భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన కాన్పును సుసాధ్యం చేశారు. ఈ కాన్పులో మహిళ 5.25 కిలోల బాలుడికి జన్మనివ్వడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం సన్న భార్య నందినికి నెలలు నిండటంతో.. గురువారం ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఆస్పత్రి వైద్యులు సాత్విక్, మల్లేశ్ సాధారణ ప్రసవం కోసంప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి శస్త్రచికిత్స చేయగా నందిని 5.25 కిలోల బరువైన మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ రెండూ సాధారణ ప్రసవాలే జరిగాయి. ఈసారి కేసులో క్లిష్టత దృష్ట్యా తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment