తప్పుడు కులద్రువీకరణ పత్రాలను సమర్పించి మెడిసిన్ సీటు సంపాదించిన ఐదుగురు విద్యార్థుల తో పాటు.. వారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో కౌన్సెలింగ్ సందర్భంగా తప్పుడు కుల ద్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. సోమవారం వీరిలో ఐదుగురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు.