False certificates
-
రామారావు.. అప్పారావు.. భాస్కరరావు!
సాక్షి, టెక్కలి: రామారావు.. అప్పారావు.. భాస్కరరావు.. ఇవన్నీ ఓటర్ల జాబితాలోని పేర్లు అనుకుంటే పొరపాటే. డివిజన్ కేంద్రమైన టెక్కలికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రామారావు ఇన్ని పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అధికారుల కళ్లు గప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాజేస్తున్నాడు. ఈయన నిర్వాకంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి యు.తమ్మయ్య ఆధారాలతో సహా సిద్ధమయ్యారు. ఆయన చెప్పిన సమాచారం మేరకు.. టెక్కలి పట్టణానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి నెయ్యిల రామారావు బతికుండగానే అప్పారావుగా పేరు మార్చుకుని తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. దీంతో భార్య వరలక్ష్మికి వితంతు పింఛన్(ఐడీ నంబరు 101746880) మంజూరైంది. రామారావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశం కార్యకర్తల సాయంతో వృద్ధాప్య పింఛన్ (ఐడీ నంబరు 101909288) కొట్టేశాడు. అంతేకాకుండా భార్య వరలక్ష్మి అతి తెలివి ప్రదర్శించి తన భర్త రామారావు పేరును భాస్కరరావుగా మార్చి స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల స్థలాలు కాజేయడంతో పాటు టీడీపీ కార్యకర్తల సాయంతో నిర్మాణాలు సైతం చేపట్టారు. అప్పట్లో కొంత మంది ఫిర్యాదు చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తల అండతో ఇంటి నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగించేశారు. ఈ కుటుంబ సభ్యులకే స్థానిక శ్రీనివాసనగర్‌లో సొంతంగా భారీ భవనాలు ఉండడం విశేషం. ఎప్పటికప్పుడు అధికారుల కళ్లుకప్పి ప్రభుత్వాన్ని మోసగిస్తూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అక్రమార్గంలో పొందుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానిక విశ్రాంత ఉద్యోగి తమ్మయ్య టీడీపీ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతో రామారావు కుటుంబ సభ్యుల మోసాలపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఆయన సాక్ష్యాధారాలతో సహా సిద్ధమవుతున్నారు. -
నకిలీవి ఇచ్చి.. అసలు ఐఫోన్లకు ఎసరు
♦ తప్పుడు పత్రాల తో రిప్లేస్ ♦ నగరంలోని మొబైల్ షాపులకు ఢిల్లీ ముఠా టోకరా ♦ ఇద్దరి పట్టివేత, పరారీలో ఐదుగురు నిందితులు హైరదాబాద్: నకిలీ ఐఫోన్లను తప్పుడు ధ్రువపత్రాల సహాయంతో సెల్‌ఫోన్ షాపుల్లో రీప్లేస్ చేస్తూ మోసానికి పాల్పడుతోంది ఢిల్లీకి చెందిన ఓ ముఠా. జూబ్లీహిల్స్ పోలీసులు ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసి, 20 డూప్లికేట్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్ర అలియాస్ సోను(22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్(23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యంతో పాటు మరో యువకుడు నెలన్నర క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నకిలీ సెల్ఫోన్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఐఫోన్లకు మక్కీమక్కీ నకిలీవి తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి వివిధ షాపుల్లో నకిలీ ఫోన్లు రీప్లేస్ చేస్తూ.. కంపెనీ ఫోన్లు కొత్తవి తీసుకుంటున్నారు. వాటిని ఇతరులకు అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సోను, అమన్‌నాగ్‌పాల్ దొరికిపోయారు. పోలీసులు వీరిద్దరినీ విచారించగా ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. వీరి నుంచి 20 నకిలీ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోను, అమన్‌నాగ్‌పాల్ అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
-
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
తప్పుడు కులద్రువీకరణ పత్రాలను సమర్పించి మెడిసిన్ సీటు సంపాదించిన ఐదుగురు విద్యార్థుల తో పాటు.. వారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో కౌన్సెలింగ్ సందర్భంగా తప్పుడు కుల ద్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. సోమవారం వీరిలో ఐదుగురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు.