Medical counselling
-
3.16 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ కన్వీనర్ సీటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా నీట్లో ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీటు లభించింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మొదటి విడత జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న కన్వీనర్ సీట్లలో దాదాపు 4,760 సీట్లను విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. ఏ కాలేజీలో ఏ ర్యాంకుకు ఎవరికి సీట్లు వచ్చాయో విద్యార్థులకు సమాచారం పంపించింది. గతేడాది అత్యధికంగా నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఒక ఎస్సీ విద్యార్థికి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు లభించగా.. ఈసారి బీసీ ఏ కేటగిరీలోనే 3,16,657 ర్యాంకర్‌కు సీటు లభించడం విశేషం. గత ఏడాది మొదటి విడతలో 1.31 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈసారి మొదటి విడతలో 1.65 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. బీసీ బీ కేటగిరీలో గతేడాది మొదటి విడతలో 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.94 లక్షల ర్యాంకర్‌కు సీటు లభించింది. అలాగే గతేడాది బీసీ డీ కేటగిరీలో 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.80 లక్షల ర్యాంకర్‌కు వచ్చింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్ జరగనుంది. బీసీ ఈ కేటగిరీలో ప్రస్తుతం 2.03 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఎస్సీ కేటగిరీలో 2.90 లక్షల ర్యాంకుకు, ఎస్సీ కేటగిరీలో 2.87 లక్షల ర్యాంకుకు సీటు లభించడం గమనార్హం. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో దివ్యాంగ రిజర్వేషన్ కింద 13.41 లక్షల ర్యాంకుకు సీటు లభించింది. ఇలావుండగా జాతీయ స్థాయిలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారికి కూడా మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అంటున్నారు.పెరిగిన సీట్లతో విస్త్రృత అవకాశాలురాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీలు పెరిగాయి. అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లోనూ సీట్లు పెరిగాయి. దీంతో అధిక ర్యాంకర్లకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 64 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో మల్లారెడ్డికి చెందిన రెండు, నీలిమ మెడికల్ కాలేజీలు డీమ్డ్ వర్సిటీలయ్యాయి. వీటితో పాటు ఎయిమ్స్ మెడికల్ కాలేజీని మినహాయించి 60 మెడికల్ కాలేజీల్లోని సీట్లకు ఇప్పుడు కన్వీనర్ కోటా కింద సీట్ల కేటాయింపు జరిపారు. 2024–25 వైద్య విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా అదనంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
సర్వీస్ కోటా సీట్లు ఆంధ్రా వైద్యులకే పరిమితం కాదు
సాక్షి, అమరావతి: మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని భాగాలను హైకోర్టు రద్దుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ డాక్టర్లకు ప్రభుత్వ కోటా కింద 50 శాతం, క్లినికల్ 30 శాతం, నాన్ క్లినికల్ 50 శాతం సీట్లను కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సర్వీస్ కోటాను కేవలం ఏపీలో పనిచేస్తున్న వైద్యులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదంది. ఇది ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 95కు విరుద్దమని చెప్పింది. తెలంగాణలో పనిచేస్తున్న వైద్యులు కూడా ఏపీలో ఇన్‌సర్వీస్ స్థానిక లేదా ఇన్‌సర్వీస్ స్టానికేతర ప్రభుత్వ కోటాకు అర్హులని స్పష్టం చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం అధికరణ 371డి కింద కల్పించిన ప్రయోజనాలన్నీ పదేళ్లు అమల్లో ఉంటాయని, అందువల్ల ప్రస్తుత కేసులో పిటిషనర్లు ఏపీ ప్రభుత్వ ఇన్‌సర్వీస్ కోటాకు అర్హులవుతారని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ డాక్టర్లకు ప్రభుత్వ కోటా కింద 50 శాతం, క్లినికల్ 30 శాతం, నాన్ క్లినికల్ 50 శాతం సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు వైద్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యా లపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున ఎం.ఆర్.కె.చక్రవర్తి, తిరుమలరావు, ప్రభుత్వం తరఫున అపాధర్‌రెడ్డి వాదించారు. -
సృష్టి ఆసుపత్రి కేసు:. డాక్టర్ నమ్రతకు నోటీసులు
సాక్షి, విజయవాడ: సృష్టి ఆసుపత్రి అక్రమాలపై ఏపీ మెడికల్ కౌన్సిల్ విచారణను వేగవంతం చేసింది. ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులను విక్రయించారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డాక్టర్ నమ్రత అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ నమ్రతకు నోటీసులు జారీ చేసింది. సరోగసి చిన్నారుల అక్రమ విక్రయంపై ఇప్పటికే సుమోటోగా స్వీకరించిన మెడికల్ కౌన్సిల్.. బినామీ పేర్లతో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ హాస్పిటల్స్ నిర్వహించినట్లు నిర్ధారించింది. నమ్రతపై చర్యలపై ఎథిక్స్ కమిటీకి ఏపీ మెడికల్ కౌన్సిల్ సిఫార్సు చేసింది. -
వైద్య రిజర్వేషన్లపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జీవో 550 ప్రకా రం రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లో కొంత మేరకు వైఫల్యం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం ఆయా వర్గాలకు అన్యాయం జరిగిందంటూ సర్కారుకు అనేక ఫిర్యాదులు రావడంతోపాటు దీనిపై బీసీ సంఘాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు విన్నవించాయి. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశిం చారు. జీవో 550 ప్రకారం రిజర్వేషన్ల అమలు జరిగిందా లేదా అనే అంశంపై ఆ శాఖ విచారణ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 30 నుంచి 40 ఎంబీబీఎస్ సీట్లల్లో అన్యాయం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి తెలిపారు. దీంతో 3, 4వ విడత కౌన్సెలింగ్‌ల్లో తప్పును సరిదిద్దుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీకి సూచించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడేం చేయాలని వర్సిటీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే తాము అంతా నిబంధనల ప్రకారమే చేసినట్లు వర్సిటీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆరోగ్య శాఖ వర్సెస్ ఆరోగ్య వర్సిటీ.. రిజర్వేషన్ల అమలు తీరుపై వైద్య ఆరోగ్యశాఖకు, ఆరోగ్య వర్సిటీ మధ్య తీవ్రమైన అగాథం నెలకొంది. రిజర్వేషన్లను సరిగ్గానే అమలు చేశామన్న వర్సిటీ అభిప్రాయాన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఏకీభవించడంలేదు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌ల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులను జనరల్ కోటాలో లెక్కించాల్సింది పోయి రిజ ర్వేషన్ల కిందకు తీసుకొచ్చారని, దీంతో అనేకమంది రిజర్వేషన్ సీట్లు కోల్పోయారని విమర్శలు వచ్చాయి. జనరల్‌లో సీట్లు వచ్చే అవకాశమున్న రిజర్వేషన్ విద్యార్థులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయకూడదని 550 ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నప్పటికీ వర్సిటీ పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదులు అందాయి. అలాగే ఓపెన్ కాంపిటీషన్లో సీటు సాధించిన రిజర్వేషన్ విద్యార్థి కాలేజీ ఆప్షన్ మార్చుకొని మరో కాలేజీకి వెళ్తే.. ఆ సీటును అదే కేటగిరీకి చెందిన వారికి ఇవ్వాలనీ ఉత్తర్వులో ఉందని అంటున్నారు. కానీ ఆ ప్రకారం జరగలేదని విమర్శలు వచ్చాయి. ఇప్పటివరకు మొదటి, రెండు విడతల సందర్భంగా 2,487 సీట్లకు కౌన్సెలింగ్ జరిగింది. అయితే వర్సిటీ మాత్రం ఓపెన్ కేటగిరీలో 1,244 మందికి, రిజర్వేషన్ కేటగిరీలో 1,243 మందికి సీట్లు ఇచ్చామని తెలిపింది. మొదటి కౌన్సెలింగ్‌లో ఓపెన్ కేటగిరీలో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మంచి కాలేజీ కోసం రెండో కౌన్సెలింగ్ కోసం వేచి చూశారని, దీంతో వారి సీట్లను తిరిగి ఆయా వర్గాలకే కేటాయించినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జీవో 500 ప్రకారం ఇక్కడ సక్రమంగా జరగలేదని సంఘాలు, వైద్య ఆరోగ్యశాఖలోని కీలకమైన వ్యక్తులు భావించడంలేదు. దాదాపు 30 నుంచి 40 సీట్లల్లో రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంతేకాదు వర్సిటీ అధికారులు జీవో 550ను తమకు నచ్చినట్లుగా అర్థంచేసుకున్నారని కూడా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలక వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనిపై ఆరోగ్య వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. తమపై బురద జల్లేం దుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. మూడో విడత ఆలస్యం.. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత కన్వీనర్ కోటాలో ఇంకా 160 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. వాటితోపాటు జాతీయ కోటాలో మిగిలిపోయి రాష్ట్రానికి వచ్చిన 67 సీట్లు, అగ్రవర్ణ పేదల (ఈడబ్య్లూఎస్)కు కేటాయించిన 190 సీట్లకు ఇప్పుడు మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందన్న వాదనల నేపథ్యంలో మూడో విడత కౌన్సెలింగ్ ఆలస్యం అయ్యే సూచనలున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఏపీకి మరో తీపి కబురు
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలలకు ఒక్కసారిగా 460 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో అదనపు సీట్లు రావడం ఇదే తొలిసారని, ఈ సీట్లన్నీ ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్ నుంచే అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో అనంతపురం వైద్యకళాశాలలో 50 సీట్లు, శ్రీకాకుళం రిమ్స్‌లో 50 సీట్లు పెరిగాయి. మిగతా 360 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద మంజూరయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం ప్రభుత్వ సీట్లు 1,900 ఉండగా, అనంత, శ్రీకాకుళం సీట్లతో కలిపి 2 వేలకు చేరాయి. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 11 వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 2,360కి చేరింది. పద్మావతి మహిళా వైద్యకళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వైద్య విద్య ఖరీదైనదని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా 460 సీట్లు రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయి రెండో కౌన్సిలింగ్ మొదలు కాబోతోంది. కానీ ఇప్పటివరకూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సీట్ల భర్తీ జరగలేదు. ఈ వ్యవహారంపై కొంత సందిగ్ధత నెలకొని ఉండడంతో న్యాయ సలహాకు పంపించామని, నేడో రేపో స్పష్టత వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. -
ఎవరిది లోపం?
గర్భం రాకపోవడానికి స్త్రీ, పురుషులలో ఎక్కువ బాధ్యత లేదా లోపం ఎవరిదై ఉంటుంది? లోపాల విషయానికి వస్తే ఇద్దరిదీ సమానబాధ్యత ఉంటుందా? ఫెల్లోపియన్ ట్యూబుల్లో వచ్చే సమస్యలు కూడా గర్భం రాకపోవడానికి కారణం అంటుంటారు. దీని గురించి వివరించగలరు. – టి.ఎన్., గుంటూరు ఆడవారిలో సమస్యల వల్ల, 35% మగవారిలో సమస్యల వల్ల, 30% ఇరువురిలో సమస్యలు ఉండడం వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మగవారిలో శుక్ర కణాలు తక్కువ ఉండటం, అసలు లేకపోవటం, వాటి నాణ్యత, కదలిక సరిగా లేకపోవటం, హార్మోన్ల లోపం, జన్యు లోపం, ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల సంతానం కలగకపోవటానికి కారణాలు కావచ్చు. ఆడవారిలో హార్మోన్ల లోపం, అండం తయారు కాకపోవటం, అండం నాణ్యత సరిగా లేకపోవటం, గర్భాశయంలో లోపాలు, గడ్డలు, ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకొనిపోవటం, ఇన్ఫెక్షన్లు వంటివి... ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల సంతానం కలగడానికి ఇబ్బంది అవుతుంది. 30% మందిలో భార్య, భర్త ఇద్దరిలోను సమస్యలు, ఇంకా పరిశోధనలలో కూడా తెలియని ఎన్నో కారణాల వల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి సంతానం కలగనప్పుడు దంపతులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆడవారిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల గర్భాశయం ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్లలో వాపు, అడ్డంకులు ఏర్పడి, అవి మూసుకొనిపోవటం జరగవచ్చు. ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల అండం, వీర్యకణాలు ట్యూబ్‌లోకి ప్రవేశించలేకపోవటం, రెండూ ఒకటి కాలేకపోవటం వల్ల గర్భం ధరించటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.ఫెలోపియన్ ట్యూబ్స్ తెరుచుకుని ఉన్నాయా, మూసుకొని ఉన్నాయా తెలుసుకోవటానికి హిస్టరోసాల్పింగో గ్రామ్ (హెచ్ఎస్జీ) అనే ఎక్స్–రే పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ట్యూబ్స్ మూసుకొని ఉంటే, ల్యాపరోస్కోపి ద్వారా సరిచేయడానికి ప్రయత్నం చేయవచ్చు. నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. ఏ చిన్న జోక్ చెప్పినా విపరీతంగా నవ్వుతుంటాను. మావారు నన్ను రకరకాల జోక్స్ చెప్పి నవ్విస్తుంటారు. అయితే ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో గట్టిగా నవ్వడం సరికాదని ఇంట్లో పెద్దలు చెబుతున్నారు. ఇది నిజమేనా? – ఆర్వి, కాజీపేట గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపితే అంతే ఆరోగ్యంగా బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదుగుతుంది. అలాగే తల్లి కూడా మానసిక ఆందోళన లేకుండా, తొమ్మిది నెలలు తేలికగా గడిచిపోతాయి. ప్రెగ్నెన్సీలో గట్టిగా నవ్వకూడదని ఎక్కడా లేదు. ఆరో నెల నుంచి కడుపులో బిడ్డ బయట శబ్దాలను వినగలుగుతుంది. అలాగే మీ మానసిక పరిస్థితి బిడ్డ ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది. గట్టిగా నవ్వడం వల్ల, కడుపులో బిడ్డ కూడా పైకి, కిందకి కదులుతుంది. గట్టిగా నవ్వడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఇవి మనసుని, శరీరాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. అవయవాలకి రక్త సరఫరా పెరుగుతుంది. అలాగే బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకి దోహదపడుతుంది. కాబట్టి నువ్వు గట్టిగా నవ్వడాన్ని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నీకు ఎలా నవ్వాలనిపిస్తే అలా నవ్వుకోవచ్చు. దానివల్ల నీకు, పుట్టబోయే బిడ్డకి ఇద్దరికీ మంచిదే! నగరాల్లో నివసించే గర్భిణి స్త్రీలు gestational diabetes అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఈమధ్య చదివాను. దీని గురించి వివరించండి. ఇది రాకుండా ముందుజాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? – ఆర్.ఎన్., తాడిపత్రి గర్భిణీల రక్తంలో చక్కెర శాతం ఉండాల్సిన దాని కంటే పెరగడాన్ని gestational diabetes అంటారు. ప్రెగ్నెన్సీలో కొందరి శరీర తత్వాన్ని బట్టి, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, ముందు నుంచే బరువు అధికంగా ఉండటం, తల్లిదండ్రులలో షుగర్ వ్యాధి ఉండటం, ప్రెగ్నెన్సీ సమయంలో బరువు అధికంగా పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం... వంటి అనేక కారణాల వల్ల gestational diabetes వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. gestational diabetesనగరాల్లో ఉండే గర్భిణీలలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో ఉండే గర్భిణీలలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నగరాలలో ఉండే కొంతమంది గర్భిణీలలో వారిలో ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల, ఎక్కువ శారీరక శ్రమ చెయ్యకపోవటం వల్ల, అధిక బరువు ఉండటం వల్ల నగరాలలో ఉండే గర్భిణీలలో gestational diabetesఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న మహిళలు, గర్భం రాకముందే బరువు తగ్గటం, గర్భం వచ్చిన తర్వాత ఆహారంలో స్వీట్స్, షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు, పండ్లలో అరటిపండు, సపోటా వంటివి తక్కువగా తీసుకోవటం, అధిక బరువు పెరగకుండా అన్నం తక్కువ తిని, కూరలు ఎక్కువ తీసుకోవటం, చిన్న చిన్న పనులు, కొద్దిగా వాకింగ్ వంటివి చేయడం వల్ల చాలావరకు gestational diabetesని కొందరిలో నివారించవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల వచ్చేgestational diabetesని నివారించలేక పోవచ్చు. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, తక్కువ మోతాదులో మందులతో gestational diabetes అదుపులో ఉంటుంది. అలాగే దానివల్ల వచ్చే సమస్యలు పెరగకుండా, కాంప్లికేషన్స్ ఎక్కువ కాకుండా బయటపడవచ్చు. -
మెడికల్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
-
మెడికల్ ప్రవేశాలకు 7 వరకు గడువు
- తెలంగాణ విజ్ఞప్తి మేరకు సడలింపునిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం - నేడు మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వచ్చే నెల 7వ తేదీ నాటికి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ, తిరిగి పరీక్షలు నిర్వహించడంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆల స్యమైంది. దీంతో ప్రవేశాల గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ కూడా తమ రాష్ట్రంలోనూ గడువు పొడిగించాలని మరో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, ప్రవేశాలకు నెల రోజులు గడువు పొడిగించాలని తెలంగాణ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఇరు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్లకు హాజరయ్యే అవకాశమున్నందున.. ఏపీలోనూ గడువు పొడిగించాలని ఆ రాష్ట్ర న్యాయవాది అభ్యర్థించారు. ప్రవేశాల గడువు పొడిగించేందుకు భారత వైద్య మండలి (ఎంసీఐ) అభ్యంతరం తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం... మెడికల్ ప్రవేశాల గడువును అక్టోబర్ 7లోగా పూర్తి చేసుకోవచ్చని సూచించింది. ఇక ఏపీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పొందేందుకు అవకాశం కల్పించే ఓపెన్ కోటా సీట్ల భర్తీకి మాత్రం 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే ఏపీలో మెడికల్ కాలేజీల్లోని ఓపెన్ కోటా సీట్లలో ప్రవేశాలకు మాత్రమే ఈ గడువు వర్తిస్తుంది. నేడు మూడో కౌన్సెలింగ్ తెలంగాణలో ఇప్పటికే రెండు విడతల మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండో కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు బుధవారం వారికి కేటాయించిన కాలేజీల్లో చేరారు. ఇంకా ఎవరైనా చేరకపోతే ఖాళీగా ఉండిపోయే సీట్లు, కొత్తగా అనుమతి వచ్చిన మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీలోని 75 కన్వీనర్ కోటా సీట్లకు గురువారం మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించి, శుక్రవారం సీట్లు కేటాయిస్తామని కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీలో మిగిలిన సీట్లకు, మల్లారెడ్డి కాలేజీలోని బీ కేటగిరీ సీట్లకు 30వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
మెడికల్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిలింగ్ విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ 7 వరకు పొడిగిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్‌ను మరో నెల రోజులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణకు గడువు పెంచితే తమకు సమయం ఇవ్వాలని ఏపీ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ మేనేజ్మెంట్ అసోషియేషన్స్ కోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నెల రోజుల గడువు పెంచేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ అక్టోబర్ 7 వరకు పొడిగించింది. -
24వేల ర్యాంక్ కార్డును 13వేలుగా మార్ఫింగ్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3లో ఆ యువతికి 24 వేల ర్యాంకు వచ్చింది. కానీ తనకు 13వ ర్యాంకు వచ్చిందంటూ వాదించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మెడికల్ కౌన్సిలింగ్ లో భాగంగా శనివారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమైంది. తెలంగాణలోని ఐదు కేంద్రాల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థినీ విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలోని దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కౌంటర్ లో ఓ యువతి గందరగోళం సృష్టించింది. ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక యువతి ఎంసెట్ 3లో తనకు 13వ ర్యాంకు వచ్చిందని ర్యాంక్ కార్డును అధికారులకు చూపించింది. అయితే ఆ ర్యాంక్ కార్డును మార్ఫింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు అనుమానంతో పేరు, ఇతర వివరాలను పరిశీలించగా ఆమె అసలు ర్యాంక్ 24 వేలు అని వెల్లడైంది. కానీ ఆ యువతి మాత్రం తన వాదనను అలాగే కొనసాగించడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. 'ఒక యువతి ఏడుస్తూ వచ్చి తనకు 13వ ర్యాంకే వచ్చిందని అలజడి చేయబోయింద'ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ వ్యవహారంపై జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తప్పుడు ర్యాంక్ కార్డును చూపిన విద్యార్థినిపై కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు. -
జూలై రెండో వారంలో మెడికల్ కౌన్సెలింగ్
- ఈ ఏడాది నుంచి వెబ్ కౌన్సెలింగ్ - ఏపీ, తెలంగాణకు ఒకేసారి మెడికల్ కౌన్సెలింగ్ - కన్వీనర్ కోటాలోకి మరో 200 సీట్లకు అవకాశం! విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : ఎంసెట్ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై రెండో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మాదిరిగానే తొలుత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తామని, అనంతరం వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. అన్‌రిజర్వుడ్ మెరిట్ (నాన్‌లోకల్), లోకల్ సీట్ల భర్తీచేయాల్సిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు వే ర్వేరుగా దాదాపు ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఏపీలో ఈ ఏడాది ప్రైవేటు మెడికల్ కళాశాలలైన విశ్వభారతి మెడికల్ కళాశాల (కర్నూలు)లో 100 సీట్లు, అనీల్ నీరుకొండ ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల (విశాఖపట్నం)లో 150 సీట్లు, మహారాజా మెడికల్ కళాశాల (విజయనగరం )లో 150 సీట్లకు, అలాగే మైనార్టీ కళాశాలైన ఫాతిమా మెడికల్ కళాశాల(కడప)లో 100 సీట్లకు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ సీట్ల అనుమతి కోసం ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. పై కళాశాలలకు ఈ ఏడాది ఎంసీఐ అనుమతి లభిస్తే అదనంగా కన్వీనర్ కోటా కింద 200 (ఎ-కేటగిరీ సీట్లు) అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సీట్లకు ఢోకా లేదని తెలిపారు. జూలై 24న జరిగే నీట్ ఫలితాల విడుదల అనంతరం ప్రైవేటు కళాశాలల్లోని బి-కేటగిరీ (యాజమాన్య) కోటా సీట్ల భర్తీ భర్తీ చేస్తామన్నారు. అమెరికాకు వైస్ చాన్సలర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు సెలవుపై గురువారం అమెరికాకు వెళుతున్నట్లు తెలిపారు. డీఎంఈ డాక్టర్ సుబ్బారావు ఇన్చార్జి వీసీగా వ్యవహరించనున్నారు. జూలై 17వ తేదీ వరకు వీసీ సెలవు పెట్టారు. -
అలా చేస్తేవారిని బ్లాక్ లిస్ట్‌లో పెడతాం:కామినేని
-
మెడికల్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌కు జెఎన్టీయూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. బుధవారం రవిరాజు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ఎంసెట్ రాసినా రెండు రాష్ట్రాల విద్యార్థలు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చునని తెలిపారు. 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ఇప్పటికే వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్‌ను అప్లోడ్ చేశామని చెప్పారు. వాటిని పరిశీలించుకుని ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. మెడిసెట్ ర్యాంకుల ప్రకారమే సీట్లు భర్తి చేస్తున్నట్లు రవిరాజు వివరించారు. -
జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్
-
జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్
హైదరాబాద్: వైద్య కళాశాలల్లో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేఎన్టీయూ కళాశాలను ముట్టడించారు. బుధవారం నుంచి జేఎన్‌టీయూలోమెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అయితే, ఇటీవల ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజును పెంచిన విషయం విదితమే. ధనికులకు మాత్రమే వైద్య విద్య అందేలా ప్రభుత్వ విధానం ఉందని ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ శ్రేణులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో అధికారులు కౌన్సిలింగ్ ను నిలిపివేశారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే నిలిచిపోయినట్టు కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
ప్రారంభమైన మెడికల్ కౌన్సెలింగ్
హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం మెడికల్ తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నేడు 1 నుంచి 1000 ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో జేఎన్టీయూ, ఓయూ, కేయూలో అధికారులు కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌన్సెలింగ్ వచ్చే నెల 6 వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో జరిగే ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్‌ను తెలంగాణలో వరంగల్, హైదరాబాద్‌లోని మూడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని ఏ కేటగిరీలో ఉన్న మొత్తం 50 శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్ కింద భర్తీ చేస్తారు. తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లోని 1,550 ఎంబీబీఎస్, 606 దంత వైద్య సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి జేఎన్టీయూ, ఉస్మానియాలోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లోని కాకతీయవర్సిటీలో, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి నిర్వహిస్తారు. -
రేపట్నుంచే మెడికల్ కౌన్సెలింగ్
ఆగస్టు 6 దాకా నిర్వహణ ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 50 శాతం సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసిన వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నుంచి ఆగస్టు 6 దాకా కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జేఎన్టీయూ-ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని కన్వీనర్ కోటా కింద కలిపి 50 శాతం సీట్లకు ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 850, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ‘ఎ’ కేటగిరీలోని 725 కలిపి మొత్తం 1,575 సీట్లను ఇందులో భర్తీ చేస్తారు. బీడీఎస్‌లో ప్రభుత్వ కాలేజీల్లోని 100 సీట్లు, ఆర్మీ కాలేజీలోని 40, ప్రైవేటులోని ‘ఏ’ కేటగిరీకి చెందిన 500... ఇలా మొత్తం 640 సీట్లను భర్తీ చేస్తారు. హైదరాబాద్‌లో కూకట్పల్లి జేఎన్టీయూ, ఉస్మానియా క్యాంపస్‌లోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లో కాకతీయ వర్సిటీలో, విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి బుధవారం (29) నుంచి 31వ తేదీ దాకా; రెండు, మూడు దశల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి 3వ తేదీ దాకా కౌన్సెలింగ్ ఉంటుంది. -
మెడికల్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు
-
29 నుంచి తెలంగాణలో మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (లబ్బీపేట): తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 1525 ఎంబీబీఎస్, 1140 బీడీఎస్ సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ చెప్పారు. బుధవారం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కౌన్సెలింగ్ వివరాలను తెలిపారు. 29న ఉదయం ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం జనరల్ కేటగిరి అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రారంభమై 30, 31 తేదీల్లో కూడా కొనసాగుతుందన్నారు. ఆగస్టు 1,2,3 తేదీల్లో రిజర్వేషన్ కేటగిరి (ఎస్సీ, ఎస్టీ, బీసీ) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 4న సీఏపీ (ఆర్మీ), 5న ఎన్సీసీ, స్పోర్ట్స్‌అండ్ గేమ్స్, పోలీస్ అమర వీరుల పిల్లలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ, మసాబ్‌ట్యాంక్‌లోని ఓ కళాశాల, వరంగల్‌లోని వైద్య కళాశాల, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మెడికల్ కౌన్సిలింగ్ విషయమై ఈ నెల 13న జరగనున్న ఉన్నత విద్యాశాఖ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత
-
మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత
* తెలంగాణలో 29 నుంచి ప్రారంభం * ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 6 నుంచి మొదలయ్యే అవకాశం * ఒకట్రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం * తెలంగాణ కళాశాలలకు హైదరాబాద్, వరంగల్, విజయవాడల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మెడికల్ కౌన్సెలింగ్‌పై స్పష్టత వచ్చింది. తొలుత తెలంగాణలో ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ఏపీలో మెడికల్ కౌన్సెలింగ్ మొదలుపెట్టాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 30లోగా అన్ని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కావాలన్నది భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) నిబంధన . ఈ నేపథ్యంలో తొలుత తెలంగాణలోని వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం ఉంటాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులతోపాటు తెలంగాణ ఉన్నత విద్యామండలి, వైద్యవిద్యా శాఖ అధికారుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొన్నటివరకు 2,950 ఎంబీబీఎస్ సీట్లుండగా, ఇటీవలే మల్లారెడ్డి వైద్య కళాశాలలకు సంబంధించి 300 సీట్ల రెన్యువల్‌కు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. దీంతో సీట్లు 2,650కి తగ్గాయి. ప్రభుత్వకళాశాలల్లో 850 సీట్లుండగా, ప్రైవేటు కాలేజీల్లో 1,800 సీట్లున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న 1,800 సీట్లలో 900 సీట్లను కన్వీనర్ కోటా కింద వర్సిటీయే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. అంటే మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లతోపాటు డెంటల్ సీట్లను 29 నుంచి జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఏపీలో కౌన్సెలింగ్‌పై 2 రోజుల్లో స్పష్టత తెలంగాణ కళాశాలలకు సంబంధించి 29 నుంచి కనీసం ఐదు రోజులపాటు కౌన్సెలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఆగస్టు మొదటి వారంలో, వీలైతే 6వ తేదీ నుంచి ఏపీలోని వైద్యసీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరపాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం విజయవాడ, తిరుపతిల్లో కౌన్సెలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో కేంద్రం పెట్టాలా వద్దా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీలోని మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేటుకాలేల్లో 1,950 సీట్లుండగా ఇందులో 975 (50 శాతం) సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. మొత్తం 2,725 ఎంబీ బీఎస్, డెంటల్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేటు కళాశాలల్లోని మిగతా 50 శాతం ఎంబీ బీఎస్ సీట్లు.. అంటే 975 సీట్లలో 685 సీట్లను (మొత్తం సీట్లలో 35 శాతం) మేనేజ్మెంట్ కోటా కింద (ఎంసెట్ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా), సుమారు 268 సీట్లను(మొత్తం సీట్లలో 15 శాతం) ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేస్తారు. రెండు రాష్ట్రాల కౌన్సెలింగ్ పూర్తయ్యాక యాజమాన్య కోటాను భర్తీ చేస్తారు. యాజమాన్య కోటా సీట్ల ర్యాంకులపై కసరత్తు ఏపీలోని 35 శాతం (మేనేజ్మెంట్ కోటా) సీట్లకు జరిగిన ఎంసెట్ ఏసీ (అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ర్యాంకులపై కసరత్తు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. రెండు రాష్ట్రాల్లో ప్రభు త్వ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తి కాగానే ఈ సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. ప్రైవేటు యాజమాన్యాలతో పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఉంటుంది. - డాక్టర్ రవిరాజు, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇరు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు కోటా తెలంగాణ ఏపీ ప్రభుత్వ కళాశాలల్లో... 850 1,750 ప్రైవేటు కళాశాలల్లో... 1,800 1,950 ఇందులో కన్వీనర్ కోటా (50%) 900 975 -
20 తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: జూలై 20వ తేదీ తర్వాత మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ పాపిరెడ్డి, వైద్య విద్య సంచాలకులు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తదితరులు హాజరయ్యారు. వచ్చేనెల 15 వరకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) కొత్త కాలేజీలు, సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు సమయం ఉన్నందున కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను 20వ తేదీ తర్వాతే విడుదల చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సహకారంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో రెండు, వరంగల్, విజయవాడల్లో ఒక్కో కేంద్రం చొప్పున 4 కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేకంగా నిర్వహించిన ఎం-సెట్ కౌన్సెలింగ్‌ను పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం ఒక ప్రతినిధిని నియమించిందన్నారు. ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్‌ను ప్రతినిధిగా నియమించనున్నట్లు తెలిసింది. -
మెడికల్ కౌన్సెలింగ్ ఏదీ?
* ఎంబీబీఎస్ ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని సర్కారు * ఇప్పటికీ ఏర్పాట్లపై దృష్టిసారించని వైద్యారోగ్యశాఖ * ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని వైనం.. ఆందోళనలో విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారైనా మెడికల్ కౌన్సెలింగ్‌పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు ఇది తమకు సంబంధించిన అంశం కాదన్నట్లుగా వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ తేదీలను, స్థలాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత తమదన్న ఆలోచన కూడా వైద్యారోగ్యశాఖకు లేకపోవడం గమనార్హం. అసలు ఓ ఉన్నతాధికారి అయితే ఇది ఉన్నత విద్యామండలి తీసుకోవాల్సిన నిర్ణయంగా చెబుతుండటం గమనార్హం. మరోవైపు మెడికల్ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించిన కళాశాలలు తూతూమంత్రంగా కౌన్సెలింగ్ నిర్వహించి, ఇప్పటికే సీట్లు కొనేసుకున్నవారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మొత్తంగా అటు ప్రభుత్వ సీట్లు.. ఇటు ప్రైవేటు సీట్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌పై స్తబ్దత నెలకొంది. ఎవరి ఆధ్వర్యంలో.. తెలంగాణలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 1,750 సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని ‘ఏ’ కేటగిరీ సీట్లలో 50 శాతాన్ని ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. ‘బీ’ కేటగిరీలో 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేకంగా ప్రైవేటు ఎం-సెట్ నిర్వహించారు. వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ జరిపి సీట్లు భర్తీ చేస్తారు. మిగతా 15 శాతం సీట్లను ఎన్నారై కోటా కింద ప్రైవేటు యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి. ఎంసెట్ మెడికల్ విభాగానికి 92 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 14న పరీక్ష నిర్వహించి, అదే నెల 27న ఫలితాలు ప్రకటించారు. ఇది జరిగి దాదాపు నెల రోజులు కావస్తున్నా.. వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. అసలు తెలంగాణ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశంలోనూ స్పష్టత లేదు. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినా ఇప్పటివరకు రిజిస్ట్రార్‌ను కానీ, కార్యనిర్వాహక మండలిని కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. అయితే పీజీ కౌన్సెలింగ్‌లో తమకు అన్యాయం జరిగిందని అప్పట్లో తెలంగాణ వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏపీలో జరిపితే అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌పై స్పష్టత ఇవ్వాలని.. విజయవాడలో నిర్వహించాలని భావిస్తే, అందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
20 నుంచి రెండో విడత వైద్య కౌన్సెలింగ్
విజయవాడ: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 20 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. బాబూలాల్ తెలిపారు. తొలి విడత మాదిరిగానే హైదరాబాద్ జేఎన్టీయూ, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీల్లోని ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఈ నెల 19న స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్(ఎన్సీసీ/ఆర్మీ/పీఎంసీ/వికలాంగ) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అభ్యర్థుల కౌన్సెలింగ్‌లో ఉదయం 9 గంటలకు పీఎంసీ అభ్యర్థులకు, 9.30కు వికలాంగ అభ్యర్థులకు, 10.30కు ఎన్సీసీ అభ్యర్థులకు, మధ్యాహ్నం 1 నుంచి ఆర్మీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతుంది. -
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం
విజయవాడ/విశాఖపట్నం/ తిరుపతి: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. సీటు తీసుకున్నాక రద్దు చేసుకునే విద్యార్థులు రూ.లక్ష చెల్లిస్తేనే ఒరిజనల్ సర్టిఫికెట్లు ఇస్తామని ఈ ఏడాది నిబంధన విధించారు. తొలి రోజు కౌన్సెలింగ్ రాత్రి 10.50 గంటలకు ముగియగా, 1,325 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి రోజు 1,361 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ కేంద్రంలో 569 మంది, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో 76, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 324, ఆంధ్ర యూనివర్సిటీలో 164, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో 228 మంది హాజరయ్యారు. మొదటి ఇద్దరు ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తొలి సీటును హైదరాబాద్ జేఎన్టీయూ కౌన్సెలింగ్ కేంద్రంలో 3వ ర్యాంకర్ కె.పృథ్వీరాజ్‌కు కేటారుుంచారు. 5వ ర్యాంకర్ వి.మనోజ్ఞితరెడ్డి కూడా జేఎన్టీయూలోనే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరిద్దరికీ ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చాయి. 4వ ర్యాంకర్ దారపనేని హరితకు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు లభించింది. 6, 7, 8, 9, 10, 11వ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు గైర్హాజరయ్యారు. వీరంతా ఎయిమ్స్, జిప్మర్, తదితర వైద్య విద్యా సంస్థల్లో చేరి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కాగా,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 16 ప్రభుత్వ, 23 ప్రైవేట్ కళాశాలల్లోని ఎంబీబీఎస్ (4610 కన్వీనర్ కోటా) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. 3 ప్రభుత్వ, 23 ప్రైవేట్, నాన్- మైనార్టీ డెంటల్ కాలేజ్‌ల్లో బీడీఎస్ (1,506 కన్వీనర్ కోటా) సీట్లకూ కౌన్సెలింగ్ జరుగుతోంది. కొత్తగా అనుమతి పొందినతిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలోని 127 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఆదివారం 1,501 నుంచి 4,500 ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌కు పిలిచారు. గుట్టుగా యాజమాన్య కోటా దరఖాస్తుల విక్రయం ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్య కోటా(సీ-1 కేటగిరీ) సీట్లలో చేరేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గత రెండు రోజులుగా గుట్టుగా దరఖాస్తులు విక్రయిస్తోంది. కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తులు విక్రరుుంచటానికి నిరాకరించడంతో కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు హెల్త్ యూనివర్సిటీలో దరఖాస్తులు విక్రయిస్తున్నారు. అరుుతే ఈ దరఖాస్తులకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు, ప్రచారం చేయకుండా విక్రయించాలని వర్సిటీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. -
మెడికల్ సీటు వద్దంటే.. లక్ష ఫైన్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సీటు తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకుంటే లక్ష రూపాయల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుందని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బుట్టా శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ లక్ష రూపాయల నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వస్తే దాన్ని మార్చుకోవడం తప్పా అని వారు వాదిస్తున్నారు. అయితే.. కావాలని సీటు రద్దు చేసుకుంటేనే ఫైన్ కట్టాల్సి ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు.. ఎంసెట్ మెడికల్ విభాగంలో 19వ ర్యాంకు వచ్చినా.. కౌన్సెలింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో డీనా అనే ర్యాంకర్‌ను అధికారులు తిప్పిపంపారు. మరోవైపు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మెడికల్ సీట్లలో 15% ఎన్ఆర్ఐ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వీసీని కలిసి మెమోరాండం ఇచ్చేందుకు పీడీఎస్‌యూ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. -
2 రాష్ట్రాల్లో 5 కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్!
విజయవాడ: ఎంసెట్ మెడికల్ కౌన్సెలింగ్ విషయంలో రెండు ప్రభుత్వాలను సమన్వయం చేసుకుని ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీచేసిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన అనంతరం మంగళవారం రాత్రి 10 గంటలకు హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. ఆ నోటిఫికేషన్ కాపీలను హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ అందజేశారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం, తిరుపతి ఎస్వీయూ, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
బీడీఎస్ ‘మేనేజ్మెంట్ కోటా’ఫీజు పెంపు
* ఫలించిన ప్రైవేటు కళాశాలల ఒత్తిళ్లు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్, అన్ అయిడెడ్, నాన్ మైనారిటీ దంత వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజులను యథాతంగా కొనసాగించాలనే తన నిర్ణయాన్ని రెండు రోజులకే తెలంగాణ ప్రభుత్వం మార్చుకుంది. తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ మైనారిటీ వైద్య విద్య కళాశాలల మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజులను పెంచుతూ ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దంత వైద్య కళాశాలల ఫీజులు యథాతథంగా కొనసాగుతాయని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తితో నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం ..డెంటల్ కళాశాలల మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజును రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు, ఎన్ఆర్ఐ కోటా ఫీజులను రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. -
మెడికల్ కౌన్సెలింగ్‌పై రేపు నిర్ణయం
తెలంగాణ సీఎస్‌తో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల ఖ రారుపై సోమవారం స్పష్టత రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమావేశమై దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల నిర్ణయంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. శనివారం ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సోమవారం కేసీఆర్ రాష్ట్రానికి వస్తున్నందున ఆయనతో సమావేశమైన అనంతరం కౌన్సెలింగ్ తేదీ, ఫీజుల పెంపుపై ఉత్తర్వులను వెలువరించాలని నిర్ణయించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఆ లోగానే కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల దరఖాస్తుల గడువు 25 దాకా పొడిగింపు విజయవాడ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లకు అభ్యర్థులు ఈ నెల 25 వరకూ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం వెబ్సైట్లో దరఖాస్తులు పొందడానికి 22 చివరి తేదీగా పేర్కొనగా, మరో మూడ్రోజులు పెంచుతూ ఈ నెల 25 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www;//ntruhs.ap.nic.inను చూడవచ్చు. -
27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27 నుంచి మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు నిర్ణయానికొచ్చారు. దీని కోసం శుక్రవారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాలకు చెందిన కొంతమంది అధికారులు గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. అయితే దీనికి ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు అందుబాటులో లేరు. అందువల్ల శుక్రవారం మళ్లీ సమావేశమైన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాగా, బీ కేటగిరీ సీట్లకు పాతఫీజులే ఉంటాయని అధికారులు చెబుతున్నా, శుక్రవారం తుదినిర్ణయం తీసుకోనున్నారు. -
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ రద్దు
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గత మూడు రోజులుగా నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ను రద్దు చేశారు. రిజర్వేషన్లలో సీట్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని విద్యార్థులు ఆందోళన చేయడంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి మళ్లీ కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశముంది. బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభించగా తొలిరోజు 470 సీట్లు, రెండోరోజు 102 సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థుల ఆందోళనతో కౌన్సెలింగ్ రద్దు చేశారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 350 సీట్లను కుదించడంపైనా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
మెడికల్ కౌన్సెలింగ్‌లో 370 సీట్లు భర్తీ
విజయవాడ, న్యూస్‌లైన్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో శనివారం 370 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 754 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రోజు కౌన్సెలింగ్‌లో 132 మంది అభ్యర్థులు కొత్తగా సీట్లు పొందగా, 238 మంది మెరుగైన కళాశాలల్లో సీట్ల కోసం స్లైడింగ్ అయ్యారు. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం 4,251 ఎంబీబీఎస్, 865 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. ఆదివారం జరిగే కౌన్సెలింగ్‌కు 6001 నుంచి 12వేల ర్యాంకు వరకు అభ్యర్థులను అహ్వానించారు. -
మరో మూడు కేంద్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ, న్యూస్‌లై న్: ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి జరగనున్న రెండోవిడత మెడికల్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్‌తోపాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌ను కేవలం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఈనెల 2న హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. అయితే రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చిన వినతుల మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఐ.వి.రావు గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈనెల 11న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో మాత్రమే స్పెషల్ (పీఎంసీ, ఎన్సీసీ, ఆర్మీ, పీహెచ్) కేటగిరీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతుందని రిజిస్ట్రార్ తెలిపారు. కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్న సీట్లు, కళాశాలల వివరాలను గురువారం యూనివర్సిటీ వెబ్సైట్ హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్‌లో పొందుపరిచారు.