పెళ్లి అంత ముఖ్యం కాదు: నటి | Actress Raima Sen Says Marriage is not need for me | Sakshi
Sakshi News home page

Raima Sen: నాకు పెళ్లి అంత ముఖ్యం కాదు: రైమా సేన్

Published Tue, Oct 19 2021 6:58 PM | Last Updated on Tue, Oct 19 2021 9:05 PM

Actress Raima Sen Says Marriage is not need for me - Sakshi

పెళ్లి విషయంలో ఒకొకరికి ఒకో అభిప్రాయం ఉంటుంది. కొందరికి దాన్ని జీవితంలో ఓ ముఖ్యమైన విషయంగా అనుకుంటారు. మరికొందరు ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. తాజాగా పెళ్లి విషయం తన ఆలోచన విధానాన్ని తెలియజేసింది బాలీవుడ్‌ నటి రైమా సేన్. 

ఇటీవల రైమా ఓ ఇంటర్వూలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు బదులిచ్చింది. ‘పెళ్లి అనేది జీవితానికి ఓ ఫర్ఫెక్ట్‌ ముగింపు అని సమాజం అనుకుంటుంది. వివాహం చేసుకొని వారు సంతోషంగా ఉండారని అందరూ అనుకుంటారు. కానీ మ్యారేజ్‌ కాకపోయినా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇలా నేను ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నా. ఎంతో నేర్చుకుంటున్నా’ అని ఈ భామ చెప్పింది. ‘నాకు పెళ్లి అంత ముఖ్యం కాదు. అయితే సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటా. కానీ ఇంతవరకు అలాంటి వ్యక్తి ఎదురుపడలేదు’ అని ఈ బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉన్నట్లు ఈ అందగత్తె పేర్కొంది.

చదవండి: ఒడిలో కూర్చోవాలనుందన్న నెటిజన్‌.. స్పందించిన నటి ఆయేశా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement