
సాక్షి, అమరావతి : ఓ విద్యార్థినికి సీటు అంశానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లాకు చెందిన రేవూరు వెంకట అశ్రిత అనే విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు కోల్పోయింది. ఇదే అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రేవూరి వెంకట అశ్రితకు నష్టపరిహారం కింద ఏడు లక్షల రూపాయలు ఎన్టీఆర్ యూనివర్సిటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో నష్ట పరిహారం విద్యార్థికి చెల్లించాలని తేల్చి చెప్పింది.
అదే సమయంలో వెంకట ఆశ్రిత కన్నా తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆశ్రిత కన్న తక్కువ మెరిట్ ఉన్న మరొకరికి సీటు కేటాయించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎక్కువ మెరిట్ ఉన్న ఆశ్రితకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సీటు కేటాయించకుండా నిరాకరించినందుకు రూ.25000లను ఖర్చుల కింద చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో అశ్వితకు చెల్లించాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Comments
Please login to add a commentAdd a comment