
టాలీవుడ్ నటి తమన్నా భాటియా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఎంజాయ్ చేయగా.. ఎక్కడ చూసినా గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ వేడుకల్లో తమన్నా అతనికి ముద్దులు పెడుతున్న వీడియో వైరల్ కావడంతో డేటింగ్ ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే గోవాలో జరిగిన న్యూ ఇయర్ సందడి చేసిన భామ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ధరించిన సీక్వెన్ పింక్ టాప్ పై ఇప్పుడు చర్చ మొదలైంది.
పింక్ సీక్వెన్ టాప్ ధరించిన తమన్నా న్యూ ఇయర్ పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. ఈ వేడుకల్లో నటి ధరించిన డ్రెస్ అందరినీ దృష్టిని ఆకర్షించింది. హాట్ లుక్ తో అదరగొట్టిన మిల్కీ బ్యూటీ ధరించిన టాప్ విలువ అక్షరాలా రూ.2,27,830. ఆమె గతంలోనూ కరణ్ జోహార్ బర్త్ డే వేడుకల్లోనూ ఈ డ్రెస్ తో మెరిసింది. ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఇదో ట్రెండ్ గా మారింది.
నటుడు విజయ్ వర్మతో ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమన్నా వార్తల్లో నిలిచింది. వీరిద్దరు రాబోయే ప్రాజెక్ట్ 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. విజయ్ వర్మ చివరిగా అలియా భట్ నటించిన చిత్రం డార్లింగ్స్ లో కనిపించాడు. అతను తదుపరి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment