CBIT
-
సీబీఐటీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్
మణికొండ: గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఐఎస్ఓ 9001:2015 నాణ్యతా వ్యవస్థల ప్రామాణిక దృవపత్రం లభించింది. 2002 సంవత్సరం నుంచి సీబీఐటీకి ఐఎస్ఓ 9001 ప్రమాణాల కింద దృవీకరించచడం జరుగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఇదంతా కళాశాల స్టాఫ్ కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. -
25న సీబీఐటీలో వైఎస్సార్సీపీ మెగా జాబ్ మేళా
చాపాడు(వైఎస్సార్ జిల్లా): చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో 25న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీబీఐటీలో శుక్రవారం మీడియాతో మాట్లాడి, జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్సైట్ ((WWW.YSRCPJOBMELA.COM))ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. చదవండి: ఊపందుకుంటున్న ‘ఊళ్లు’ ఇప్పటికే తిరుపతి, వైజాగ్, గుంటూరులో జాబ్ మేళాల ద్వారా 40,243 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు పొత్తులు ఉన్నా లేకున్నా తమ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, సుపరిపాలన అందించే తమ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 స్థానాల్లో గెలిపిస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలకు ఉపయోగకరంగా ఏదీ ఆలోచించరని, అది వారికి పుట్టుకతో వచ్చిందని, ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తారని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
25న సీబీఐటీలో మెగా జాబ్‌మేళా
చాపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ)లో 100 ప్రముఖ కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సోమవారం సీబీఐటీ కాలేజీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి జాబ్‌మేళా నిర్వహణకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే గుంటూరు, తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఈక్రమంలో జిల్లా ప్రజల కోసం సీబీఐటీలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మెగాజాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. మేళాలో ఆయా కంపెనీలకు చెందిన 300 మంది హెచ్ఆర్లు తమ ప్రతినిధులతో పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగ ఎంపిక పడతారన్నారు. అభ్యర్థులు వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకుని డైరెక్ట్‌గా జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీబీఐటీ కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ డా.జి.శ్రీనివాసులరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షులు తెలిదేల లక్షుమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సీబీఐటీ జట్టుకు టైటిల్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆతిథ్య చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ–గండిపేట) జట్టు విజేతగా నిలిచింది. శనివారం ఫైనల్ మ్యాచ్‌లో సీబీఐటీ 2–0తో భవన్స్ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో దహేశ్ (సీబీఐటీ) 21–12, 21–16తో నిఖిల్ కుమార్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మనీశ్ (సీబీఐటీ) 21–13, 21–13తో శశాంక్‌ను ఓడించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సీఎస్ఐ కాలేజి 2–1తో బద్రుకా కాలేజిని ఓడించింది. తొలి సింగిల్స్‌లో నీరజ్ (సీఎస్ఐ) 21–19, 18–21, 21–16తో భరత్ (బద్రుకా)పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో రాహుల్ (బద్రుకా) 21–18, 21–19తో అఖిల్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నీరజ్–అఖిల్ ద్వయం 22–20, 21–19తో రమనీత్ సింగ్–రాహుల్ జోడీపై గెలుపొంది మూడోస్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో భవన్స్ (సైనిక్‌పురి) 2–1తో బద్రుకా జట్టుపై, సీబీఐటీ 2–1తో సీఎస్ఐ జట్టుపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి ప్రిన్సిపాల్ పి. రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసీపీఈ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా తదితరులు పాల్గొన్నారు. -
200 శాతం పెరగనున్న ఇంజనీరింగ్ ఫీజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. ఏకంగా 200 శాతానికి మించి ఫీజు పెంపును కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) ఏకంగా రూ.3 లక్షల వార్షిక ఫీజును ప్రతిపాదించింది. మిగతా 75 ప్రధాన కాలేజీలు కూడా ఫీజుల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీకి (టీఏఎఫ్ఆర్సీ) అందజేశాయి. ఫీజుల పెంపు కోసం ఇప్పటికే 6 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించి, కాలేజీలవారీగా ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని, ఫీజులు ఖరారయ్యాక మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వవర్గాలు పడ్డాయి. ఫీజు ఖరారు గడువు ముగిసింది 2016లో ఖరారు చేసిన ఫీజుల గడువు 2018–19 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో 2019–20 విద్యా సంవత్సరం నుంచి వచ్చే మూడేళ్లపాటు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ఫీజుల కమిటీ ఖరారు చేస్తేనే వాటికి చట్టబద్ధత ఉంటుంది. వరుస ఎన్నికల కారణంగా టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం అంశం మరుగున పడిపోయింది. చైర్మన్ నియామకం జరిగేలోగా టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి హోదాలో విద్యాశాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. యాజమాన్య ప్రతిపాదిత ఫీజులను అమలు చేస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 27 నుంచి ఆప్షన్లు ప్రారంభమయ్యేనా? ఆయా కాలేజీలన్నింటిలోనూ యాజమాన్య ప్రతిపాదిత ఫీజును అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే సాధారణ కాలేజీల్లోనూ భారీగా ఫీజుల పెంపును అమలు చేయాల్సి వస్తుంది. టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్ నియామకం తరువాత కొత్త ఫీజులను ఖరారు చేశాక మిగులు ఫీజులను సర్దుబాటు చేయాలని పేర్కొన్నప్పటికీ ముందుగా ప్రతిపాదిత ఫీజును చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందనప్పుడు, అప్పీల్‌కు వెళ్లనపుడు 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభిస్తారా? లేదా? అనేది గందరగోళంగా మారింది. వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తే మాత్రం కచ్చితంగా కాలేజీల వారీగా ఫీజులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. 27వ తేదీలోగా కోర్టు ఉత్తర్వులు అందితే అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. లేదంటే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసి, కోర్టు ఉత్తర్వుల కాపీ అందాకే అప్పీల్‌కు వెళ్లాలని, ఆ తరువాతే వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు పేర్కొంటున్నారు. -
15 మంది కస్టమ్స్ ఆఫీసర్లపై వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోమారు అధికారులపై కొరడా ఝళిపించింది. అవినీతి, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఇటీవల ఆదాయపన్ను అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులపై వేటువేసింది. అవినీతి, ముడుపులు అందుకున్నారన్న ఆధారాలతో ప్రభుత్వం మంగళవారం 15 మంది సీనియర్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించింది. అందులో ఒకరు ప్రిన్సిపల్ కమిషనర్ హోదా ఉన్న అధికారి కావడం గమనార్హం. వీరిలో కొందరు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ముడుపులు అందుకోవడం, ప్రభుత్వ సొమ్మును కాజేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం వంటి అభియోగాలతో సీబీఐ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసిందని ఆర్థిక శాఖాధికారులు పేర్కొన్నారు. వీరిలో ప్రిన్సిపల్ ఏడీజీగా పనిచేస్తున్న అనూప్ శ్రీవాస్తవపై 1996లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఓ సొసైటీకి భూమిని కొనుగోలు చేయడానికి సహకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. జాయింట్ కమిషనర్ నళిన్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఫండమెంటల్ రూల్స్, క్లాస్ జే లోని 56వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి వీరిని తొలగించారు. రానున్న మూడు నెలలపాటు యధావిధిగా వేతనాలు అందుతాయని తెలిపారు. మూడు నెలల ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ అధికారులను తొలగించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెన్నై కమిషనర్ జీ శ్రీ హర్షలను సీబీఐ వలపన్ని పట్టుకుంది. వీరితో పాటు కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్లు అతుల్ దీక్షిత్, వినయ్ బ్రిజ్ సింగ్‌లు ఉన్నారు. ఢిల్లీ జీఎస్టీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ అమ్రేశ్ జైన్, భువనేశ్వర్ జీఎస్టీ జోన్‌కు చెందిన ఎస్ఎస్ బిష్త్, ముంబై జీఎస్టీ జోన్‌కు చెందిన వినోద్ సంగా, వైజాగ్ జీఎస్టీ జోన్‌కు చెందిన రాజు శేఖర్, అలహాబాద్ జీఎస్టీ జోన్‌కు చెందిన మొహమ్మద్ అల్తాఫ్‌లు ఉన్నారు. వీరితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ డిప్యూటీ కమిషనర్ అశోక్ అశ్వాల్ కూడా ముందస్తు పదవీవిరమణ చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. -
మరో 15 మంది అధికారులపై కేంద్రం వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన 15 మంది అధికారులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌లో కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారులను నిర్బంధ పదవీ విరమణతో సాగనంపింది. వీరిపై లంచాలు స్వీకరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. కాగా, గత వారం 12 మంది సీనియర్ అధికారులపై సైతం కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు సంబంధించి నిబంధన 56(జే) కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
‘శ్రుతి – 2019’ (సీబీఐటీ)
-
‘శ్రుతి – 2019’ (సీబీఐటీ)
-
దటీజ్ సంహిత..
మణికొండ: అతిచిన్న వయసులో ఇంజినీరింగ్ పట్టా అందుకున్న కాశిభట్ట సంహితను చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాల అధ్యాపక బృందం అభినందించింది. గండిపేటలోని కళాశాలలో బుధవారం కళాశాల ఇన్చార్జి అధ్యక్షురాలు డి.సంద్యశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంహిత ఐదేళ్ల వయసులోనే సోలార్ సిస్టంపై 16 పేజీల వ్యాసం రాసి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ప్రశంసలు అందుకుందని తెలిపారు. 2007లో ఆమె అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ‘ఉత్తమ బాల పురస్కారం’ సైతం పొందిందన్నారు. 10 సంవత్సరాల వయసులోనే ప్రభుత్వ అనుమతితో 2012లో పదో తరగతి పరీక్షలు రాసి 8.8 జీపీఏ సాధించడంతో పాటు గణితం, సైన్స్‌లో 10/10 గ్రేడ్ సాధించిందన్నారు. 2014లో 12 సంవత్సరాల వయసులో ఇంటర్ ఎంపీసీలో 89 శాతం మార్కులు సాధించిందన్నారు. దీంతో ఆమెను ఇంజినీర్‌ను చేయాలనే పట్టుదలతో తల్లిదండ్రులు సీబీఐటీ కళాశాలను ఆశ్రయించారని, తాము సీటును కేటాయించి చేర్చుకున్నామని సంద్యశ్రీ వివరించారు. ప్రస్తుతం సంహిత 16 ఏళ్ల వయసులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిందని, చివరి సెమిస్టర్లో 9.5 జీపీఏ పాటు ఓవరాల్‌గా 8.85 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించి యువ ఇంజినీర్‌గా నిలిచిన సంహితను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సంహితను సన్మానించి బంగారు గొలుసు బహూకరించారు. -
సీబీఐటీ వద్ద ఐదోరోజుకి చేరిన విద్యార్థుల ఆందోళన
-
హోరెత్తిన సీబీఐటీ
-
గండిపేట CBITలో కార్పీడియం ఫెస్ట్ ప్రమోషన్
-
సీబీఈసీ ఇకపై సీబీఐటీ
న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల అత్యున్నత విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) త్వరలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ (సీబీఐటీ)గా పేరు మార్చుకోనుంది. జీఎస్టీ అమలు గడువు అయిన వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జీఎస్టీ వ్యవస్థాగత నిర్మాణానికి సంబంధించిన ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించే నిబంధనలు, మినహాయింపులను సీబీఐటీ అమలు చేస్తుంది. సీబీఐటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు కస్టమ్స్, ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్, న్యాయ పరమైన అంశాలు, శిక్షణ, వివాదాల వంటివి పర్యవేక్షిస్తారు. -
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు
సీబీఐటీ, వీబీఐటీలో ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజగోపాల్ చాపాడు: ఒకప్పుడు విదేశీయులు ఎంతో మంది భారతదేశానికి వచ్చి చదువుకోవాలనే స్థాయిలో మన దేశం ఉండేదని.. ప్రస్తుతం ఇతర దేశాలకెళ్లి చదువుకోవాలనే విధంగా మన దేశస్తులు ఉన్నారని.. ఈ విధానానికి స్వస్తి పలికి మన దేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రాజగోపాల్ పేర్కొన్నారు. స్థానిక చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ), విజ్ఞానభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ) కాలేజీలలో మంగళవారం ఎస్కే యూనివర్సిటీ వీసీ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల కోవలో ఉందని, భారతదేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా యువతకే ఉందని, వీరిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న నీతి వాక్యాలను మరవకూడదని, వివేకానందుడి స్ఫూర్తితో చదువుకోవాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు తెలిసిన టెక్నాలజీని ఉపయోగిస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందేందుకు ప్రతి విద్యార్థి ప్రయత్నించాలన్నారు. విద్యార్థి దశలో సబ్జెక్టు నాలెడ్జీతో పాటు ఇంటర్నెట్ సాయంతో అదనపు సిలబస్‌ను నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం వైస్ చాన్స్‌లర్ దంపతులను సీబీఐటీ, వీబీఐటీ యాజమాన్యం తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాళ్లు పాండురంగన్‌రవి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు యోగివేమన కాలేజీ ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి పాల్గొన్నారు. మొక్కలు నాటిన వీసీ దంపతులు స్థానిక సీబీఐటీ, వీబీఐటీ కాలేజీ ఆవరణలో మంగళవారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజగోపాల్ సతీసమేతంగా మొక్కలను నాటారు. పచ్చదనం పెంపొందించడం ఎంతో అవసరమని, మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు. -
బైండర్ తో సీబీఐటీ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ స్టార్టప్ బైండర్‌తో... చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో సీబీఐటీ ఉపాధ్యాయులలకు, విద్యార్థులకు క్లౌడ్ ఆధారంగా పనిచేసే లెర్నింగ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ (ఎల్ఎంఎస్) సేవలను అందిస్తామని బైండర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంకా చెప్పాలంటే తరగతిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కళాశాల పూర్తయ్యాక కూడా బైండర్ టెక్నాలజీ ఆధారంగా విద్యార్థులకు టచ్‌లో ఉంటారన్నమాట. దీంతో విద్యార్థులకు ఎలాంటి సందేహాలొచ్చినా అప్పటికప్పుడే నివృత్తి చేసుకునే అవకాశముంటుంది. ఇప్పటికే బైండర్ సేవలను గుంటూరులోని వీవీఐటీ, జనగాంలోని సీజేఐటీఎస్లతో పాటుగా హైదరాబాద్‌లోని శ్రీనిధి, వర్ధమాన్, మల్లారెడ్డి గ్రూప్, వీబీఐటీ, సీవీఎస్ఆర్ వంటి సుమారు 33 కళాశాలలు వినియోగించుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సీబీఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ బి.చెన్నకేశవ రావు, డెరైక్టర్ ప్లేస్‌మెంట్స్ డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, బైండర్ కో-ఫౌండర్, యూనివర్సిటీ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతి వంగీపురం పాల్గొన్నారు. -
2,200 రాకెట్లు.. ఒకేసారి
సీబీఐటీ, వీబీఐటీ విద్యార్థుల వినూత్న ప్రయోగం వైఎస్ఆర్ జిల్లా చాపాడులోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (సీబీఐటీ), విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) కళాశాల విద్యార్థులు సంయుక్తంగా ఏక కాలంలో 2,200 ఎయిర్ రాకెట్లను ప్రయోగించారు.‘14 యంత్రాస్’ అనే సంస్థ చెన్నై ఐఐటీ, బెంగళూరు ఐఐఎం సహకారంతో రూ. 25 లక్షల ఖర్చుతో 2,200 మంది విద్యార్థులతో ఎయిర్ రాకెట్లను తయారు చేయించింది. వాటిని సీబీఐటీ, వీబీఐటీ ప్రాంగణ ం వేదికగా ప్రయోగించారు. చైనాలో ఓ విద్యా సంస్థ 2011లో 1,056 మందితో ఇలాంటి ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డు సాధించగా, తాజా ప్రయోగం ఆ రికార్డును అధిగమించాయి. రాకెట్లు 100 అడుగుల ఎత్తుకు వెళ్లాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నాలజీపై విశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సీబీఐటీ, వీబీఐటి కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి చెప్పారు. గిన్నిస్ రికార్డు వారికి ఈ ప్రయోగ వివరాలు పంపుతామన్నారు. - చాపాడు -
ఉరిమే అలలు
-
సీబీఐటీలో కార్ల ప్రదర్శన