
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం 'మా కాళి'.

టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో విడుదల కానుంది

గతేడాది గోవాలో జరిగిన 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు

ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు

తాజాగా జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డ్‌ను 'మా కాళి' చిత్రం గెలుపొందింది

1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు

'మా కాళి' చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వారికి దగ్గరైన రైమా సేన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు

తెలుగులో నితిన్ సరసన ధైర్యం అనే సినిమాలో మాత్రమే రైమా సేన్ ఇప్పటి వరకు నటించింది

సుమారు 20 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ ఈ చిత్రంతో తెలుగు వారికి దగ్గరయ్యారు

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమాలో కూడా ఆమె మెప్పించింది











