Raima Sen
-
ఇఫీలో మా కాళి
రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రల్లో విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా కాళి’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మల్టీ లింగ్వల్ మూవీ ఇది. హిందీలో నిర్మించిన ఈ చిత్రం బెంగాలీ, తెలుగులో 2025లో విడుదల కానుంది. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ(ఇంటర్నేనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ‘మా కాళి’ సినిమాని ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా రాష్ట్ర డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ– ‘‘మా కాళి’ చిత్రాన్ని భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే నేపథ్యంలో తీశారు. 1947లో స్వాతంత్య్రం పొందిన మన దేశం ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ గా మారింది. 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది. ఒక దేశం మూడు ముక్కలైంది. అయినప్పటికీ భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది. ‘మా కాళి’ వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే’’ అని తెలిపారు. ‘‘మా కాళి’కి ప్రమోద్ సావంత్, ఆనంద బోస్గార్ల నుంచి వచ్చిన ప్రశంసల్ని సత్కారంగా భావిస్తున్నాం’’ అన్నారు విజయ్ యెలకంటి, నిర్మాత వందనా ప్రసాద్. -
హీరోయిన్‌కు బెదిరింపులు.. భరించలేకపోతున్నానంటూ..
సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సర్వసాధారణమైపోయింది. అయితే కొందరు విమర్శలతోనే ఆగిపోవడంలేదని బెదిరింపులకు పాల్పడుతున్నారంటోంది హీరోయిన్ రైమా సేన్. ఏకంగా ఇంట్లోని తన ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆమె 'మా కాళి' అనే సినిమా చేస్తోంది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందీ మూవీ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజైంది. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అది చూసిన కొందరు తనను అదే పనిగా బెదిరిస్తున్నారట. 'నాకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకని ఇలా ఏదిపడితే అది అనేస్తున్నారు. మా కాళి సినిమా ఎందుకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తున్నారు. లెజెండరీ నటి సుచిత్రా సేన్ మనవరాలుయ్యండి ఇలాంటి మూవీస్ చేస్తావా? నువ్వు కూడా కోల్‌కతాలోనే ఉండేది.. అది గుర్తుంచుకో అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులు భరించలేకపోతున్నాను' అంది. తెలుగులో ఒకే ఒక సినిమా కాగా రైమా సేన్ గతేడాది ద వ్యాక్సిన్ వార్ సినిమాలో కనిపించింది. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ వివాదంగానే మారింది. ఇప్పుడు మా కాళి మూవీతో ఈ హీరోయిన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి విజయ్ ఏలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈమె తెలుగులో ధైర్యం అనే సినిమాలో నటించింది. ఆమె తల్లి మూన్ మూన్ సేన్, సోదరి రియా సేన్ కూడా నటీమణులు కావడం విశేషం. View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) చదవండి: నయన్- విఘ్నేశ్‌లను ఒక్కటి చేసిన హీరో ఎవరో తెలుసా? -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!
తెలుగు సినిమాలు మీరు బాగా చూస్తారా? అయితే మీకో పజిల్. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్లోకి వచ్చారనేది తెలుసా? మీకే కాదు దాదాపు ఏ ఒక్కరికీ తెలిసుండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటుంటారు. కాకపోతే రేసులో నిలబడి స్టార్స్ అయ్యేది మాత్రం చాలా తక్కువమంది. (ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అలానే తెలుగులో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా తేజ లాంటి దర్శకుడి చేతిలో పడింది. నితిన్ హీరోగా నటించిన 'ధైర్యం'లో హీరోయిన్గా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఆ మూవీ హిట్ కాలేదు. ఈమెకు మరో ఛాన్స్ రాలేదు. ఈమె పేరే రైమా సేన్. హీరోయిన్ రీమా సేన్‌కి ఈమెకు ఏం సంబంధం లేదనిపిస్తుంది. పేర్లు ఒకేలా ఉండటం వల్ల అందరూ పొరబడుతుంటారు. ప్రస్తుతం హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు చేస్తున్న రైమా సేన్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ముంబయిలో పుట్టింది. అమ్మమ్మ సుచిత్రా సేన్ నటి. ఆ తర్వాత ఈమె తల్లి మూన్ మూన్ సేన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2014-19 మధ్య ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించింది. రైమా సేన్ చెల్లెలు రియా సేన్ కూడా నటి. ఈమె కూడా బెంగాలీ, హిందీలో సినిమాలు చేస్తోంది. ఇదంతా పక్కనబెడితే రైమా వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. కానీ లేటెస్ట్గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మాత్రం.. వయసు అబద్ధమేమో అనే డౌట్ వస్తుంది. మరెందుకు లేటు.. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Prasenjit biswas (@makeupartist_prasenjit) View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) -
పెళ్లి అంత ముఖ్యం కాదు: నటి
పెళ్లి విషయంలో ఒకొకరికి ఒకో అభిప్రాయం ఉంటుంది. కొందరికి దాన్ని జీవితంలో ఓ ముఖ్యమైన విషయంగా అనుకుంటారు. మరికొందరు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. తాజాగా పెళ్లి విషయం తన ఆలోచన విధానాన్ని తెలియజేసింది బాలీవుడ్ నటి రైమా సేన్. ఇటీవల రైమా ఓ ఇంటర్వూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు బదులిచ్చింది. ‘పెళ్లి అనేది జీవితానికి ఓ ఫర్ఫెక్ట్ ముగింపు అని సమాజం అనుకుంటుంది. వివాహం చేసుకొని వారు సంతోషంగా ఉండారని అందరూ అనుకుంటారు. కానీ మ్యారేజ్ కాకపోయినా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలా నేను ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నా. ఎంతో నేర్చుకుంటున్నా’ అని ఈ భామ చెప్పింది. ‘నాకు పెళ్లి అంత ముఖ్యం కాదు. అయితే సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటా. కానీ ఇంతవరకు అలాంటి వ్యక్తి ఎదురుపడలేదు’ అని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉన్నట్లు ఈ అందగత్తె పేర్కొంది. చదవండి: ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్.. స్పందించిన నటి ఆయేశా -
అవి లేవనడం మూర్ఖత్వమే..
వివాహేతర సంబంధాలు లేవనడం మూర్ఖత్వమే అవుతుందని బెంగాలీ భామ రైమా సేన్ సుద్దులు చెబుతోంది. వివాహేతర సంబంధాలు నిజజీవితంలోనూ ఉన్నాయని, వాటి ఆధారంగా తీసే సినిమాలనూ జనం ఆమోదిస్తున్నారని అంటోంది. ఉన్నట్టుండి ఈ సోది అంతా ఎందుకు చెబుతోందనుకుంటున్నారా..? వివాహేతర సంబంధమే కథాంశంగా రూపొందుతున్న ‘ఇష్క్ కభీ కరియో నా’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది మరి! -
సెక్స్‌వర్కర్ పాత్రలో..
బెంగాలీ బ్యూటీ రైవూ సేన్ త్వరలోనే తెరకెక్కనున్న ‘బాలీవుడ్ డెయిరీస్’లో సెక్స్‌వర్కర్ పాత్రలో కనిపించనుంది. కొన్నాళ్లుగా బెంగాలీ సినివూలతో బిజీబిజీగా ఉంటున్న ఆమె, ‘చిల్డ్రన్ ఆఫ్ వార్’ చిత్రం తర్వాత బాలీవుడ్లో కనిపించలేదు. చాలా గ్యాప్ తర్వాత దొరికిన ఈ అవకాశం ఎగ్జయిటింగ్‌గా ఉందంటూ రైవూ ‘ట్విట్టర్’లో అభివూనులకు తెలిపింది. కోల్‌కతాలో పేరుమోసిన రెడ్‌లైట్ ఏరియూలోని సెక్స్‌వర్కర్ పాత్రలో రైవూ ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.