గాసిప్స్‌ మంచిదే! | Tamannah About Comments On Her Film Carrier | Sakshi
Sakshi News home page

గాసిప్స్‌ మంచిదే!

Published Thu, Feb 28 2019 12:35 PM | Last Updated on Thu, Feb 28 2019 12:35 PM

Tamannah About Comments On Her Film Carrier - Sakshi

గాసిప్స్‌ మంచిదే అనగానే మరక మంచిదే అనే వాణిజ్య ప్రకటన గుర్తుకొస్తోంది కదూ! అవును ఇదో రకం ప్రచార టెక్నిక్‌. ఇవాళ నెగిటివ్‌ ప్రచారమే వినియోగదారుల్లోకి చొచ్చుకుపోతోంది. నటి తమన్నా అలాంటి టెక్నిక్‌నే అమలు పరుస్తోంది. ఈ మిల్కీబ్యూటీకి నటిగా సీనియారిటీ పెరిగిపోతోంది కదా ఆ మాత్రం వాడకపోతే ఎలా? అదీ గాక ఇప్పుడు ఈ అమ్మడికి ప్రచారం చాలా అవసరం.

నటిగా దశాబ్దాన్ని దాటేసిన తమన్నా మొదట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుని ఉంటుందంటారు? అవన్నీ అనుభవాలేకదా! అయితే తమన్నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్‌ ప్రచారం. తమన్నాకు అవకాశాలు లేవని, ఫ్లాప్‌ల నటి అని, ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందేనంటూ రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది.

అయితే ఇలాంటి ప్రచారానికి మరొకరైతే బాధ పడడమో, ఫైర్‌ అవడమో జరుగుతుంది. కానీ ఈ పంజాబీ బ్యూటీ కాస్త భిన్నం కదా! గాసిప్స్‌ మంచిదే అంటోంది. అందుకు కారణం కూడా చెబుతోంది. నా నట కెరీర్‌ అంతం కాబోతోంది లాంటి ట్విట్స్, గాసిప్స్‌ వంటివి చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. నాపనైపోయింది అని అన్నప్పుడు తనకింకా ఉత్సాహం కలుగుతోందని అంది.

ఎందుకంటే అప్పుడు తానింకా కొత్త నటిగా ఫీల్‌ అవుతానని చెప్పింది. అది తనకు ఇంకా శ్రమించేలా చేస్తుందని పేర్కొంది. అయినా అలాంటి ఫ్లాప్‌ ముద్రలో తాను ఉన్నప్పుడే బాహుబలి చిత్ర అవకాశం వచ్చిందని పేర్కొంది. ఒక నటిగా నట జీవితం ఇక చాలు అని భావించినప్పుడే తన వృత్తి పరమైన జీవితం ముగుస్తుందని అంది. అయితే తనలోని నటికి మాత్రం ఎప్పటికీ విశ్రాంతి ఉండదని నటి తమన్నా పేర్కొంది.

తమన్నా ఉదయనిధితో నటించిన కన్నే కలైమానే చిత్రంలో నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. ఇక త్వరలో నటుడు విశాల్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులోనూ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి. సో ఈ అమ్మడు వదంతులను ఎంజాయ్‌ చేస్తూ మరింత ఉత్సాహంతో నటించేస్తోందన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement