carrier
-
డయాబెటిక్ రోగుల కోసం పోర్టబుల్ కూలింగ్ క్యారియర్!
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఇన్సులిన్‌ను ఎప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కానీ ఇంట్లో ఫ్రిజ్ లేనివారికి ఇది కొంత ఇబ్బందికరమే. వాళ్ల విషయంలో దీనికి పరిష్కారమెలా? ఈ అంశంపైనే పరిశోధనలు చేసి ఓ కూలింగ్ క్యారియర్‌ను రూపొందించిన ఒడిశా అమ్మాయి కోమల్ పాండాకు జేమ్స్ డైసన్ అవార్డు వరించింది. స్థానికంగా లభ్యమయ్యే సులభమైన సాంకేతికతతో కొత్త ఉపకరణాలను రూపొందించేవారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. మన దేశం నుంచి కోమల్ పాండాకు ఈ అవార్డుతోపాటు రూ. 5 లక్షలు బహూకరిస్తారు. కోమల్ రూపొందించిన ‘నోవోక్యారీస్’ అనే ఈ ఉపకరణంతో ఇన్సులిన్‌ను చాలాసేపు చల్లదనంలో ఉంచవచ్చు. అంతేకాదు దూరప్రయాణాల్లో, విద్యుత్ సౌకర్యాలూ, బ్యాటరీ సౌలభ్యాలు లేనిచోట్ల కూడా ఇన్సులిన్‌తోపాటు చల్లదనంలోనే ఉంచాల్సిన చాలా రకాల మందుల్ని సుదీర్ఘకాలంపాటు నిల్వ చేయవచ్చు. ‘నోవోక్యారీస్’ రూపకల్పనకు తన తండ్రి నుంచే కోమల్‌కు స్ఫూర్తి లభించింది. ఆయన ఓ డయాబెటిస్ బాధితుడు. ఆఫీసులో ఫ్రిజ్ లేదు. దూరప్రయాణాలప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ఆయన మాత్రమే కాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం దాదాపు 20 శాతం మందులు ఇలా దూర్రప్రాంతాలకు ప్రయాణం చేసేవారి విషయంలో, రిఫ్రిజిరేటర్ సౌకర్యం లేకపోవడం వల్ల చెడిపోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటోంది. ఇలాంటి వారికి ఇదెంతో ప్రయోజనం. (చదవండి: కమ్మటి కబుర్ల కమ్యూనిటీ కిచెన్..! వంటరికి విస్తరి.. ) -
పెళ్లి తరువాత కరియర్‌కు గుడ్‌బై చెప్పిన బ్యూటీస్
-
ఈ ఎలక్ట్రిక్ బండి 350 కేజీలు మోస్తుంది.. ఒక్కసారి చార్జ్‌కి 150 కిలోమీటర్లు!
సరుకు రవాణా అవసరాల కోసం ఎక్కువ మొత్తంలో బరువు తీసుగల టూ వీలర్ కోసం చేస్తున్నారా.. అది కూడా ఎలక్ట్రిక్ బండి (Electric Scooter) కావాలా.. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి పరిశీలించండి.. పొలం దగ్గరకు వెళ్లడానికి, ఎరువు బస్తాలు, కూరగాయలు, ఇతర బరువైన వస్తువులు తీసుకువెళ్లడానికి కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 ( KOMAKI XGT CAT 2.0) సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏకంగా 350 కేజీల బరువునైనా లాగగలదు. రైతులు, కూరగాయలు, ఇతర చిరు వ్యాపారులు, దుకాణదారులు ఈ బండిలో సరుకు రవాణా చేయవచ్చు. పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. రేంజ్, ఫీచర్లు, ధరలు కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0 బండిని ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎక్స్ట్రా క్యారియర్, బీఎల్డీసీ హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, ఆటో రిపేర్, మల్టీపుల్ సెన్సార్స్, సెల్ఫ్ డయాగ్నసిస్, వైర్లెస్ అప్డేట్స్, స్మార్ట్ డ్యాష్ బోర్డ్, బ్యాక్ ఎల్ఈడీ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎకో, స్పోర్ట్, టర్బో అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో ఉంటాయి. మొబైల్ చార్జింగ్ పాయింట్, లాక్ బై రిమోట్, టెలీస్కోపిక్ షాకర్, రిపేర్ స్విచ్, యాంటీ థెఫ్ట్ లాక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఫోల్డబుల్ సీటు మరో ప్రత్యేకత. ఇక కోమకి ఎక్స్‌జీటీ క్యాట్ 2.0లో రెండు వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. 72వీ 31 ఏహెచ్ వేరియంట్ ధర రూ.1.01 లక్షలు . దీని రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 72వీ 44 ఏహెచ్ వేరియంట్ ధర రూ. 1.14 లక్షలు. దీని రేంజ్ 150 కిలోమీటర్ల వరకు ఉంది. ఇదీ చదవండి: FAME 2 SUBSIDY: ఎలక్ట్రిక్ బైక్‌లు కొనేవారికి బ్యాడ్ న్యూస్.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం! -
ఫెడరల్ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం
ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (ఎఫ్ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఫెడరల్ బ్యాంక్‌లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది. దరఖాస్తు చేసుకోవాలంటే.. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి ► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. ► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23 ►నవంబర్ 11న ఆన్లైన్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.federalbank.co.in/federal-internship-program -
గాసిప్స్ మంచిదే!
గాసిప్స్ మంచిదే అనగానే మరక మంచిదే అనే వాణిజ్య ప్రకటన గుర్తుకొస్తోంది కదూ! అవును ఇదో రకం ప్రచార టెక్నిక్. ఇవాళ నెగిటివ్ ప్రచారమే వినియోగదారుల్లోకి చొచ్చుకుపోతోంది. నటి తమన్నా అలాంటి టెక్నిక్‌నే అమలు పరుస్తోంది. ఈ మిల్కీబ్యూటీకి నటిగా సీనియారిటీ పెరిగిపోతోంది కదా ఆ మాత్రం వాడకపోతే ఎలా? అదీ గాక ఇప్పుడు ఈ అమ్మడికి ప్రచారం చాలా అవసరం. నటిగా దశాబ్దాన్ని దాటేసిన తమన్నా మొదట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుని ఉంటుందంటారు? అవన్నీ అనుభవాలేకదా! అయితే తమన్నా గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రచారం. తమన్నాకు అవకాశాలు లేవని, ఫ్లాప్‌ల నటి అని, ఇక మూటా ముల్లు సర్దుకోవలసిందేనంటూ రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి ప్రచారానికి మరొకరైతే బాధ పడడమో, ఫైర్ అవడమో జరుగుతుంది. కానీ ఈ పంజాబీ బ్యూటీ కాస్త భిన్నం కదా! గాసిప్స్ మంచిదే అంటోంది. అందుకు కారణం కూడా చెబుతోంది. నా నట కెరీర్ అంతం కాబోతోంది లాంటి ట్విట్స్, గాసిప్స్ వంటివి చదవడం తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. నాపనైపోయింది అని అన్నప్పుడు తనకింకా ఉత్సాహం కలుగుతోందని అంది. ఎందుకంటే అప్పుడు తానింకా కొత్త నటిగా ఫీల్ అవుతానని చెప్పింది. అది తనకు ఇంకా శ్రమించేలా చేస్తుందని పేర్కొంది. అయినా అలాంటి ఫ్లాప్ ముద్రలో తాను ఉన్నప్పుడే బాహుబలి చిత్ర అవకాశం వచ్చిందని పేర్కొంది. ఒక నటిగా నట జీవితం ఇక చాలు అని భావించినప్పుడే తన వృత్తి పరమైన జీవితం ముగుస్తుందని అంది. అయితే తనలోని నటికి మాత్రం ఎప్పటికీ విశ్రాంతి ఉండదని నటి తమన్నా పేర్కొంది. తమన్నా ఉదయనిధితో నటించిన కన్నే కలైమానే చిత్రంలో నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవాతో దేవి–2 చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇక త్వరలో నటుడు విశాల్‌తో జత కట్టడానికి రెడీ అవుతోంది. అదేవిధంగా తెలుగులోనూ అవకాశాలు ఆశాజనకంగానే ఉన్నాయి. సో ఈ అమ్మడు వదంతులను ఎంజాయ్ చేస్తూ మరింత ఉత్సాహంతో నటించేస్తోందన్నమాట. -
ఆకాశం ఎరుపెక్కుతోంది
రిపోర్టింగ్‌లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్‌గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ .. తన మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు. స్త్రీలను ‘ఆకాశంలో సగభాగం’ అని చైనా వివ్లవ నాయకుడు మావో అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిరసిస్తూ బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ ఇప్పుడు తన నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు సంస్థలలో స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం నేరం అని ఈ జనవరి 1న ఐస్‌ల్యాండ్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులకు నిరసనగా మొన్న జనవరి 8న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్‌కు అంతా నల్లదుస్తులు ధరించి వచ్చారు. ఇప్పుడు బిబిసి చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ ఏడాది ‘మహిళా విప్లవం’ ఏదో రాబోతున్నట్లే ఉంది. శుభ పరిణామమే! బీబీíసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు! లక్షా ఎనభై వేల పౌండ్ల జీతాన్ని వదులుకుని లండన్ తిరిగొచ్చేశారు. ‘న్యూస్ రూమ్‌లో చిన్న ఉద్యోగం ఇవ్వండి చాలు’ అని అన్నారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఊహించని పరిణామం ఇది. రాజీనామా లేఖొచ్చి టేబుల్ మీద పడగానే బోర్డు రూమ్ ఉలిక్కిపడింది. బీబీసీలో సీనియర్ జర్నలిస్ట్ గ్రేసీ. ముప్పై ఏళ్ల అనుభవం. ‘ఈక్వల్ పే’ లేదని ఈ అకస్మాత్తు రాజీనామా చేశారు. తనకు లేదని కాదు. అసలు బీబీసీ లోనే లేదని. ‘డబ్బు ముఖ్యం కాదు నాకు. సమానత్వం కావాలి. నాకొక్కదానికి కాదు. బీబీసీలో పనిచేస్తున్న మహిళందరికీ కావాలి’ అని గ్రేసీ బహిరంగ లేఖ రాశారు. వెంటనే ఆమెకు మద్దతుగా 130 మంది ఉన్నతస్థాయి బీబీసీ జర్నలిస్టులు ఒక ప్రకటన విడుదల చేశారు. అవార్డు విన్నింగ్ జర్నలిస్టు గ్రేసీని తిరిగి చైనా ఎడిటర్‌గా పునర్నియమించాలని ఆ ప్రకటన డిమాండ్. అలా చేయాలంటే, బీబీసీ ‘ఈక్వల్ పే’ విధానాన్ని అమలు చేయాలి. స్త్రీ,పురుష సిబ్బందికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఒకే హోదాలో ఉన్నవారిలో స్త్రీల కన్నా, పురుషులు యాభై శాతం అధికంగా జీతాలను పొందుతున్నారని, అదంతా రహస్యంగా జరిగిపోతోందని తన దృష్టికి వచ్చిన వెంటనే గ్రేసీ బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె జీతం ఏడాదికి లక్షా ముప్పై వేల పౌండ్లు. ఆ మొత్తాన్ని లక్షా ఎనభై వేల పౌండ్లకు పెంచేందుకు గత అక్టోబర్‌లోనే బీబీసీ పేపర్లు కూడా తయారు చేసింది. కానీ గ్రేసీ వద్దన్నారు. ‘‘అందరికీ పెంచాలి’’ అని కండిషన్ పెట్టారు. ‘ఈక్వల్ పే’ కోసం గత జూలైలో సిబ్బంది నుంచి బీబీసీపై ఒత్తిడి వచ్చినప్పుడు అత్యున్నత స్థాయిలో జీతాలు ఎలా ఉన్నాయన్నదీ ఆ సంస్థ ఒక నివేదికను విడుదల చేయవలసి వచ్చింది. అప్పుడే గ్రేసీ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అప్పుడే ఆమెకు జీతం పెంచడానికి బీబీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అప్పుడే గ్రేసీ తనకొక్కదానికే జీతం పెంచడంపై విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పటికి ఆరు నెలలు గడిచాయి. ఎక్కడి జీతాలు అక్కడే ఉన్నాయి. మహిళలూ ఎక్కడివారు అక్కడే ఉన్నారు. పురుషులకు దీటుగా పనిచేస్తున్నప్పటికీ పురుషులకన్నా తక్కువ జీతాలు పొందుతున్నారు. ఇది గ్రేసీని బాధించింది. ఆగ్రహం తెప్పించింది. రిపోర్టింగ్‌లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్‌గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ.. చివరికి మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు. చైనాలో నిక్కచ్చి ఎడిటర్‌గా పనిచేయడం నిత్యం డ్రాగన్లతో పోరాడటమే. పాలకుల బెదిరింపులు ఉంటాయి. పోలీసుల వేధింపులు ఉంటాయి. ఎడిటరే స్వయంగా రిపోర్టింగ్‌కి వెళితేనే గానీ సమాచారం సేకరించలేనంత గుంభనంగా, పకడ్బందీగా చైనా యంత్రాంగం ఉంటుంది. ఆ కష్టాలేవీ ఇప్పుడు రాజీనామా చేశాక గ్రేసీ ఏకరువు పెట్టడం లేదు. ‘చీకటి మీద లైట్‌ను ఫోకస్ చేసే గొప్ప వృత్తిలో ఉన్నప్పుడు మన దగ్గర చీకటిని చూడలేకపోతే.. సమాజాన్ని వేలెత్తి చూపే నైతిక హక్కు మనకు ఎలా ఉంటుంది?’’ అని గ్రేసీ ప్రశ్నిస్తున్నారు. నిజాలు దాస్తుందని చైనాకు పేరు. ఎడిటర్‌గా ఇంతకాలం గ్రేసీ ఆ నిజాలను బయటికి రప్పించారు. బీబీసీకి జీతాలను దాచే అలవాటుందని తెలిశాక ఆమే బయటికి వచ్చారు. క్యారీ గ్రేసీ బయటికి రావడం అంటే.. అసమానతలను బయటికి తేవడమే! -
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
-
ఎంచుకున్న సంకెళ్లు
‘‘ఊరి నుంచి చంద్రం వచ్చి వెళ్లాడు’’ రామం ఇంట్లోకి అడుగుపెడుతూనే చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ చెప్పింది లక్ష్మి.‘‘అమ్మకెలా ఉందట?’’ సోఫాలో కూలబడుతూ అడిగాడు రామం. మనం జీవితంలో వేసే ప్రశ్నలలో చాలా వాటికి సమాధానం తెలిసే వేస్తాం. మన యాంత్రికమైన సంభాషణలకి అవి ఒక ఊతం మాత్రమే.‘‘ఎలా ఉంటుంది! ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోమంటే మన మాట వింటారా, ఆ ఆర్.ఎం.పి. డాక్టరు ఇచ్చే అరకొర మందులకి ఆవిడ ఉబ్బసం ఏం తగ్గుతుందీ! అలాగే ఉన్నారంట.’’రామానికి తెలుసు - ఆవిడ అలాగే ఉంటుంది, ఆ ఊళ్లోనే ఉంటుంది. జబ్బు తగ్గుతుందని తెలిసినా తమ దగ్గరికి మటుకు రాదు. కొడుకు బడ్జెట్‌కి మరింత భారం కాకూడదనో, కోడలితో వైరం ఎందుకనో, ఉన్న ఇంటిని వదులుకో లేకనో ఆవిడ గడప దాటదు. తనే వెళ్లి ఆవిడని కొన్నాళ్లు చూసుకునే తీరికా స్వతంత్రమూ రామానికి లేవు. ఊరి నుంచి అందిన కబురుతో తల్లి అనారోగ్యం మళ్లీ వాస్తవికతలోకి రావడంతో రామం నిస్తేజంగా మారి పోయాడు. మళ్లీ అవే యాంత్రికమైన సంభాషణలూ, విశ్లేషణలూ, ఆలోచనలూ. మధ్యమధ్యలో అకస్మాత్తుగా ఏదో ఉపాయం స్ఫురణకు వస్తుంది. అంతలోనే అది ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని తేలిపోవడంతో ఆ క్షణికోద్రేకం సడలిపోతుంది. ఆ రాత్రి భోజనాలు ముగిసి నిద్రకు సిద్ధమవుతుండగా, ‘‘లక్ష్మీ’’ అంటూ పిలిచాడు రామం. ఆ స్వరంలోని మార్దవాన్ని గ్రహించిన వెంటనే అర్థమైపోయింది లక్ష్మికి, అతనేదో నిర్ణయానికి వచ్చాడనీ, ఆ నిర్ణయంపై తన సమర్థనని కోరుకుంటున్నాడనీ!‘‘మరేం లేదు’’ తటపటాయిస్తూ మొదలుపెట్టాడు రామం- ‘‘అమ్మని ఎంతగా బతిమాలినా ఇక్కడికి రాదు. అక్కడ ఉంటే తన ఆరోగ్యం సవ్యంగా ఉండటం లేదు. అందుకని నెలనెలా ఓ రెండు వేలు తనకి పంపితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తనకొచ్చే బొటాబొటీ పింఛను ఏ మూలకీ సరిపోతున్నట్లు లేదు. ఏమంటావూ?’’ ఎటో చూస్తూ అడిగాడు రామం. లక్ష్మికి తెలుసు, ఇటువంటిదేదో రామం నోటి వెంట వస్తుందని. ఎందుకంటే తమ జీవితాలలో చాలా సమస్యలకి పరిష్కారం డబ్బుతోనే ముడిపడి ఉంది. ఆప్యాయతలూ, అనుబంధాలూ, సంతుష్టి అని ఎన్ని కబుర్లు చెప్పినా అవన్నీ పూట గడిచిన తర్వాతే కదా! కానీ నెలనెలా రెండు వేలంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఇప్పటికే నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకు భవిత కోసం ఎన్నో వదులు కోవలసి వస్తోంది. అన్నీ మానుకుని జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా ఓ పేరాసెట మాల్తో సరిపెట్టుకుంటే గానీ నెలాఖరుకి ఓ రెండువేలు మిగలట్లేదు. అలాంటిది ఇంకో రెండువేలంటే ఎక్కడి నుంచి వస్తాయి! అందునా వయసు మీదపడిన ఆయన తల్లికోసం, ఎన్నటికీ వీడని ఆవిడ అనారోగ్యం కోసం, అవే రెండు వేలు తమ కొడుకు పేరున వేస్తే మరింత సద్విని యోగం అవుతాయి కదా! అరనిమిషం లోనే లక్ష్మి ఇదంతా ఆలోచించేసింది. కానీ దేన్నీ బయటకి అనలేదు. కొన్ని భావాలని ఉన్నవి ఉన్నట్లుగా వ్యక్తీకరించడానికి సంస్కారం అడ్డు వస్తుంది. అందుకనే లక్ష్మి, రామాన్ని మరోవిధంగా నిలువ రించడానికి ప్రయత్నించింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితులలో నెలనెలా రెండువేలంటే ఎక్కడి నుంచి తేగలం!’’ ‘‘కష్టమేననుకో’’ నిట్టూరుస్తూ బదులిచ్చాడు రామం. ‘‘కానీ ఒక్కో పద్దులోనూ కాస్త కాస్త పొదుపు చేస్తే సాధ్యమేననిపిస్తోంది.’’ ఏమీ మాట్లాడలేదు లక్ష్మి. దాంతో రామమే మళ్లీ అందుకున్నాడు. ‘‘పాలప్యాకెట్లూ, బియ్యం, కూరలు కాస్త చవక రకానివి తెచ్చుకుంటే నెలకి ఎంతలేదన్నా ఓ ఎనిమిదొందలు మిగులుతాయి. ఎలాగూ చలికాలం కాబట్టి ఫ్రిజ్ ఆఫ్ చేసి పారేస్తే ఓ రెండు వందలు కరెంటు ఆదా అవుతుంది, సెల్‌ఫోన్ కూడా అత్యవసరానికి తప్ప వాడ కుండా ఉంటే మూడు వందలు మిగుల్తాయి’’ ఆశువుగా చెప్పుకుపోతున్నాడు రామం, మధ్యలో ఆపేస్తే ఆ నిశ్శబ్దాన్ని భరించడం కష్టం. అసంతృప్తితో కూడిన ఆ నిశ్శబ్దాన్నీ ఆపై పెగిలే పొడిపొడి మాటలనీ చివరికెలాగూ భరించక తప్పదు. ‘‘నా బండి పక్కన పడేసి రోజూ బస్సులో ఆఫీసుకి వెళ్తే, నెలకో ఎనిమిది వందలన్నా ఆదా అవుతాయి, ఇహపోతే...’’ తటపటాయిస్తూ చివరి అంకానికి చేరుకున్నాడు రామం. ‘‘నీకా ఎలాగూ సీరియల్స్ చూసే అలవాటు లేదు, నాకేమో ఆదివారాలు తప్ప టీవీ చూసే తీరికుం డదు. అందుకని కేబుల్ కనెక్షన్ తీయించేస్తే రెండు వందలు మిగుల్తాయి. అంతగా బాబి గాడు మారాం చేస్తే ఓ కార్టూన్ సీడీ కొనిపెడితే సరిపోతుంది’’ అంటూ ముగించాడు.లక్ష్మి ఉలకలేదు, పలకలేదు. రామం చెప్పిన లెక్కల్ని మనసులో బేరీజు వేస్తూ కూడుకుంది - మొత్తం 2,300 రూ॥ఆ మిగతా మూడు వందలూ తనని ఊరించడానికే నని తెలుసు లక్ష్మికి. తనిప్పుడు అనాల్సిన మాటలేమిటో కూడా తెలుసు. ‘‘సరే మీ ఇష్టం!’’ అంటూ నిర్లిప్తంగా అటు తిరిగి పడుకుంది, ఆమె తన మనసులోని అసంతృప్తిని వెల్లడించకపోయినా ఈపాటికి తన కళ్లు చెమ్మగిల్లే ఉంటాయని రామానికి తెలుసు. మర్నాడు ఉదయం బాబిగాడు పాలు తాగనని మారాం చేశాడు. కానీ పాలు పల్చబడ్డాయని మటుకు తెలుసుకోలేక పోయాడు. రామానికి కూడా టీ సయించలేదు గానీ ‘అదే అలవాటైపోతుందిలే’ అనుకుంటూ ఒక్క గుక్కలో తాగేసి నడుచుకుంటూ తన ఇంటికి దగ్గరలో ఉన్న బస్టాప్‌కి బయల్దేరాడు.వచ్చే బస్సూ, పోయే బస్సూ - అన్నీ కిటకిటలాడేవే! ఎప్పుడో ఓసారి తన బండికి రిపేరైతేనే, బస్సెక్కడానికి నామోషీ పడే రామానికి, ఇకపై రోజూ ఆ రద్దీలోనే ఇరుక్కుని ఆఫీసుకి వెళ్లాలన్న ఆలోచన ఇబ్బందికరంగా తోచింది. ఆ బస్సులో అందరూ తనబోటి మనుషులే - కానీ ఎందుకనో ఈవేళ తానొక మెట్టు దిగజారానన్న భావన, తను చేస్తున్న త్యాగం కంటే పడుతున్న ఇబ్బందే ఎక్కువేమోనన్న దుగ్ధ. ‘ అలవాటైపో తుందిలే’ అనుకుంటూ కళ్లు మూసుకుని బస్సు రాడ్డుకి వేలాడసాగాడు. ఆ సాయంత్రం రైతుబజారు దగ్గర ఆగి ఏయే కూరలు చవగ్గా ఉన్నాయో వాకబు చేసి మరీ కొనుక్కుని ఇంటికి బయల్దేరాడు. ఈ లెక్కన తనకిష్టమైన బీన్స్ కానీ బాబిగాడికి ఇష్టమైన క్యారెట్లు కానీ ఇకపై కొనలేకపోవచ్చు. రామం ఇల్లు చేరుకునేసరికి ఇల్లంతా నిస్తేజంగా తోచింది. టీవీ శబ్దంతో ప్రతిధ్వనించే హాలు గోడలన్నీ మూగబోయి ఉన్నాయి. కందిరీగలా ఝంకారం చేసే ఫ్రిజ్ నిశ్చలంగా ఉంది - ఒక్క రోజులోనే ఎంతటి మార్పు. ఈ మార్పుని తాను నెలల తరబడి భరించగలడా! కష్టమే... ఎందుకంటే కొద్దిరోజుల్లోనే అతని నూతన కార్యాచరణకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఆ శనివారం సాయంత్రం రామం ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి దిగాలుగా కూర్చునుంది, ‘‘ఏమైంది?’’ ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ భయం భయంగా అడిగాడు రామం. ‘‘ఇంకా ఏం కావాలి, మీ పొదుపు మా ప్రాణాల మీదకి తెచ్చేట్లుంది’’ విసురుగా జవాబిచ్చింది లక్ష్మి. ఉపోద్ఘాతం లేకుండా పురాణం ప్రారంభమవదు కదా!‘‘బాబిగాడు మూడురోజుల నుంచీ సరిగా తిండి తినడం లేదు. ఆ ముతక బియ్యం వాడికి సయించట్లేదు. పైగా బడి నుంచి రాగానే ఫ్రిజ్‌లో నీళ్లు ఉండట్లేదని రోజూ అలుగుతున్నాడు. పనిమనిషి కూడా మీ టీవీ పనిచేయట్లేదేంటని రోజూ అడుగుతోంది’’ - అదీ అసలు సంగతి! ‘‘టీవీ పాడైపోయిందని చెప్పక పోయావా?’’ అనునయించాడు రామం. ‘‘అదీ అయ్యింది. దానికది ఏమందో తెలుసా! ‘‘మీకు కొత్త టీవీ కొనుక్కోవడం అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి. చెన్నైలో మా తమ్ముడు వాళ్లింట్లో పాత టీవీ ఒకటుంది. ఓ వేయి రూపాయలిస్తే దాన్ని తెప్పించి పెడతానంది.’’ఆ మాటలు విన్న రామానికి కూడా లక్ష్మి మనసులోని మంట తగులుకుంది. అసలే అటు ఆఫీసులో రామం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ప్రతి ఒక్కరూ ఎందుకని బండి వేసుకురావటం లేదని అడిగేవారే. బండి రిపేరులో ఉందని చెప్పగానే తమకి తోచిన సలహాలని ఇచ్చేవారే. ఇక వారం నుంచీ ఎవరికీ తనంతట తానుగా ఫోను చేయక పోవడంతో ‘ఇన్కమింగ్ రామం’ అంటూ ఓ మారుపేరు కూడా పెట్టేశారు. ‘‘ఈ ఒక్క నెలా ఓపిక పట్టు లక్ష్మీ! అంతగా అయితే వచ్చే నెల నుంచీ వేయి రూపాయలే పంపుదాంలే!’’ అంటూ ఆమె పక్క కూలబడ్డాడు. అలవాటు తప్పిన బస్సు ప్రయాణాలకి ఇంట్లో చికాకులు కూడా తోడవడంతో మోకాళ్లపై తల వాల్చుకుని నిస్సత్తువగా కూలబడి పోయాడు రామం. ఆలోచనాపరుల కోసం ఓ థింకర్ విగ్రహాన్ని రూపొందించినట్లే, మధ్య తరగతి మనుషుల కోసం ఓ విగ్రహాన్ని చెక్కాలనుకుంటే, దానికి సరిగ్గా సరి పోతుంది, రామం ప్రస్తుత భంగిమ. ఇన్ని సర్దుబాట్లు చేసి నెలాఖరుకి ఎంతో కొంత కూడబెట్టినా, అనుకోని ఖర్చులు రానే వచ్చాయి. లక్ష్మి వాళ్ల అక్క, బావ రాకరాక సిటీకి రావడంతో, వాళ్లకి సిటీలోని పర్యాటక ప్రదేశాలన్నీ చూపించి ఓ పన్నెండు వందల రూపాయలతో వాళ్లిద్దరికీ బట్టలు పెట్టి పంపాడు రామం. అంత చేసినా తాము పెట్టిన బట్టలకి వాళ్ల మొహాలలో వెలుగే కనిపించకపోవడంతో ఉసూరుమనిపించింది. ‘‘మీ అమ్మగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది’’ రామం ఇంటికి రాగానే అతని చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ ఓ ఉత్తరాన్ని అతని చేతిలో పెట్టింది లక్ష్మి.తల్లి ప్రస్తావనతో రామం మనసు చివుక్కుమంది. ఈ నెల పంపుదామను కున్న డబ్బు ఇంకా పంపనే లేదు, వచ్చే నెలకి గానీ ఎంతో కొంత పంపే సావకాశం చిక్కేట్లు లేదు. తాను డబ్బు పంపుతానని అమ్మతో ఏమీ చెప్పలేదే! మరెందుకు రాసిందో ఉత్తరం అనుకుంటూ తెరిచి చదవసాగాడు. ‘‘రామానికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయునది. చలికాలం దాటిపోవడంతో నా ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లుగానే తోస్తోంది. అక్కడ నువ్వు, లక్ష్మీ, పిల్లవాడూ క్షేమంగానే ఉన్నారని తలుస్తాను. బాబిగాడి పుట్టిన రోజు కోసమని వాడికిష్టమైన సున్నుండలూ, జంతికలూ చేసి ఉంచాను. వాటిని చంద్రానికిచ్చి పట్నానికి పంపు తున్నాను. అదే చేత్తో ఓ ఐదు వందలు కూడా పంపుతున్నాను. వాటితో పిల్లవాడికి మంచి బట్టలు కొనగలవు. వీలు చూసుకుని మీరందరూ ఓసారి మనింటికి రండి. మీ ఆరోగ్యాలు జా...’’ చివరికి వచ్చేసరికి అక్షరాలు అలికి నట్లుగా అయిపోయాయి. తల్లి దయకి కళ్ల వెంబడి నీరు ధార కడుతుండగా సోఫాలో వాలిపోయాడు రామం. రామంలో ఊహించని ఈ బేలతనానికి బిత్తరపోయి అతని చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని చదువుతున్న లక్ష్మి వంక చూస్తూ గద్గద స్వరంతో అన్నాడు రామం- ‘‘ప్రపంచీకరణ వలన మన మధ్యతరగతి ప్రజలంతా తెగ సుఖపడిపోతున్నారని, నాయకులూ, మేధావులూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు గానీ, నిజంగా మనమేం బావుకుంటున్నాం చెప్పు! ప్రతి వ్యక్తీ తన జీతానికి అనువైన చట్రంలో బిగుసుకుని పోతున్నాడు. అవసరానికీ, విలాసాలకీ మధ్యనున్న సరిహద్దులు అతి సులువుగా చెరిగిపోతున్నాయి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో, లేక తనే ఆ విలాసాలకి అలవాటుపడో ఉన్న స్థాయి నుంచి ఒక్క మెట్టు కూడా కిందకి దిగలేని నిస్సహాయతలో ఉన్నాం. కార్పొరేట్ చదువులూ, ఏసీలు, కార్లూ, హోటల్ తిళ్లూ, ఎల్ఈడీలూ, ఇంటి లోన్లూ... అంటూ ఎవరి రాబడికి తగ్గట్టు వాళ్లు ఖర్చుపెట్టక తప్పట్లేదు.’’లక్ష్మికి అతడిని ఎలా సముదాయిం చాలో తోచలేదు. తనలోని బాధే వేరొక రిలో వ్యక్తమవుతున్నప్పుడు ఎలా సముదా యించగలదు? కానీ అతనికి సాంత్వన కలిగేట్లు ఒక్కమాట మటుకు అనగలిగింది - ‘‘వచ్చేవారం వెళ్లి ఆవిడతో ఓ రెండు రోజులు గడుపుదాం. ఇక్కడికి వచ్చి ఉంటారేమో మరోసారి అడిగి చూద్దాం!’’ కానీ ఆ పైవారం ఆడిట్ పని మొదలవ్వడంతో ఆ ఊసే మర్చిపోయారంతా! కె.ఎల్.సూర్య -
ఇంటి నుంచే క్యారియర్
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ఎక్కడికెళ్లినా ఇంటి నుంచే క్యారియర్ పట్టుకెళతారు. ఆర్టీఐ చట్టం కోసం ఉద్యమించినా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో పనిచేసినా, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీ వీధులన్నీ కలియతిరిగినా... కేజ్రీవాల్ సమయానికి భోజనం చేసేలా చూసుకుంటారు ఆయన భార్య సునీత. ఎందుకంటే కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారు. పైగా శీతాకాలంలో తిరగబెట్టే దగ్గు, గొంతుగరగర. ఐఆర్ఎస్ అధికారిణి అయిన సునీత ఉదయాన్నే లేచి భర్తకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేస్తారు. తాగునీరు వేడి చేసి ప్లాస్క్‌లో పోసిపెడతారు. కేజ్రీవాల్ సహాయకులు మర్చిపోతారేమోననే అనుమానంతో లంచ్ బాక్స్‌తో పాటు అప్పుడప్పుడు నోట్స్ కూడా పెడతారు. అందులో ఆయనకు ఎప్పుడెప్పుడుఏమేమి ఇవ్వాలో రాసిపెడతారు. ఆమె నిరంతర సహకారం లేకుంటే తానేమీ సాధించకపోయేవాడినని ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున సునీతను అభిమానులకు పరిచయం చేస్తూ కేజ్రీవాల్ ఉద్విగ్నతకు లోనయ్యారు.