విజయవాడ: రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌ను ఈ నెల 20 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. బాబూలాల్ తెలిపారు. తొలి విడత మాదిరిగానే హైదరాబాద్ జేఎన్టీయూ, వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీల్లోని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఈ నెల 19న స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్(ఎన్‌సీసీ/ఆర్మీ/పీఎంసీ/వికలాంగ) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 19న జరిగే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అభ్యర్థుల కౌన్సెలింగ్‌లో ఉదయం 9 గంటలకు పీఎంసీ అభ్యర్థులకు, 9.30కు వికలాంగ అభ్యర్థులకు, 10.30కు ఎన్‌సీసీ అభ్యర్థులకు, మధ్యాహ్నం 1 నుంచి ఆర్మీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
20 నుంచి రెండో విడత వైద్య కౌన్సెలింగ్
Published Sat, Sep 13 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM
Advertisement
Advertisement