Milky Beauty Lyrical Song Released From Megastar Bhola Shankar Movie, Video Inside - Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie Songs: 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ'.. ఊపేస్తోన్న భోళాశంకర్‌ సాంగ్!

Published Fri, Jul 21 2023 4:20 PM | Last Updated on Fri, Jul 21 2023 4:44 PM

Second Lyrical Song Release From Megastar Bhola Shankar Movie - Sakshi

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన తాజాగా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ చిత్రంలో సుశాంత్‌  కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి  ‘భోళా మేనియా ’ అంటూ సాగే  ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం  రిలీజ్ చేసింది.

(ఇది చదవండి: భోళా శంకర్‌: మెగాస్టార్‌, నందమూరి ఫ్యాన్స్‌ కోసం భలే స్కెచ్‌!)

తాజాగా మరో లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్‌ రిలీజైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. అన్నా, చెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. 

(ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement