న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ఎక్కడికెళ్లినా ఇంటి నుంచే క్యారియర్ పట్టుకెళతారు. ఆర్టీఐ చట్టం కోసం ఉద్యమించినా, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేతో పనిచేసినా, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీ వీధులన్నీ కలియతిరిగినా... కేజ్రీవాల్ సమయానికి భోజనం చేసేలా చూసుకుంటారు ఆయన భార్య సునీత. ఎందుకంటే కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారు.
పైగా శీతాకాలంలో తిరగబెట్టే దగ్గు, గొంతుగరగర. ఐఆర్‌ఎస్ అధికారిణి అయిన సునీత ఉదయాన్నే లేచి భర్తకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేస్తారు. తాగునీరు వేడి చేసి ప్లాస్క్‌లో పోసిపెడతారు. కేజ్రీవాల్ సహాయకులు మర్చిపోతారేమోననే అనుమానంతో లంచ్ బాక్స్‌తో పాటు అప్పుడప్పుడు నోట్స్ కూడా పెడతారు. అందులో ఆయనకు ఎప్పుడెప్పుడుఏమేమి ఇవ్వాలో రాసిపెడతారు. ఆమె నిరంతర సహకారం లేకుంటే తానేమీ సాధించకపోయేవాడినని ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున సునీతను అభిమానులకు పరిచయం చేస్తూ కేజ్రీవాల్ ఉద్విగ్నతకు లోనయ్యారు.
ఇంటి నుంచే క్యారియర్
Published Fri, Feb 13 2015 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement