
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే బోలెడంత లక్ ఉండాలి.

తమన్నాకు అదృష్టం చాలా ఉంది. అందుకే గత 19 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది.

బాంబేలో పుట్టి పెరిగిన ఈ చిన్నది.. 13 ఏళ్లకే నటన మొదలుపెట్టేసింది.

అక్కడ నుంచి ఒక్కో భాషల్లో నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

'శ్రీ' సినిమాతో హీరోయిన్‌గా మారింది. 'హ్యాపీడేస్' సినిమా ఈమె లైఫ్‌లో టర్నింగ్ పాయింట్.

నాగచైతన్యతో చేసిన '100% లవ్' మూవీ తమన్నాని స్టార్ హీరోయిన్ చేసింది.

ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది.

ప్రస్తుతం ఈమెకు 35 ఏళ్లు. త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది.

తోటి నటుడు విజయ్ వర్మతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న తమన్నా.. 2025లో శ్రీమతి కాబోతుంది.

మిల్కీ బ్యూటీ అనే బిరుదుతో గ్లామరస్ రోల్స్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో చాలానే పేరొచ్చింది.

మరి పెళ్లి తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదంటే మెల్లగా తగ్గించేస్తుందో చూడాలి?










