
మణికొండ: గండిపేటలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐఎస్‌ఓ 9001:2015 నాణ్యతా వ్యవస్థల ప్రామాణిక దృవపత్రం లభించింది.
2002 సంవత్సరం నుంచి సీబీఐటీకి ఐఎస్‌ఓ 9001 ప్రమాణాల కింద దృవీకరించచడం జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇదంతా కళాశాల స్టాఫ్ కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు.