సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించింది. వర్సిటీలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఐఎస్‌వో ఏపీ, తెలంగాణ ఇన్‌చార్జి శివయ్య చేతుల మీదుగా వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను అందుకోనున్నారు.
నెల రోజుల కిందట శివయ్య బృందం వర్సిటీని సందర్శించి మెడికల్, ఆయుష్, పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుపుతున్న తీరు, అకడమిక్ విభాగంలో పారదర్శక సేవలు, పరీక్షల నిర్వహణ వంటి అన్ని విషయాలను పరిశీలించింది. వర్సిటీలో పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను అందించనున్నారు.
కాగా ఇప్పటివరకు దేశంలోని ఏ ఆరోగ్య వర్సిటీ ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను పొందలేదని, దీన్ని తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment