namrata
-
వయసు ఆపని పరుగు
సాధారణంగా 53 ఏళ్ల వయస్సులో ఉన్న ఫ్యాషన్ డిజైనర్‌ని మీ లక్ష్యాలేమిటి? అంటే.. ప్రపంచమంతా బొటిక్స్ తెరవడమో మరొకటో అంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మారథాన్స్ లను పూర్తి చేయడం అన్నారంటే అది డిజైనర్ నమ్రత జోషిపురా అయి ఉంటారు. అందుకే ఇప్పుడామె బాలీవుడ్ టాప్ డిజైనర్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ మారథాన్ రన్నర్ కూడా. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమంలో తనను తాను ‘సిక్స్ స్టార్ ఫినిషర్‘ అని సగర్వంగా పరిచయం చేసుకున్న ఢిల్లీ డిజైనర్ నమ్రత సాక్షితో పంచుకున్న విశేషాలు...‘స్కూల్లో, కాలేజ్‌లో ఉండగా హాకీ ఆడేదాన్ని. బీకామ్ చేసినా సృజనాత్మక రంగంలోనే భవిష్యత్తు బాగుంటుందని ఫ్యాషన్ డిజైనింగ్లోకి వచ్చాను. ఢిల్లీ నిఫ్ట్‌లో కోర్సు చేస్తున్నపుడు నా టైమ్ పూర్తిగా దానికే కేటాయించాల్సి వచ్చేది. దాంతో ఫిట్నెస్, హాకీ అన్నీ అటకెక్కాయి. అయితే వాకర్స్‌కు బెస్ట్ సిటీ అయిన న్యూయార్క్‌లో ఉన్నప్పుడు సుదూరాలు నడవడం అలవాటై ఫ్యాషన్ రంగంలో బిజీగా ఉంటూనే మినీ మారథాన్ లో పాల్గొన్నా. ఆ క్రమంలోనే ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచంలోని 6 పెద్ద మారథాన్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఢిల్లీ మారథాన్ తో మొదలుపెట్టి 2018లో లండన్, 2019లో చికాగో, 2021లో బోస్టన్ , 2022 బెర్లిన్ లో తాజాగా టోక్యో మారథాన్స్ పూర్తి చేశాను’ ఆగని పరుగు..‘వెర్టిగో, ఆస్తమా, పోస్ట్ మెనోపాజ్ సమస్యలు నన్ను బాధించేవి. రెండుసార్లు కోవిడ్‌తో బాధపడినప్పటికీ మారథాకు ట్రైనింగ్ షెడ్యూల్‌ను కోల్పోలేదు, అయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఆరు బయట రన్ కష్టమైంది. ట్రెడ్‌మిల్‌పై 25–30 కిలోమీటర్లు పరిగెత్తడం కష్టతరమైన పని. ఇవి దృష్టిలో పెట్టుకుని శిక్షణలో మార్పులు చేస్తూ వచ్చిన నా కోచ్ నకుల్ బుట్టాకు థ్యాంక్స్ చె΄్పాలి’మహిళ... గుర్తించాలి తన కల...‘తన కప్పు ఖాళీగా ఉంచుకుని పక్కనవారి కప్పుని నిండేలా చేయడం అసాధ్యం. ఇంటికోసం మాత్రమే కాదు. తన పట్ల కూడా మహిళకు బాధ్యత ఉండాలి. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యాలు కా΄ాడుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలు సాధించుకోవాలి’ఆగను... అలుపెరుగను...‘ఫ్యాషన్ రంగంలో కూడా మరింతగా విస్తరించాలి.. కొత్త స్టోర్స్ ్రపారంభించాలి. నా తదుపరి లక్ష్యం కొన్ని ట్రయల్ రన్నింగ్ ఈవెంట్లు. ఎంతకాలం వీలైతే అంత కాలం పరుగు తీస్తూనే ఉంటా’ అంటున్న నమ్రత తన కలను నెరవేర్చుకోవాలని కోరుకుందాం. – సత్యబాబు -
హైదరాబాద్‌లో స్వదేశ్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన నమ్రతా(ఫోటోలు)
-
మహేశ్ బాబు- నమ్రత పెళ్లి ఫోటోలు చూశారా?
-
ఎవరూ ఊహించలేని టార్గెట్ వైపు అడుగులేస్తున్న 'సితార'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార. కాదు.. కాదు.. 'సితార ఘట్టమనేని' అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. మొదట ప్రిన్స్ మహేష్ బాబు ఫేమ్‌తో గుర్తింపు దక్కినా తర్వాత తన టాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌నే క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది. సితార శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. అంతే కాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యూయెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసి.. ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందకునేంత రెమ్యునరేషన్ తీసుకుంది. అంటే సుమారు కోటి రూపాయలకు పైగానే అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: Sitara Ad Remuneration: చిన్న యాడ్.. కళ్లుచెదిరే మొత్తం ఇచ్చారు!) గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు. 'సితార ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది. తను ఇంగ్లీష్,తెలుగు చాలా చక్కగ మాట్లాడుతుంది. ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది. కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. తనకు సొంతంగా వచ్చింది.' అని చెప్పారు. సితార ఇంత వరకు ఎలాంటి సినిమాలు తీయలేదు. యూట్యూబ్,ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే తను కనిపిస్తుంది. అక్కడ కూడా తనకు మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సితార ఒక స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రతా కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అమెకు డ్యాన్స్,యాక్టింగ్‌లో హావ భావాలు పలికించడంలో రాటుతేలేందకు శిక్షణ ఇప్పించింది. ఈ విధంగా చాలా విషయాల్లో సితార మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత. దీంతో ఆమె ఒక స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితార గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సితారని 'మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్' పోటీలకు నమ్రత సిద్ధం చేస్తోంది అని... ఆపై సితారను హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారట.. ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే సితారకి ఇంకా పదకొండేళ్లే.. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొనాలంటే ఇంకా సుమారుగా ఆరేళ్లు ఉండాల్సిందే. మరీ ఇప్పటి నుంచే ఎందుకంటారా? అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం. అక్కడ రానించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీదు తప్పదు. ఈ శిక్షణల వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం. ఒక రకంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సితార ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) -
నేను, మహేశ్ తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే : నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల జంట ఒకరు. వెండితెరపై హీరో,హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వంశీ సినిమాలో కలిసి నటించిన మహేశ్-నమ్రతలు 2005లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఈ స్టార్కపుల్కి పెళ్లయి నేటితో 18 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు నమ్రతతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. '18 ఏళ్ల ప్రయాణం ఎంతో క్రేజీగా, ప్రేమగా ముందుకు సాగింది. ఎప్పటికీ ఇలాగే ముందుకు సాగాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు'.. అంటూ పోస్ట్ చేశారు. ఇక నమ్రతా కూడా ఇన్‌స్టాలో క్యూటెస్ట్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మా జీవితంలో మేం తీసుకున్న అత్యత్తుమ నిర్ణయం ఇదే' అంటూ మహేశ్‌తో దిగిన అరుదైన ఫోటోను పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
హీరోలను మించిపోతున్న వారి భార్యల క్రేజ్
-
ఆ విషయంలో నాకు- మహేశ్‌కు మధ్య గొడవలు అవుతుంటాయి : నమ్రత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి. ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. -
వివక్షపై.. నమ్రత పిడికిలి
ఇటీవల ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ దివ్యాంగ పిల్లవాడిని విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. ‘‘ప్రత్యేక అవసరాలు కలిగిన ఇతనివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’ అని సాకును చూపిస్తూ పిల్లవాడిని విమానంలోకి ఎక్కడానికి నిరాకరించింది. ఈ సంఘటనను చూసిన వారంతా..ఇంత చిన్నచూపా? ఇదేం పని? అంటూ విమర్శిస్తూనే వారి అమానుషత్వాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే 35 ఏళ్ల నమ్రత మాత్రం అందరిలా ‘అయ్యోపాపం’ అనో, పిడికిళ్లు బిగించో ఊరుకోలేదు. దివ్యాంగులను విమాన సిబ్బంది అలా ఎలా అడ్డుకుంటారు? ఇది సరైంది కాదంటూ ఏకంగా ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘‘నాకు ఒక చెవి వినపడదు. చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత అవహేళనగా చూస్తారో ఆ బాధ నాకు తెలుసు’’ అని చెబుతూ తనలా సమాజంలో వివక్షకు గురవుతోన్న ఎంతోమంది అట్టడుగు వర్గాల వారి తరపున నిలబడి పోరాడుతోంది నమ్రత. మేఘాలయకు చెందిన అమ్మాయి నమ్రతాశర్మ. గోర్ఘా కమ్యునిటీలో ఎనిమిదో తరానికి చెందిన అమ్మాయి. నాగాలాండ్‌లో పుట్టడడం వల్ల నమ్రతకు నేపాలీ కూడా మాట్లాడం వచ్చు. మేఘాలయలో పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గ్రామీణాభివద్ధి సెక్టార్లో ఉద్యోగం రావడంతో బీహార్ వెళ్లింది. ఉద్యోగం వల్ల వినికిడి పోయింది... ఎవరికైనా ఉద్యోగం వస్తే కష్టాలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. నమ్రతకు మాత్రం ఉద్యోగంతో పెద్ద కష్టమే వచ్చింది. మేఘాలయాలో పెరిగిన నమ్రత ఉద్యోగరీత్యా బీహార్‌కు వచ్చింది. అక్కడి వాతావరణం మేఘాలయకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఉద్యోగ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేది. ప్రారంభంలో సర్దుకున్నప్పటికీ క్రమంగా తన చెవి నరాలు ఎండిపోయి వినికిడి శక్తిని కోల్పోయింది. తనతో ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. దీంతో తన సహోద్యోగులంతా ‘హే చెవిటిదానా’ అని పిలిచి పెద్దగా నవ్వుకునేవారు. నమ్రత మాటల్లో నేపాలీ యాస ధ్వనించడంతో ‘ఏ నేపాలీ’ అని కూడా ఆమెను కించపరిచేవారు. ఇలా పదేపదే జరగడంతో నమ్రతకు చాలా బాధగా అనిపించేది. గొంతుకగా నిలవాలని కొంతమంది తనకు సాయం చేస్తామని చెప్పి ఆమె మీద జోకులు వేసి నవ్వుకోవడాన్ని భరించలేని నమ్రతకు... ‘‘నాకు ఒక్క చెవి వినపడకపోతేనే ఇలా గేలిచేస్తున్నారు. కొంతమందికి పూర్తిగా వినపడదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ?’’ అనిపించింది. ఇలా అవమానాలు ఎదుర్కొంటోన్న వారికి సాయపడాలని నిర్ణయించుకుంది. దళిత, ఆదివాసి మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే వినికిడి శక్తిని కోల్పోయారో, మాట్లాడలేరో, అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి గొంతుకగా నిలబడుతోంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నమ్రత వేసిన పిటిషన్ ఇది తొలిసారి కాదు. గతంలో కూడా నమ్రత బెంగళూరులో ఉన్నప్పుడు.. అక్కడ ఉన్న ఒకే ఒక డెఫ్ ఇన్స్టిట్యూట్ ‘టెక్నికల్ ట్రై నింగ్ స్కూల్’ను మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ స్కూలును కూల్చవద్దని పిటిషన్ వేసింది. దీనికి అక్కడి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో స్కూలు కూల్చడాన్ని మెట్రో అధికార యంత్రాంగం వాయిదా వేసింది. ఆ తర్వాత ‘పాతాల్‌లోక్’ వెబ్ సిరీస్ లో ఈశాన్య దేశాల ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్ వేసింది. ఇలా సమాజంలో ఎదురయ్యే అనేక వివక్షలను గొంతెత్తి ప్రశ్నిస్తూ ఎంతోమందికి కనివిప్పు కలిగిస్తూ సమాజాభివద్ధికి తనవంతు సాయం చేస్తోంది నమ్రత. మానవత్వం చూపాలి మనుషులమని మర్చిపోయి ప్రవర్తించడం చాలా బాధాకరం. మనుషుల్లో కొంతమంది పొడవుగా, మరికొంతమంది పొట్టిగా, వివిధ రకాల రంగూ, రూపురేఖలతో విభిన్నంగా ఉంటారు. అంతమాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరు. ఎటువంటి లోపాలు, అంతరాలు ఉన్నప్పటికీ వాళ్లు మనలాంటి మనుషులని గుర్తించాలి. వికలాంగుల పట్ల వివక్ష చూపకూడదు. మానవత్వం చూపాలి. – నమ్రతా శర్మ -
గిల్టీమైండ్స్ వెబ్‌స్టార్ నమ్రతా సేథ్ ఫోటోలు
-
సృష్టి ఆసుపత్రి కేసు:. డాక్టర్ నమ్రతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతకు నోటీసులు జారీ చేసింది. సరోగసి చిన్నారుల అక్రమ విక్రయంపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్.. బినామీ పేర్లతో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ హాస్పిటల్స్ నిర్వహించినట్లు నిర్ధారించింది. నమ్రతపై చర్యలపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫార్సు చేసింది. -
డా.నమ్రతకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
-
అతడు నా అభిమాన హీరో
మహేశ్‌లో నమ్రతకు నచ్చిన విషయం ఏంటి? మహేశ్ చేసే సినిమాల కథల్లో నమ్రత ఇన్వాల్వ్ అవుతారా? నమ్రత లైఫ్‌లో బెస్ట్ మూమెంట్స్ ఏంటి? వంటి పలు ప్రశ్నలను నెటిజన్లు నమ్రతను అడిగారు మంగళవారం నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఆ విశేషాలు ఈ విధంగా... ► లాక్డౌన్లో ఏం నేర్చుకున్నారు? సహనంగా ఉండటం నేర్చుకున్నాను. ప్రతి చోటా ప్రేమ ఉంటుందని తెలుసుకున్నాను. ► షాపింగ్ అంటే ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ► మరాఠీ ప్రజలను మిస్ అవుతున్నారా? మహారాష్ట్రియన్‌గా గర్వపడుతున్నాను... నా మరాఠీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. ► మీరు మిస్ఇండియా కావడానికి స్ఫూర్తి? మా అమ్మగారు ► మీ జీవితంలో బెస్ట్ ఫేజ్? మదర్‌హుడ్ ► మీ హాబీ? హోమ్ ఇంటీరియర్స్‌ను డిజైన్ చేయడాన్ని బాగా ఇష్టపడతాను. ► మీరు తెలుగు బాగా మాట్లాడగలరా? మాట్లాడతాను కానీ ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. ► ఫిట్నెస్ సీక్రెట్? వ్యాయామం చేయడం, తినడం, బాగా నిద్రపోవడం. ► మీ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్? నా పెళ్లి రోజు. నేను ఇద్దరు పిల్లలకు తల్లినైన రోజు. ► మీ ఫేవరెట్ టాలీవుడ్ హీరో? ఇంకెవరు? మహేశ్‌బాబు. ► మీ ఫేవరెట్ ప్లేస్? ప్రస్తుతం ఇంటిని మించిన ఫేవరెట్ ప్లేస్ లేదు. ► మహేశ్గారిలో మీకు నచ్చిన విషయం? రియల్‌గా ఉండే మహేశ్ వ్యక్తిత్వం ► మీ కూతురు సితార సినిమాల్లో నటిస్తుందా? ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం తను తన యూట్యూబ్ చానెల్ (ఆద్యా సితార) కోసం వీడియోలు చేయడంలో చాలా బిజీగా ఉంది. ► మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మరో సినిమా ఉంటుందా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పగలదు. ►మహేశ్ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైనవి? ఒక్కడు, పోకిరి, మహర్షి, దూకుడు, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను ► మహేశ్‌బాబుతో మీరు ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారా? మా ఇద్దరికీ ఒకరికొకరిపై పూర్తి నమ్మకం ఉంది. సో.. ఇన్సెక్యూరిటీకి తావు లేదు. ► మహేశ్‌బాబు వంట చేస్తానంటే మీరు ఏం వండమని చెబుతారు? మహేశ్ సులభంగా ఏం వండుతాడా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ► సితార, గౌతమ్.. ఎవరి అల్లరి ఎక్కువ? ఎవరి అల్లరి వాళ్లది ► భవిష్యత్‌లో మహేశ్‌గారు, మీరు ఒకే సినిమాలో నటిస్తారా? ఈ జీవితకాలంలో అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది. ► మీ అత్తగారు ఇందిరమ్మ గురించి కొన్ని మాటలు చెప్పండి? ప్రేమకు నిర్వచనం. ► మహేశ్ నిక్‌నేమ్? నాని ► మహేశ్ స్క్రిప్ట్ సెలక్షన్లో మీ పాత్ర ఉంటుందా? నేను ఇన్వాల్వ్ కాను. ► మీరు సాయిబాబా భక్తురాలిగా ఎలా మారారు? సాయిబాబాకు మా అమ్మగారు పెద్ద భక్తురాలు. నా అనుభవాలు నన్ను బాబా భక్తురాలిగా మార్చాయి. సాయిబాబా.. మై ఓన్లీ గురు. భర్త, పిల్లల పేర్లతో టాటూ -
ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత
అబ్బాయిది సౌత్. అమ్మాయిది నార్త్. మనసులు కలిశాయి. మనసులు కలిస్తే.. సౌత్, నార్త్ కలుస్తాయా?! ‘నో’ అన్నారు నమ్రత పేరెంట్స్. ఇటువైపు కూడా సేమ్ టు సేమ్.. ‘నో’! ఒక్క సినిమాతో ఒకటై పోయినవాళ్లు.. ఏడడుగులు వేయడానికి నాలుగేళ్లు ఆగారు. పదిహేనేళ్లయింది పెళ్లయి. ఆ పెళ్లి కళ ఇంకా అలాగే ఉంది. మహేశ్‌లో అదే సిగ్గు. నమ్రతలో అదే నవ్వు. భార్యాభర్తల్ని ఇంటర్వ్యూ చేసినట్లు లేదు. ఇద్దరు ప్రేమికులతో ముచ్చటించినట్లు అనిపించింది. మీ ఇద్దరూ కలిసి చేసింది కేవలం ఒక్క సినిమాయే (వంశీ). ఆ సినిమా చేసిన కొన్ని నెలల పరిచయంతోనే ‘లైఫ్ పార్ట్నర్గా తనే పర్ఫెక్ట్’ అనే నమ్మకం ఎలా కలిగింది? నమ్రత: ‘వంశీ’ సినిమా కోసం 52 రోజులు అవుట్డోర్ షూటింగ్ చేశాం. ఆ షెడ్యూల్ పూర్తయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లే టైమ్ వచ్చింది. అప్పుడు ఒకరిని ఒకరం మిస్ అవుతాం అని అర్థమయిపోయింది. దూరం అవుతామనే ఆలోచనే భరించలేనిదిగా అనిపించింది. ఆ ఫీలింగ్ నుంచే పెళ్లి ఆలోచన వచ్చింది. అది కాకుండా మహేశ్ ప్రవర్తన చూసి నా జీవితాన్ని పంచుకోవడానికి తనే పర్ఫెక్ట్ అనిపించింది. మహేశ్: ఆ సినిమా కోసం ట్రావెల్ చేసిన ఆ కొన్ని రోజుల్లో నమ్రత బెస్ట్ బెటరాఫ్ అవుతుందని నాకూ అనిపించింది. ‘వంశీ’లో... ‘వంశీ’ ఫ్లాప్ సినిమా. కానీ మీ ఇద్దరినీ కలిపిన సినిమా? నమ్రత: అవును. మా ఇద్దరి కెరీర్లో నిరుత్సాహపరిచిన సినిమా అది. అయినప్పటికీ ‘వంశీ’ సినిమాకి మేం ఎప్పటికీ ధన్యవాదాలు చెబుతూనే ఉంటాం. మా ఇద్దరినీ కలిపిన ఆ సినిమా మాకెంతో ప్రత్యేకం. మీరు నార్త్.. మహేశ్‌గారు సౌత్. మరి ఇద్దరి ఇంట్లో మీ పెళ్లిని సులువుగా అంగీకరించారా? నమ్రత: నేను తనకి పర్ఫెక్ట్ భార్యని అవుతానని వాళ్ల ఫ్యామిలీని కన్విన్స్ చేయాలనుకున్నారు మహేశ్. అయితే వాళ్లు ఓకే చెప్పడానికి నాలుగేళ్లు పట్టింది. ఆ నాలుగేళ్లు నేను ఓపికగా వెయిట్ చేశా. చేసుకుంటే మహేశ్నే లేకపోతే లేదు అని ఫిక్స్ అయ్యాను. మరి మీ పేరెంట్స్ ఈజీగానే ఒప్పుకున్నారా? నమ్రత: మా అమ్మానాన్న కూడా వెంటనే ఒప్పుకోలేదు. అయితే మహేశ్‌ని కలిసిన తర్వాత వాళ్లు ఫుల్ హ్యాపీ. మా పెళ్లికి అంగీకరించారు. మహేశ్‌గారు నటించిన ‘మురారి’లో పెళ్లి సీన్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. రియల్ లైఫ్‌లో మీది సింపుల్ వెడ్డింగ్.. అలా గ్రాండ్‌గా చేసుకుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? నమ్రత: మా పెళ్లి జరిగిన విధానం నాకు చాలా నచ్చింది. చాలా సింపుల్‌గా జరిగినా మాకు బాగా సన్నిహితులైనవారి సమక్షంలో కూల్‌గా జరిగింది. అందుకే గ్రాండ్‌గా చేసుకుని ఉండాల్సింది అనే ఆలోచనే ఎప్పుడూ లేదు. ఈ నెల 10న మీ పెళ్లి రోజుని ఎలా జరుపుకున్నారు? నమ్రత: ఇంట్లోనే జరుపుకున్నాం. ఉదయాన్నే పిల్లల్ని స్కూల్‌కి పంపి, ఎవరి వర్కౌట్స్ వాళ్లు చేసుకుని సాయంత్రం పిల్లలు ఎప్పుడు వస్తారా? అని ఎదురు చూశాం. పిల్లలిద్దరూ మా కోసం స్వయంగా గ్రీటింగ్ కార్డు తయారు చేశారు. అది చాలా స్పెషల్‌గా, టచింగ్‌గా అనిపించింది. సాయంత్రం కుటుంబమంతా డిన్నర్‌కి వెళ్లాం, త్వరగానే తిరిగొచ్చాం. నెక్ట్స్ డే మా అబ్బాయి గౌతమ్, పాప సితార స్కూల్‌కి వెళ్లాలి కదా. మహేశ్: పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం బాగుంటుంది. అందుకే మ్యారేజ్ సెలబ్రేషన్ అంటే పిల్లలతో కలిసి బయటికెళ్లడమే. మీ పెళ్లయి పదిహేనేళ్లు పూర్తయ్యాయి.. నమ్రత: ఈ పదిహేనేళ్లల్లో మా ప్రేమ ఇంకా పెరిగింది. ప్రేమికులుగా ఉన్నప్పుడు, పెళ్లయిన కొత్తలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉంటున్నాం. ఈ పదిహేనేళ్ల జర్నీ సరదాగా, సంతోషంగా సాగిపోయింది. ఫ్యామిలీ లైఫ్ విషయంలో ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. మహేశ్: అలా అని అన్నీ హ్యాపీ మూమెంట్సే ఉన్నాయని చెప్పడం లేదు. వీటితోపాటు కొన్ని ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉన్నాయి. ఆనందాన్ని ఎలా పంచుకున్నామో బాధలను కూడా అలానే పంచుకుంటూ వస్తున్నాం. ఓవరాల్‌గా మాది బ్యూటిఫుల్ జర్నీ. పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుండిపోయే జ్ఞాపకాల గురించి? నమ్రత: చాలా ఉన్నాయి. పెళ్లయిన కొత్తల్లో మేం ఒక ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. ఆ రోజులు బెస్ట్. ఆ తర్వాత గౌతమ్ పుట్టడం ఓ మంచి అనుభూతి. ‘ఖలేజా’ ముందు మహేశ్ మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో మేం స్పెండ్ చేసిన టైమ్ బెస్ట్. పెళ్లయినప్పుడు ఉన్న ఫ్లాట్ నుంచి మేం కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం ఓ మంచి మెమొరీ. ఆ తర్వాత సితార పుట్టడం ఇంకో మంచి అనుభూతి. యాక్టర్ నుంచి సూపర్ స్టార్‌గా మహేశ్ మారడం.. ఇవన్నీ నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్స్. మహేశ్: నిజానికి మా పెళ్లి తర్వాత తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి కుదరలేదు. ఆ మూడేళ్ల బ్రేక్ మా మంచికే. మా అబ్బాయి గౌతమ్‌తో ఎక్కువగా ఉండగలిగాను. ఆ బ్రేక్ నాకు రిఫ్రెషింగ్లా అనిపించింది. మీ మామయ్య కృష్ణగారి గురించి చెప్పండి? నమ్రత: మహేశ్ లైఫ్‌లో మామయ్యగారు స్ట్రాంగ్ ఫోర్స్. మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆయన ఓ బలం. మా అందరికీ ఆయనే స్ఫూర్తి. వాళ్ల కుటుంబంలోకి నన్నో కూతురిలా ఆహ్వానించారు. మామయ్యగారు నాకు తండ్రిలానే అనిపిస్తారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లను బాగా ముద్దు చేస్తారు. పిల్లలతో ఉన్నప్పుడు ఆయన కూడా పిల్లాడైపోతారు. మా అందర్నీ ముందుకు నడిపించేది మామయ్యగారే. ఆయన్నుంచి నేర్చుకున్న విషయాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్ అత్తగారు ఇందిర గారితో మీ అనుబంధం.. నమ్రత: ఇందిరమ్మగారు చిన్న పిల్లలాంటివారు. మా ఇంట్లో అందరికంటే చిన్నపిల్ల ఆవిడే (నవ్వు). ఏ విషయాన్ని అయినా చిన్నపిల్లలానే డీల్ చేస్తారు. అందర్నీ చాలా ప్రేమగా చూస్తారు. పిల్లలతో, మహేశ్‌తో, నాతో భలే ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. కొన్నిసార్లు నా మీద జోక్స్ చేస్తుంటారు. మామయ్యగారిలానే అత్తయ్యగారు కూడా నన్ను కూతురిలా చూసుకుంటారు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అత్తయ్యవాళ్లు నన్ను చూసుకున్న విధానాన్ని మరచిపోలేను. నమ్రతగారిలో మీకు నచ్చిన లక్షణాలేంటి? మహేశ్: తన సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఏ సందర్భంలో అయినా తను తనలానే ఉంటుంది. ముఖ్యంగా తనలో నెగటివ్ ఆలోచనలు ఉండవు. అది చాలా చాలా పాజిటివ్ విషయం. చాలా కైండ్ పర్సన్. అలాగే అవసరమైనప్పుడు చాలా స్ట్రిక్ట్ కూడా. నమ్రత చాలా నిజాయితీ గల మనిషి. మరి మహేశ్గారిలో మీకు నచ్చే విషయాలు? నమ్రత: ఆయనలో అమాయకత్వం ఉంది. అలాగని అమాయకుడు కాదు. సున్నిత మనస్కుడు. ఫ్యామిలీని తను ప్రేమించే విధానం సూపర్బ్. తనది స్వచ్ఛమైన మనసు. ఆయన స్వభావం చాలా మంచిది. ఇంకా మహేశ్‌లో నచ్చే విషయాలు చాలా చాలా ఉన్నాయి. పెళ్లి చేసుకుని సినిమాలు మానేశారు. ఆ విషయంలో ఏదైనా అసంతృప్తి ఉందా? కమ్‌బ్యాక్ లాంటిది ఏమైనా ఊహించొచ్చా? నమ్రత: పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్నది నా సొంత నిర్ణయమే. ఆ నిర్ణయం సరైనది కాదు అని ఒక్క నిమిషం కూడా అనిపించలేదు. మహేశ్ నాకు మంచి జీవితాన్నిచ్చారు. ఇంతకు మించి నాకేం కావాలి? మహేశ్, పిల్లలు నా ప్రపంచం. వీళ్లు కాకుండా నాకు వేరే ఏ ఆనందాలూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఈ జీవితం కాకుండా నాకు వేరే జీవితం కూడా అవసరం లేదు. ఒక భార్యగా, తల్లిగా నమ్రత ఎలా ఉంటారు? మహేశ్: మదర్‌గా నమ్రత అమేజింగ్. వంక పెట్టే పనిలేదు. ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులూ తనకి ఇచ్చేయొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు స్ట్రిక్ట్‌గా ఉండాలి కదా. తను స్ట్రిక్ట్ మదర్. ఇక భార్యగా నమ్రత గురించి చెప్పాలంటే.. చాలా చాలా గొప్ప భార్య. తను లేకపోతే నేను లేను. నా బెస్ట్ ఫ్రెండ్, నా సపోర్ట్ సిస్టమ్ అన్నీ తనే. నా జీవితాన్ని చాలా సులువుగా మార్చడం తనకి మాత్రమే తెలుసు. నమ్రతగారిని మీ అమ్మగారితో పోల్చమంటే... మహేశ్: ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన స్త్రీలు ఉంటారు. నా జీవితంలో మా అమ్మ, నా భార్య ముఖ్యమైన స్త్రీలు. వాళ్లు నా సర్వస్వం. అలాగే నా పిల్లలు కూడా. నాకు తెలిసి మా అమ్మగారిలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. కచ్చితంగా ఉండరు. నా భార్య విషయంలో కూడా ఇదే చెబుతాను. నమ్రతలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. నా జీవితంలో వీళ్ల స్థానాల్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అంత ముఖ్యమైన వాళ్లు నాకు. తండ్రిగా మహేశ్ ఎలా ఉంటారు? నమ్రత: కొడుకుగా, భర్తగా, తండ్రిగా మహేశ్ ది బెస్ట్. ఎటువంటి సందర్భాల్లో అయినా మాకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఇస్తారు కూడా. మహేశ్‌గారు డామినేటింగ్‌గా ఉండరనే అనుకుంటున్నాం. మీ ఇంట్లో డామినేషన్ ఎవరిది? నమ్రత: మా ఇద్దరిలో ఎవరో ఒకరు డామినేటింగ్‌గా ఉంటారని చెప్పలేం... సమానంగానే ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో తనే గెలుస్తారు (నవ్వుతూ). మహేశ్ నుంచి మీరందుకున్న బెస్ట్ గిఫ్ట్? నమ్రత: రొటీన్‌గా అనిపించొచ్చు కానీ మహేశ్ నుంచి నేనందుకున్న బెస్ట్ గిఫ్ట్ నా పిల్లలు. మహేశ్: నా బలం నా ఇల్లు. ఇంట్లో ఆనందం దొరికితే ఇక దానికి మించిన గిఫ్ట్ ఉండదు. ఆ విధంగా ఐయామ్ హ్యాపీ. పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తారా? ఎవర్ని అడుగుతారు? నమ్రత: పిల్లలకి ఏం కావాలన్నా మహేశ్ దగ్గరకు వెళ్తారు. ఎందుకంటే నో అనరు కాబట్టి. నేను మాత్రం అది నిజంగా అవసరం అయితేనే ఓకే అంటాను. లేదంటే నో... నో... అంతే. సో.. నేనే స్ట్రిక్ట్. పిల్లలు భవిష్యతులో ఇలా స్థిరపడితే బాగుంటుంది అని డిస్కస్ చేస్తుంటారా? పెద్దయ్యాక గౌతమ్, సితార ఏం కావాలనుకుంటున్నారు? మహేశ్: ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం కావాలనుకుంటున్నారో అది వాళ్ల ఇష్టం. మేం డిసైడ్ చేయదలచుకోలేదు. అయితే వాళ్లు ఏం చేసినా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం. మహేశ్‌కి చాలా సిగ్గు. హీరోయిన్స్‌తో కూడా సరిగ్గా మాట్లాడరు అని ఓ సందర్భంలో అన్నారు. ఆ స్వభావమే భార్యగా మిమ్మల్ని సెక్యూర్‌గా ఉంచిందా? నమ్రత: అలా ఏం కాదు. తన కో–స్టార్ట్స్‌తో చాలా కంఫర్ట్‌బుల్‌గానే ఉంటారు. మహేశ్ చుట్టూ ఎవరున్నా... ఎంతమంది ఉన్నా నేను భయపడటానికి వీలు లేనంత భరోసా ఇచ్చారు. తన ప్రవర్తనతో నమ్మకం కలిగిస్తారు. ఆ ధైర్యం కలిగించడం చాలా మఖ్యం. వంట విషయంలో మహేష్‌గారు ఏమైనా సహాయం చేస్తుంటారా? నమ్రత: మహేశ్‌కి వంట రాదు. నాక్కూడా అనుకోండి (నవ్వుతూ). సో.. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేయడం లాంటివి ఏమీ జరగలేదు. మంచి వంట మనిషి ఉన్నారు. సక్సెస్ఫుల్ మ్యారేజ్‌కి మీరిచ్చే టిప్స్? మహేశ్: హ్యాపీ మ్యారేజ్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది. ప్రతీ భార్యాభర్త ఈక్వేషన్ ఒకలా ఉండదు. ఒక్కో కపుల్‌ది ఒక్కోలా ఉంటుంది. టిప్స్ అని చెప్పలేను కానీ సక్సెస్ఫుల్ రిలేషన్‌కి నమ్మకం, బలమైన స్నేహం ముఖ్యం. మా రిలేషన్లో అదే ఫాలో అవుతాం. నమ్రత: ఒకరి మీద ఒకరికి నమ్మకం, స్నేహం, కుటుంబ బంధాల మీద మా రిలేషన్షిప్ ఆధారపడి ఉంది. మా పిల్లలు కూడా కుటుంబ బంధాలు, విలువలు బాగా నమ్మాలని, పాటించాలని, సాధారణమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అభిమానుల గురించి కూడా చెప్పాలని ఉంది. మా కుటుంబం మీద చాలా మంది అభిమానుల ఆశీస్సులు ఉండటం మా అదృష్టం. మామయ్యగారు, మహేశ్‌గారి అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పిల్లలకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి. మార్కుల విషయంలో మీ ఇద్దరూ లిబరల్గానే ఉంటారా? నమ్రత: ఇంట్లో ఉంటాను కాబట్టి పిల్లల స్టడీస్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాది. అయితే మహేశ్‌కి కూడా చాలా ఇంట్రస్ట్. స్కూల్లో ఏం చేస్తున్నారు? ఎలా చదువుకుంటున్నారు? అనేవి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారు. మహేశ్: మార్కుల గురించి ఇద్దరం పెద్దగా పట్టించుకోం. బాగా మార్కులు రావాలని పిల్లలను ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని మా ఫీలింగ్. అయితే బాగా చదువుకోవాలని, వీలైనంత హార్డ్‌వర్క్ చేయాలని చెబుతాం. – డి.జి. భవాని -
అర్ధాంగికి బర్త్‌డే విషెస్: మహేశ్‌బాబు
నమ్రతా శిరోద్కర్.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అర్ధాంగిగా అందరికీ సుపరిచితమే. మహేశ్‌బాబుకు అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు తన భార్యకు బర్త్‌డే విషెస్ తెలిపాడు. ‘ఎంతగానో ప్రేమించే నా ఇల్లాలికి, జీవిత భాగస్వామికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు. ఇక మహేశ్ సోదరి మంజుల కూడా నమ్రతకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ‘నీ కలలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ సో మచ్..’ అంటూ నమత్రతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మహేశ్ అభిమానులు సైతం ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేశ్, నమ్రత దంపతులు టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా పేరు గడించారు. తనకు ఎలాంటి చీకూచింతా లేకుండా ప్రశాంతంగా ఉండటానికి నమ్రతే కారణమని మహేశ్ గతంలో ప్రస్తావించాడు. తన యాడ్స్, సినిమాలు, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నింటిలోనూ ఆమె కీలక పాత్ర పోషాస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. Wishing the woman of the house, the woman in my life❤❤❤ the Happiest Birthday!!! Just love and more love 🤗🤗🤗 Namrata 💞💞💞 pic.twitter.com/QuhuO64LSG — Mahesh Babu (@urstrulyMahesh) January 21, 2020 Happy Birthday my dearest Tom cat. Hope all your dreams and aspirations come true. Love You so much. God bless you.❤❤❤ pic.twitter.com/ALr6Y3Y66A — Manjula Ghattamaneni (@ManjulaOfficial) January 22, 2020 చదవండి: నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్... వైరల్ అది నేను తీసుకున్న మంచి నిర్ణయం: మహేశ్ -
అతిథి పాత్రలో మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. ఈ సినిమాలతో పాటు ఓ చిన్న సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు కూడా మహేష్ ఆసక్తికనబరుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్, త్వరలో ఇతర హీరోలతో లో బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రొడక్షన్ వ్యవహారాలను మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటున్నారు. అయితే తొలి ప్రయత్నంగా ఓ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కనిపించే ఓ కీలక పాత్రను మహేష్ బాబుతో చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నారట నమ్రత. తమ బ్యానర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావటంతో మహేష్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేందుకు ఓకె చెప్పే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఒప్పుకుంటాడా లేదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
చిన్నారి చిరునవ్వు
మహేశ్‌బాబు తనయ సితార ముఖంలో నవ్వులు పూయించారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి నమ్రత పేర్కొన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహర్షి’ సినిమా కోసం మహేశ్‌బాబు న్యూయార్క్‌లో ఉన్నారు. మహేశ్‌బాబుతో కలిసి ఆయన భార్యాపిల్లలు నమ్రత, సితార, గౌతమ్‌లు కూడా వెళ్లారు. అక్కడ ఆలియా భట్‌తో కలిసి సితార దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నమ్రత. ‘‘సితారకు ఆలియా అంటే ఎంతో ఇష్టం. ఆమెతో సితార ఫొటో దిగింది. సితార ముఖంలో నవ్వులకు కారణమైన ఆలియాకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు నమ్రత. ఇంతకీ ఆలియా న్యూయార్క్ ఎందుకు వెళ్లారనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం... రిషి కపూర్‌కు కాస్త అనారోగ్యంగా ఉంటే న్యూయార్క్‌లో చికిత్స చేయించుకోవడానికి వెళ్లారట. ఆయన్ను చూసేందుకే న్యూయార్క్ వెళ్లారట ఆలియా. ఇంతకీ రిషీని ఆలియా ఎందుకు పరామర్శించారంటే.. రణ్‌బీర్ కపూర్ తండ్రి కాబట్టి. రణ్‌బీర్, ఆలియా లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
మనశ్శాంతిగా ఉండనివ్వరా?.. వర్మపై ఫైర్
విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్ జీవితంపై వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తానని ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుధాల కేసు నేపథ్యంలో ఇది ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చారు. ‘సంజయ్ వద్దకు ఏకే- 56 రైఫిల్ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి పూసగుచ్చినట్లు వివరించే యత్నం చేస్తానని, అందుకు సంజు బాబాతోపాటు కేసును దర్యాప్తు చేసిన అధికారులను సైతం కలిసి కథను రూపొందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నమ్రతా దత్ స్పందించారు. ‘అక్రమాయుధాల కేసు సంజు జీవితంలోని ఓ బాధాకరమైన ఘటన. దాన్ని వర్మ ఎందుకు తవ్వాలనుకుంటున్నారు? ఆర్జీవీ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలే. అలాంటప్పుడు బయోపిక్‌తో సంజును క్షోభపెట్టాలనుకుంటున్నారా? మమల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని ఆయన చూస్తున్నారా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంజుకి అభ్యంతరం లేకపోతే మాత్రం తాము వర్మ ప్రయత్నానికి అడ్డుతగలబోమని ఆమె స్పష్టం చేశారు. -
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక
-
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక, స్టార్ల హంగామా
అక్కినేని వారింట చిన్న కోడలుగా అడుగపెట్టబోయే చివరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి అయింది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరి వివాహానికి రామ్ చరణ్ నుంచి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వరకు టాలీవుడ్ స్టార్లందరూ హాజరయ్యారు. శ్రియా, అనిన్దిత్ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు శ్రియా భూపాల్, అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌తో తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన చీరలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్దిత్, క్లాసిక్ శెర్వానీతో సింపుల్ లుక్‌లో కనిపించాడు. ఉపాసనకు అనిన్దిత్ కజిన్ కాగ, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయ్యారు. సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్, లావణ్యలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కాగ, శ్రియా భూపాల్‌కు అంతకముందు నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ ఇరువురి వివాహం ఆఖరి నిమిషాల్లో ఆగిపోయింది. అఖిల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఇరు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా.. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్టాఫిక్ కూడా మారింది. శ్రీయా భూపాల్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అఖిల్ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. -
సితార అల్లరిని కంట్రోల్ చేయలేం : మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన మహేష్, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ పుట్టిన రోజే తన జీవితంలో అత్యంత ఆనందం కలిగిన రోజని చెప్పిన మహేష్, తన కూతురు సితార అల్లరి ఎవరు కంట్రోల్ చేయలేరన్నాడు. ఇక తన సినిమాల ఎంపికలో భార్య నమ్రత, తండ్రి కృష్ణల ప్రమేయం ఏమాత్రం ఉండదని, సినిమాలను తనఇష్టాఇష్టాల మేరకు తానే సెలెక్ట్ చేసుకుంటానని తెలిపారు. అయితే ఆర్థికపరమైన విషాయాలు, యాడ్ ఎండార్స్ మెంట్ల లాంటివి మాత్రం నమ్రతే చూసుకుంటారని తెలిపాడు. ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్స్ కు వెల్లటం ఇష్టమన్న సూపర్ స్టార్ ఎక్కువగా స్విట్జర్లాండ్ లో గడిపేందుకు ఇష్టపడతానని తెలిపారు. -
మా నాన్న వెరీ గుడ్
‘మా నాన్న వెరీ గుడ్’ అంటోంది నమ్రత ‘‘అమ్మా! మా నాన్న కూడా వెరీ గుడ్’’ అంటున్నారు గౌతమ్, సితార ఎవరి నాన్న వాళ్లకి వెరీ గుడ్... హ్యాపీ ఫాదర్స్ డే . ♦ మహేశ్‌బాబు ఎలాంటి ఫాదర్? నమ్రత: సేమ్ టు సేమ్... జస్ట్ లైక్ మా నాన్నలానే. ‘మీకు స్కూల్‌కి వెళ్లాలని లేదా? సర్లే వెళ్లొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా? ఆడుకోండి. నిద్ర వస్తుందా.. వెళ్లి పడుకోండి. బొమ్మలు ఏవైనా కావాలంటే వెళ్లి కొనుక్కోండి’ – ఇలా పిల్లలు ఏం అడిగినా... ‘యస్’ చెప్తాడు. మహేశ్ నోటి నుంచి ‘నో’ అనే పదమే రాదు. ♦ మీరు స్ట్రిక్ట్‌గా ఉంటారా? ఓ స్థాయి వరకు ఏం అనను. స్కూల్‌కి వెళ్లాల్సిన టైమ్‌లో ఆటలు ఆడుతుంటే... ఊరుకోను. అప్పుడప్పుడూ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాను. ♦ పిల్లల మార్కుల గురించి మహేశ్ పట్టించుకుంటారా? చూస్తాడు. ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకుంటాడు. కాకపోతే పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్స్‌కి వెళ్లడు. వాటికి నేను వెళతాను. తప్పకుండా రావాల్సిందే అని గౌతమ్ అడిగితే మాత్రం ఆ ఈవెంట్ మిస్ కాకుండా చూసుకుంటాడు. ♦ మీ గురించి మహేశ్ దగ్గర పిల్లలు కంప్లైంట్ చేస్తారా? అఫ్కోర్స్. రోజూ చేస్తారు. అప్పుడు ‘ఓకే.. అమ్మతో మాట్లాడతా. కూల్’ అంటాడు. ఒక్కోసారి ‘పిల్లలే కదా.. వదిలెయ్’ అని నాతో చెబుతుంటాడు. ♦ ఇప్పుడు మమ్మీ డాడీ కల్చర్ కదా. మరి మీ పిల్లలు అమ్మా, నాన్న అనే పిలుస్తారా? నేను మా నాన్నని ‘పప్పా’ (నాన్న) అని పిలిచేదాన్ని. అమ్మను ‘మా’ (అమ్మ) అనేదాన్ని. పిలుపు విషయంలో మహేశ్ చాలా పర్టిక్యులర్. అమ్మా, నాన్న అని పిలిపించు కోవాలన్నది తన డెసిషనే. అందుకే మొదట్నుంచీ మా పిల్లలకు అమ్మా, నాన్న అని పిలవడం అలవాటు చేశాం. ♦ ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం... మీ నాన్నకు మహేశ్‌బాబు ఎందుకు నచ్చారు? హ్యాండ్సమ్గా ఉంటారనా? ఆయన మనసు నచ్చిందా? మహేశ్ ఈజ్ వెరీ కైండ్ అండ్ లవింగ్ పర్సన్. చాలా మంచోడు. అమ్మానాన్నలకు మహేశ్‌లో ఆ లక్షణాలు నచ్చాయి. నేను హ్యాపీగా ఉండడం వాళ్లకు కావాలి. మహేశ్‌తో నేను హ్యాపీగా ఉన్నాను. సో, ఓకే చెప్పేశారు. అంతే తప్ప... మహేశ్ బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉంది? అతనెవరి కుమారుడు? అతని క్యాస్ట్ ఏంటి? అతనెక్కడి నుంచి వచ్చాడు? అనేవి ఆలోచించలేదు. మా అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? లేదా? అనేది మాత్రమే నాన్న ఆలోచించారు. ♦ మీ ఫాదర్, మీ హజ్బెండ్లో ఉన్న సేమ్ క్వాలిటీస్ గురించి? ఇద్దర్నీ కంపేర్ చేసి చూడలేను. కానీ, ఇద్దరిలో కొన్ని క్వాలిటీస్ కామన్‌గా ఉన్నాయి. ఇద్దరూ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. మహిళలను బాగా గౌరవిస్తారు. ఇద్దరూ వెరీ కైండ్ అండ్ గివింగ్. ♦ ఓ అమ్మాయికి నాన్న దగ్గర దొరికే సపోర్ట్ భర్త దగ్గర కూడా దొరికితే బాగుంటుంది... (మధ్యలో అందుకుంటూ)... మహేశ్ ఈజ్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. నాకే కాదు... మా పిల్లలకు, మా ఫ్యామిలీ అందరికీ మహేశ్ ఎంతో సపోర్ట్. పిల్లలకు, ఫ్యామిలీకి కొంచెం టైమ్ కూడా కేటాయించలేని భర్త అయితే... పరిస్థితి మరోలా ఉండేదేమో! మహేశ్ అలా కాదు. ఎప్పుడూ మాతోనే, మాకు అండగానే ఉంటాడు. ♦ ఏ అమ్మాయికైనా నాన్న అంటే స్పెషల్ లవ్ ఉంటుంది. తండ్రి అంత మంచి వ్యకి భర్తగా రావాలని కోరుకుంటారు.. మీరలా అనుకునేవారా? లేదండీ. నేనెప్పుడూ అలా అనుకోలేదు. ఎందుకంటే, మనల్ని సంతోషంగా ఉంచే వ్యక్తి మన లైఫ్ పార్ట్నర్ అయితే చాలనుకునేదాన్ని. నిజంగానే నాకలాంటి వ్యక్తే దొరికాడు. భర్త అంటే పెత్తనం చేసేవాడు.. భార్య అంటే అణిగి మణిగి ఉండాలనుకునే వ్యక్తి కాదు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్విలానే ఉండాలి. వీళ్లతో మాట్లాడకూడదు. ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు’ అనే కండిషన్లు మహేశ్ పెట్ట లేదు. నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాల్సిన పరిస్థితి రాలేదు. ♦ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా? యాక్చువల్‌గా ఎరేంజ్డ్ మ్యారేజెస్‌కి చాలా కట్టుబాట్లు ఉంటాయి. చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. ఇతరుల కోసం ఇష్టం లేని పనులు కొన్ని చేయాలి. నేను వాటికి వ్యతిరేకిని కాదు. కానీ, ఒక భార్యాభర్త సంతోషంగా ఉండాలంటే అవి ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడాలి. ఈ మూడూ ఉంటే సరిపోతుంది. ఏ భార్యాభర్త అయినా హ్యాపీగా ఉంటారు. ♦ మీరు లవ్ మ్యారేజెస్నే సపోర్ట్ చేస్తారా? అవును. బట్, నేను ఎరేంజ్డ్ మ్యారేజ్ మంచిది కాదనడం లేదు. కాకపోతే ఎక్కువగా రాజీపడాల్సి ఉంటుంది. నా ఫ్రెండ్స్‌లో చాలామందికి ఎరేంజ్డ్ మ్యారేజెస్ జరిగాయి. 50 శాతం మంది హ్యాపీగా ఉన్నారు. మిగతా 50 శాతం మంది రాజీలతో సాగిస్తున్నారు. లవ్ మ్యారేజెస్లో కూడా అలా ఉంటాయనుకోండి. నా విషయం గురించి మాట్లాడతాను. మనిషి ఎలాంటివాడో తెలుసుకోకుండా అతనితో మిగతా జీవితాన్ని పంచుకోవాలనుకోలేదు. మహేశ్ ఏంటో పూర్తిగా తెలుసుకున్నాకే నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఇవాళ మేం హ్యాపీగా ఉన్నాం. మా అమ్మానాన్నలది ఎరేంజ్డ్ మ్యారేజే. ఆ తర్వాత వాళ్లిద్దరూ లవ్‌లో పడ్డారు. జీవితాంతం హ్యాపీగా ఉన్నారు. ♦ మీ పెళ్లికి ముందు మహేశ్‌గారు, మీరు లవ్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, వాళ్ల బాధ్యతలు.. ఇదంతా ఎలా ఉంది? మా పెళ్లయి పన్నెండేళ్లు. అంతుకుముందు నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. సో.. మా బంధం మొత్తం 16 ఏళ్లు. ‘ఇట్స్ వెరీ వెరీ గుడ్’. లవర్స్‌గా ఉన్నప్పటి ఫేజ్ చాలా బాగుండేది. ఆ తర్వాత భార్యాభర్తలయ్యాం. ఆ ఫేజ్ ఎప్పుడూ సూపర్. పేరెంట్స్‌గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. 16 ఏళ్లలో వచ్చిన ఈ ఫేజ్లన్నీ స్వీట్ మెమొరీస్. ♦ మామూలుగా పెళ్లయిన ఏడేళ్లకు భార్యాభర్తల మధ్య ‘సెవన్ ఇయర్స్ ఇచ్’ స్టార్ట్ అవుతుందట.. టూ ఇంటూ సెవన్ 14 ఏళ్లు.. ఇంకా రెండేళ్లు అదనంగానే అయ్యాయి... (నవ్వుతూ). అయినా మా మధ్య ఎలాంటి ‘ఇచ్’ లేదు. ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే, రోజంతా మేం పక్క పక్కన ఉండం. మహేశ్ షూటింగ్స్‌తో బిజీగా ఉంటాడు. నాకు ఇంటి వ్యవహారాలతో సరిపోతుంది. సంవత్సరంలో మేమంతా కలిసి గడిపే రోజులను లెక్కపెడితే... ఓ మూడు నాలుగు నెలలు ఉంటామేమో. ఆ టైమ్‌ని మేం నలుగురుం చాలా హాయిగా గడుపుతాం. అందుకే అంటున్నా... ‘ఐయామ్ బ్లెస్డ్’. నాన్నకు గిఫ్ట్... సస్పెన్స్ ♦ మీ నాన్నగారు వెరీ గుడ్డా? గుడ్డా? యావరేజ్ డాడీయా? గౌతమ్: మా నాన్న వెరీ గుడ్. మా గురించి చాలా కేర్ తీసుకుంటారు. ♦ ఫాదర్స్ డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా? గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ, అదేంటో చెప్పను. సస్పెన్స్. అయితే ఐ వాంట్ టు టెల్ హిమ్ ‘హ్యాపీ ఫాదర్స్ డే’. ♦ తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీ నాన్నగారు తిడతారా? అస్సలు తిట్టరు. కూల్‌గా ఉంటారు. ♦ మీ నాన్న యాక్ట్ చేసిన వాటిలో నీకు బాగా నచ్చిన సినిమా? ‘శ్రీమంతుడు’ అంటే బాగా ఇష్టం. చాలాసార్లు చూశాను. ♦ ‘1 నేనొక్కడినే’లో మీ నాన్నతో యాక్ట్ చేసినప్పుడు ఏమనిపించింది? నాకు బాగా అనిపించింది. నాన్నతో ఇంట్లో ఉన్నా బాగుంటుంది. లొకేషన్లో ఉన్నా బాగుంటుంది. ఎక్కడున్నా బాగా అనిపిస్తుంది. ♦ మీ స్కూల్లో జరిగే ఈవెంట్స్ అన్నింటికీ మీ నాన్న హాజరవుతారా? ఇంపార్టెంట్ ఈవెంట్స్‌కి తప్పకుండా వస్తారు. ♦ నిన్ను, సితారనీ బాగా గారం చేస్తారా? చాలా చేస్తారు. ఎంత అల్లరి చేసినా తిట్టరు. మా నాన్న వెరీ వెరీ గుడ్. ♦ మరి.. అమ్మ గురించి? అమ్మ కూడా వెరీ స్వీట్. కాకపోతే సరిగ్గా చదవకపోయినా, ఎక్కువ అల్లరి చేసినా కొంచెం తిడుతుంది. ♦ సితారా... మీ నాన్న గురించి నువ్వేం చెబుతావ్? నాన్న వెరీ గుడ్. అన్నయ్య చెప్పాడు కదా. నేనూ నాన్నకి ‘హ్యాపీ ఫాదర్స్ డే’ చెబుతున్నా. నమ్రత: సితార ఇంకా చిన్న పిల్ల. క్వొశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం అంటే కష్టమే. ♦ మామూలుగా అయితే గౌతమ్కన్నా సితారే బాగా మాట్లాడుతుంది కదా.. నమ్రత: ఆ.. అవును. బిందాస్‌గా ఉంటుంది. అచ్చం నాలా. గౌతమ్ ఏమో వాళ్ల నాన్నలా కొంచెం రిజర్వ్(నవ్వేస్తూ). ♦ ఇద్దరిలో మహేశ్‌కి ఎవరు బాగా క్లోజ్? ఇద్దరూ. నేనెప్పుడూ వాళ్లతోనే ఉంటాను. మహేశ్ షూటింగ్స్‌కి వెళుతుంటాడు కదా... ఎక్కువ మిస్సవుతారు కాబట్టి, పిల్లలిద్దరికీ మనసంతా వాళ్ల నాన్న మీదే ఉంటుంది. మా నాన్న నేర్పిన విలువలే... ♦ ఫాదర్స్‌డే సందర్భంగా మీ ఫాదర్‌తో మీకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి? నమ్రత: నాన్న (నితిన్ శిరోద్కర్), నేను వెరీ వెరీ క్లోజ్. అమ్మానాన్నలకు నేను, సిస్టర్ (శిల్పా శిరోద్కర్) మాత్రమే. నేనంటే నాన్నకు చాలా ఇష్టం. మా అమ్మకు సిస్టర్ అంటే ఇష్టం. నాన్న చాలా సరదా మనిషి. ఫన్ లవింగ్ అండ్ వెరీ కైండ్! ఎప్పుడూ మమ్మల్ని చెడగొట్టేవారు. బాగా గారాబం చేసేవారు. మా అమ్మ ఏమో నాన్నపై కోప్పడేవారు. ♦ మీకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు... (ప్రశ్న మధ్యలోనే అందుకుంటూ...) ఏం లేదు. నేనే నాన్న దగ్గరకు వెళ్లి మార్కుల గురించి చెప్పేదాన్ని. ఏమీ అనేవారు కాదు. నాకు బాగా గుర్తు... 12వ తరగతిలో (ఇంటర్మీడియట్లో) మార్కులు సరిగ్గా రాలేదు. నాన్న దగ్గరకు వెళ్లి ‘సారీ’ చెప్పా. ‘నీకు పాస్ మార్కులు రాకపోతే మళ్లీ ఎగ్జామ్స్ రాయి. డోంట్ వర్రీ’ అన్నారు. నాతో నాన్న అలా ఉండేవారు. చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్... నిజంగా మేము ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మందలించేవారు. నాన్న లేని లోటు మర్చిపోయాను! ♦ మీ మామగారిలో మీ నాన్నగారిని చూసుకునేంతగా కృష్ణగారు మిమ్మల్ని చేరదీస్తారా? ఇవాళ మా నాన్నగారు లేరు. అమ్మా నాన్న చనిపోయి పదేళ్లవుతోంది. అది మాకో షాక్. మహేశ్ వల్ల ఆ బాధ నుంచి త్వరగా బయటపడగలిగా. తర్వాత తర్వాత మా మావయ్యగారు నాకు నాన్న లేని లోటుని తెలియనివ్వలేదు. ఇవాళ మావయ్యగారి గురించి ఎవరడిగినా ‘మా నాన్నగారి కన్నా ఎక్కువ’ అని చెబుతుంటాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఎవరినైనా ఇంకొకరితో పోల్చవచ్చు. కానీ, మా మావయ్యగారిని మాత్రం ఎవరితోనూ పోల్చలేం. అసలు ఆయనలా ఎవరూ ఉండరేమో. నా దృష్టిలో మా మావయ్యగారు ఎంతో ఎత్తులో ఉంటారు. నన్ను కూతురికన్నా ఎక్కువగానే చూస్తారు. ఆ మాటకొస్తే... నాది లక్కీ లైఫ్. మా ఫాదర్ సూపర్. మా ఫాదర్ ఇన్ లా సూపర్. నా హజ్జెండ్ మహేశ్ సూపర్. మహేశ్ ఈజ్ సూపర్ ఫాదర్ ఆల్సో. ♦ మీ నాన్నగారు అలా కోప్పడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? (ఆలోచిస్తూ...) ఆయనెప్పుడూ అంత సీరియస్ కాలేదు. కానీ, ఎప్పుడైనా నేను, నా సిస్టర్ మాట్లాడిన మాటలు తప్పుగా ఉంటే అప్సెట్ అయ్యేవారు. ♦ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ... అమ్మాయి హీరోయిన్ అవుతానంటే ఏ తండ్రికైనా టెన్షన్ ఉంటుంది కదా! నో... నో! ఎప్పుడూ నాన్న టెన్షన్ పడలేదు. మా నానమ్మ (మీనాక్షీ శిరోద్కర్) మరాఠీలో ప్రముఖ నటి. నాన్న సిల్వర్ స్పూన్‌తో పుట్టి పెరిగారు. ఆయనొక్కరే పిల్లాడు కావడంతో అందరూ బాగా గారాబం చేశారు. నాన్న పెరిగిందే సినిమాల్లో. ఆయనకు నటన అనేది చాలా సహజమైన విషయం. నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు నాన్న పెద్దగా ఆశ్చర్యపోలేదు. టెన్షనూ పడలేదు. ♦ పోనీ... సలహాలు ఏవైనా ఇచ్చారా? ఆయన ఆలోచనలు చాలా లిబరల్గా ఉంటాయి. అదే సమయంలో... మేము అమ్మాయిల్లాగానే ఉండాలని అనుకునేవారు. ఆయనెప్పుడూ మాతో ‘‘మీరేం చేసినా... మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. విలువలతో సంప్రదాయబద్ధంగా నడుచుకోండి. శక్తిమంతమైన మహిళగా ఉండండి’’ అని చెప్పేవారు. ‘‘మన కుటుంబానికి గానీ... ముఖ్యంగా మీకు గానీ అగౌరవాన్ని తీసుకొచ్చే ఏ పనులూ చేయవద్దు. మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు గౌరవించేలా నడుచుకోండి’’ అని నాన్న చాలాసార్లు చెప్పారు. ♦ మీరిప్పుడు మంచి హోమ్ మేకర్‌గా ఉండటానికి కారణం మీ నాన్నగారు నేర్పించిన విలువలేనా? అవును. కచ్చితంగా! అమ్మానాన్నలు ఇద్దర్నుంచి నాకు ఈ లక్షణాలు వచ్చాయి. స్పష్టంగా చెప్పాలంటే... నాన్నే. ‘‘మీరేం చేయాలనుకుంటు న్నారో... అది చేయండి. బట్, ఆల్వేస్ బీ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ విమెన్. ఏ గుడ్ హోమ్ మేకర్’’ అని నాన్న చెప్పేవారు. నువ్వో అమ్మాయివి కనుక... ఏం చేసినా సక్సెస్‌ఫుల్‌గా చేయాలనే వారు. అప్పుడే ప్రతి ఒక్కరూ గౌరవంగా, ప్రేమగా చూస్తారని చెప్పేవారు. ♦ మీరు తెలుగింటికి కోడలిగా అడుగుపెడుతున్న టైమ్‌లో నాన్న ఏవైనా సలహాలు ఇచ్చారా? అమ్మానాన్నలకు మహేశ్ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. మహేశ్, నేనూ లవ్‌లో ఉన్నప్పుడు వాళ్లు మహేశ్‌ను కలిశారు. అప్పుడే నచ్చేశాడు. మావయ్యగారిని (కృష్ణ) కూడా కలిశారు. అమ్మానాన్నలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక్కడో విషయం చెప్పాలి. మా ఇంట్లో కులమతాల పట్టింపులు లేవు. మా అమ్మానాన్నలనే కాదు... వాళ్ల తల్లిదండ్రులకు కూడా పట్టింపులు లేవు. అంటే.. అప్పటి తరంవాళ్లు అలా ఉండటం గొప్ప విషయం. ‘‘తప్పకుండా మహారాష్ట్ర వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉండకూడదు. మన క్యాస్ట్ అయ్యుండాలి’’ వంటి సమస్యలు మా ఫ్యామిలీలో ఎప్పుడూ లేవు. నేను హ్యాపీగా ఉండాలనేది అమ్మానాన్నల అభిమతం. నా విషయంలోనే కాదు... సిస్టర్ విషయంలోనూ అంతే. ప్రతి ఒక్కరూ నేర్చుకోవల్సిన పాఠమిది. – డి.జి. భవాని -
రీ ఎంట్రీ వార్తలు రూమర్స్..!
కొద్ది రోజుల కిందట సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ హడావిడి చేసింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందన్న ప్రచారం జరిగింది. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా. ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపించటంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఈ రూమర్స్‌పై స్పందించిన నమ్రత, అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేసింది. మహేష్ డేట్స్, ఎండార్సమెంట్స్ చూడటంతో పాటు పిల్లల్ని తానే చూసుకోవాలన్న నమ్రత, తనకు సినిమా చేసే టైం లేదని.. ఆ ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. పెళ్లి తరువాత నార్త్‌లో ఐశ్వర్య, సౌత్‌లో జ్యోతిక లాంటి తారలు రీ ఎంట్రీలో దూసుకుపోతుంటే నమ్రత మాత్రం ఫ్యామిలీకే అంకితమవుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న నమ్రత
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి రంగనాయక మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
మహేష్ సినిమాలో నమ్రత గెస్ట్ రోల్?
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు కిక్ ఇచ్చే వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నమ్రత గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుందట. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన నమ్రత, పెళ్లి తరువాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంజి నమ్రత చివరి సినిమా. ఇన్నేళ్ల తరువాత ఓ అతిథి పాత్రలో నమ్రత కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాలో కీలక పాత్రకు నమ్రత అయితేనే కరెక్ట్ అని భావించిన దర్శకుడు ఇప్పటికే ఆ ప్రపోజల్‌ను నమ్రత ముందు ఉంచాడట. అయితే నమ్రత తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగకీరిస్తుందా..? లేదా..? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. -
జిమ్ సెంటర్‌ను ప్రారంభించిన నమ్రత
-
ఆధునికతే అసలైన దత్తత
గ్రామాభివృద్ధిపై నమ్రత శిరోడ్కర్ బుర్రిపాలెంలోపర్యటన ప్రజల అవసరాలు తెలుసుకున్న మహేష్‌బాబు భార్య తెనాలి : గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే కేవలం రోడ్లు వేయడం, రంగులు పూయడం కాదని, ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దడం, ప్రజలను చైతన్యం చేసి భాగ స్వాములను చేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడమని ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు నమ్రత, మహేష్ సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానిక కల్యాణమండపంలో గ్రామ సర్పంచి కొండూరు సామ్రాజ్యం అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. నమ్రత మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా గుర్తింపును పొందాల్సి ఉందన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలు తొలగి వైద్య ఖర్చులు తగ్గిపోతాయని చెప్పారు. మద్యపానం, ధూమపానం సాధ్యమైనంతగా తగ్గించాలని, అక్షరాస్యతను నూరు శాతానికి చేర్చాలన్నారు. అంతా ఐక్యంగా ఉండాలని, తరచూ గ్రామసభలు నిర్వహించి, అన్ని వర్గాలను భాగస్వాములను చేసి ముందుకు నడవాలని చెప్పారు. గ్రామంలో వివిధ పనులకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని, గ్రామాభివృద్ధిని పర్యవేక్షించాలని సలహానిచ్చారు. సభకు ముందు అంగన్వాడి కార్యకర్త శ్రీలక్ష్మి, డ్వాక్రా మహిళ ఘట్టమనేని సామ్రాజ్యం, ప్రధానోపాధ్యాయుడు లలితా ప్రసాద్ ఆయా విభాగాలకు సంబంధించిన అవసరాలను ప్రస్తావించారు. వాకా పాములు సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవీ శ్రీనివాస్, తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఎంఈవో రవికాంత్, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, జెడ్పీటీసీ ఎ.జయలక్ష్మి, పాలకేంద్రం అధ్యక్షుడు చలపతిరావు, నీటిసంఘం అధ్యక్షుడు కోటా వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ప్రియబాంధవి, మార్కెట్ యార్డు డెరైక్టర్ కంచర్ల ఏడుకొండలు, పి.శ్రీనివాస్, అశోక్, డి.శారద పాల్గొన్నారు. అడుగడుగునా స్వాగతం నమ్రతకు బుర్రిపాలెం గ్రామస్తులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలు, అక్కడి కుటుంబాల వివరాలతో సహా సమగ్ర సమాచారాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పంపిన ప్రత్యేక బృందం ఇప్పటికే సేకరించింది. ఈ క్రమంలో అక్కడి ప్రజల మనోగతాన్ని, అవసరాలను స్వయంగా తెలుసుకునే నిమిత్తం నమ్రత, మహేష్‌బాబు సోదరి, జయదేవ్ భార్య పద్మావతితో కలిసి వచ్చారు. తొలుత హీరో కృష్ణ ఇంట్లో ఆయన తలిదండ్రులు ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసిన నమ్రత ఉదయం 9.30 గంటల నుంచి గ్రామంలో పర్యటించారు. వీధుల్లో నడుస్తూ.. ముందుగా కృష్ణ తల్లిదండ్రులు నిర్మించిన గీతామందిరానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఎస్సీ కాలనీకి వెళ్లి, అక్కడి చ ర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాలనీలో మహిళలను పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఘట్టమనేని నాగరత్నమ్మ పేరిట నడుస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు లలితాప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులను పలకరించారు. అక్కడి అవసరాలను తెలుసుకున్నారు. పాఠశాల ఎదుట సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అక్కడ మొక్క నాటారు. అనంతరం గ్రామంలోని కల్యాణమండపంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. మళ్లీ మహేష్‌తో వస్తా.. బాబు (మహేష్‌బాబు)కు బుర్రిపాలెం ఊరంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పారు. తనతోపాటే మహేష్ రావాల్సి ఉందని, బిజీ షెడ్యూలు కారణంగా రాలేకపోయినట్టు చెప్పారు. గ్రామస్తులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు, ఆతిథ్యానికి ధన్యవాదాలు చెబుతూ ‘మళ్లీ వస్తా.. మహేష్‌తో’ అన్నారు. తొలుత ‘అందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో మాట్లాడటం ఆరంభించిన నమ్రత కొద్దిసేపు తెలుగులోనే మాట్లాడినా.. సరిగ్గా రాదని చెబుతూ ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. దేవినేని కరుణ చంద్రబాబు ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. మహేష్‌బాబు, నమ్రత, వారి పిల్లలతో రూపొందించిన టెలీఫిలిం, 2015 ‘రిఫ్లెక్షన్స్’ పేరుతో ఎంపీ గల్లా జయదేవ్ చిత్రమాలికను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రదర్శించారు. దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమత్ర గురువారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చిన నమత్రకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నమత్రను తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. -
దుబాయ్ లో 'ప్రిన్స్' ఫ్యామిలీ!
టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు ఈసారి నూతన సంవత్సర వేడుకలను దుబాయ్ లో జరుపుకున్నారు. షూటింగ్ కు కొద్దిరోజులు విరామం ఇచ్చి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి అక్కడ కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను నమ్రత తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. తన కుమారుడు గౌతమ్ తో కలిసి ఏడారిలో దిగిన ఫోటోను ఆమె పెట్టారు. ఈ వారంలోనే మహేష్ బాబు స్వదేశానికి తిరిగిరానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. -
మలేసియాలో మహేష్ బాబు సందడి
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇప్పుడేం చేస్తున్నాడు? సినిమాలకు కాస్తంత విరామం ఇచ్చి, తన భార్య, పిల్లలతో హాయిగా మలేసియాలో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా రోజులుగా సినిమాల్లో బిజీగా గడపడంతో కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోయిన ఈ హీరో, ఇప్పుడు పూర్తి సమయాన్ని వాళ్లకే అంకితం చేశాడు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారలను తీసుకుని మలేషియా వెళ్లాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే తదుపరి చిత్రం షూటింగ్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌ను కుటుంబానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. మహేష్ వచ్చేలోపు మిగిలిన నటులతో మరికొన్ని ముఖ్యమైన సీన్లను దర్శకుడు పూర్తి చేస్తున్నారని సినిమా వర్గాలు చెప్పాయి. కొరటాల శివతో మహేష్ బాబు చేస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, క్యారెక్టర్ నటుడు జగపతి బాబు కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'మగాడు' అని పేరు పెట్టినట్లు కథనాలు వచ్చాయి. -
నేనొక్కడినే ఆడియో: ఫ్యామిలీతో మహేశ్