బాలీవుడ్‌లో ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ బిగ్‌బాస్ షూటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్ రెండోవారాలు పూర్తి చేసుకుంది. సెకండ్ వీక్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హేమ శర్మ ఎలిమినేట్ అయింది.
బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన హేమ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఎలాంటి సినిమాకుటుంబ నేపథ్యం లేదని తెలిపింది. నా పర్సనల్ లైఫ్‌లో అన్ని కష్టాలు అనుభవించానని వెల్లడించింది. కానీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని..కష్టపడి ఇక్కడి దాకా వచ్చానని హేమ శర్మ పేర్కొంది.
నేను చేసిన పెద్ద తప్పు అదే..
హేమ శర్మ మాట్లాడుతూ.. ' నా కష్టంతో సొంతంగానే ఎదిగాను. ఎవరైనా నన్ను దూషిస్తే అస్సలు అంగీకరించను. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశా. నా కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా. అందులో కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి. నేను చేసిన తప్పులను అంగీకరిస్తున్నా. అంతే కాదు.. ఎవరూ కూడా నాలాగా ఆ తప్పులు చేయకూడదని కోరుకుంటున్నా. రెండుసార్లు వివాహం చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే తప్పుడు వ్యక్తులను నా జీవితంలోకి ఆహ్వానించా' అని తెలిపింది.
బిగ్ బాస్ -18 కంటెస్టెంట్‌గా ఛాన్స్
హేమ శర్మ తన కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆమె వీడియోలతో నెట్టింట ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అందువల్లే బిగ్‌బాస్ సీజన్-18లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది. కాగా.. ప్రస్తుత సీజన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment