Rare pictures
-
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
ఈమెని గుర్తుపట్టారా? సౌత్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపింది.. కానీ కొన్నాళ్లకే!
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. హీరోయిన్లు గ్లామర్ మెంటైన్ చేసినన్నీ రోజులు, హీరోలకు హిట్ సినిమాలు దక్కినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీటిలో మార్పులొస్తాయో.. నటీనటులు జీవితాలు అప్పుడప్పుడు తలక్రిందులవుతుంటాయి. అలాంటి ఓ నటినే ఈమె. ఈ మాత్రం చెప్పాం కదా! మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో సంప్రదాయబద్ధంగా చీరలో పూలు పెట్టుకుని కనిపిస్తున్న అమ్మాయి సిల్క్ స్మిత. అవును మీరు ఊహించింది కరెక్టే. పశ్చిమ గోదావరి జిలాల్లో పుట్టి పెరిగిన వడ్లపాటి విజయలక్ష్మీ.. టీనేజీలో ఉండగానే హీరోయిన్ అయిపోదామని ఇంట్లో కూడా చెప్పకుండా మద్రాసు పారిపోయింది. పేరు మార్చుకుని సిల్క్ స్మితగా మారిపోయింది. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరుగా మొదలై.. స్టార్ హీరోలతో కలిసి ఐటమ్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్)80-90ల్లో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఐటమ్ సాంగ్స్ అంటే దర్శకనిర్మాతలకు ముందు గుర్చొచ్చేది ఈమెనే. అంతలా సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత వచ్చిన ఫేమ్, డబ్బుని మేనేజ్ చేసుకోలేక.. కొందరు హీరోల మాయలో పడి సర్వస్వం కోల్పోయింది. ఒత్తిడి తట్టుకోలేక కేవలం 36 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పట్లో సినిమాలు చేసినప్పటికీ.. ఈమెని ఇప్పటి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటోంది.ఇలాంటి సిల్క్ స్మిత రేర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చీరతో అందానికే ఆధార్‌లా ఉన్న సిల్క్‌ని చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఓర్నీ.. ఈమె సిల్క్ స్మితనా అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగానే ఈమె జీవితాన్ని ఆధారంగా కొన్నేళ్ల క్రితం హిందీలో 'ద డర్టీ పిక్చర్' అనే మూవీ వచ్చింది. ఇది చూస్తే సిల్క్ స్మిత జీవితం ఎలా ఉంటుందో తెలిసే ఛాన్స్ ఉంది!(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి) -
ఇతడు ప్రముఖ నటుడు, దర్శకుడు.. మీకు బాగా తెలుసు.. గుర్తుపట్టారా?
ఒకప్పుడు నటులు, దర్శకులు ఎవరి పని వాళ్లు చేసుకునే వాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సీనియర్ దర్శకులు.. పూర్తిస్థాయి నటులుగా మారిపోతున్నారు. కుర్ర హీరోలు చాలామంది డైరెక్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే పైన ఉన్నది అలాంటి యాక్టర్ కమ్ డైరెక్టరే. తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఇతడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు సముద్రఖని. అవును మీలో కొందరు ఊహించింది కరెక్టే. ఈ మధ్య కాలంలో వరసగా తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నది ఇతడే. అల వైకుంఠపురములో, క్రాక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, హనుమాన్.. ఇలా విలన్ అనే కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)నటుడిగా ఇంత పేరు తెచ్చుకున్నాడు గానీ సముద్రఖని కెరీర్ దర్శకత్వ శాఖలో మొదలైంది. డిగ్రీ పూర్తవగానే నటుడు అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కాకపోతే తొలుత తమిళంలో సీరియల్, సినిమాల్లో అనామక రోల్స్ చేశాడు. ఎప్పుడైతే ప్రముఖ దర్శకుడు బాలచందర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడో అప్పటి నుంచి డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుని పలు హిట్ సినిమాలు తీశాడు.2001 నుంచి తమిళంలో నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. 'అల వైకుంఠపురములో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు. గతేడాది పవన్ కల్యాణ్ హీరోగా 'బ్రో' మూవీ డైరెక్ట్ కూడా చేశాడు. యాక్టింగ్, డైరెక్షన్‌తో పాటు పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం లాంటి కళలు కూడా ఉన్నాయి. ఇకపోతే సముద్రఖని పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్నది ఈ ఫొటోనే ఇది చూసి మీరు గుర్తుపట్టడమైతే కష్టం. మరి మీలో ఎంతమంది గుర్తుపట్టారు?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్) -
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Sai Pallavi Unseen Photos: హైబ్రిడ్ పిల్లా ‘సాయిపల్లవి’ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Allu Arjun HD Images: ప్రతి పాత్రా ప్రత్యేకం.. వెండితెర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేకం (ఫొటోలు)
-
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
Birthday Special: హీరో వరుణ్ తేజ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Mani Ratnam: డైరెక్టర్ ‘మణిరత్నం’ అరుదైన చిత్రాలు
-
Birthday Special: సీఎం వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఫొటోలు ఎప్పుడైనా చూశారా (ఫోటో గ్యాలరీ)
-
కెప్టెన్ ఓ సెన్సేషన్.. విజయకాంత్ అరుదైన చిత్రాలు
-
హీరో నాగచైతన్య బర్త్ డే స్సెషల్ (ఫోటోలు)
-
నటుడు, రచయిత ఉత్తేజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా? (అరుదైన ఫొటోలు)
-
Birthday Special: మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Kannada Superstar Shivarajkumar: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ అరుదైన ఫోటోలు.. ఓ లుక్కేయండి
-
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అరుదైన ఫొటోలు
-
బ్యాట్ పట్టుకున్న ఈయనెవరో గుర్తుపట్టారా? కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
భారతదేశంలో టాప్ 10 ధనవంతుల జాబితాలో రెండవ స్థానం పొందిన 'గౌతమ్ అదానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 54.5 బిలియన్ డాలర్ల సంపద కలిగి అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత ఈ రోజు ఎలా ఉన్నాడో అందరికి తెలుసు. అయితే యుక్త వయసులో ఎలా ఉండేవాడనేది ఇక్కడ చూడవచ్చు. నేడు దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీతో పోటీ పడుతున్న ఆదానీ.. సోలార్, థర్మల్ విద్యుత్ తయారీ, ఓడరేవుల నిర్వహణ వంటి ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారు. గుజరాత్లో జన్మించిన ఈయన కాలేజీ చదువుని మధ్యలోనే ఆపేసి డైమండ్ బిజినెస్ చేయడానికి 1980లోనే ముంబై వెళ్ళాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉండటానికి వచేసాడు. ఆ తరువాత 1988లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ స్థాపించాడు. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ చిన్నప్పుడు స్కూల్ ట్రిప్‌లో భాగంగా కాండ్లా ఓడరేవుకి వెళ్లినట్లు, ఆ పోర్టు చూసాక పెద్దయ్యాక ఇలాంటిది నేను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అదానీ గతంలో వెల్లడించారు. అనుకున్న విధంగానే ముంద్రా పోర్టు కాంట్రాక్ట్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా విస్తరించారు. ఎన్నెన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని ఈ రోజు దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ప్రస్తుతం ఈయన నెట్ వర్త్ రూ. 5.9 లక్షల కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆదానీ టాప్ 10 జాబితాలో మొదటి స్థానం పొందే అవకాశాలు కూడా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
Kannada Real Star Upendra: దమ్మున్న దర్శకనటుడు ఉపేంద్రను ఇలా ఎప్పుడైనా చేశారా?
-
Versatile Actor Raghuvaran: విలక్షణ నటుడు రఘువరన్ అరుదైన చిత్రాలు
-
Folk Singer Gaddar: ప్రజా యుద్ధ నౌక గద్దర్ అరుదైన ఫొటోలు
-
Actress Raasi Unseen Photos: అందాల తార రాశి .. ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
Dhanush Rare & Unseen Photos: బెస్ట్ యాక్టర్ ధనుష్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Actress Soundarya Unseen Photos: తెలుగు తెరకు సిసలైన సౌందర్యం (ఫొటోలు)