
బాహుబలి బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా లేదట..!
వెండితెరపై ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి
వెండితెరపై ఇక కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో బాహుబలి సినిమాతో తిరిగి సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించింది మిల్కీ బ్యూటి తమన్నా. వరుసగా బాహుబలి, ఊపిరి, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు సక్సెస్ సాధించటంతో తమన్నా కెరీర్ తిరిగి గాడిలో పడినట్టే కనిపించింది. అదే సమయంలో అభినేత్రి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాలేదు.
దీంతో మరోసారి తమన్నా కెరీర్ కష్టాల్లో పడింది. త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోన్న తమన్నా, చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. విక్రమ్, శింబు లాంటి హీరోలతో తమిళ నాట సినిమాలు చేస్తున్నా.. ఆసక్తికరమైన ప్రాజెక్ట్లు మాత్రం మిల్కీ బ్యూటి దగ్గరకు రావటం లేదు. బాహుబలి సినిమాతో కెరీర్ మలుపు తిరుగుతుందని భావించిన తమన్నాకు తెలుగు తెర మీద నిరాశే ఎదురవుతోంది.