సాక్షి, విజయవాడ: ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకున్న సమయంలో అండగా నిలిచిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారుల సహకారం మరువలేనిదని పీజీ మెడికల్ విద్యార్థులు అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 37 రోజులుగా జీవో 56 అమలుచేయాలని ఆందోళన చేశామని, చివరకు హైకోర్టులో తమకు న్యాయం జరిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. జీవో 56 తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పీజీ మెడికల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో చేరామని తెలిపారు. సహకరించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి మేలు మరిచిపోలేమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment