మహారాష్ట్ర రాజ్ భవన్ కు ఐఎస్ఓ గుర్తింపు
Published Tue, Feb 25 2014 5:06 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యున్నత పాలన విధానాలను రూపొందించినందుకు, ప్రమాణాలను పాటించినందుకుగాను ఇచ్చే ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ముంబైలోని రాజ్ భవన్ దక్కించుకుంది. భారత దేశంలో అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ ను సాధించిన తొలి రాజ్ భవన్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఐఎస్ఓ 9001:2008 సర్టిఫికెట్ ను గవర్నర్ కే శంకరనారాయణన్ మంగళవారం స్వీకరించారు.
ఉన్నత ప్రమాణాలు, సేవల్ని అందించిన అధికారులను, సిబ్బందిని గవర్నర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని అత్యున్నత కార్యాలయమైన రాజ్ భవన్ ప్రమాణాలు పాటించడంలోనూ, విలువలను పెంపొందించడంలోనూ ఇతర కార్యాలయాలకు మార్గదర్శకంగా నిలువాలని గవర్నర్ శంకరనారాయణ ఆకాక్షించారు. 50 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న రాజ్ భవన్ కు మూడు వైపుల అరేబియన్ సముద్రం ఉంది.
Advertisement
Advertisement