Milky Beauty
-
13 ఏళ్లకే నటన.. లైఫ్ మార్చిన కాలేజీ సినిమా.. తమన్నా గురించి ఇవి తెలుసా? (ఫోటోలు)
-
ముద్దబంతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ.. (ఫొటోలు)
-
సినిమాలో కథ అక్కర్లే.. మిల్కి బ్యూటీ ఉంటే చాలు..
-
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్‌లలో అదరహో (ఫోటోలు)
-
తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. (ఇది చదవండి: థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!) కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పి.. అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగింది. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా.. రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది. (ఇది చదవండి: మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా) Bouncers try to stop fan from getting near #Tamannaah but she says #Kaavaalaa and gracefully poses for a selfie sending the fan to cloud nine #KaavaalaaStorms100MViews Get ready to witness @tamannaahspeaks magic on big screens #JailerFromAugust10th 😍😍pic.twitter.com/cnt4N9ZFsh — moviememesmedia (@moviememesmedi1) August 6, 2023 -
వామ్మో.. మిల్కీ బ్యూటీ ధరించిన టాప్ అంత రేటా?
టాలీవుడ్ నటి తమన్నా భాటియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఎంజాయ్ చేయగా.. ఎక్కడ చూసినా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ వేడుకల్లో తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న వీడియో వైరల్ కావడంతో డేటింగ్ ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే గోవాలో జరిగిన న్యూ ఇయర్ సందడి చేసిన భామ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ధరించిన సీక్వెన్ పింక్ టాప్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. పింక్ సీక్వెన్ టాప్ ధరించిన తమన్నా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. ఈ వేడుకల్లో నటి ధరించిన డ్రెస్ అందరినీ దృష్టిని ఆకర్షించింది. హాట్ లుక్ తో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ ధరించిన టాప్ విలువ అక్షరాలా రూ.2,27,830. ఆమె గతంలోనూ కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లోనూ ఈ డ్రెస్ తో మెరిసింది. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఇదో ట్రెండ్ గా మారింది. నటుడు విజయ్ వర్మతో ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా వార్తల్లో నిలిచింది. వీరిద్దరు రాబోయే ప్రాజెక్ట్ 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. విజయ్ వర్మ చివరిగా అలియా భట్ నటించిన చిత్రం డార్లింగ్స్ లో కనిపించాడు. అతను తదుపరి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో కనిపించనున్నాడు. -
బాహుబలి బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేదట..!
వెండితెరపై ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించింది మిల్కీ బ్యూటి తమన్నా. వరుసగా బాహుబలి, ఊపిరి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు సక్సెస్ సాధించటంతో తమన్నా కెరీర్ తిరిగి గాడిలో పడినట్టే కనిపించింది. అదే సమయంలో అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి తమన్నా కెరీర్ కష్టాల్లో పడింది. త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న తమన్నా, చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. విక్రమ్, శింబు లాంటి హీరోలతో తమిళ నాట సినిమాలు చేస్తున్నా.. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు మాత్రం మిల్కీ బ్యూటి దగ్గరకు రావటం లేదు. బాహుబలి సినిమాతో కెరీర్ మలుపు తిరుగుతుందని భావించిన తమన్నాకు తెలుగు తెర మీద నిరాశే ఎదురవుతోంది. -
ఈర్ష్య నుంచి బయటపడాలి
పోటీ, ఈర్ష్యాద్వేషాల నుంచి బయట పడితేనే సంతోషం సొంతమవుతుందంటున్నారు నటి తమన్న. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ మిల్కీ బ్యూటీ తమిళం, తెలుగు భాషలలో చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. తాజాగా దేవి చిత్రంతో మరోసారి బాలీవుడ్‌కు వెళ్లనున్న తమన్న ఇప్పుడు చాలా పరిణితి చెందారు. ఈ విషయాన్ని ఆమె మాటలు వింటే అర్థం అవుతుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఏమంటున్నారో చూద్దామా! ‘మనసులో ఉన్నది ఎంతో కాలం దాచుకోలేం. అలాగే కష్టం వస్తే నవ్వడం సాధ్యం కాదు. నా వరకూ వస్తే నిజ జీవితంలో నటించడం నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానో అది స్పష్టంగా ముఖంలో తెలిసిపోతుంది. మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. ప్రతి రంగంలోనూ నిత్యం ప్రతిభావంతులు వస్తూనే ఉంటారు. వారు మనల్ని వెనక్కు నెట్టి ఎదుగుతుంటారు. దీంతో ప్రతి వారిలో అభద్రతా భావం మనసుల్ని తొలిచేస్తుంది. ఈ వృత్తిలో నిలదొక్కుకోగలమా అన్న సందేహం మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఇక సినిమా రంగం విషయానికి వస్తే ఇక్కడ అందమైన ప్రతిభావంతులైన నటీమణులు చాలా మంది వస్తున్నారు. వారిని చూస్తే అసూయ పుడుతుంది. వారు నటించిన చిత్రాలు విజయం సాధించినప్పుడు వాటిలో నటించే అవకాశం మనకు రాలేదనే బాధ కలుగుతుంది. ఇలాంటి మానసిక పరిస్థితి అయోమయానికి గురి చేసి అశాంతిని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పోటీ, ఈర్ష్యాద్వేషాల నుంచి బయట పడాలి.నేను వాటి నుంచి ఎప్పుడో బయట పడ్డాను. సినిమాలో నాకంటే అందమైన,ప్రతిభ గల నటి కచ్చితంగా ఉంటారు. వారి ప్రతిభను అంగీకరించి గౌరవించాలి. అందుకు మనని మనం తయారు చేసుకోవాలి. అప్పుడే మంచి స్నేహితురాళ్లను సంపాదించుకోగలం. నేను ప్రతిభావంతులను స్వాగతిస్తాను. అభినందించడానికి సంకోచించను. నా కంటే బాగా నటిస్తే అసూయపడను. వెంటనే ఫోన్ చేసి అభినందిస్తాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది స్నేహితుల్ని సంపాదించుకున్నాను’ అంటూ ముక్తాయింపునిచ్చారు. -
స్టార్ ఎట్రాక్షన్... డ్యాన్స్!
ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) తొలిసారిగా దక్షిణాదికి వచ్చి చాలా సంచలనాలే సృష్టించింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నాలుగు సినిమా పరిశ్రమలకు సంబంధించి తొట్టతొలిసారిగా చేసిన ‘ఐఫా - ఉత్సవం’ 2016 అవార్డుల వేడుకలో రెండో రోజైన సోమవారం నాడు ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో జియోనీ, రేనాల్ట్ సంస్థల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అందించిన ఈ ‘ఐఫా - ఉత్సవం’లో క్రేజీ హీరోలు రామ్‌చరణ్, అఖిల్, అందాల తార తమన్నా తదితరులు పలు హిట్ పాటలకు ఆహూతుల ఎదుట ప్రత్యక్షంగా నర్తించారు. దాంతో, గచ్చీబౌలిలోని ఔట్‌డోర్ స్టేడియమ్‌కు విచ్చేసిన జనం వేదికకే కళ్ళప్పగించి, చూస్తూ ఉండిపోయారు. ప్రముఖ హిందీ నటీనటులు ప్రసిద్ధ అవార్డు ప్రదానోత్సవాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలాకాలంగా ఉన్నదే. కానీ, తెలుగు హీరోలు స్టేజ్ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి. ఎలక్ట్రిఫయింగ్ రామ్‌చరణ్ ‘ఐఫా - ఉత్సవం’లో స్టేజ్ ప్రదర్శన కోసం కొద్ది రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు రామ్‌చరణ్. ఆ కృషి మొత్తం సోమవారం వేదికపై కనిపించింది. ఒరిజినల్‌గా మంచి డ్యాన్సరైన రామ్‌చరణ్ కళ్ళు మిరుమిట్లు గొలిపే డ్రెస్‌తో, కళ్ళకు గాగుల్స్ ధరించి, చేతిలో గిటార్ పెట్టుకొని వేదికపై కనిపించగానే స్టేడియమ్లో హర్షధ్వానాలు మారుమోగాయి. గిటార్ కొన నుంచి నిప్పులు విరజిమ్ముతుండగా, పలు హిట్ పాటల్లోని పల్లవులతో కూడిన సమ్మిశ్రమ గీతానికి రామ్‌చరణ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ‘ఆరెంజ్’, ‘బ్రూస్లీ’ తదితర చిత్రాల నుంచి ఎంచుకున్న పాటల పల్లవులు ఈ ‘మెడ్లీ’ సాంగ్‌లో చోటుచేసుకున్నాయి. అలాగే తండ్రి చిరంజీవి హిట్ సాంగ్స్‌కు రీమిక్స్‌లుగా తన సినిమాల్లో వాడుకున్న ‘బంగారు కోడిపెట్ట...’, ‘వానా వానా వెల్లువాయే...’ పాటల పల్లవులకు ఈ అగ్ర హీరో ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు. రామ్‌చరణ్ డ్యాన్స్ చేస్తుంటే, తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన తదితరులు ముందు వరుసలో కూర్చొని, అభిమానంగా, ఆసక్తిగా చూశారు. ప్రతి పాట పల్లవికీ కాస్ట్యూమ్‌లో వైవిధ్యాన్ని చూపుతూ, రామ్‌చరణ్ డ్యాన్స్ చేశారు. ‘వానా వానా వెల్లువాయే...’ పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు వేదికలో సగానికి పైగా పరుచుకున్న పొడవాటి పచ్చరంగు కొంగుతో తమన్నా వేదికపై ప్రత్యక్షమయ్యారు. ‘మెగా మెగా మెగా మీటర్...’ అంటూ వచ్చే తాజా ‘బ్రూస్లీ’ పాటకు హుందాగా రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు అభిమానులకు గిలిగింతలు పెట్టాయి. కెమేరా ముందే తప్ప ఎన్నడూ జనం ముందు నర్తించని రామ్‌చరణ్ ఈ తొలి ప్రయత్నంలోనే తన సత్తా ఏమిటో చూపారు. దూసుకొచ్చిన అఖిల్ గత ఏడాదే ‘అఖిల్’ సినిమాతో తెరపై హీరోగా పరిచయమైన నాగార్జున రెండో కుమారుడు అఖిల్ డ్యాన్స్ ‘ఐఫా - ఉత్సవం’లో మరో స్పెషల్ ఎట్రాక్షన్. మోటార్ బైక్ నడుపుతూ, వేదిక ముంగిటకు దూసుకు వచ్చారీ యువ హీరో. బైక్ దిగుతూనే, ముందు వరుసలో కూర్చొని ఉన్న తల్లితండ్రులు నాగార్జున, అమల దగ్గరకు వెళ్ళి, కాళ్ళకు నమస్కరించిన అఖిల్ ఆ పైన జనానికి అభివాదం చేస్తూ, వేదిక మీదకు వచ్చారు. తొలి చిత్రం ‘అఖిల్’లో కెమేరా ముందు నర్తించిన పాటలనే జనం ముందు ప్రదర్శించారీ క్రేజీ హీరో. ‘పడేశావే పడేశావే.. నీ మాయలో నన్ను పడేశావే...’ పాటకు స్లో మూవ్మెంట్ వేసినా, ‘జరా నవ్వరాదే...’, ‘అక్కినేని... అక్కినేని...’ లాంటి బీట్ పాటలకు ఫాస్ట్ స్టెప్పులు వేసినా, డ్యాన్స్‌లో ఒక హుందాతనం చూపించారు. అఖిల్ డ్యాన్స్ చేస్తున్న తీరును ప్రేక్షకులతో పాటు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ కన్నా మరింత ఆసక్తిగా నాగార్జున, అమల చూశారు. అఖిల్ డ్యాన్స్ చేస్తున్నంత సేపు తల్లితండ్రులుగా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మరీ ముఖ్యంగా, అమల ముఖంలో చిరు నవ్వుతో కూడిన ఆనందం స్పష్టంగా తొంగిచూసింది. వేదికపై తనతో పాటు నర్తిస్తున్న గ్రూప్ డ్యాన్సర్లందరినీ కలుపుకొని అఖిల్ వేదికపై దుమ్ము రేపారు. డ్యాన్స్ కా... తమన్నా అవార్డు ప్రదాన వేదికలపై హీరోయిన్లు డ్యాన్స్‌లు చేయడం మామూలే. కానీ, ‘ఐఫా - ఉత్సవం’ 2016లో తమన్నా చేసిన డ్యాన్స్ మామూలు విషయం కాదు. పాలరాతిలా తెల్లగా ఉంటుందంటూ వ్యాఖ్యాతలు ‘‘మార్బుల్ బ్యూటీ’’ అని తమన్నాను సంబోధించినప్పుడు స్టేడియవ్ు అంతా కిసుక్కుమంది. ఆకాశంలో నుంచి అప్సరస దిగినట్లుగా, వేదిక పైకి ఆమె దిగివచ్చిన దృశ్యం ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. ‘బాహు బలి’లోని ‘ధీవర...’ పాటకు దేవలోక కన్యలానే ఆమె అభినయించారు. ‘పచ్చబొట్టేసినా...’ పాటలో సున్నితమైన ప్రేమను పండించారు. ‘నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ’ పాటకి తమన్నా మంచి బీట్‌లో నర్తిస్తుంటే, స్టేడియమ్ అంతా ఈలలే. ఇక, ఫాస్ట్‌గా సాగే తమిళ పాట ‘సబ్‌స్క్రై బర్ నాట్ రీచబుల్ మచ్చీ’కి మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తుంటే, జనంలో వేడి, ఉత్సాహం పెరిగిపోయాయి. మరో తమిళ పాట ‘సెల్ఫీ పుళ్ళా...’తో దాన్ని పతాకస్థాయికి తీసు కెళ్ళి, పాట చివరలో వేదిక దిగి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు లాంటి అగ్రహీరోలతో తమన్నా సెల్ఫీ తీసుకోవడం కనువిందుగా మారింది. మొత్తానికి, ‘ఐఫా-ఉత్సవం’లో తిరుగులేని స్టార్ ఎట్రాక్షన్... ఈ స్టార్స్ డ్యాన్స. -
ఇప్పుడు చాలా హాయిగా ఉంది!
‘‘జీవితం చాలా అద్భుతమైనది. మనల్ని ఎటువైపు మళ్లిస్తుందో ఊహించలేం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు.. కానీ, రేపేం చేయాలో ఈరోజే ప్లాన్ చేసేసుకుంటాం. ఊహించినది జరగకపోతే అప్సెట్ అయిపోతాం. అదే జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలాంటి నిరాశా, నిస్పృహలు ఉండవు’’ అని తమన్నా అంటున్నారు. ఈ మిల్కీ బ్యూటీకి జీవితం గురించి నిర్దిష్టమైన అభిప్రాయం ఉందట. దాని గురించి తమన్నా చెబుతూ -‘‘ఒకప్పుడు చిన్న చిన్న కష్టాలకే పెద్దగా బాధపడిపోయేదాన్ని. అలాగే, చిన్ని చిన్ని సక్సెస్లకే పెద్దగా ఆనందపడిపోయేదాన్ని. కానీ, అలా జీవిస్తే ప్రమాదం అని తెలుసుకున్నాను. కష్టసుఃఖాలకు సమానంగా స్పందించడం అలవాటైతే జీవితం బాగుంటుందని అర్థం చేసుకున్నాను. అందుకే, జరగకూడనిది జరిగినప్పుడు.. జరగనున్నది మంచికే అనుకుంటాను. అందుకని అతిగా బాధపడిపోను. ఒకవేళ మంచి జరిగితే.. ఆ వెంటే చెడు ఉంటుందనుకుంటా. సో.. అతిగా ఆనందపడిపోను. ఇలా బతకడం మొదలుపెట్టాక చాలా హాయిగా ఉంటోంది. జీవితాన్ని అర్థం చేసుకుంటే ఆనందమే మినహా దుఃఖానికి తావు లేదు’’ అన్నారు. దీన్నిబట్టి తమన్నాకి జీవితం పట్ల మంచి అవగాహన ఉందని అర్థమవుతోంది కదూ. -
ఎంత డబ్బిచ్చినా అది మాత్రం చేయను!
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనే రీతిలో క్రేజ్ ఉన్నవాళ్లు క్యాష్ చేసుకున్నంత అన్నట్లుగా సెలబ్రిటీల లైఫ్ ఉంటుంది. జనాల్లోకి తమ ఉత్పత్తిని తీసుకెళ్లడం కోసం ఉత్పత్తిదారులు సెలబ్రిటీలతో నాలుగు మంచి మాటలు చెప్పిస్తారు. ఈ మాటలు చెప్పడానికి సెలబ్రిటీలు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. స్టార్ హీరోయిన్ తమన్నా కూడా అలా భారీ పారితోషికం తీసుకుని, చేస్తున్న వాణిజ్య ప్రకటనలు చాలానే ఉన్నాయి. కానీ, ఈ మిల్కీ బ్యూటీ ఎన్ని కోట్లిచ్చినా ఒకే ఒక్క యాడ్‌లో మాత్రం నటించరట. గతంలో అలాంటి యాడ్‌లో నటించిన తమన్నా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నారు. దాని గురించి ఆమె చెబుతూ - ‘‘సినిమాల్లోకి రాకముందు నేను మోడల్‌గా చేసేదాన్ని. ఆ సమయంలో ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించాను. కానీ, ఇప్పుడు నేను హీరోయిన్ని. ఓ సెలబ్రిటీగా సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. అందుకే, శరీర రంగుకి సంబంధించిన ఉత్పత్తులకు మోడల్‌గా చేయకూడదని నిర్ణయించుకున్నాను. మన ఇండియాలో రంగుకి ప్రాధాన్యం ఇస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే, రంగు అనేది మన చేతుల్లో ఉండదు. కానీ, ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే, శారీరకంగా తెల్లగా ఉండాలనుకోకుండా మానసికంగా తెల్లని కాగితంలా ఉండాలంటాను’’ అన్నారు. -
అది సంతృప్తి నివ్వలేదు
మూడు పదుల వయసు కోసం ఎదురు చూస్తున్నారట తమన్న. నటిగా తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా ప్రకాశిస్తున్న ఈ పంజాబీ భామ తన స్థాయి ఇంకా సంతృప్తి నివ్వలేదట. కోలీవుడ్ కరీనాకపూర్గా ప్రాచుర్యం పొందిన తమన్న పాలరాతి బొమ్మలాంటి శరీరాకృతితో కుర్రకారుకు కనువిందు కలిగిస్తోంది. 1989 డిసెంబర్ 21న ముంబయిలో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ తన 15వ ఏటనే నటిగా బాలీవుడ్లో ప్రవేశించారు. చాంద్ సే రోసన్ సేకర్ అనేది హీరోయిన్గా తమన్న తొలి చిత్రం. ఆ తరువాత దక్షిణాదిపై కన్నేశారు. ఇక్కడ తొలిచిత్రం కేడీ. ఏఎం రత్నం తన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో మరో కొడుకు రవికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా పరిచయం కాగా, ప్రతినాయిక పాత్రలో తమన్న నటించారు. అయితే నటిగా మంచి గుర్తింపు నిచ్చిన చిత్రం కల్లూరి. తెలుగులో హ్యాపీడేస్ చిత్రం ఈ భామ కెరీర్‌కు తొలి హ్యాపీ చిత్రంగా నిలిచింది. ఆ తరువాత తమిళంలో పడిక్కాదవన్, అయన్ తదితర చిత్రాల విజయాలు తమన్నను ఉన్నతస్థానంలో కూర్చోపెట్టాయి. ప్రస్తుతం హిందీ చిత్రాలపై అధిక దృష్టి సారించిన తమన్న అక్కడ అక్షయ్‌కుమార్, అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్‌లతో జోడి కడుతున్నారు. అలాగే ప్రస్తుతం తమిళంలో ఆర్యతో రొమాన్స్ చేస్తున్నారు. నేనొచ్చిన పని పూర్తి కాలేదు తాను ఈ రంగంలోకి వచ్చిన పని పూర్తిగా కాలేదంటోంది తమన్న. ఇప్పటికే పాతికేళ్ల వయసును పూర్తి చేసుకున్నారు. తన ఈడు వారంతా పెళ్లి చేసుకున్నారట. కానీ తాను మాత్రం ఎంతో సాధించాలని వచ్చిందట. అయితే తాను వచ్చిన పని ఇంకా పూర్తిగా నెరవేరలేదంది. అందువల్లే వైవిధ్యభరిత పాత్రల వైపు దృష్టి సారించినట్లు తెలిపింది. నయనతార, అనుష్కల వంటి వారికి 30 ఏళ్ల తరువాతే వెయిటైన పాత్రలు లభించాయి. అలాగే నేను 30 ఏళ్ల వరకు అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తాను. అందుకే ప్రస్తుతానికి వివాహం గురించి ఆలోచించడం లేదని తన మనసులోని భావాలను బయటపెట్టారట. -
బెజవాడలో మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా గురువారం విజయవాడలో సందడి చేశారు. సెల్కాన్ మొబైల్ కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభిమానులను అలరించారు.సెల్కాన్ మొబైల్ సంస్థ కొత్తగా తయారుచేసిన క్యూ42 మొబైల్‌ను హోటల్ తాజ్ గేట్‌వే గురువారం ఆమె మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్లోని సెల్ఫీ ఫ్రంట్ కెమెరా అంటే తనకె ంతో ఇష్టమన్నారు. ఈ మొబైల్‌ను మొదటిగా తానే కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తాను ‘బాహుబలి’లో నటిస్తున్నానని, ఈ అవకాశం రావడం తన అదృష్టమన్నారు. జీనియస్ డెరైక్టర్ అంటూ రాజమౌళికి కితాబు ఇచ్చారు. తెలుగులో రవితేజాతో, తమిళంలో ఆర్యతో సినిమా చేస్తున్నానని తమన్నా చెప్పారు. తెలుగు బ్రాండ్ మొబైల్స్‌ను అందిస్తున్న సెల్కాన్ ఫోన్లను కొనుగోలు చేయూలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సెల్కాన్ మొబైల్స్ ఎండీ వై.గురు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రేతినేని మురళి తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ -
14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చాను
అందం చూడవయా ఆనందించవయా అంటూ ఓ కవి తన అభిప్రాయూన్ని పాటలో కడు రమ్యంగా చెప్పారు. అందానికి గులాంకాని మగవాడుండడు. అందానికి అంత పవర్ ఉంది. అలాంటి అందం కోసం మగువలు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంటారు. ప్రత్యేక అందాలను సొంతం చేసుకున్న నటి తమన్న. మిల్కీ బ్యూటీగా పేరొందిన తమన్న దక్షిణాది చిత్రాల్లో నటించిన్పుడు కాస్త భారీ అందాలనే ప్రదర్శించారు. బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన తరువాత నడుమెక్కడే నవలావని అని పాడుకునేంతలా నాజూగ్గా తయారయ్యారు. ఈ ముద్దుగుమ్మ సౌందర్య రహస్యం ఏమిటన్న విషయాన్ని ఆమె మాటల్లోనే చూద్దాం. చదువుకునే రోజుల్లో ఆటలంటేనే తప్పించుకు తిరిగేదాన్ని. ఆహారం కూడా ఎక్కువగా తినేదాన్ని కాదు. రోజుకు రెండు సార్లు మాత్రమే భోజనం చేసేదాన్ని. 14 ఏళ్ల వయసులోనే నటిగా రంగ ప్రవేశం చేశాను. సరైన ఆహారం ఎంత అవసరమో అప్పుడు గ్రహించాను. పౌష్టికాహారం వ్యాయామం ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్‌కు చాలా అవసరం అని అర్థమైంది. ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లినప్పుడు ఈ విషయాలన్నీ అవగతం అయ్యాయి. నా జీవితంలో ముఖ్యమైన మలుపు అదే. నిత్యం యోగా చేస్తాను. శారీరక వ్యాయామం తప్పనిసరి. పరిమిత ఆహారం తీసుకోవడం మొదలెట్టాక ఎనర్జీ పెరిగింది. రెండు గంటలకోసారి డైట్ ఆహారం తింటున్నాను. ఉదయం కార్బొహైడ్రేడ్, సాయంత్రం ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను. బిరియానీ ప్రియురాలిని, అప్పుడప్పుడు దానిపై మనసు లాగుతుంది. ము ఖం మృదువుగా ఉండడానికి పెరు గు, చందనం, పసుపు, పప్పుల మిశ్రమం అప్లై చేస్తాను. వారానికి రెండు సార్లు తలార స్నా నం చేస్తాను. నా అందాన్ని కాపాడే టిప్స్ ఇవేనని తమన్న వెల్లడించారు. -
బాలా డైరెక్షన్లో మిల్క్‌బ్యూటీ