
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అంటారు. మోనాలిసా అనే అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. మొన్నటి వరకు ఇళ్లిళ్లూ తిరిగి పూసలు అమ్ముకున్న ఈ యువతి.. మహాకుంభమేళా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. పూసలు అమ్ముకునేందుకు ఆమె కుంభమేళాకి వెళ్లడం..తన నీలికళ్లు, అందం, చిరునవ్వుకు ఫిదా అయిన ఓ వ్యక్తి ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం..అవికాస్త వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ‘స్టార్’ అయిపోయింది. ప్రస్తుతం ఈ నీలికళ్ల సుందరి తన వ్యాపారాన్ని వదిలేసి..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు.. ఇక ఈ సినిమాకు పారితోషికంగా రూ.21 లక్షలు అందుకున్నట్లు సమాచారం. అయితే మొదటి సినిమాకు పారితోషికం తీసుకున్న అనంతరం మోనాలిసా అన అమ్మకి బంగారు గొలుసు కొనిపెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ చూడండి అమ్మకి ఏం కొనిచ్చానో అంటూ వీడియో పెట్టింది.ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లుక్ మార్చేసిన బ్యూటీ
ప్రస్తుతం తనకున్న క్రేజీని మోనాలిసా క్యాష్ చేసుకుంటుంది. సినిమాలతో పాటు షాప్ ఓపెనింగ్స్‌కి కూడా వెళ్తోంది. తాజాగా ఓ బంగారు ఆభరణాల దుకాణం ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా వెళ్లింది. మొన్నటి వరకు మేకప్ అంటే తెలియని మోనాలిసా..ముఖానికి మేకప్ వేసుకొని తన లుక్‌నే మార్చేసింది. జుట్టు కూడా చిన్నగా కత్తిరించుకుంది. మేకప్ తర్వాత ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మోసాలిసాలో ఉన్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment