ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గత మూడు రోజులుగా నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ను రద్దు చేశారు.
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గత మూడు రోజులుగా నిర్వహించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ను రద్దు చేశారు. రిజర్వేషన్లలో సీట్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని విద్యార్థులు ఆందోళన చేయడంతో వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి మళ్లీ కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశముంది.
బుధవారం కౌన్సెలింగ్ ప్రారంభించగా తొలిరోజు 470 సీట్లు, రెండోరోజు 102 సీట్లు భర్తీ అయ్యాయి. విద్యార్థుల ఆందోళనతో కౌన్సెలింగ్ రద్దు చేశారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 350 సీట్లను కుదించడంపైనా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.