ISO certification
-
సీబీఐటీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మణికొండ: గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐఎస్ఓ 9001:2015 నాణ్యతా వ్యవస్థల ప్రామాణిక దృవపత్రం లభించింది. 2002 సంవత్సరం నుంచి సీబీఐటీకి ఐఎస్ఓ 9001 ప్రమాణాల కింద దృవీకరించచడం జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇదంతా కళాశాల స్టాఫ్ కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ఐఎస్వో సర్టిఫికెట్
సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): పారదర్శకమైన సేవలు అందిస్తున్నందుకుగాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. వర్సిటీలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఐఎస్వో ఏపీ, తెలంగాణ ఇన్చార్జి శివయ్య చేతుల మీదుగా వీసీ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ ఐఎస్వో సర్టిఫికెట్‌ను అందుకోనున్నారు. నెల రోజుల కిందట శివయ్య బృందం వర్సిటీని సందర్శించి మెడికల్, ఆయుష్, పారా మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుపుతున్న తీరు, అకడమిక్ విభాగంలో పారదర్శక సేవలు, పరీక్షల నిర్వహణ వంటి అన్ని విషయాలను పరిశీలించింది. వర్సిటీలో పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు గుర్తించి ఐఎస్వో సర్టిఫికెట్‌ను అందించనున్నారు. కాగా ఇప్పటివరకు దేశంలోని ఏ ఆరోగ్య వర్సిటీ ఐఎస్వో సర్టిఫికెట్‌ను పొందలేదని, దీన్ని తొలిసారిగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అందుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం) -
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఐఎస్వో గుర్తింపు
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (సీపీవో)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. ఆ సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ధ్రువీకరణపత్రం అందజేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఐఎస్వో 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కాగా, కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సీపీవో) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్ కమిషనరేట్ ఎంపికై మేటిగా నిలవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎస్వో గుర్తింపునకు ఎంపికవడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (ఎల్‌అండ్‌వో) జి.చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. -
ఐఎస్వో సర్టిఫికేషన్ దిశగా ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్ అడుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవన సముదాయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో సేవలందిస్తున్న ఆర్బీకేల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఐఎస్వో గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. 7 ఆర్బీకేలకు ఇటీవలే ఐఎస్వో సర్టిఫికేషన్ లభించింది. తొలి విడతలో దరఖాస్తు చేసిన మరో 6 ఆర్బీకేలను ఇటీవలే ఐఎస్వో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లింది. వీటికి వచ్చే నెల మొదటి వారంలో ఐఎస్వో గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఆర్బీకేలకు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. అగ్రి ల్యాబ్స్‌కూ దశల వారీగా దరఖాస్తు మరోవైపు నియోజకవర్గ, జిల్లా, రీజనల్, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు కూడా దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్‌లతో పాటు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్రస్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 70 ల్యాబ్స్ అందుబాటులోకొచ్చాయి. వీటికి అనుబంధంగానే పాడి, ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మత్స్య శాఖకు సంబంధించి 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 35 వాటర్ సాయిల్ ఎనాలసిస్, 35 మైక్రో బయాలజీ, 14 ఫీడ్ ఎనాలసిస్, 17 పీసీఆర్, 13 క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 10, రీజనల్ స్థాయిలో 4, పులివెందులలో రిఫరల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 60 ల్యాబ్స్‌లో సేవలు అందిస్తున్నారు. దశల వారీగా అన్నిటికీ.. ఇప్పటికే ఏడు ఆర్బీకేలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. త్వరలో మరో ఆరు ఆర్బీకేలకు గుర్తింపు రానుంది. ఇదే రీతిలో మిగిలిన ఆర్బీకేలతో పాటు వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు కూడా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించే దిశగా కృషి చేస్తున్నాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ -
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?
సాక్షి, బెంగళూరు: బైక్ మీద వెళ్లేవారు క్షేమం కోసం శిరస్త్రాణం తప్పక ధరించాలి. కొంత మంది నాణ్యమైన ఐఎస్ఓ ధృవీకృత హెల్మెట్లను వాడితే మరికొందరు చీప్‌గా దొరికే వాటితో సర్దుకుపోవచ్చు. ఇక తలను పూర్తిగా కాకుండా సగం మాత్రమే కప్పి ఉంచే శిరస్త్రాణాలను వాడడం పెరిగిపోతోంది. ఈ హాఫ్ హెల్మెట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ముప్పును ఆపలేవని నిమ్హాన్స్, పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది. బెంగళూరులో నమోదైన రోడ్డు ప్రమాదాల గణాంకాలను గమనిస్తే మృతుల్లో ఎక్కువమంది హాఫ్ హెల్మెట్లను ధరించిన వారు ఉన్నారు. ముఖం భాగాల్లో గట్టి దెబ్బలు తగిలే ప్రమాదాన్ని ఇవి ఏమాత్రం తగ్గించలేవని వెల్లడైంది. జాగృతి తరువాత జరిమానా యోచన.. ఐటీ నగరంలో 15 చోట్ల 90 వేల ద్విచక్రవాహనదారులను పరిశీలించగా నాణ్యత లేని హాఫ్ హెల్మెట్లను ఎక్కువ మంది ధరిస్తున్నట్లు గుర్తించారు. 60 శాతం మంది చవక రకం హెల్మెట్లనే వాడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం హెల్మెట్ల వినియోగంపై 15 రోజుల పాటు అవగాహన కల్పించాలని పోలీసు శాఖ యోచన చేస్తోంది. అనంతరం హాఫ్ హెల్మెట్లను ధరించేవారికి జరిమానాలు విధించాలని ఆలోచిస్తున్నట్లు భావిస్తోంది. చదవండి: (కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్) -
చెన్నూరు ఆర్బీకేకు ఐఎస్వో సర్టిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలోనే రైతులకు సమస్త సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అరుదైన గౌరవం లభించింది. దశల వారీగా ఆర్బీకేలు ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం ఫలించే దిశగా అడుగుపడింది. ఏడాదిన్నరగా అత్యుత్తమ సేవలందిస్తున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు రైతు భరోసా కేంద్రానికి ఐఎస్వో సర్టిఫికేషన్–9001–2015 దక్కింది. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఐఎస్వో ఏజెన్సీ బృందం ఈ కేంద్రాన్ని సందర్శించింది. రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పారదర్శకంగా అందిస్తున్న సేవలను ప్రామాణికంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ కేంద్రం ఉందని నిర్ధారించింది. ఆ మేరకు చెన్నూరు ఆర్బీకేకి ఐఎస్వో సర్టిఫికేషన్ జారీ చేసింది. చెన్నూరు ఆర్బీకే ప్రత్యేకతలివే.. చెన్నూరు ఆర్బీకే పరిధిలో 1,600 మంది రైతులుండగా 3 వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉంది. రూ.21.80 లక్షలతో నిర్మించిన నూతన భవనంలో రైతులకు సేవలందిస్తున్నారు. గతేడాది 267 మందికి 44.5 ఎంటీల యూరియా, 45 మందికి 105 బస్తాల పచ్చిరొట్ట, 20 మందికి 30 బస్తాల జీలుగు విత్తనాలు, 40 మందికి 75 బస్తాల వరి విత్తనాలు పంపిణీ చేశారు. సిద్ధారెడ్డిపాళెం, కట్టుబడిపాళెం గ్రామాల్లోని 60 మంది రైతుల క్షేత్రాల్లో రెండు పొలంబడులు నిర్వహించారు. రూ.9.52 కోట్ల అంచనా వ్యయంతో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన, సున్నావడ్డీ పంట రుణాలు, పంటల బీమా వంటి పథకాల ద్వారా ఆర్బీకే పరిధిలో అర్హులైన ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చారు. ఆర్బీకేలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా 8.78 కోట్ల విలువైన 1.15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. -
కాణిపాకం, అప్పన్న ఆలయాలకు ఐఎస్వో సర్టిఫికెట్లు
కాణిపాకం (యాదమరి)/సింహాచలం(పెందుర్తి): చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి, విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాలకు ఐఎస్వో సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది. శుక్రవారం వినాయక చవితి రోజు ఐఎస్వో సంస్థ ప్రతినిధి శివయ్య కాణిపాకం ఆలయానికి చేరుకుని సంస్థ నుంచి ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు ఒకటి, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌కు మరో సర్టిఫికెట్ అందజేశారు. ఆయనకు ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఐఎస్వో సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, తదితరులు ఉన్నారు. మరోవైపు అప్పన్న దేవస్థానానికి ఐఎస్వో 9001–2015 గుర్తింపు లభించింది. సింహగిరికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు, హిందూ ధర్మం, సంస్కృతిని ప్రచారం చేస్తున్నందుకు దేవస్థానానికి ఈ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సింహాచలం దేవస్థానానికి ఈ గుర్తింపునిచ్చింది. ఆ సంస్థ జారీ చేసిన ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులమీదుగా దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా దేవస్థానం అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే పంచగ్రామాల భూసమస్య పరిష్కారమవుతుందన్నారు. -
3 విభాగాల్లో ఏపీఎండీసీకి ఐఎస్వో సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) అంతర్జాతీయంగా మూడు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఐఎస్వో సర్టిఫికెట్లు సాధించింది. క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్, హెల్త్ అండ్ సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో సర్టిఫికేషన్ పొందింది. సంస్థ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాక అంతర్జాతీయ సంస్థ ఐఎస్వో ఈ సర్టిఫికెట్లను ప్రకటించింది. ఐఎస్వో ఏజెన్సింగ్ సంస్థ చీఫ్ ఆడిటర్ మురళీ బుధవారం విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఈ సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో వెలికితీస్తున్న అత్యంత నాణ్యత గల బైరటీస్, గ్రానైట్ ఖనిజాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. తనిఖీ ల్యాబ్‌లతో పాటు థర్డ్ పార్టీ ల్యాబ్‌లలో కూడా ఖనిజ నాణ్యతను పరీక్షించాకే విక్రయిస్తున్నామని, అందువల్లే ఏపీఎండీసీ ఖనిజ ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ మరింత పెరిగిందన్నారు. కేవలం మైనింగ్ వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఏపీఎండీసీ కృషి చేస్తోందని వెంకటరెడ్డి వివరించారు. -
9 రైల్వేస్టేషన్లకు ఐఎస్ఓ–సర్టిఫికేషన్ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైల్వేస్టేషన్లకు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ–14001:2015 సర్టిఫికేషన్ గుర్తింపు లభించిం ది. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత, పర్యావరణ అనుకూల విధానాల ఆధారంగా ఈ గుర్తింపు లభిస్తుంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో ఉన్న హైదరాబాద్(నాంపల్లి), సికింద్రాబాద్, కాచిగూడ, నిజామాబాద్, బాసర, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని విజయవాడ, కర్నూలు సిటీ, నాందేడ్ డివిజన్ పరిధిలోని పర్లి వైద్యనాథ్ స్టేషన్లు ఈ ఘనతను సాధించాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జాతీ యస్థాయిలో ఎకో–స్మార్ట్ స్టేషన్లుగా మార్చేం దుకు 36 స్టేషన్లను ఇటీవల ఎంపిక చేసింది. అందులో సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లున్నా యి. ఈ ఎంపికకు దోహదం చేసిన అంశాల్లో కొన్ని తాజా సర్టిఫికేషన్ గుర్తింపునకు ఉప యోగపడ్డాయని అధికారులు తెలిపారు -
బొటానికల్ గార్డెన్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్:ఎకో టూరిజం పేరుతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్వో 9001–2015 సర్టిఫికెట్ లభించింది. దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూములను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్కుల్లో ఒకదానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయింది. ఒక పార్కుకు ఐఎస్వో సర్టిఫికెట్ రావడం దేశంలోనే మొదటిసారి కాగా బొటానికల్ గార్డెన్ ఈ అరుదైన ఘనతను సాధించింది. శనివారం బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్, ఇతర అధికారులు ఐఎస్వో సర్టిఫికెట్ అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అటవీ శాఖ అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతోందని, బొటా నికల్ గార్డెన్‌కు ఐఎస్వో సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ఇంద్రకరణ్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో బొటానికల్ గార్డెన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, సందర్శకులు, వాకర్స్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ కార్పొరేషన్ వీసీ, ఎండీ రఘువీర్, హెచ్వైయం సీఈవో అలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు. -
టీటీడీ సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుపతి తుడా: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సంస్థలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల,్డ కుప్పం, రాజాం, నర్సాపూర్, మహబూబ్‌నగర్, బెంగళూరులోని టీటీడీ కల్యాణ మండపాలకు ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) గుర్తింపునిచ్చింది. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధ్యక్షతన శనివారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, ఐఎస్ఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు గుర్తింపునిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం హర్షం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం జేఈవో మాట్లాడుతూ ఐఎస్ఓ ప్రతినిధులు పలుమార్లు టీటీడీ వసతి సముదాయాలు, విద్యాసంస్థలు, కల్యాణ మండపాలను పరిశీలించారన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్లే వీటికి గుర్తింపు దక్కిందని వివరించారు. ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేసిన పలు విభాగాల అధికారులు, సిబ్బందికి ఐఎస్ఓ ప్రతినిధి కార్తికేయన్ ప్రశంసాపత్రాలు అందించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఈలు రమేష్‌రెడ్డి, రాములు, వేంకటేశ్వర్లు, డీఈవో రామచంద్ర, డెప్యూటీ ఈవోలు రామ్మూర్తిరెడ్డి, లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్ర రాజ్ భవన్ కు ఐఎస్ఓ గుర్తింపు
మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యున్నత పాలన విధానాలను రూపొందించినందుకు, ప్రమాణాలను పాటించినందుకుగాను ఇచ్చే ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ముంబైలోని రాజ్ భవన్ దక్కించుకుంది. భారత దేశంలో అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ ను సాధించిన తొలి రాజ్ భవన్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఐఎస్ఓ 9001:2008 సర్టిఫికెట్ ను గవర్నర్ కే శంకరనారాయణన్ మంగళవారం స్వీకరించారు. ఉన్నత ప్రమాణాలు, సేవల్ని అందించిన అధికారులను, సిబ్బందిని గవర్నర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని అత్యున్నత కార్యాలయమైన రాజ్ భవన్ ప్రమాణాలు పాటించడంలోనూ, విలువలను పెంపొందించడంలోనూ ఇతర కార్యాలయాలకు మార్గదర్శకంగా నిలువాలని గవర్నర్ శంకరనారాయణ ఆకాక్షించారు. 50 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న రాజ్ భవన్ కు మూడు వైపుల అరేబియన్ సముద్రం ఉంది.