
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల జంట ఒకరు. వెండితెరపై హీరో,హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్-నమ్రతలు 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది.
ఈ స్టార్‌కపుల్‌కి పెళ్లయి నేటితో 18 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. '18 ఏళ్ల ప్రయాణం ఎంతో క్రేజీగా, ప్రేమగా ముందుకు సాగింది. ఎప్పటికీ ఇలాగే ముందుకు సాగాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. అంటూ పోస్ట్ చేశారు.
ఇక నమ్రతా కూడా ఇన్‌స్టాలో క్యూటెస్ట్ పోస్ట్‌ను షేర్‌చేసింది. 'మా జీవితంలో మేం తీసుకున్న అత్యత్తుమ నిర్ణయం ఇదే' అంటూ మహేశ్‌తో దిగిన అరుదైన ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment