
విశ్వసుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. ఈమె పుట్టినరోజు నేడు (నవంబర్ 01)

ఐశ్వర్య స్టార్ హీరోయిన్ అని, సల్మాన్ ఖాన్‌ని ప్రేమించిందని, బచ్చన్ ఇంటి కోడలు అయ్యిందని తెలిసిందే.

కానీ ఈమె గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా బోలెడన్ని ఉన్నాయి.

1994లో 'మిస్ వరల్డ్' విజేతగా నిలిచిన ఐశ్వర్య రాయ్.. మూడేళ్ల తర్వాత తమిళంలో తొలి సినిమా చేసింది.

తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈమె పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.

గతేడాది రిలీజైన 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలో చివరగా ఐష్ కనిపించింది.

కర్ణాటకలో పుట్టిన ఈమెకు మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు.

ఐశ్వర్యకు వాచీలంటే చాలా ఇష్టం. మార్కెట్‌లోకి కొత్తగా ఏ మోడల్ వాచీ వచ్చినా కొనేస్తూ ఉంటుంది.

వాచీలతో పాటు ఆభరణాలన్నా సరే చాలా ఇష్టం. కొన్నింటిని సొంతంగా కూడా డిజైన్ చేసుకుంది.

2006లో ఓ సబ్బు యాడ్ షూట్ కోసం దుబాయి వెళ్లింది. ఆ రోజంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఐష్ క్రేజ్

లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐశ్వర్య మైనపు విగ్రహాం పెట్టారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ నటి ఈమెనే.

నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్ గార్డెన్‌లోని తులిప్ పువ్వుల్లోని ఓ జాతికి ఐశ్వర్య పేరు పెట్టడం విశేషం.

ఐశ్వర్యకు క్రికెట్ అంటే పిచ్చి. ఇప్పుడు కుదరడం లేదు గానీ అప్పట్లో సరదాగా క్రికెట్ ఆడేది.

2009లో ఈమెని భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. 2012లో బ్రిటన్ ప్రభుత్వం 'ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్' పురస్కారాన్ని ఇచ్చింది.

అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకున్న ఈమెకు ఆరాధ్య అని ఓ కూతురు ఉంది.

ప్రస్తుతం ఈమె వివాహ బంధంలో పొరపొచ్చలు వచ్చాయి. దీంతో భర్తకు దూరంగా ఉంటోంది.





