
లంచావతారులను సాగనంపిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన 15 మంది అధికారులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌లో కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారులను నిర్బంధ పదవీ విరమణతో సాగనంపింది. వీరిపై లంచాలు స్వీకరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
కాగా, గత వారం 12 మంది సీనియర్ అధికారులపై సైతం కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు సంబంధించి నిబంధన 56(జే) కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే.