళ్లుగా ఆమె తెలుసని కూడా అన్నారు. అంతేకాకుండా గౌరీ ఇటీవలే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశారని ఆయన ప్రస్తావించారు. కాగా.. ఇప్పటికే అమిర్ ఖాన్ కిరణ్ రావు, రీనా దత్తాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు బెంగళూరుకు చెందిన గౌరీ.. రీటా స్ప్రాట్ కుమార్తె. ప్రస్తుతం ఆమె ముంబయిలోనే ఓ సెలూన్‌ను నిర్వహిస్తోంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (Bhagyashree) ఆస్పత్రిపాలైంది. ఈ మధ్య ట్రెండింగ్‌లోకి వచ్చిన పికెల్‌బాల్ ఆడుతుండగా తలకు గాయమైంది. దీంతో ఆస్పత్రిలో చేరగా వైద్యులు ఆమె నుదురుకు 13 కుట్లు వేశారు. తలకు కట్టుతో ఉన్న భాగ్యశ్రీ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ భాగ్యశ్రీ?అందాల తార భాగ్యశ్రీ.. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది. 1989లో మైనే ప్యార్ కియా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టింది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకుంది.తర్వాత కూడా పలు సినిమాలు చేసింది. త్యాగి, పాయల్, అమ్మవ్రా గంద (కన్నడ), మా సంతోషి మా, రెడ్ అలర్ట్: ద వార్ వి, ఛత్రపతి, ససాజిని షిండేకా వైరల్ వీడియో వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకారం, యువరత్న రానా, రాధేశ్యామ్ సినిమాలతో మెప్పించింది. ఈమె చివరగా లైఫ్ హిల్ గయూ అనే హాట్‌స్టార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది.చదవండి: అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్ -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
ఆ సీన్స్ చేయకపోవడానికి కారణమిదే: కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది సింగం ఏగైన్, క్రూ, ది బకింగ్హమ్ మర్డర్స్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ది బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీలో పోలీసు పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాంటి సన్నివేశాలను చేయడం తనకు ఎప్పుడూ సౌకర్యంగా అనిపించలేదని తన 25 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడింది.కరీనా కపూర్ మాట్లాడుతూ.. "ఇది మొత్తం మనం చూసే ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. లైంగికతను మానవ అనుభవంగా మనం చూడం. ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు మనం దానిని మరింతగా లోతుగా చూడటం, గౌరవించడం ప్రారంభించాలి. ఇదే నా నమ్మకం," అని ఆమె అన్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి మీరెందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించగా.. కరీనా కపూర్ స్పందించింది. కథను అలా ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. కథ పరంగా అయితే అది తప్పనిసరి అని నేను నమ్మను.. ఎందుకంటే అలా చేయడం సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు. నేను ఎప్పుడూ అలా చేయలేదు' అని తెలిపింది.(ఇది చదవండి: సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!)కాగా.. కరీనా కపూర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్లో తెరపై ఎప్పుడూ లైంగిక సన్నివేశాల్లో నటించలేదు. 2003లో వచ్చిన 'చమేలి' సినిమాలో కపూర్ ఒక సెక్స్ వర్కర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ సినిమాలో నటించడంపై కరీనా మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలను గ్రహించానని తెలిపింది. స్త్రీ తత్వం, అందంగా ఉండటం వంటి సాంప్రదాయ భావనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదని అనిపించింది. ఈ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించింది. అది చిన్న వయసులో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర పోషించినందుకు నేను సంతోషంగా అనిపించిందని తెలిపింది. కాగా.. కరీనా కపూర్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, చుప్ చుప్ కే, గోల్మాన్ రిటర్న్స్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. -
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్‌తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
హీరోయిన్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విజయం భారత్‌ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్‌లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్‌మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్‌పై గతంలో కూడా సారా అలీ ఖాన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్‌లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
శ్రీదేవి చివరి చిత్రానికి సీక్వెల్.. ఖుషీ కపూర్‌పై నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ అగ్రనిర్మాత, డైరెక్టర్ బోనీ కపూర్ తాజాగా ఓ సినిమాను ప్రకటించారు. తన భార్య, దివంగత నటి శ్రీదేవి నటించిన చివరి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించునున్నట్లు వెల్లడించారు. 2017లో వచ్చిన మామ్ మూవీకి కొనసాగింపుగా తాజాగా ఉండనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తన చిన్న కూతురైన ఖుషీ కపూర్ సైతం నటిస్తున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ-2025 అవార్డుల వేడుకకు హాజరైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.అయితే శ్రీదేవి సీక్వెల్ మూవీలో ఖుషీ కపూర్‌ను ఎంపిక చేయడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీదేవి స్థానంలో ఖుషీ చేయడమేంటి? ఇది చూస్తుంటే పెద్ద జోక్‌గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదే నిజమైతే డిజాస్టర్ ఖాయమని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దయచేసి ఈ సినిమాకు జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. వీలైతే యామీ గౌతమ్, కంగనా రనౌత్, బిపాసా బసుని తీసుకోండి కానీ.. ఖుషీ కపూర్‌కు నటనా నైపుణ్యాలు లేవని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.నటన విషయానికొస్తే ఖుషీ కపూర్ చివరిసారిగా ఇబ్రహీం అలీ ఖాన్‌తో నాదానియన్లో కనిపించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా బోనీ కపూర్ చేసిన ప్రకటనతో నెటిజన్స్ తీవ్ర నిరాశకు గురువుతున్నారు. శ్రీదేవీ మూవీ సీక్వెల్లో మాత్రం ఖుషీ కపూర్ వద్దని తెగేసి చెబుతున్నారు. మామ్ సీక్వెల్ కోసం ఖుషీని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. 2018లో ఆమె మరణానికి ముందు నటించిన చివరి చిత్రమిదే. శ్రీదేవి కెరీర్లో 300వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, పాకిస్థానీ నటులు సజల్ అలీ, అద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీదేవి మరణానంతరం 65వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మామ్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. -
తెలుగు హీరో... హిందీ విలన్
తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్ల హవా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసేందుకే బాలీవుడ్ యాక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తొలిసారిగా తెలుగు తెరపై విలన్‌గా కనిపించనున్న కొందరు బాలీవుడ్ యాక్టర్స్, వారు ఓకే చేసిన సినిమాలు వివరాలు ఇలా ఉన్నాయి.మల్టీ మిలియనీర్‘నీర్జా, పద్మావత్, సంజు, గంగుభాయి కతియావాడి’ వంటి చిత్రాలతో నటుడిగా బాలీవుడ్లో నిరూపించుకున్నారు జిమ్ సర్భ్. ఈ నటుడికి టాలీవుడ్ ఎంట్రీ చాన్స్ లభించింది. నాగార్జున–ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ మల్టీ మిలియనీర్ పాత్రను జిమ్ సర్భ్ చేస్తున్నారు.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హైప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ భిక్షగాడిగా కనిపిస్తారని, ఓ ఆఫీసర్‌గా నాగార్జున, మల్టీ మిలియనీర్ పాత్రలో జిమ్ సర్భ్ కనిపిస్తారని తెలిసింది. ఓ బలమైన సామాజిక అంశం, డబ్బు ప్రధానాంశాలుగా ‘కుబేర’ కథనం సాగుతుందని సమాచారం.ఇటు ఓజీ... అటు జీ2‘మర్డర్, గ్యాంగ్‌స్టర్, ముంబై సాగ, టైగర్ 3, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మి గురించి తెలుగు ఆడియన్స్‌కు తెలిసిందే. ఈ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఖరారైంది. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తున్నారు ఇమ్రాన్ హష్మి. పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలోని గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ – ప్రచారంలో ఉన్న టైటిల్)లో ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓమి భావ్ అనే పాత్రలో హష్మి కనిపించనున్నట్లుగా తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ΄్లాన్ చేస్తోంది. మరోవైపు అడివి శేష్ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. కాగా ‘జీ 2’ సినిమా షూటింగ్లో ఆల్రెడీ ఇమ్రాన్ హష్మీ జాయిన్ అయ్యారు. గత ఏడాది అక్టోబరులో ‘జీ 2’ కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ఇమ్రాన్ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. కాగా అడివి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో విలన్‌గా నటిస్తూ, డబుల్ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇమ్రాన్ హష్మి.ఇన్స్పెక్టర్ స్వామిఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘రైఫిల్ క్లబ్’ వంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అనురాగ్ కశ్యప్ యాక్టర్‌గా తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని కొందరు తెలుగు ఆడియన్స్ ఆశపడ్డారు. వారి ఆశ నిజమైంది. అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్: ఓ ప్రేమకథ’ అనే సినిమా రూపొందుతోంది.ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ఉంటుందని తెలిసింది. కథ రీత్యా... ఇద్దరు ప్రేమికులు బ్రేకప్ చెప్పుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా... వీరిద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రైమ్‌ను అడ్డుకోవాల్సిన బాధ్యత ఇన్స్పెక్టర్ స్వామిది. మరి... క్రిమినల్స్ అయిన ఈ ప్రేమికులను పోలీసాఫీసర్‌గా ఇన్స్పెక్టర్ స్వామి పట్టుకున్నాడా? అనేది ‘డెకాయిట్’ సినిమా చూసి తెలుసుకోవాలి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగం వంటి అంశాల మేళవింపుతో రూపొందుతున్న ‘డెకాయిట్’ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు నటుడిగానే కాదు... ‘పాంచ్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార’ వంటి హిందీ చిత్రాలతో అనురాగ్ కశ్యప్ బాలీవుడ్లో దర్శకుడిగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాతగానూ, రైటర్‌గానూ ఆయన రాణిస్తున్న విషయం కూడా విదితమే.అర్జున్‌కు విలన్‌గా...స్క్రీన్‌పై నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్’ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ మూవీలో ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయశాంతి. ఇక ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్నారు సోహైల్ ఖాన్. ‘పార్ట్నర్, వీర్, దబాంగ్ 3’ వంటి చిత్రాల్లో నటుడిగా అభినందనలు అందుకున్న సోహైల్ ఖాన్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాకీ పార్టు పూర్తయింది. రామ్‌చరణ్‌కు విలన్‌గా...రామ్‌చరణ్‌కు విలన్‌గా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు. హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలోప్రారంభం కానుందని తెలిసింది.కాగా ఈ మల్టీ స్పోర్ట్స్ (క్రికెట్, కుస్తీ తదితర క్రీడలు) డ్రామాలో దివ్యేందు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ దివ్యేందు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు విలన్‌గా కనిపిస్తారట దివ్యేందు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావొచ్చని, దీపావళికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉందనీ సమాచారం. మరోవైపు ‘ప్యార్‌కా పంచనామా, టాయిలెట్: ఏక్ ప్రేమకథ, ఓల్డ్ కపుల్’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటుడిగా రాణించారు దివ్యేందు. కాగా ‘మిర్జాపూర్, సాల్ట్ సిటీ, ది రైల్వే మెన్’ వంటి వెబ్ సిరీస్‌లతో దివ్యేందు మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. కొందరు బాలీవుడ్ యాక్టర్స్ ఆల్రెడీ తెలుగులో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా చేసిన ‘భగవంత్ సింగ్ కేసరి’లో అర్జున్ రామ్‌పాల్, ‘డాకు మహారాజ్’లో బాబీ డియోల్ విలన్స్‌గా నటించారు. కాగా పవన్ కల్యాణ్ ‘హరిహరవీర మల్లు’ చిత్రంలో ఎంతో కీలకమైన ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర 2’ చిత్రంలోనూ బాబీ డియోల్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది విడుదలైన రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేశారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ ‘రాజా సాబ్’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ చేస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ప్రభాస్ ‘ఫౌజి’ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్‌గా చేస్తున్నారు. నాగార్జున–నానీల ‘దేవదాసు’ (2018)లో విలన్‌గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో మళ్లీ విలన్‌గా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ ఎంతటి బలమైన రోల్ చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కల్కి 2’లోనూ అమితాబ్ బచ్చన్ రోల్ కొనసాగుతుందని తెలిసిందే... ఇలా విలన్స్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ మరికొందరు ఉన్నారు.– ముసిమి శివాంజనేయులు -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న బాలకృష్ణ హీరోయిన్..!
రక్త చరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తర్వాత అయితే తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తోంది. గతేడాది మేరీ క్రిస్మస్, సిస్టర్ మిడ్నైట్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం లాస్ట్ డేస్ అనే మూవీలో కనిపించనుంది.ఇదిలా ఉండగా తాజాగా రాధిక ఆప్టేకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. త్వరలోనే రాధికా ఆప్టే దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కించబోయే కోట్యా అనే ఓ యాక్షన్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సినీవీ-సీహెచ్‌డీ వెల్లడించిది. ఈ సినిమాను నిర్మాత విక్రమాదిత్య మోత్వానే నిర్మిస్తారని సమాచారం. ఏదేమైనా బాలయ్య హీరోయిన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా..రాధికా ఆప్టే ప్యాడ్‌మ్యాన్, అంధాధున్, విక్రమ్ వేద, ఎ కాల్ టు స్పై, కబాలి, లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా నటించిన సిస్టర్ మిడ్నైట్ బాఫ్టాకు నామినేట్ అయింది. అంతేకాకుండా సిస్టర్ మిడ్నైట్ గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. కాగా.. రాధికా ఇటీవల భర్త బెనెడిక్ట్ టేలర్‌తో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. -
బంగారాన్ని బహుమతిగా ఇచ్చేసిన నటి.. నోరెళ్లబెట్టిన కూతురు
ఎవరైనా మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయనో, బ్యాగు బాగుందనో, నెక్లెస్ బాగుందనో చెప్తే థాంక్స్ అంటూ సంతోషిస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం బంగారు దిద్దులు బాగున్నాయన్నందుకు ఏకంగా వాటినే తీసి బహుమతిగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon). రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది. ఆమె కనిపించగానే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు.బంగారు కమ్మ బహుమతిగా..వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా.. తల్లి చేసిన పనికి నోరెళ్లబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీనా మనసు బంగారం.. ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్, మంచి మనసున్నవాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి.. తను నిజంగా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.రెండు గాజులు గిఫ్ట్‌గా..రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఓ పెళ్లికి హాజరైన ఆమె పెళ్లికూతురికి తన గాజుల్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఆమె సినిమాల విషయానికి వస్తే వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్ నటి -
బాలీవుడ్ హీరో ఫ్యామిలీ ఈవెంట్లో శ్రీలీల.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రాబిన్హుడ్తో ప్రేక్షకులను పలకరించనుంది. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్లో మెరిసింది. హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు కార్తీక్ ఆర్యన్ సైతం స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సోదరి కృతిక తివారీ కోసం ఈ వేడుక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్స్ డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే కార్తీక్ ఆర్యన్ గతేడాది సూపర్‌హిట్ చిత్రం భూల్ భూలైయా- 3లో కనిపించాడు. మరోవైపు శ్రీలీల పుష్ప-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెప్పించింది. Sreeleela at kartik aaryan's sister celebrationbyu/Medium_Bicycle_1004 inBollyBlindsNGossip -
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్‌ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్‌ను స్వాగతించారు. -
ఎవరికీ చెప్పకుండా చేయించుకున్నా: సెక్రేడ్ గేమ్స్ నటి
సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కుబ్రా సైత్. ఇటీవలే షాహిద్‌కపూర్ హీరోగా నటించిన దేవా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కుబ్రా సైత్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. గతంలో తనకు అబార్షన్ జరిగినప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించింది. ఆ సమయంలో తాను ధైర్యం కోల్పోయినట్లు వెల్లడించింది. అది తన జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదని తెలిపింది.ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ మాట్లాడుతూ.. 'నేను అబార్షన్‌కు వెళ్లినప్పుడు బలంగా ఉన్నట్లు అనిపించలేదు. ఆ సమయంలో చాలా బలహీనంగా ఉన్నా. అలా చేయకుంటే బతుకుతానని చెప్పే ధైర్యం, శక్తి నాకు లేవు. ఆ సమయంలో నేను చాలా బలహీనంగా భావించా. నాకు ఏదో వెలితిగా అనిపించింది. అస్సలు విలువ ఉండదేమో అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడేందుకు చాలా కాలం పట్టింది. నా కోసం ఒక నిర్ణయం తీసుకున్నా. అది కూడా నా సొంత ఆలోచనలకు కట్టుబడి నిర్ణయించుకున్నా. ఇక్కడ నేను సామాజిక నిబంధనలను ఉల్లంఘించాను అనడానికి ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేనే స్వయంగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు' అని వెల్లడించింది. ఓసారి తన స్నేహితురాలతో కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్‌తో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని తెలిపింది. ఆ సమయంలో తన కళ్లలో నీళ్లు వచ్చాయని వెల్లడించింది. -
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్లో తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్‌పేపర్‌గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విజయ్‌తో సినిమా.. నా కూతురు అసలు ఒప్పుకోలేదు: స్టార్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇండియాలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల తన సోదరుడి పెళ్లిలో మెరిసిన ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనుంది. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కించబోతున్న ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక కనిపించనుంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ విచ్చేసిన ముద్దుగుమ్మ చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసమే భాగ్యనగరానికి వచ్చినట్లు వార్తలొచ్చాయి.అయితే ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మధు చోప్రా తన కూతురి సినీ కెరీర్ గురించి మాట్లాడింది. గతంలో దళపతి విజయ్ సరసన ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌కు జంటగా తమిజాన్ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ప్రియాంక చోప్రా నో చెప్పిందని ఆమె తెలిపింది. అయితే మూవీ మేకర్స్ నా భర్తను కలిసి మాట్లాడారని వెల్లడించారు. దీంతో ఆయన మాట కాదనలేక ప్రియాంక నటించిందని అసలు విషయం చెప్పింది మధు చోప్రా.మధు చోప్రా తమిజన్ సినిమా గురించి మాట్లాడుతూ.. 'ప్రియాంక మొదట ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పింది. కానీ వారు ప్రియాంక సోదరుడిని కలిశారు. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి మాట్లాడారు. కేవలం రెండు నెలల పాటు వేసవి సెలవుల్లో మా మూవీ షూట్‌కు సమయవివ్వండి అని అడిగారు. వారి మాట కాదనలేక ప్రియాంక చోప్రా ఫాదర్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత తన తండ్రి మాట కోసం ప్రియాంక చోప్రా నటించింది" అని తెలిపింది.విజయ్ అంటే ప్రియాంకకు చాలా గౌరవం ఉందని మధు చోప్రా తెలిపింది. విజయ్ చాలా ఓపికతో ప్రియాంకకు సెట్స్‌లో సాయం చేశాడని చెప్పుకొచ్చింది. ప్రభుదేవా బ్రదర్ రాజు సుందరం కొరియోగ్రాఫీలో స్టెప్పులు చాలా కఠినంగా ఉన్నాయి.. విజయ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్.. అతనితో ప్రియాంక డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని పేర్కొంది. అలాగే కొత్త భాష నేర్చుకోవడం, డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడంలో విజయ్ సాయం సాయం చేశాడని మధు చోప్రా గుర్తు చేసుకుంది. ఇకపోతే ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ హెడ్స్ ఆఫ్ స్టేట్‌లోనూ కనిపించనుంది. -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఆ వీడియోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు: విద్యా బాలన్
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆన్లైన్లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.విద్యాబాలన్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్‌ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
నా కూతుర్ని షూటింగ్‌కు పంపిస్తా.. ఏదైనా జరిగితే మాత్రం?: మహేష్ హీరోయిన్ తల్లి
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగిన భారతీయ నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబోలో వస్తున్న చిత్రంలోనూ ప్రియాంక నటిస్తున్నారు. నిజానికి మన దేశం నుంచి అందాల సుందరి కిరీటం అందుకున్నవారిలో ప్రియాంక చోప్రా స్థాయిలో తారా పధానికి చేరుకున్నవారు లేరనే చెప్పాలి. ఇంతింతై ఎదిగిన ఆమె విజయాల వెనుక ఆమె కష్టం ఎంత ఉందో...ఆమె తల్లి మధు చోప్రా కష్టం కూడా అంతే ఉందని అంటుంటారు బాలీవుడ్ జనాలు.సినిమా రంగంలో ప్రియాంక అడుగుపెట్టిన దగ్గర్నుంచీ ఆమెని అనుక్షణం కంటికి రెప్పలా కాచుకున్నారు ఆమె తల్లి మధుచోప్రా. అందంతో పాటు ప్రతిభ కూడా ఉన్న తన కూతురు టాప్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు. మధ్యలో కొందరి వల్ల ప్రియాంక చోప్రా వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు కూడా కూతురికి అండా దండా తానై ప్రియాంక కృంగిపోకుండా వెన్నంటి ఉన్నారు. సినీ హీరోయిన్లను వారి తల్లులు నీడలా అనుసరించడం కొత్త విషయం కాకపోయినా... ప్రియాంక తల్లి మధుచోప్రా.. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించారు. తన కష్టం ఫలించి అంతర్జాతీయ స్థాయిలో తన కూతురు పేరు తెచ్చుకోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవడంతో మధు చోప్రా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు.ఈ నేపధ్యంలో ఇటీవల పలు ఇంటర్వ్యూల సందర్భంగా ప్రియాంక సినిమా కెరీర్ గురించి మధుచోప్రా పంచుకున్నారు. అదే సమయంలో దోస్తానీ (ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం) దర్శకుడు తరుణ్ మన్షుఖానీ అప్పట్లో ఎలా ప్రవర్శించారో కూడా గుర్తు చేసుకున్నారు. దోస్తానా చిత్రంలో ప్రియాంక తరుణ్‌తో కలిసి పనిచేసినప్పుడు కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని మధు చోప్రా చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఒక రోజు ప్రియాంక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిందని, జ్వరంతో వణికిపోయిందని గుర్తుచేసుకున్నారు. తాను ఆమెకు మందులు ఇచ్చానని, అయితే మాత్రలు వేసుకున్న తర్వాత సినిమా షూటింగ్‌కు వెళదామని ప్రియాంక ప్రయత్నించగా తాను వారించానని చెప్పారు. కాస్త సమయం తీసుకో అని చెప్పానని, గంట తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో ప్రియాంక సూచనల మేరకు తాను దర్శకుడు తరుణ్‌కి ఫోన్ చేశానని వెల్లడించారు. తరుణ్‌కి ఫోన్ చేసి ప్రియాంకకు హై టెంపరేచర్ ఉన్నందున ఆ రోజు షూటింగ్‌కు రావడం కుదరదని చెప్పగా, ‘‘ మీ అమ్మాయి ఎంత సౌకర్యంగా ఉందో చెప్పండి’’ అని తరుణ్ వ్యంగ్యంగా బదులిచ్చాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పుడు తనకు తీవ్రమైన ఆగ్రహం వచ్చిందని దాంతో తాను అతనికి చాలా పరుషంగా మాట్లాడానని వెల్లడించారు. ‘‘ఆమె మీ షూటింగ్ సెట్లో చనిపోవాలని మీరు కోరుకుంటే, సరే... నేను ఆమెను పంపుతాను. కానీ ఆమెకు ఏదైనా జరిగితే, దానికి మీరే బాధ్యులవుతారు’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించానన్నారు. ఇదంతా గుర్తు చేసుకున్న మధుచోప్రా... అయితే అదంతా గతమని తరుణ్, తాను ఇప్పుడు మంచి స్నేహితులమని, ఇప్పటికీ తాను తరుణ్‌ని కలిసినప్పుడల్లా అప్పటి నా కోపాన్ని గుర్తు చేస్తూ తనను ఆటపట్టిస్తుంటాడంటూ మధుచోప్రా చెప్పారు. -
డాకు మహారాజ్ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!
ఈ ఏడాది డాకు మహారాజ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025 -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
సాహో మూవీతో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ (Shraddha Kapoor). ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే గతేడాది విడుదలైన స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో వచ్చిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించారు.రైటర్‌తో డేటింగ్..అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మపై కొన్ని రోజులుగా డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ సినీ రచయిత రాహుల్ మోదీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అంతేకాదు వీరిద్దరు చాలాసార్లు ఈవెంట్లలో జంటగా కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్లో ఉన్నారంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది శ్రద్ధాకపూర్. తమ రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా దీన్ని బట్టి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని అర్థమవుతోంది.పెళ్లిలో జంటగా..తాజాగా తన ప్రియుడిగా భావిస్తోన్న రాహుల్ మోదీతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైంది ముద్దుగుమ్మ. గుజరాత్లో అహ్మదాబాద్‌లో జరిగిన స్నేహితుల పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సందడి చేసింది. ఇద్దరు కలిసి నూతన వధూవరులతో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ సైతం పెళ్లికి హాజరైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు శ్రద్దాకపూర్, రాహుల్ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. కాగా.. గతేడాది జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్‌లో శ్రద్ధా కపూర్, రాహుల్ జంటగా కనిపించారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరింత వైరలయ్యాయి. Shraddha Kapoor and Rahul Mody at a friend's wedding in Ahmedabad last night ♥️ pic.twitter.com/PBRanqJeoR— 𝒔𝒉𝒓𝒂𝒅𝒅𝒉𝒂__𝒎𝒚__𝒋𝒂𝒂𝒏🦋 (@shraddhasmehnaz) February 22, 2025 -
'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది. -
'26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం'.. భార్యకు అజయ్ దేవగణ్ స్పెషల్ విషెస్
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్చల్ అనే మూవీ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్‌లో కనిపించారు. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) -
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్‌లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను మరింత స్పెషల్‌గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్‌తో ఫ్యాన్స్‌ను అలరించిన ముద్దుగుమ్మ సడన్‌గా మ్యాచ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్‌లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్‌కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్‌లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్‌లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్‌లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్‌గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
హీరోయిన్‌కి అభిమానితో చేదు అనుభవం..వీడియో వైరల్
సినీ తారలు బయట కనిపించడం చాలా అరుదు. ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప బయటకు రారు. అందుకే అలా బయట కనిపించినప్పుడు వాళ్లను చూసేందుకు జనాలు ఎగబడతారు. కొంతమంది సెల్ఫీలు దిగుతూ సంబరపడిపోతారు. హీరోహీరోయిన్లు కూడా తమ కోసం వచ్చిన అభిమానులను నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు ఇస్తుంటారు. కొంతమంది హీరోలు సెల్ఫిలు అడిగినా కొడుతారను..అది వేరే విషయం. కానీ చాలా మంది అయితే అడగ్గానే సెల్ఫీకి ఒప్పేసుకుంటారు. అలాంటి వారిలో నటి పూనం పాండే(Poonam Pandey) కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే బోల్డ్ బ్యూటీ.. ఇప్పుడు సెల్ఫీ అంటేనే భయపడిపోతుందట.ఫోటో కోసం వచ్చి..తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఫొటో సెషన్లో భాగంగా విలేకరులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సెల్ఫీనే కదా అని ఆమె నవ్వుతూ ఫోటోకి పోజులివ్వగానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పూనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.వెంటనే తేరుకున్న పూనమ్ అతడిని బలంగా నెట్టివేసింది. అలాగే, ఫొటో జర్నలిస్టు ఒకరు వెంటనే అప్రమత్తమై అతడి నుంచి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.స్క్రిప్టెడా?ఇలాంటి ఘటన పూనమ్ కాకుండా ఇతర హీరోయిన్లలలో ఎవరికి జరిగినా అంతా నిజమనే నమ్మేవారు. కానీ పూనమ్ చరిత్ర తెలిసివాళ్లు ఇది ఫేక్ అని అంటున్నారు. ఇదంత స్క్రిప్టెడ్ అని.. అటెన్షన్ కోసమే పూనమ్ ఇలాంటి పని చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీడియోను గమనిస్తే మొదటి నుంచీ ఆమె తీరు అనుమానాస్పదంగా ఉందని ఒకరు, ఆమె అంత బాగా నటించలేదని కామెంట్ చేస్తున్నారు.గతంలో ఇంతకు మించి.. పూనమ్‌కి వివాదాలు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి డ్రామాలు చాలానే ఆడింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఏకంగా తాను చనిపోయినట్లు వార్తలు రాయించుకుంది. అనంతరం తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే తన ఉద్దేశమని వివరణ ఇచ్చింది.2011లో వరల్డ్ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. సినిమాల కంటే ఇలాంటి డ్రామాలే పూనమ్‌కి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ముద్దు వీడియో కూడా ఫేకే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రియుడితో యానిమల్ బ్యూటీ చెట్టపట్టాల్.. నడిరోడ్డుపై..!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri). ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కించింది ముద్దుగుమ్మ. యానిమల్ తర్వాత ఈ బాలీవుడ్ భామకు ఒక్కసారిగా అవకాశాలు క్యూ కట్టాయి. పలు స్టార్ హీరోల సరసన వరుస చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత గతేడాది బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ధడక్-2 చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది.ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తూనే ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సామ్ మర్చంట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని తెలిసింది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా తన ఇన్‌స్టాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ఈ విధంగా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.అయితే తాజాగా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో కలిసి జంటగా కనిపించింది. వీరిద్దరు బైక్‌పై వెళ్తుండగా వీడియో తీసిన నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉందని నిజమేనంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ రూమర్స్ నిజమేనంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తమ రిలేషన్‌పై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. పోనీ అలా వాటిని ఖండించలేదు కూడా. అందుకే ఈ తాజా వీడియో చూస్తే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది.(ఇది చదవండి: వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!)సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. #TriptiiDimri was seen on a bike with rumoured beau #SamMerchant.🫶🏻#FilmfareLens pic.twitter.com/FvH0s70F7Z— Filmfare (@filmfare) February 19, 2025 -
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
అమ్మకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా..వీడియో వైరల్
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అంటారు. మోనాలిసా అనే అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. మొన్నటి వరకు ఇళ్లిళ్లూ తిరిగి పూసలు అమ్ముకున్న ఈ యువతి.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పూసలు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లడం..తన నీలికళ్లు, అందం, చిరునవ్వుకు ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం..అవికాస్త వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ‘స్టార్’ అయిపోయింది. ప్రస్తుతం ఈ నీలికళ్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు.. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా అన అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లుక్ మార్చేసిన బ్యూటీప్రస్తుతం తనకున్న క్రేజీని మోనాలిసా క్యాష్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా వెళ్తోంది. తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా వెళ్లింది. మొన్నటి వరకు మేకప్ అంటే తెలియని మోనాలిసా..ముఖానికి మేకప్ వేసుకొని తన లుక్‌నే మార్చేసింది. జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది. మేకప్ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మోసాలిసాలో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
ఛావాపై వివాదాస్పద ట్వీట్.. హీరోయిన్‌పై ఓ రేంజ్లో నెటిజన్స్ ఫైర్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో నటిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్స్.స్వర భాస్కర్ చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మన వీరుల చరిత్రతో ఆటలు ఆడుకోవద్దని సూచిస్తున్నారు. ఓ నెటిజన్ ఆమెకు రిప్లై ఇస్తూ.. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్రను అభ్యసించా. ఔరంగజేబ్ చేతిలో శంభాజీ మహరాజ్ చిత్రహింసలతోనే మృతి చెందారనడంలో ఎలాంటి కల్పితాలు లేవు. దయచేసి మీ ఆలోచన విధానంపై ఒకసారి పునరాలోచించుకోండి అంటూ చురకలంటించాడు. (ఇది చదవండి: ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?)హిందువులపై ఔరంగజేబ్ చిత్రహింసలను కల్పితం అనడం.. శంభాజీ మహరాజ్ ప్రాణత్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడేందుకు మీకెంత ధైర్యం? ఛత్రపతి శివాజీ జయంతి రోజున మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఓ నెటిజన్ స్వర భాస్కర్‌పై మండిపడ్డాడు. ఛత్రపతి శంభాజీ రాజ్ అనుభవించిన హింసలో ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించలేదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. కాగా.. నటి స్వర భాస్కర్.. ఫహాద్ ఆహ్మద్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాసార్లు తన వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తూనే ఉంది..బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛావా. మడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శంభాజీగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించింది. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల 'ఛావా' ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.A society that is more enraged at the heavily embellished partly fictionalised filmy torture of Hindus from 500 years ago than they are at the horrendous death by stampede & mismanagement + then alleged JCB bulldozer handling of corpses - is a brain & soul-dead society. #IYKYK— Swara Bhasker (@ReallySwara) February 18, 2025 -
మొదటి ఆడిషన్.. ఆంటీ మాటలతో ఇబ్బందిగా ఫీలయ్యా: హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ప్రస్తుతం సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్, జావేద్ జాఫేరి ఐమీ ఐలా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ సిరీస్‌గా 'ఊప్స్ అబ్ క్యా'ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాల్ కులకర్ణి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సంఘటనలను వివరించింది. మొదటిసారి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు.సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. ' ఓ సినిమా ఆడిషన్ కోసం తన వద్ద ఉన్న ఏకైక పంజాబీ సూట్‌ను ధరించా. నాతో పాటు ఆడిషన్‌కు మరో 25 మంది అమ్మాయిలు హాజరయ్యారు. అయితే అప్పుడు డైరెక్టర్ గిరీష్ కర్నాడ్‌ను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపలికి వెళ్లగానే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు నాకంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు. సిటీలో పేరున్న ఒకామె 'ఎందుకు వచ్చావ్' అని అడిగింది. ఆమె ప్రశ్నలోని వ్యంగ్యం నాకు అర్థం కాలేదు. అందిరిలాగే వర్క్‌షాప్‌కు వచ్చానని సమాధానం ఇచ్చా. కానీ ఆమె (ఆంటీ) నన్ను చూస్తూ కెమెరాలో ముదురుగా ఉండే అమ్మాయిలు చాలా బాగా కనిపించరని మీకు తెలియదా? అన్నారు. ఆ సమయంలో నాకు 16 ఏళ్ల వయసు. ఆమె మాటలతో చాలా ఇబ్బంది పడ్డా. చాలా డిస్టర్బ్ అయ్యా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది.' అని వెల్లడించారు.ఆ తర్వాత జరిగిన ఆడిషన్లో డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్ అందరినీ పలకరించాడు. ఆయన వచ్చాక నన్ను నేను పరిచయం చేసుకున్నా.. గిరీశ్ కర్నాడ్‌తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేసింది. తాను 12వ తరగతి చదువుతున్నానని.. అంతేకాకుండా నాటకాల్లో చేస్తున్నట్లు డైరెక్టర్‌తో చెప్పినట్లు గుర్తు చేసుకుంది సోనాలి కులకర్ణి. -
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. రివీల్ చేసిన భర్త!
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఇషితా దత్తా- వత్సల్ సేత్ ఒకరు. తెలుగులో చాణక్యుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో కనిపించింది. సినిమాలతోపాటు పలు బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన ఇషితా దత్తా.. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్‌ను పెళ్లాడింది. ఇప్పటికే వీరిద్దరికీ వాయు అనే కుమారుడు కూడా జన్మించాడు. గతంలో తన కుమారుడిని ఫేస్ రివీల్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె భర్త వత్సల్ సేత్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డను తమ ఇంటికి ఆహ్వానించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. '9 ఏళ్ల పరిచయం.. ఎనిమిదేళ్ల ప్రేమ.. గుర్తుగా ఓ చిన్న ప్రేమ.. త్వరలోనే మా హృదయాలు మళ్లీ కలవబోతున్నాయి' అంటూ వాలైంటైన్ డే రోజున పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైతం వత్సల్ సేత్ ఈ వార్తలను ధృవీకరించారు. ఇషితా రెండోసారి గర్భం ధరించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని.. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇషిత నాకు ప్రెగ్నెన్సీ గురించి చెప్పినప్పుడు.. ఒక తండ్రిగా నేను సంతోషించానని తెలిపారు. కాగా.. ఇషితా దత్తా, వత్సల్ సేత్ 2017లో పెళ్లి చేసుకున్నారు. 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' అనే టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. జూలై 19 2023న తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.సినిమాల విషయానికొస్తే ఇషిత దత్తా చివరిసారిగా థ్రిల్లర్ చిత్రం 'దృశ్యం 2'లో కనిపించింది ప్రస్తుతం ఆమె మరో ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. మరోవైపు వత్సల్ చివరిగా 'ఆదిపురుష్' చిత్రంలో కనిపించారు. ఝార్ఖండ్‌లో పుట్టి పెరిగిన ఇషితా దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2012లో తెలుగులో వచ్చిన చాణక్యుడు సినిమాలో హీరోయిన్గా నటించింది. హిందీలో దృశ్యం 1, దృశ్యం 2 , ఫిరంగి, బ్లాంక్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. -
ఈ గుండు పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా మధురమే. బాల్యంలో మన చిలిపి పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఎంతలా అంటే వాటిని చూసినప్పుడు.. అసలు అక్కడ నేనేనా అన్నంతలా ఉంటాయి. ఒక్కసారి ఆ బాల్యంలోకి తిరిగి వెళ్తే బాగుంటుందని అనుకోరు ఉండరేమో. ఆ చిన్ననాటి రోజులే బాగుండేవి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేవాళ్లమని ఏదో ఒక సందర్భంలో అనుకుంటూ ఉంటూనే ఉంటాం. అంతటి అద్భుతమైన క్షణాలు ఆ బాల్యపు రోజులు. ఆ రోజులనే మరోసారి గుర్తు చేసుకుంది మన స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆ తీపి గుర్తులను మీరు కూడా చూసేయండి.బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. 1983 నుంచి 2008 వరకు తన జీవితంలో తీపి క్షణాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రియాంక చోప్రా ఎంతో క్యూట్‌గా కనిపించింది. చిన్నప్పటి తాను ఎంతలా మారిపోయిందో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.. మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో మరోసారి కలుద్దాం అంటూ పోస్ట్ చేసింది. ఇవీ చూసిన కొందరు అచ్చం మీ కూతురు మాల్టీని తలపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
మూడేళ్లు డేటింగ్.. ప్రియుడిని పెళ్లాడిన రానా నాయుడు హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్.. తన చిన్ననాటి స్నేహితురాలు, రానా నాయుడు వెబ్ సిరీస్ నటి ప్రియా బెనర్జీని ఆయన పెళ్లాడారు. ముంబయిలోని బాంద్రాలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నటి స్మితా పాటిల్ కుమారుడే ప్రతీక్ బాబర్. తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రతీక్. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 14న శుక్రవారం జరిగింది. ఫిబ్రవరి 12న మొదలైన హల్దీ, మెహందీ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి.దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రియా పుట్టినరోజున నవంబర్ 28న ఓ రెస్టారెంట్లో ప్రపోజ్ చేసినట్లు ప్రతీక్ వెల్లడించాడు. ఆ తర్వాత వీరు తమ రిలేషన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయితే పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్ బాబర్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో మెప్పించిన ప్రియా బెనర్జీ. ఈ సిరీస్‌లో రానాని టెంప్ట్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. కానీ అంతకు ముందే కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా నటుడు ప్రతీక్ బాబర్‌ను పెళ్లాడింది. ప్రతీక్ బాబర్ హిందీలో జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Priya Banerjee (@priyabanerjee) -
కిస్సిక్ భామ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోగా ఎవరంటే?
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ఆ తర్వాత పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించింది. ఇటీవల పుష్ప-2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను ఓ ఊపు ఊపేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దక్షిణాదిలో ఓ ఊపు ఊపేస్తోన్న శ్రీలీలకు బాలీవుడ్‌లోనూ క్రేజీ ఛాన్ కొట్టేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు. -
పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్
'పెళ్లి, ప్రెగ్నెన్సీకి దూరంగా ఉంటేనే సినిమా ఛాన్స్' అని హీరోయిన్లతో నిర్మాతలు ఒకప్పుడు బలవంతంగా సంతకం చేయించుకునేవారట. ఎవరిదాకానో ఎందుకు? తనతోనూ అలాంటి అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకున్నారంటోంది సీనియర్ హీరోయిన్ షీబా ఆకాశ్‌దీప్ (Sheeba Akashdeep Sabir). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు టాప్ హీరోయిన్లందరూ స్టార్ హీరోలతో జత కడుతున్నారు. పెద్దగా తారతమ్యాలు లేవు.హీరోయిన్గా కొంతకాలమే..అయితే అప్పటికీ, ఇప్పటికీ హీరోలు దశాబ్దాలతరబడి కథానాయకులుగానే కొనసాగుతున్నారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. హీరోయిన్గా చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. అది అయిపోయాక ఇదిగో నాలా క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిందే! గతంలో ఓ భయంకరమైన కండీషన్ ఉండేది. మా తరంవారికి ఎవరికైనా బాయ్‌ఫ్రెండ్ ఉంటే అది బయటకు చెప్పాలంటేనే భయపడేవాళ్లం. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్ అంటే సింగిల్‌గానే ఉండాలన్న రూల్ ఉండేది. భయంకరమైన కాంట్రాక్ట్ప్రేమలో ఉన్నామని తెలిస్తే ఏవేవో పుకార్లు పుట్టుకొచ్చేవి. పెళ్లయిందంటే ఏకంగా ప్యాకప్ చెప్పాల్సిందే! అందుకనే నిర్మాతలు మాతో ముందుగానే ఓ అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకునేవారు. మేము పెళ్లి చేసుకోము, పిల్లల్ని కనము అని అందులో రాసుండేది. ఇది అత్యంత భయంకరమైన కాంట్రాక్ట్. అని చెప్పుకొచ్చింది. షీబా ఆకాశ్‌దీప్.. యే ఆగ్ కబ్ బుజేగి (1991) సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. నచ్నేవాలే గానేవాలె, సూర్యవంశీ, హమ్ ఐ కమాల్ కె, ప్యార్ కా రోగ్, సురక్ష, కాలియా, మిస్ 420, కాలా సామ్రాజ్య, దమ్ వంటి చిత్రాలు చేసింది. చివరగా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాలో మెరిసింది.చదవండి: బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్! -
మూడు లగ్జరీ ఫ్లాట్స్ కొన్న బిగ్‌బాస్ విన్నర్.. ధర ఎన్ని కోట్లంటే?
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ భామ.అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్ గెలిచిన గౌహర్ ఖాన్, మోడలింగ్‌తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ ఆరంభించిన గౌహర్‌ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి. -
తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్
నచ్చని వారితో పని చేయడం తనకు నచ్చదని అంటోంది హీరోయిన్ సోనమ్ కపూర్(Sonam Kapoor). కపూర్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ..పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. వెండితెరపై అరుదుగా కనిపించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్.. తన వ్యక్తిగత, ప్రొఫిషినల్ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.బిడ్డ పుట్టాక మారిపోయానుకెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ ప్రేమ వివాహం చేసుకుంది. 2018లో తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని సోనమ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకి ఓ బాబు ఉన్నాడు. పేరు వాయు. కొడుకు పుట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటోది సోనమ్. ‘తల్లి అవ్వడం అనేది నన్ను పూర్తిగా మార్చేసింది. అది మహిళలకు శారీరికంగా, మానసికంగా.. అన్ని రకాలుగా మార్చేస్తుంది. అసలు ముందు ఉన్న మనిషి కాదేనే అనిపించేస్తుంది.ప్రతి తల్లికి పిల్లలే మీకు మొదటి ప్రాధాన్యత అవుతారు. నా కొడుకు బాగోగులు చూసుకోవడమే నాకు ముఖ్యం. ఆ తర్వాతే సమయం ఉంటేనే సినిమాలు చేస్తా’ అని సోనమ్ చెప్పుకొచ్చింది.నచ్చితేనే చేస్తానా పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. భర్త, పిల్లలే నా ప్రపంచం. సినిమాల్లో కూడా నటిస్తాను. నన్ను నమ్మి, సరదాగా పని చేసే దర్శకులతో మాత్రమే సినిమా చేస్తాను. హీరోయిన్గా బిజీగా ఉన్న రోజుల్లో కూడా ఇదే ఫాలో అయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. మనిషిగా మనం ఎదిగేలా చేసేవారితోనే ఎక్కువగా పనిచేస్తాను. ఒకరు నాకు నచ్చకపోతే వారితో కలిసి పనిచేయడం చాలా కష్టం. నేను ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్న అనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’ అని సోనమ్ వివరించింది. -
'ఎమోషన్స్ అప్పటి వరకు ఎవరికీ అర్థం కావు'.. కరీనా కపూర్ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కుటుంబంలో ఉండే రిలేషన్స్‌ను ఉద్దేశించి కరీనా కపూర్ చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సమయంతో పాటు ఎవరికైనా నిర్ణయాలు మారవచ్చని తెలిపింది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి తర్వాత చేసిన పోస్ట్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందో ఓసారి చూసేద్దాం.కరీనా కపూర్ తన పోస్ట్‌లో రాస్తూ.. " వివాహాలు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఇష్టమైన వ్యక్తి మరణం, పేరెంటింగ్ గురించి సంఘటనలు నిజంగా అర్థం చేసుకోలేరు. ఇది మీ జీవితంలో నిజంగా జరిగే వరకు మీకు ఇలాంటి విషయాలు అర్థం కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు, సిద్ధాంతాలు, ఊహలు వాస్తవాలు కావు. జీవితంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడితే అంత తెలివైన వారిగా ఎదుగుతారు" అంటూ రాసుకొచ్చింది.కాగా.. ఇటీవల ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో ఉన్నఇంట్లోకి ఒక ఆగంతకుడు చోరీకి యత్నించాడు. అదే క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన సైఫ్‌ను కత్తితో దాడి చేశాడు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సినిమాల విషయానికొస్తే కరీనా కపూర్ చివరిసారిగా హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రంలో కనిపించింది. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
రిలేషన్షిప్లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్‌ఫ్రెండ్‌తో కలిసి!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.డిన్నర్‌కు వెళ్తూ..తాజాగా మరోసారి తన భాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్‌కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్‌కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్‌వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
బామ్మర్ది పెళ్లిలో సాంగ్ పాడిన నిక్ జోనాస్.. ప్రియాంక చోప్రా డ్యాన్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారు. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా గ్రాండ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ వేడుకల్లో తన ముద్దుల కూతురు మాల్టీ మేరీకో కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. తాజాగా ఇవాళ జరిగిన బరాత్ వేడుకల్లో తన భర్త, సింగర్ నిక్ జోనాస్లో కలిసి సందడి చేసింది. బాలీవుడ్ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించింది.ఈ వేడుకల్లో ప్రియాంక నీలిరంగు లెహంగాలో అందంగా కనిపించగా.. నిక్ జోనాస్ తెల్లటి షేర్వానీ ధరించి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు.అంతకుముందు జరిగిన సంగీత్ వేడుకల్లో నిక్ జోనాస్ పాట పాడారు. ఈ వీడియోను ప్రియాంక చోప్రా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ బామర్ది పెళ్లిలో బావ అద్భుతమైన ఫర్మామెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా.. తన ప్రియురాలు, నటి నీలం ఉపాధ్యాయను పెళ్లాడనున్నారు. మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) -
'సల్మాన్, షారూఖ్ నన్ను చూసి నవ్వారు'.. హీరోయిన్ కామెంట్స్
మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించిన హీరోయిన్ మమతా కులకర్ణి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సడన్‌గా సన్యాసం స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ ఇండస్ట్రీని వదిలేసిన మమతా ఇండియాను వదిలేసి రెండు దశాబ్దాలయింది. సుదీర్ఘ విరామం తర్వాత మహాకుంభ్ మేళా కోసం భారత్‌కు తిరిగొచ్చింది. దాదాపు 23 ఏళ్లుగా ఈ అవకాశం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. కాగా మమతా కులకర్ణి.. హిందీలో కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడీ వంటి పలు సినిమాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ చిత్రాలతో మెప్పించింది.తాజాగా మమతా బాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను కరణ్ అర్జున్ మూవీ గురించి మాట్లాడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలో తనను చూసి సల్మాన్, షారుక్ ఖాన్ నవ్వుకున్నారని తెలిపింది. సల్మాన్ ఖాన్ ఏకంగా తనను చూసి తలుపులు వేసుకున్నాడని పేర్కొంది.మమతా కులకర్ణి మాట్లాడుతూ.. "కరణ్ అర్జున్ మూవీ షూట్ షారుఖ్, సల్మాన్‌తో కలిసి చేశాను. అక్కడే ఓ సాంగ్ షూట్లో కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్‌ను సింగిల్ టేక్‌లో చేశా. కానీ వాళ్లిద్దరూ రీటేక్స్ ఎక్కువగా తీసుకున్నారు. దాంతో కొరియోగ్రాఫర్‌కు కోపం వచ్చి ప్యాకప్ చెప్పేశాడు. ఆ తర్వాత సల్మాన్ అసహనానికి గురయ్యాడు. నేను గదిలోకి వెళ్తుంటే నా ముఖంపై తలుపు వేశాడు. కానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సల్మాన్ ఎప్పుడూ నన్ను ఆటపట్టించేవాడు. నేను సెట్లో సమయపాలన పాటిస్తాను.' అని తెలిపింది.(ఇది చదవండి: 23 ఏళ్లుగా దీనికోసమే.. ఒలంపిక్ గెల్చినంత సంతోషంగా ఉంది: మమతా)కాగా.. మమతా కులకర్ణి 2000 సంవత్సరం ప్రారంభంలో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఆమె చివరిసారిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్లో కనిపించింది. అంతకుముందు మేరా దిల్ తేరే లియే, తిరంగా, దొంగ పోలీస్, కిస్మత్ లాంటి చిత్రాల్లో నటించింది. -
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
కంగనా రనౌత్ రెస్టారెంట్.. తొలి కస్టమర్‌గా స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తన బిజినెస్‌ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్‌కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది. తన కొత్త రెస్టారెంట్‌కు మొదటి కస్టమర్‌గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా రెస్టారెంట్‌ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్‌ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అన్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె నీ రెస్టారెంట్‌కు నేనే మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్‌గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms) -
ఏఐ మోనాలిసా.. బాలీవుడ్ హీరోయిన్ కంటే అందంగా!
ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ మేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అమ్మాయి మోనాలిసా. జీవవోపాధి కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు ఊహించని విధంగా ఫేమ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా వల్ల ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్లో మూవీ ఆఫర్ కూడా వరించింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కించనున్న సినిమాలో మోనాలిసా కనిపించనుంది.అయితే తాజాగా మోనాలిసాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో నటించేందుకు కోసం హీరోయిన్లా మేకప్ వేసుకుని కనిపించింది. అయితే ఈ వీడియోను ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఏఐ సాయంతో చేసినప్పటికీ మోనాలిసా మేకోవర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అచ్చం హీరోయిన్ కటౌట్‌ను తలపిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Punjab Kesari (@punjabkesari_pk) -
భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న యానిమల్ బ్యూటీ.. డైరెక్టర్ ఏమన్నారంటే?
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో ఫేమస్ అయింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిప్తి డిమ్రికి ఆఫర్లు వెతక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్లో వరుసగా సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ.అయితే ఇటీవల త్రిప్తి డిమ్రీ రొమాంటిక్ హిట్ సిరీస్ ఆషికి-3లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. కానీ ఊహించని విధంగా ఆమె ఈ ప్రాజెక్ట్ తప్పుకుంది. దీంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వదంతులు మొదలయ్యాయి. ఆమెకున్న బోల్డ్ ఇమేజ్ వల్లే నిర్మాతలు త్రిప్తి ఎంపికపై నిర్ణయాన్ని మార్చుకున్నారని ఊహగానాలొచ్చాయి.తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి డిమ్రీ తప్పుకోవడంపై ఈ మూవీ డైరెక్టర్ అనురాగ్ బసు స్పందించారు. ఆమె ఎందుకు తప్పుకుందో తననే అడగాలని అన్నారు. నా సినిమాలో చేయకపోయినా ఎప్పటికీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అని.. నటిగా ఆమె అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తేదీలే సమస్య అయి ఉండవచ్చని అన్నారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని.. త్రిప్తి ప్రస్తుతం దర్శకుడు విశాల్ భరద్వాజ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మా సినిమాకు టైటిల్ పేరేంటో నాకు తెలియదు.. మేము హీరోయిన్ను ఇంకా ఖరారు చేయలేదని.. వారం రోజుల్లో ప్రకటిస్తామని అనురాగ్ బసు పేర్కొన్నారు. కాగా.. అనురాగ్ బసు బాలీవుడ్లో గ్యాంగ్‌స్టర్, బర్ఫీ, లైఫ్ ఇన్ ఎ మెట్రో చిత్రాలకు ఫేమస్ అయ్యారు. -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్‌కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోయిన్‌తో బ్రేకప్.. పెళ్లిపై స్పందించిన స్టార్ హీరో
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తాను సింగిల్‌గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు. -
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్.. ఆయనను గుర్తు చేసుకుని!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. గురుగ్రామ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్టేజీపై ర్యాంప్ వాక్ చేస్తున్న ఏడుస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఫ్యాషన్ వేడుకను దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ బల్‌ను గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. సోనమ్ కన్నీళ్లతో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఆమె మాట్లాడుతూ .. "రోహిత్ బల్ కోసం నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. అతని దుస్తులను చాలాసార్లు ధరించడం సంతోషం కలిగించింది. నా కోసం అతను చాలాసార్లు దుస్తులు డిజైన్ చేయించారు. బహుశా అతని కోసం చివరి ప్రదర్శన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వారసత్వ, హస్తకళ వేడుక ప్రతిదీ ఆనందంగా జరుపుకోవడమే. నేను అదే విధంగా దుస్తులు ధరించడం ఇష్టపడతాను.' అని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సోనమ్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.సోనమ్ తన ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. " లెజెండరీ రోహిత్ బల్కు నివాళిగా నడవడం గౌరవంగా భావిస్తున్నా. అతని కళాత్మకత, దృష్టి, వారసత్వం భారతీయ ఫ్యాషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాయి. అతని జ్ఞాపకార్థం ర్యాంప్ వాక్ చేయడం ఉద్వేగభరితంగా అనిపించింది. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ఒక రూపకర్తగా ఆయన ఒక ఐకాన్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. సోనమ్‌తో పాటు చిత్రనిర్మాత మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ వాలయ, నటులు ఈషా గుప్తా, రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే కూడా రోహిత్ బల్కు నివాళులర్పించేందుకు ర్యాంప్ వాక్ చేశారు. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
బాలీవుడ్ హీరోయిన్‌కు షాకిచ్చిన ట్విటర్.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ట్విటర్ షాకిచ్చింది. కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆమె ట్విటర్(ఖాతా)ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్వర భాస్కర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. నేను చేసిన ట్వీట్స్‌లో రెండు ఫోటోలు కాపీ రైట్ ఉల్లంఘించినట్లుగా గుర్తించి నా ఖాతాను రద్దు చేశారని తెలిపింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని అని పోస్ట్ చేసింది. ఇలాంటి నిర్ణయాలు తనకు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపింది. అంతా కాకుండా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే..ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర భాస్కర్ పోస్ట్ ఈ ట్విటర్ అకౌంట్(ఎక్స్) సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఒకటి హిందీ దేవనాగరి లిపిలో "గాంధీ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందగీ హై" అనే నినాదం రాసిన ఫోటో కాగా.. మరొకటి తన కుమార్తె జాతీయ జెండా పట్టుకుని ఉండగా.. ఆ పిల్లాడి మొహన్ని కనిపించకుండా హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అంటూ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్ట్‌లపై ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్వరభాస్కర్ అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా.. స్వర భాస్కర్ విషయానికొస్తే సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2023లో జనవరి 6న వీరి పెళ్లి జరిగింది. మొదట రిజిస్టర్ మ్యారేజ్ ద్వారా భార్యాభర్తలయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్‌ఫ్లవర్ సింబల్‌ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్)కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్‌హౌస్‌లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్‌స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్‌డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌కు ఇన్‌స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్‌గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్‌లు, హోటళ్ల బిజినెస్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్‌గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్‌తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
'మహిళల జీవితాల గురించి మీకేం తెలుసు?'.. హీరామండి హీరోయిన్ ఫైర్
బాలీవుడ్ భామ రిచా చద్దా చివరిసారిగా హీరామండి వెబ్ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఇందులో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించడం విశేషం.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, నైట్‌క్లబ్‌లకు వెళ్లే వారిని ప్రగతిశీల మహిళలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తెరపై చూపించే స్త్రీల నిజ జీవితం గురించి మీకు తెలుసా అని చిత్రనిర్మాతలను ఆమె ప్రశ్నించారు.రిచా మాట్లాడుతూ..' 2010-2012 కాలంలో బాలీవుడ్లో మహిళలు స్మోకింగ్ చేసేవారని కొందరు చెడుగా చూపించారు. అంటే సిగరెట్ తాగి.. నైట్ క్లబ్ వెళ్లేవారని కొందరు దర్శకులు బ్యాడ్‌గా రాశారు. అంతేకాదు క్లబ్‌ల్లో డ్యాన్స్ చేసేవారి పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించినట్లు గుర్తించా. నేను ఆ చిత్ర నిర్మాతలను ఒక్కటే అడగాలనుకుంటున్నా.అసలు అలాంటి మహిళల గురించి మీకు తెలుసా?. మహిళల త్యాగం గురించి మీకేం తెలుసు. మా ఎముకల నుంచి ఒక బిడ్డను తయారు చేస్తాం. మా రక్తంతో వారికి పోషకాలు అందిస్తాం. పిల్లల కోసం మా జుట్టు, నిద్ర అన్ని దూరమవుతాయి. అంతకుమించిన త్యాగం ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఎవరైనా చేయగలరా? ' అని ఆమె ప్రశ్నించారు.కాగా.. రిచా చద్దా చివరిసారిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి: ది డైమండ్ బజార్లో కనిపించింది. ఇందులో సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, తాహా షా బాదుషా కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిచా ఇటీవల గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇది ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. -
23 ఏళ్లు వయసు.. రూ 250 కోట్ల ఆస్తి.. ఎవరీ బుల్లితెర నటి?
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా.. ఇది వాస్తవమే.షారుఖ్‌ని మించిన అభిమానం.. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్స్‌తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో షారుఖ్‌ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.ఎపిసోడ్‌కి 18 లక్షలుజన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది. ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్‌కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
విడుదలకు ముందే వివాదం.. రష్మిక చిత్రాన్ని అడ్డుకుంటామంటూ వార్నింగ్!
పుష్ప భామ రష్మిక మందన్నా ప్రస్తుతం ఛావా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ సరసన నటించింది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఛావా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదానికి కారణమైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఛావా మూవీపై మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని ఒక డ్యాన్స్ సీన్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ సీన్ తొలగించకపోతే సినిమాకు విడుదలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఛత్రపతి చరిత్రను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పే ఇలాంటి ప్రయత్నాలు అవసరమని.. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.కాగా.. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించడంపై మంత్రి మండిపడ్డారు. దర్శకుడు ఆ సీన్ కట్ చేయాలని.. అంతేకాదు ఈ సినిమాను చరిత్రకారులు, మేధావులకు చూపించాలని అన్నారు. వారు ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఈ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాతలు చరిత్రకారులను సంప్రదించి వివాదాస్పద కంటెంట్ ఉంటే విడుదలకు ముందే తొలగించాలని సమంత్ పిలుపునిచ్చారు. మేం సూచించిన మార్పులు చేయకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మహారాజ్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.ఆ సీన్లు తొలగిస్తాం.. డైరెక్టర్శంభాజీ మహారాజ్.. మహారాణి యేసుబాయితో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలను తొలగిస్తున్నట్లు చావా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమేనని.. మరాఠా రాజు వారసత్వం కంటే మరేది ముఖ్యం కాదని ఉటేకర్ తెలిపారు. -
బ్లాక్ చీరలో 'అలియా భట్' స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్‌స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్‌గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్‌హిట్ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
తెలుగులో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ 'దియా మీర్జా' ఫోటోలు
-
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
హీరోయిన్‌తో డేటింగ్.. స్నేహితురాలితో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అడార్ జైన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్న నాటి స్నేహితురాలు అలేఖ అద్వానీని ఆయన పెళ్లాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు సందడి చేశారు. వారం రోజు క్రితమే వీరి పెళ్లి వేడుక జరగగా.. తాజాగా నటుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. అడార్ జైన్ ప్రముఖ సీనియర్ నటుడు రాజ్ కపూర్ మనవడు. రాజ్ కపూర్ కుమార్తె రీమా కపూర్ కుమారుడు. వీరంతా బాలీవుడ్ సినీ తారలైన రణ్ బీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్లకు బంధువులే. అయితే వీళ్లెవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ గత సంవత్సరం ముంబయిలోని ఆదర్ నివాసంలో జరిగిన రోకా వేడుకలో మాత్రం పాల్గొన్నారు. రోకా వేడుకకు అలియా భట్, నీతు కపూర్ కూడా హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆదర్ జైన్- అలేఖా అద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో మూడుముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.తారా సుతారియాలో డేటింగ్..అంతతముందు అడార్ జైన్ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ భామ తారా సుతారియాతో డేటింగ్లో ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరిద్దరు పలు ఈవెంట్లతో సందడి చేశారు. 2020లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023లో ఈ జంట విడిపోయారు. కాగా.. 2017లో ఖైదీ బ్యాండ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అడార్ జైన్.. చివరిసారిగా హలో చార్లీ చిత్రంలో కనిపించాడు. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) -
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
'మగాడు కేవలం దానికోసమే'.. హీరోయిన్ టబు కథనాలపై స్పందించిన టీమ్!
హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్‌తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.ఖండించిన టబు టీమ్..ఇటీవల ఆన్లైన్లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. -
బిగ్‌బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్‌పై శిల్పా రియాక్షన్
బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
రిలీజ్‌కు సిద్ధమైన వివాదాస్పద మూవీ.. సినీ ప్రియులకు బంపరాఫర్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ఎమర్జన్సీ. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మూవీ టీమ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ సినిమా విడుదల రోజు టికెట్లను రూ.99 లకే అందుబాటులో ఉంచనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసింది. రిలీజ్ రోజే ఈ ఆఫర్ ప్రకటించడం విశేషం. ఇటీవల సోనూ సూద్ సైతం ఫతే సినిమాకు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ విషయంలో సోనూ సూద్‌నే కంగనా రనౌత్ ఫాలో అయినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!)ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.17th jan, #emergency day 🇮🇳 pic.twitter.com/71dWpvnGGk— Kangana Ranaut (@KanganaTeam) January 16, 2025వివాదాలతో ఆలస్యం..ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై వివాదాలు నడుస్తున్నాయి. ఓ వర్గం వారిని కించపరిచేలా ఉందంటూ కొందరు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీంతో కొన్ని సీన్స్ తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. సెన్సార్ బోర్డు చెప్పిన ఆదేశాలు పాటించడంతో ఎమర్జెన్సీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జన్సీ వీక్షించిన నితిన్ గడ్కరీ..ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎమర్జన్సీ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ప్రత్యేక షోను ఏర్పాటు చేయగా.. కంగనా రనౌత్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ మూవీని చూశారు. -
కూతురి పేరును రివీల్ చేసిన ప్రముఖ నటి.. అర్థం అదేనట!
ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.2023లో పెళ్లి..కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.ఎవరీ మసాబా గుప్తా..?కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి
లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి అన్నారు. ఒక్క రోజులోనే నగరం కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్లో కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. -
'ఆ దేవుడి దయతో బతికిపోయాం'.. విషాదంపై హీరోయిన్ ట్వీట్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా విచారం వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తన కలలో కూడా ఊహించలేదని అన్నారు. మా పొరుగువారంతా ఇలా బాధపడతారని అనుకోలేదంటూ ట్వీట్ చేశారు ప్రీతి జింటా. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.ప్రీతి జింటా తన ట్వీట్లో రాస్తూ.' లాస్ ఎంజిల్స్‌లో మా చుట్టూ ఉన్న వారిని మంటలు నాశనం చేసే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నేను బతికుండగా ఇలాంటి విషాదం చూస్తానని అనుకోలేదు. నా స్నేహితులు, కుటుంబాలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మన చుట్టూ ఉన్నవారికి జరిగిన విధ్వంసం చూసి నా హృదయ బరువెక్కింది. అక్కడి విధ్వంసం చూస్తుంటే ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి విషాదం సమయంలో మేమ సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ మంటల్లో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గాలి త్వరలోనే తగ్గి మంటలు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నా. ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేస్తున్న అగ్నిమాపక శాఖ, అగ్నిమాపక సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ సురక్షితంగా ఉండండి' అని పోస్ట్ చేశారు.కాగా.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చుతో వేల ఇళ్లు మంటల్లో బూడిదయ్యాయి. ఈ మంటలు దాదాపు వెయ్యి ఎకరాలకు వ్యాపించాయి. ఈ ప్రకృతి విపత్తుతో దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. ఈ విషాద ఘటనలో దాదాపు 13 మంది మరణించగా.. 12,000 కంటే ఎక్కువ ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.కాగా.. నటి ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి అక్కడే నివసిస్తున్నారు. వీరిద్దరికి ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్‌తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. తాజాగా అమెరికాలో వీరు నివసిస్తున్న లాస్ ఎంజిల్స్లోనే కార్చిచ్చు ఘటన జరగడంతో ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేస్తోంది.కాగా.. ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్‌ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్‌హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. I never thought I would live to see a day where fires would ravage neighbourhoods around us in La, friends & families either evacuated or put on high alert, ash descending from smoggy skies like snow & fear & uncertainty about what will happen if the wind does not calm down with…— Preity G Zinta (@realpreityzinta) January 11, 2025 -
వాళ్లకు అలాంటిదేం లేదు.. నీకేమైంది?.. ఊర్వశి రౌతేలాపై ఘాటు కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొత్త ఏడాదిలో మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) డ్యాన్స్ చేసిన 'దబిడి దిబిడి' అంచూ సాగే సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.అయితే సాంగ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య అలా చేయడం కరెక్ట్ కాదంటూ పలువురు విమర్శించారు. అంతేకాదు శేఖర్ మాస్టర్ చెత్త కొరియోగ్రఫీ అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఆ స్టెప్పులేంటి అంటూ చాలా మంది బహిరంగంగానే బాలయ్యతో పాటు డాకు మహారాజ్ టీమ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కేఆర్కే(Kamal R Khan) ఈ సాంగ్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగువాళ్లు అలాంటి పాటలు చేయడానికి వెనకాడరు.. కానీ ఊర్వశి రౌతేలా ఆ పాటను చేయడం చూస్తే తనకు ఎలాంటి సిగ్గులేదనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారు. అయితే కేఆర్కే ట్వీట్‌పై ఊర్వశి రౌతేలా స్పందించింది. జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడేవారిని విమర్శించే అర్హత ఉందనుకోవడం విడ్డూరం అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. అవతలి వారి పైకి తీసుకొచ్చేలా చేయడం.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఉంటుందని' అని కౌంటర్ ఇచ్చిపడేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.(ఇది చదవండి: స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్)కాగా.. డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.It’s ironic how some who’ve achieved nothing feel entitled to criticize those who work tirelessly. Real power isn’t in tearing others down it’s in lifting them up and inspiring greatness. @kamaalrkhan https://t.co/kS3tdXFk0a— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 9, 2025 -
అతనితో డేటింగ్లో దంగల్ నటి.. ఫోటోలు వైరల్!
దంగల్ మూవీతో క్రేజ్ దక్కించుకున్న నటి సన్యా మల్హోత్రా(Sanya Malhotra). ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఇటీవల వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ చిత్రంలో మెరిసింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కథను అందించగా.. నిర్మాత ఆయన భార్య వ్యవహరించారు. ఈ మూవీ ద్వారానే కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉండగా అయితే దంగల్ నటి సన్యా మల్హోత్రాపై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ వాద్యకారుడు రిషబ్ రిఖిరామ్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ ఫోటో షూట్లో రిషబ్, సన్యా కలిసి ఓ అభిమానితో ఫోటోలకు పోజులిచ్చారు. ఓకే ఈవెంట్లో ఇద్దరు అదే వ్యక్తితో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట ఎంత అద్భుతంగా ఉంది.. సన్యా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఒకరు కామెంట్ చేశారు. 'ఇద్దరూ చాలా ప్రతిభావంతులు..మీరు డేటింగ్లో ఉంటే ఇంకా మంచిది' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.రిషబ్ రిఖిరామ్ శర్మ ఎవరంటే?రిషబ్ రిఖిరామ్ శర్మ.. రిఖీ రామ్ కుటుంబానికి చెందిన సితార్ ప్లేయర్, సంగీత స్వరకర్త. పురాణ సితార్ వాద్యకారుల కోసం వాయిద్యాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అతను దిగ్గజ పండిట్ రవిశంకర్ చివరి శిష్యుడు. సితార్ ఫర్ మెంటల్ హెల్త్, ఉచిత మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం సెషన్స్ నిర్వహిస్తుంటారు. రిషబ్ తన ప్రదర్శనల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో అమెరికాలోని వైట్ హౌస్‌లో నిర్వహించిన మొట్టమొదటి దీపావళి వేడుకలో సోలో ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత పారిస్‌లో జరిగిన 2024 వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకలో తన ప్రదర్శనతో భారతీయ అథ్లెట్లను అలరించాడు.ఇక సన్యా మల్హోత్రా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సన్నీ సంస్కారీ కి తులసి కుమారి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, రోహిత్ సరాఫ్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 18, 2025న థియేటర్లలోకి రానుంది.కాగా.. 2016లో వచ్చిన దంగల్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకు దంగల్ మూవీ కలెక్షన్స్‌ను ఏ సినిమా కూడా దాటలేకపోయింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్, సుహానీ భట్నాగర్, జైరా వాసీం,సాక్షి తన్వర్, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. -
ఆస్కార్ చిత్రాల ఎంపిక.. కంగనా రనౌత్ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈనెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల ఆస్కార్ ఎంపికైన చిత్రాల జాబితాపై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితాపై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనదేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది.(ఇది చదవండి: సినిమాల్లో నటించనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ హీరో)కంగనా రనౌత్ మాట్లాడుతూ..'మనదేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం.. వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్లో చోటు ఉంటుంది.'అని అన్నారు.కంగనా మాట్లాడుతూ..'ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు' అని తెలిపింది.ఎమర్జెన్సీ కథేంటంటే..కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ, ఆ తరువాతి పరిణామాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు.(ఇది చదవండి: Oscar 2025: ఆస్కార్ బరిలో ‘కంగువా’)మొదటి నుంచి వివాదాలు..ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. -
రోహిత్ శర్మపై నటి పోస్ట్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్!
బాలీవుడ్ భామ విద్యా బాలన్(vidya Balan) గతేడాది భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ హారర్-కామెడీ చిత్రంలో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నటి విద్యాబాలన్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్ శర్మను ఉద్దేశించి చేసిన పోస్ట్ నెట్టింట విమర్శలకు దారితీసింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సిరీస్‌లో ఐదో టెస్టుకు దూరంగా ఉండాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) నిర్ణయాన్ని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసించారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ బదులుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని తీసుకున్నారు. అయితే రోహిత్ శర్మకు మద్దతుగా విద్యాబాలన్ స్పందించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె తన పీఆర్ టీమ్ సూచనల మేరకే ఇలా రియాక్షన్ ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఫేమ్ కోసమే రోహిత్ శర్మ పేరును వాడుకుందని విద్యా బాలన్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నటి విద్యాబాలన్ టీమ్ స్పందించింది.స్పందించిన విద్యాబాలన్ టీమ్..విద్యాబాలన్ పోస్ట్‌పై పీఆర్ టీమ్ స్పందించింది. తమ సూచనల మేరకు ఆమె అలా చేయలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యా బాలన్ తన ఇష్టపూర్వకంగా అలాంటి పోస్ట్‌ను చేసింది. ఇందులో పీఆర్ టీమ్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. విద్యాబాలన్ మొదటి నుంచి క్రీడాభిమాని కాదు.. కానీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవారిని ఆమె మెచ్చుకుంటుందని పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. టరోహిత్ను ప్రశంసిస్తూ విద్యాబాలన్ చేసిన ట్వీట్‌పై చాలా మంది విమర్శలు గుప్పించారు. అసలు ఆమె ట్విటర్లో రోహిత్‌ను ఫాలో కావడం లేదని.. ఇదంతా కేవలం పీఆర్ స్టంట్‌లో భాగమేనని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రోహిత్‌ను ప్రశంసిస్తూ వచ్చిన స్క్రీన్ షాట్‌ను విద్యాబాలన్ మొదట షేర్ చేసి వెంటనే దాన్ని తొలగించారన్నారు. ఈ పోస్ట్ కాస్తా పెద్ద చర్చకు దారితీయడంతో దీనిపై విద్యా బాలన్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇది చదవండి: సినిమా కోసం 12 కిలోల బరువు పెరిగి ఆపై.. చైన్ స్మోకర్గా మారిన బ్యూటీ)2014లో పద్మశ్రీ అవార్డు..కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. సుమారు 13 ఏళ్ల క్రితం విడుదలైన ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యాబాలన్ పేరు అందరికీ దగ్గరయ్యారు. బాలీవుడ్లో భారీ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సిరీస్ కోల్పోయిన్ భారత్..ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్‌ని ట్రోఫిని టీమిండియా చేజార్చుకుంది. చివరి టెస్ట్‌లో ఓటమి పాలవడంతో 3-1తో సిరీస్‌ను కంగారూలకు అప్పగించింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా అర్హత సాధించింది. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రోటీస్‌తో ఆసీస్ తలపడనుంది. (ఇది చదవండి: అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్) Rohit Sharma, what a SUPERSTAR 🤩!! To take a pause & catch your breath requires courage … More power to you … Respect 🙌 !! @ImRo45— vidya balan (@vidya_balan) January 4, 2025 -
మాజీ ప్రియురాలితో సినిమా.. ప్రశంసలు కురిపించిన హీరో
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో కేదార్నాథ్ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. గతేడాది ఏ వతన్ మేరే వతన్ మూవీతో మెప్పించిన సారా.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ముంబయిలో జరిగిన ఈవెంట్లో స్కై ఫోర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీలో సారా మాజీ ప్రియుడు వీర్ పహరియా కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన వీర్ పహారియా.. మాజీ ప్రియురాలు సారా అలీఖాన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సారా అలీ ఖాన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. షూటింగ్లో తనకు మద్దతు అందించినందుకు సారాకు కృతజ్ఞతలు తెలిపాడు.వీర్ పహారియా మాట్లాడుతూ.. "ఆమె చాలా మంచి వ్యక్తి. సారాకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువ. తనకు ఇప్పటికే సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉంది. అందువల్లే నాకు చాలా సహాయం చేసింది. ఈ విషయంలో సారాకు రుణపడి ఉన్నా. తన మొదటి సినిమాలో మద్దతుగా నిలిచినందుకు సారాకు ధన్యవాదాలు" అని అన్నారు.కాగా.. 2018లో కేదార్నాథ్ మూవీ ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ చిత్ర పరిశ్రమలోకి రాకముందు వీర్ పహారియాతో డేటింగ్ చేసింది. గతేడాది కాఫీ విత్ కరణ్ సీజన్- 7 లో పాల్గొన్న సారా ఈ విషయం బయటకొచ్చింది. ఈ షోలో జాన్వీ కపూర్ వీర్ సోదరుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్న సమయంలోనే వీర్‌తో సారా డేటింగ్ చేస్తున్నారని హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను ఆటపట్టించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఎలాంటి రిలేషన్లో లేరు. వీర్ పహారియా, సారా అలీ ఖాన్ స్కై ఫోర్స్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24, 2025న విడుదల కానుంది.పొలిటీషియన్ కుమారుడితో డేటింగ్ రూమర్స్..మరోవైపు సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై గతంలో మరోసారి డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.కేదార్నాథ్ పర్యటన వల్లే..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. -
బికినీలో ప్రియాంక చోప్రా.. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పెద్ద హీరోతో సినిమాకు సైన్ చేశా.. ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్‌కు రమ్మన్నాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు. -
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్
తారక్ మెహతా కా ఊల్టా చష్మా షో నటి జీల్ మెహతా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు ఆదిత్య దూబేను పెళ్లి చేసుకుంది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.అయితే జీల్ మెహతా వివాహ వేడుక డిసెంబర్ 28న జరిగింది. కాస్తా ఆలస్యంగా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ పంచుకుంది. కాగా.. జీల్ మెహతా తారక్ మెహతా కా ఊల్టా చష్మా సిట్కాట్తో పాటు చల్దీ దా నామ్ గడ్డి సీరియల్లోనూ నటించింది.కాగా.. గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న జీల్ మెహతా, ఆదిత్య దూబే ఏడాది చివర్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సోను పాత్రలో అభిమానులను మెప్పించింది. జీల్ మెహతా 2008 నుంచి 2012 వరకు ఈ సిట్కామ్ షోలో కనిపించింది. మరో సీరియల్ చల్దీ దా నామ్ గడ్డిలో ప్రియాంక పాత్రలో అలరించింది. ఈ సిరీయల్ 2007 నుంచి 2008 వరకు కొనసాగింది. View this post on Instagram A post shared by Priya Parikh | Wedding Content Creation (@sociallydreaming) -
కూతురిపై డేటింగ్ రూమర్స్.. తనకేలాంటి బాధలేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.డేటింగ్ రూమర్స్..అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్‌పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్ నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.మొదట తనపై వచ్చే ట్రోల్‌లను డీల్ చేసిన పాలక్ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్‌కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా.. మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రాల్లో కనిపించారు. -
బేబీబంప్‌తో కేఎల్ రాహుల్ సతీమణి.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాహుల్, అతని భార్య అతియా శెట్టి సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. వచ్చే ఏడాదిలో ఈ జంట మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారు. అతియా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా అతియా శెట్టి సైతం ఆస్ట్రేలియాలోనే ఉంది.ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బిజీగా ఉన్నారు. మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతోంది. తాజాగా మెల్బోర్న్ స్టేడియంలో అతియాశెట్టి కనిపించింది. ఆమెతో పాటు అనుష్క శెట్టి, నితీశ్ కుమార్ రెడ్డి ఫాదర్ కూడా కనిపించారు. అయితే అతియాశెట్టి బేబీబంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాహుల్, అతియాల వివాహం 2023, జనవరి 23న ముంబయిలో జరిగింది. రాహుల్ శ్రీమతి అతియా ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు. Athiya Shetty with the baby 🥹❤️🧿🤞🏻🥹🧿❤️🪬😭💗😭🥹🪬🥺💗❣️🤍Also anushka and nitish family 🥹 pic.twitter.com/okzKM5umY4— Tia'world (@singh36896) December 29, 2024 -
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2(Stree 2 Movie). గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రానికి స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆజ్ కీ రాత్ అంటూ అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
మానుషి చిల్లర్ బెడ్రూం పోజులు.. డైమండ్ లాంటి నవ్వు (ఫొటోలు)
-
పాపం.. ఇక అదృష్టం లేదేమో.. ఐదోసారి నటికి హార్ట్ బ్రేకింగ్!
ఈ సమాజంలో ఏ మహిళకైనా ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అందుకోసమే పిల్లల కోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ గర్భధారణలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలామంది ఐవీఎఫ్, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనేందుకు యత్నిస్తుంటారు. ప్రస్తుత సరోగసీ అనే పద్ధతి చాలా వరకు సాధారణ ప్రక్రియగా మారిపోయింది.అయితే ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంభావన సేత్ సైతం పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐవీఎఫ్ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరోసారి ప్రయత్నించారు బాలీవుడ్ నటి. అయితే ఐదోసారి కూడా ఆమెకు నిరాశే మిగిలింది.ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంభావన. తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధను వ్యక్తం చేసింది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల ఇలా జరిగిందని బోరున ఏడ్చేసింది. నటి భర్త అవినాష్ ద్వివేది సైతం తాము గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే.. ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంభవనా ఎమోషనలైంది. మా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో 65 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని నటి తెలిపింది. కానీ చాలా ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుందని నాకు తెలియదు.. ఇది తలచుకుంటే చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతిరోజూ 2-3 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చేవారని.. మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఆమె భర్త అవినాశ్ బాధపడ్డారు.కాగా..గతంలోనూ ఈ జంట ఐవీఎఫ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఐదోసారి కావడంతో వారిని తీవ్ర మనో వేదనకు గురి చేసింది. గతంలో ఐవీఎఫ్ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు నటి వివరించింది. అంతేకాకుండా ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్‌ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్‌లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్‌బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్‌లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన ఆదిపురుష్ భామ..!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసింది.కబీర్ బహియా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. -
వెలుగులోకి రాని వేల కోట్ల వ్యాపారాధిపతి.. ఎవరీ బిలియనీర్?
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లోకి వచ్చే వ్యాపారవేత్తలు భారత్‌లో అనేక మంది ఉన్నారు. అయితే సంబంధిత వ్యాపార రంగాలలో ప్రముఖంగా ఉన్నప్పటికీ లో ప్రొఫైల్‌లో ఉండడానికి ప్రయత్నించేవారూ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi). బాలీవుడ్ నటిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రజల దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఎవరీ వికాస్ ఒబెరాయ్?వికాస్ ఒబెరాయ్.. ఒబెరాయ్ రియాల్టీకి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఆయన తండ్రి రణవీర్ ఒబెరాయ్ ఈ రియల్-ఎస్టేట్ కంపెనీని స్థాపించారు. ఇది వికాస్ నాయకత్వంలో దేశంలోని అగ్రశ్రేణి రియల్-ఎస్టేట్ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఆతిథ్యం, రిటైల్, కార్పొరేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌తో సహా విభిన్న రంగాలలోకి ప్రవేశించింది.ముంబైలో హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు, వాణిజ్య స్థలాలనెన్నో అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రధాన పేరుగా మారింది. ఒబెరాయ్ రియాల్టీకి అధిపతి మాత్రమే కాకుండా వికాస్ ఒబెరాయ్ ముంబైలోని ఫైవ్ స్టార్ వెస్టిన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్నారు. ప్రస్తుతం నగరంలోని మొదటి రిట్జ్-కార్ల్టన్ హోటల్‌తోపాటు విలాసవంతమైన నివాస సముదాయాన్ని నిర్మిస్తున్నారు.వికాస్ ఒబెరాయ్ నేపథ్యంముంబైలో పుట్టి పెరిగిన వికాస్ ఒబెరాయ్ నగరంలోని జై హింద్ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. తరువాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఓనర్/ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, వివేక్ శిక్షణ పొందిన పైలట్ కూడా. ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది.ప్రముఖ బాలివుడ్ నటి గాయత్రీ జోషిని వికాస్ ఒబెరాయ్ వివాహం చేసుకున్నారు. మోడల్ నుండి నటిగా మారిన ఆమె షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రంలో గీత పాత్రను పోషించారు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి అందరి దృష్టికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి విహాన్ ఒబెరాయ్, యువన్ ఒబెరాయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరు ఇటలీలోని సార్డినియాలో విహారయాత్ర చేస్తుండగా కారు ప్రమాదంలో చిక్కుకుని అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు.చదవండి: అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ జీతం ఇంతేనా?వికాస్ ఒబెరాయ్ నెట్వర్త్ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. దేశంలోని అత్యంత ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ నెట్‌వర్త్ 6.5 బిలియన్ డాలర్లు (రూ. 45,000 కోట్లు). -
లైబ్రరీలో ఫోజులు ఇచ్చిన 'లైగర్' బ్యూటీ (ఫోటోలు)
-
బాలీవుడ్ హీరోయిన్ ఫ్యాషన్ లుక్ : నెక్ట్స్ లెవల్ అంతే! (ఫోటోలు)
-
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్‌లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
నా ప్రపంచంలో నాకు నేనే రాణి : అంకిత లోఖండే (ఫోటోలు)
-
అనార్కలీ డ్రెస్‌లో అదుర్స్.. అంటున్న ఈ నటిని గుర్తు పట్టారా..! (ఫోటోలు)
-
హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్!
ప్రియుడి హత్య కేసులో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి సోదరి ఆలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కూతురు ఒకర్ని హత్య చేసేంత కిరాతకురాలు కాదని, తనకు సహాయం చేయడం మాత్రమే వచ్చని ఆమె తల్లి వెనకేసుకొస్తోంది. నర్గీస్ ఫక్రి మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించనేలేదు. సుమారు 20 ఏళ్లుగా తన సోదరితో నర్గీస్‌కు మాటల్లేవట! 20 ఏళ్లుగా మాటల్లేవ్ఈ రెండు దశాబ్దాల్లో ఈ అక్కాచెల్లెళ్లు కలుసుకుందే లేదని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరి అరెస్టయిన విషయాన్ని.. అందరిలాగే నర్గీస్ కూడా వార్తలు చూసే తెలుసుకుందట! తాజాగా నర్గీస్ ఫక్రి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నీకోసం మేమంతా వస్తున్నాం అని రాసుకొచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వాతో కలిసున్న ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ముగ్గురూ హౌస్‌ఫుల్ 5 సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది.ఏం జరిగిందంటే?అమెరికాలో ఉంటున్న ఆలియా..ఎడ్వర్డ్ జాకబ్స్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏమైందో ఏమోకానీ వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే మళ్లీ కలిసిపోదామన్న ఆలియా అభ్యర్థనను ఎడ్వర్డ్ తోసిపుచ్చాడట! పైగా తనను వదిలేసి అతడి స్నేహితురాలు అనస్తాసియాతో ఎక్కువ చనువుగా ఉండటాన్ని జీర్ణించలేకపోయిందట! ఈ క్రమంలోనే గ్యారేజీకి నిప్పుపెట్టి ఎడ్వర్డ్, అనస్తాసియాను చంపేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అరెస్టయిన ఆలియాను డిసెంబర్ 9న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.చదవండి: ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్ -
పెళ్లి తర్వాత మరింత గ్లామరస్‌గా సోనాక్షి (ఫొటోలు)
-
పింక్ శారీలో ట్రెడిషనల్‌గా అందంగా మెరిసిన బాలీవుడ్ నటి (ఫోటోలు)
-
ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్.. ఆ వీడియోలతో చెక్ పెట్టిన దంపతులు!
సినీ సెలబ్రిటీలపై రూమర్స్ రావడం ఈ రోజుల్లో అయితే సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా డేటింగ్, డివోర్స్ గురించి ఎక్కువగా వింటుంటాం. ఈ సోషల్ మీడియా యుగంలో రూమర్స్ రాకెట్ వేగంతో నెట్టింట వైరలవుతున్నాయి. అలా గత కొన్ని నెలలుగా పలువురు సినీతారలపై కూడా ఏదో ఒక సందర్భంలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఈ ఏడాది ప్రముఖ బాలీవుడ్ జంట ఐశ్వర్వరాయ్- అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు.వీరిద్దరిపై గత కొన్ని నెలలుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. పెళ్లి, బర్త్ డే వేడుకల్లో ఐశ్వర్య సింగిల్‌గా కనిపించడంతో అవీ మరింత బలపడ్డాయి. కానీ వాటిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు. తమపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ కూడా ఇవ్వలేదు.అయితే గతనెల ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ ముద్దుల కూతురు 13వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పార్టీకి డెకరేషన్ చేసిన జతిన్, నీలంలకు కృతజ్ఞతలు చెబుతూ కనిపించార ఐశ్వర్య-అభిషేక్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఆరాధ్య పుట్టిన రోజు వేడుకలో అభిషేక్ కనిపించడంతో వీరిద్దరి విడాకుల వార్తలకు ఇక చెక్ పడినట్లైంది. కాగా.. అభిషేక్ ఇటీవల ఐ వాంట్ టు టాక్ అనే చిత్రంలో కనిపించారు.భార్య మాట వినాలంటూ సలహా..తాజాగా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ఈవెంట్‌కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకున్న పురుషులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెళ్లి అయిన ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని గుర్తు చేశారు. ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా.. నా భార్య ఏం చెప్పినా వింటా అంటూ ముంబయిలో జరిగిన ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో సరదాగా కామెంట్స్ చేశారు.అంతేకాకుండా తన కూతురు ఆరాధ్యను సంతోషంగా పెంచినందుకు ఐశ్వర్యకు అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. నేను బయటకు వెళ్లి సినిమాలు చేయడం కూడా నా అదృష్టం.. ఎందుకంటే ఆరాధ్యతో పాటు ఇంట్లోనే ఉండి ఐశ్వర్య చూసుకుంటుందని నాకు తెలుసని అన్నారు. ఈ విషయంలో ఐశ్వర్యకు నా కృతజ్ఞతలు.. మన పిల్లలు ఎప్పటికీ మనల్ని వారి జీవితంలో మొదటి వ్యక్తిగానే చూస్తారని అభిషేక్ తెలిపారు. View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) View this post on Instagram A post shared by Play Time - Jatin Bhimani (@playtimeindia) -
సన్నీలియోన్ షోకు పోలీసుల అనుమతి నిరాకరణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10లోని ఇల్లీయూజన్ పబ్‌లో శనివారం వీకెండ్ నైట్‌లైఫ్‌లో భాగంగా ప్రముఖ బాలివుడ్ నటీ సన్నీ లియోన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్‌లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు. ఉదయం నుంచే సన్నీ లియోన్ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్‌కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
బ్లాక్ ఔట్ఫిట్తో బాత్రూమ్లో ఫోజులు ఇచ్చిన 'కృతి సనన్' (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి సెగల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్- అశేష్ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం. నవంబర్ 27న సాయంత్రం సోనాలి బిడ్డకు జన్మనిచ్చింది అని రాసుకొచ్చారు.బీర్ బాటిల్స్‌కు బదులు పాల సీసాలుకాగా సోనాలి ఈ ఏడాది ఆగస్టు 16న తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బీర్ బాటిల్స్ పట్టుకునే చేతిలో ఇకపై పాలడబ్బాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అశేష్ జీవితంలో మార్పు మొదలుకానుంది. నా విషయానికి వస్తే ఇప్పటివరకు నా ఒక్కదానికోసమే తిన్నాను, ఇప్పుడేమో ఇద్దరికోసం తింటున్నాను. గతేడాది పెళ్లిమా కుక్కపిల్ల కూడా రాబోయే బేబీతో ఎలా ఆడుకోవాలా? అని ఆలోచిస్తోంది. డిసెంబర్లో డెలివరీ డేట్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్ సోనాలి, రెస్టారెంట్ యజమాని అశేష్ ఐదేళ్లపాటు డేటింగ్ చేశారు. గతేడాది జూన్‌లో సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే సోనాలి సెగల్.. ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by One Communication (@one__communication) -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్ : భలే ఇంప్రెస్ చేశాడుగా! ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
హౌస్‌ఫుల్ 2-స్టార్, సింగర్ షాజాన్ పదమ్సీ గుడ్‌న్యూస్ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న షాజాన్ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్‌ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీని, ఆశిష్ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్‌తో తనను ఇంప్రెస్ చేసిన తీరును వెల్లడించింది. తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని చెప్పుకునే షాజాన్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజాన్.ఆశిష్ అందమైన పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్‌తో నవంబర్ 13న షాజాన్కు ప్రపోజ్ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్‌ని కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని వెల్లడించింది. అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్నెస్ ఫ్రీక్ అని,ఆశిష్‌కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) -
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
నెక్స్బ్రాండ్స్ ఇండియా 2030 లీడర్షిప్ ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఇది కదా సొగసు.. బంగారం వెలుగు కొద్దిసేపే! (ఫోటోలు)
-
రెడ్ హాట్ చాక్లెట్లా తృప్తి దిమ్రి.. మరీ ఇంత అందమా? (ఫొటోలు)
-
పెయింటింగ్‌లా బాలీవుడ్ భామ, డాజ్లింగ్ అంటున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ఈ వయసులో షార్ట్స్ ఎందుకు?.. సీనియర్ నటి అదిరిపోయే సమాధానం!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. -
'రణ్‌వీర్‌లో ఆ లక్షణాలే నచ్చాయి'.. దీపికా పెళ్లి వీడియో వైరల్!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ ఒకరు. ఈ జంటకు ఇటీవలే కూతురు జన్మించింది. వీరి పెళ్లయిన ఆరేళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 8న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ జంట ఇవాళ తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2018లో ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో నవంబర్ 14న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన భర్త రణ్వీర్ సింగ్ గురించి దీపికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా. అతనినొక నిశ్శబ్దం. అంతేకాదు తెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. అందుకే నేను ఇష్టపడ్డా' అని పెళ్లి వీడియోలో మాట్లాడింది.కాగా.. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) సెట్లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు మ్యారేజ్ డే సందర్భంగా దీపికా పదుకొణెకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
బుల్లితెర నటిపై తీవ్ర ఆరోపణలు.. దెబ్బకు వీడియో డిలీట్!
బాలీవుడ్లో బుల్లితెర స్టార్ రూపాలీ గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్స్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్‌ను విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో రెండుసార్లు విడాకుల పత్రాలు పంపించింది. రూపాలీ కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడమనేది చాలా పెద్ద తప్పు అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈషా కామెంట్స్‌పై నటి రూపాలీ గంగూలీ పరువునష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ రూ.50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రైవేట్‌గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు)డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ..'ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్లిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు.. నన్ను బాధపెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలను ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని" మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా.. అశ్విక్ కె వర్మ.. 1997లో సప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఈషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్.. నటి రూపాలీ గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాన్ష్ అనే కుమారుడు జన్మించాడు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి రుహి చతుర్వేది ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. కుండలి భాగ్య సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న రుహి చతుర్వేది నటుడు శివేంద్ర ఓం సాయినియోల్ను పెళ్లాడింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. వీరికి పెళ్లయిన ఐదేళ్ల తర్వాత గర్భం ధరించినట్లు వెల్లడించారు.రుహి చతుర్వేది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా అందమైన కుటుంబం ఇంకాస్త పెద్దగా అవుతోంది. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బుల్లితెర జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. రుహి చతుర్వేది, సైనియోల్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2019లో వివాహం చేసుకున్నారు.కాగా.. ఆమె కుండలి భాగ్య సీరియల్లో షెర్లిన్ ఖురానా పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు రుహి మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2010 పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత 2012లో ఆలాప్ అనే సినిమాతో నటనలో ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా ఖత్రోన్ కే కిలాడీ సీజన్-13లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. మరోవైపు ఆమె భర్త శివేంద్ర చోటి సర్దానీ అనే సీరియల్లో నటించారు. View this post on Instagram A post shared by Ruhi Chaturvedi (@ruhiiiiiiiiii) -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్‌బాస్ నటి సంప్రదాయపూజలు
-
ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే?
ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ మూవీ సక్సెస్ తర్వాత నాగ్ అశ్విన్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మహానటితో సూపర్ హిట్ కొట్టిన నాగ్.. మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.దీని కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ప్రస్తుతం కల్కి-2 మూవీతోనే బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరక్కిక్కిస్తున్నారనే వార్తలకు తెరపడింది.కాగా.. నాగ్ అశ్విన్ గతంలో కీర్తి సురేశ్ లీడ్ రోల్లో మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవితం అధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
నాకు యాక్టింగ్ రాదు.. అందుకే బాడీ చూపించా: పూజా బేడీ
చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ రాదు. ఏదో గ్లామర్‌తో మేనేజ్ చేసేస్తుంటారంతే! అయితే తమకు నటించడం రాదని ఎవరైనా చెబుతారా? కానీ బాలీవుడ్ నటి పూజా బేడీ ఇప్పుడు అదే చేసింది. తనకు అస్సలు యాక్టింగ్ రాదని, దీని నుంచి తప్పించుకునే బాడీ పార్ట్స్ చూపించి తప్పించుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూతురు పూజా బేడీ. పలు హిందీ సినిమాల్లో ఈమె నటించగా, అవి హిట్ అయ్యాయి. కాకపోతే ఈమె పెద్దగా మూవీస్ చేయలేదు. తెలుగులో చిట్టెమ్మ గారి మొగుడు, ఎన్టీఆర్ 'శక్తి' చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇవి రెండూ డిజాస్టర్స్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు.రీసెంట్గా ఫిక్కీ (FICCI) ఈవెంట్లో పాల్గొన్న ఈమె.. తనో దారుణమైన నటి అని చెప్పింది. క్లీవేజ్(ఛాతీ భాగం) చూపించి మేనేజే చేసేదాన్ని అని పూజా బేడీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా బేడీ కూతురు ఆలయ.. బాలీవుడ్లో హీరోయిన్గా చేస్తోంది. తన కుమార్తె మాత్రం తనలాంటిది కాదని, ఉదయం 6 గంటలకే నిద్రలేస్తుందని.. యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే ఆమెకు డెడికేషన్ అని చెప్పుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే పూజా బేడీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
బాలీవుడ్ సీనియర్ హీరో తొలి భార్య కన్నుమూత
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తొలి భార్య హెలెన ల్యూక్ కన్నుమూసింది. అమెరికాలోనే చనిపోయినట్లు ఈమె ఫ్రెండ్, నటి కల్పన అయ్యర్ ధ్రువీకరించింది. ఇండో-అమెరికన్ సిటిజన్ అయిన హెలెన్.. గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నాలుగు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎవరి దాని వాళ్లు చూసుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)మిథున్ చక్రవర్తితో పెళ్లి గురించి అప్పట్లో ఓసారి మాట్లాడిన హెలెన్.. తనని మిథున్ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత అతడి నిజస్వరూపం బయటపడటంతో విడిపోయానని చెప్పింది. ఈమె విడాకులు ఇచ్చేసిన తర్వాత యోగిత బలిని మిథున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన హెలెన్.. అక్కడి ఉండిపోయింది. తాజాగా ఈమె మరణవార్త తెలిసి పలువురు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే హెలెన్.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫీలింగ్ వీర్డ్. మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ నో క్లూ' అని రాసుకొచ్చింది. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల గురించే ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని, కానీ అకస్మాత్తుగా మరణించడం మాత్రం షాక్‌కి గురిచేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
క్రికెట్ అంటే పిచ్చి.. నెదర్లాండ్‌లోని ఓ ఫ్లవర్‌కి ఈమె పేరు.. ఐశ్వర్య గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
పొలిటీషియన్ కొడుకుతో హీరోయిన్?
బాలీవుడ్లో డేటింగ్ రూమర్స్ సర్వసాధారణం. పలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ సెలెబ్రిటీతో అయినా కలిసి ఫోటో దిగితే చాలు..వాళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో కొన్ని నిజమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఈ సారి సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి.పొలిటిషీయన్ కొడుకుతో ప్రేమాయణంసారా అలీఖాన్ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)అలా మొదలైంది..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. (చదవండి: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు) View this post on Instagram A post shared by Arjun Pratap Bajwa (@bajwaarjun) -
మన జీవితంలో ఆ ఒక్క సెకన్ చాలు : మలైకా అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. అయితే ఇటీవల ఆమె తండ్రి మరణం తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఆమెను పరామర్శించేందుకు వచ్చారు. అంతకుముందే 2018 నుంచి అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత తమ రిలేషన్‌పై వీరిద్దరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.అయితే తాజాగా ముంబయిలోని దివాళీ బాష్‌కు అర్జున్ కపూర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మలైకా అరోరా గురించి కొందరు ఆరా తీశారు. దీంతో తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అర్జున్ కామెంట్స్‌తో ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. అతని మాటలు విన్న మలైకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హృదయం, ఆత్మ అంటూ మలైకా రాసుకొచ్చారు. మన హృదయాన్ని ఒక్క సెకను తాకడం వల్ల.. జీవితాంతం మన ఆత్మను తాకవచ్చంటూ మనసులో మాటను బయటపెట్టింది.బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. -
అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్ మీ బే సీజన్-2లో నటిస్తోంది.అంబానీ పెళ్లిలో సందడి..ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్‌పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.ఐ లవ్ యూ అంటూ పోస్ట్అయితే ఇవాళ అనన్య పాండే బర్త్ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్‌గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్‌తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.తొలిసారిగా ఆ పెళ్లిలోనేకాగా.. అనన్య, వాకర్లు మొదటిసారిగా జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. -
ఆధ్యాత్మిక బాటలో హీరోయిన్.. పర్వతాల్లో ధ్యానం చేస్తూ!
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ఆధ్యాత్మిక బాటపట్టింది. ఇటీవల ముంబయిలో దివాళీ బాష్‌లో మెరిసిన ముద్దుగుమ్మ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. కొండల మధ్య ధ్యానం చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. గతంలోనూ సారా అలీఖాన్ తన ఫ్రెండ్ జాన్వీ కపూర్‌తో కలిసి కేదార్నాథ్ సందర్శించింది.కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రం మెట్రో ఇన్డినోలో కనిపించనుంది. ఈ మూవీలో ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమాసనా షేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఇది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ చిత్రం స్కై ఫోర్స్‌లో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
అమ్మ, నాన్న ముందే అలా అనడంతో.. ఆరునెలల పాటు: విద్యా బాలన్
బాలీవుడ్ భామ విద్యా బాలన్ తాజాగా భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విద్యా బాలన్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి కోలీవుడ్‌లో తనకెదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ఆ సంఘటనతో దాదాపు ఆరు నెలల పాటు అద్దంలో కూడా తన మొహాన్ని చూసుకోలేదని చెప్పింది. ఓ నిర్మాత తన నటన, డ్యాన్స్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా తనకు చెప్పకుండానే సినిమా నుంచి తొలగించాడని పేర్కొంది.విద్యా బాలన్ మాట్లాడుతూ.. 'నేను ఒక తమిళ చిత్రంలో చేశా. ఆ సినిమాలో రెండు రోజులు షూట్ పూర్తి చేశా. కానీ ఏమైందో తెలియదు.. నా ప్లేస్‌ను మరొకరితో భర్తీ చేశారు. ఈ విషయంపై చెన్నైలో నిర్మాతతో మాట్లాడేందుకు తల్లిదండ్రులతో కలిసి వెళ్లా. అతను సినిమాలోని కొన్ని క్లిప్‌లను మాకు చూపించి అవమానకరంగా మాట్లాడారు. మీ కూతురు ఏ యాంగిల్లో చూసినా హీరోయిన్గా కనిపిస్తోందా? అంటూ అవమానించాడు. తనకు నటించడం, డ్యాన్స్ చేయడం రాదని మొహంపైనే చెప్పాడని' ఆ చేదు ఘటనను గుర్తు చేసుకుంది.ఆయన మాటలతో చాలా బాధపడ్డానని విద్యాబాలన్ తెలిపింది. దాదాపు ఆరు నెలలు నా మొహం అద్దంలో కూడా చూసుకోలేదని వెల్లడించింది. ఆ సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొంది. కాగా.. విద్యాబాలన్ 1995లో హమ్ పాంచ్ అనే టీవీ సిరీయల్తో నటనలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో బెంగాలీ చిత్రం భలో తేకోతో అడుగుపెట్టింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ది డర్టీ పిక్చర్ (2011) చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ప్రస్తుతం హారర్-కామెడీ చిత్రం భూల్ భూలయ్యా -3తో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో మాధురీ దీక్షిత్, కార్తీక్ ఆర్యన్ కీలక పాత్రల్లో నటించారు. -
స్టార్ హీరోయిన్ ఒంటిపై మట్టితో చేసిన డ్రస్ (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమారుడితో హీరోయిన్.. దివాళీ బాష్‌లో మెరిసిన ప్రేమజంట..!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది. గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే మూవీతో అభిమానలను అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటి శ్వేత తివారీ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ బీటౌన్లోనే వినిపిస్తూనే ఉన్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాకుడా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఓసారి అతని ఇంటి వద్ద కూడా కనిపించింది.తాజాగా ఈ జంట ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీపావళి పార్టీలో మెరిశారు. వీరిద్దరు కలిసి పార్టీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇబ్రహీం అలీ ఖాన్ తన ప్రియురాలు పాలక్ తివారీని కలిసి వెళ్లడం కనిపించింది. అయితే వీరిద్దరి డేటింగ్‌పై ఇప్పటివరకు స్పందించలేదు.కాగా.. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పాలక్ తివారీ మరో చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రోసీ: ది సాఫ్రాన్ చిత్రంలో కనిపించనుంది. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్
బాలీవుడ్లో ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ బిగ్‌బాస్ షూటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ రెండోవారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హేమ శర్మ ఎలిమినేట్ అయింది.బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన హేమ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఎలాంటి సినిమాకుటుంబ నేపథ్యం లేదని తెలిపింది. నా పర్సనల్ లైఫ్‌లో అన్ని కష్టాలు అనుభవించానని వెల్లడించింది. కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని..కష్టపడి ఇక్కడి దాకా వచ్చానని హేమ శర్మ పేర్కొంది.నేను చేసిన పెద్ద తప్పు అదే..హేమ శర్మ మాట్లాడుతూ.. ' నా కష్టంతో సొంతంగానే ఎదిగాను. ఎవరైనా నన్ను దూషిస్తే అస్సలు అంగీకరించను. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశా. నా కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా. అందులో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి. నేను చేసిన తప్పులను అంగీకరిస్తున్నా. అంతే కాదు.. ఎవరూ కూడా నాలాగా ఆ తప్పులు చేయకూడదని కోరుకుంటున్నా. రెండుసార్లు వివాహం చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే తప్పుడు వ్యక్తులను నా జీవితంలోకి ఆహ్వానించా' అని తెలిపింది.బిగ్ బాస్ -18 కంటెస్టెంట్‌గా ఛాన్స్హేమ శర్మ తన కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆమె వీడియోలతో నెట్టింట ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అందువల్లే బిగ్‌బాస్ సీజన్-18లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది. కాగా.. ప్రస్తుత సీజన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. -
ప్రముఖ బ్యానర్లో చిన్న జాబ్.. తిరిగి అదే సంస్థతో హీరోయిన్గా ఛాన్స్ (ఫోటోలు)
-
పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. యానిమల్ బ్యూటీ కాదు.. ఆ హీరోయిన్ కోసం ప్రయత్నాలు!
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. గతంలో పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కనిపించనుంది.అయితే పుష్ప చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను ఊపేసింది. ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ.. అంటూ సాంగే ఐటమ్ సాంగ్ ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటకు హీరోయిన్ సమంత తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఐటమ్ సాంగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సీక్వెల్లోనూ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సాంగ్‌కు హీరోయిన్ ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పుష్ప టీమ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.అయితే ప్రస్తుతం ఈ ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ను వెతికేపనిలో ఉంది పుష్ప టీమ్. గతంలో ఈ పాట కోసం బాలీవుడ్ భామ, యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడేమో మరో క్రేజీ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. స్త్రీ-2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రద్ధాకపూర్‌ను పుష్ప టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఆమెను ఎంపిక చేస్తే బాలీవుడ్‌లోనూ క్రేజ్ వేరే లెవెల్‌కు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే శ్రద్ధాకపూర్‌ను టీమ్ సభ్యులు కలిశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ఆలియా భట్ సినిమా డిజాస్టర్.. డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం జిగ్రా. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లా సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఫేక్ కలెక్షన్స్ ఎలా ప్రకటిస్తున్నారంటూ మేకర్స్‌ను నిలదీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాజ్‌కుమార్ రావ్, ట్రిప్తి డిమ్రీ నటించిన విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాతో పోటీపడింది.అయితే జిగ్రా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది. మ్మిది రోజుల్లో కేవలం రూ.25.35 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. సినిమా ఫ్లాఫ్ కావడంతో డైరెక్టర్ వాసన్ బాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్విటర్ ఖాతాను ఆయన డిలీట్ చేశారు. ప్రస్తుతం ఆయన అకౌంట్ సెర్చ్ చేస్తే ట్విటర్లో కనిపించడం లేదు. జిగ్రా ఫెయిల్యూర్‌తోనే ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.కాగా.. కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆలియా భట్.. రక్షిత అక్క పాత్రలో కనిపించింది. ఆమె సోదరుడిగా బాలీవుడ్ నటుడు వేదాంగ్ నటించాడు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. -
సినిమాలు మానేద్దామని అనుకున్నా.. అంతా షారూఖ్ వల్లే: కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్‌తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది.సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది.కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు 18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇచ్చారని తెలిపింది.కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి
రణ్వీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం సీనియర్ నటి షబానా అజ్మీ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్లో నటించింది. నటుడు ధర్మేంద్రతో చేసిన లిప్‌లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన భర్త అనుమతి తీసుకునే ఆ సీన్ చేసినట్లు వెల్లడించారు.షాబానా అజ్మీ మాట్లాడుతూ..' నాకు ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించా. అయితే ఇందులో లిప్‌లాక్ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ చెప్పాడు. నా భర్త అనుమతి తీసుకొని చెబుతా అని అన్నా. ఇదే విషయంపై నా భర్తను అనుమతి అడిగా. ఆయన చాలా చిన్న విషయం.. దీనికి నా అనుమతి ఎందుకు' అని అన్నారు. ఈ చిత్రంలో నా రోల్ ఎప్పటికీ గుర్తుంటుందని షాబానా తెలిపారు.అయితే రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించేపనిలో బిజీగా ఉన్నాడు కరణ్ జోహార్. అయితే సీక్వెల్లో మరికొందరు కొత్తవాళ్లు ఉంటారని కరణ్ చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. -
కంగనా ఎమర్జెన్సీ.. రిలీజ్‌కు మోక్షం అప్పుడేనా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రాజకీయ కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పంజాబ్ ఎన్నికల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు నడుస్తున్నాయి. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే కొన్ని సీన్స్ మాత్రం మార్పులు చేయాలని సూచించింది. కొందరు తమను టార్గెట్ చేసి చెడుగా చూపిస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. దీంతో సినిమా విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. అందువల్లే పంజాబ్ ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)