
సాక్షి, విజయవాడ: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతకు నోటీసులు జారీ చేసింది. సరోగసి చిన్నారుల అక్రమ విక్రయంపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్.. బినామీ పేర్లతో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ హాస్పిటల్స్ నిర్వహించినట్లు నిర్ధారించింది. నమ్రతపై చర్యలపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment