senior officers
-
పోలీసుపై రెడ్ బుక్ రూల్
టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వం..శాంతిభద్రతలు అస్తవ్యస్తం ఓవైపు వేటు వేసి.. మరోవైపు కొత్తవారు కావాలంటూ కేంద్రానికి లేఖలు ‘రెడ్‌బుక్ కుట్ర’కు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్... నిబంధనలు పాటిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్’ తాము చెప్పినవారిని వేటాడితేనే పోస్టింగ్.. విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్.. పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్.. ఖాకీ చొక్కా వేసుకున్నాం కదా .. చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్..ఇదీ పోలీసు శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్న దుర్నీతి. సాక్షి, అమరావతి: సీనియర్ అధికారులను.. వెంటాడి వేటాడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా మనో వ్యథకు గురిచేస్తూ.. మంచి అధికారులను కుట్రలు చేసి పక్కనపెట్టి పాలన సాగిస్తూ.. ఉన్న అధికారులను రెడ్ బుక్ రూల్ కోసం వాడుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన పోలీసు వ్యవస్థతో ఆడుకుంటోంది. రాజకీయ స్వార్థంతో భ్రషు్టపట్టిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించే పోలీసులపై కక్ష కట్టి వేధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత కూడా రాష్ట్రంలో ఏకంగా 199 మంది పోలీస్ అధికారులకు పోస్టింగులు లేవంటే రెడ్ బుక్ కుట్ర ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. ⇒ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పోలీస్ శాఖలో హోదా ఉన్న అధికారే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ వేధింపులకు బలైనవారిలో అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులే కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే నలుగురు ఐపీఎస్‌లు, నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలు ఉండడం గమనార్హం. వీరందరికీ పోస్టింగులు ఇవ్వలేదని సాక్షాత్తు రాష్ట్ర శాసనసభకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఇంతమంది పోలీసు అధికారులను వెయిటింగ్లో ఉంచడం దేశ చరిత్రలోనే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కక్షపూరితంగా ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూడా.వెయిటింగ్లో నలుగురు ఐపీఎస్‌లు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్షసాధింపు చర్యలకు తెగించింది. 24 మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. అధికారంలో ఉన్న పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానాలను అమలు చేసే ఐపీఎస్‌పై ప్రతాపం చూపించింది. ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరు ఐపీఎస్‌లకు అదీ అప్రాధాన్యమైన పోస్టింగులు ఇచ్చింది. కానీ, నేటికీ నలుగురిని వెయిటింగ్‌లోనే ఉంచింది. సీనియర్ ఐపీఎస్‌లు కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాలు అందుబాటులో ఉన్నా సరే వారి సేవలను వినియోగించుకోవడం లేదన్నది సుస్పష్టం.కుట్ర పన్ని.. కక్షకట్టి రెడ్‌బుక్ కుట్రతో ఐదుగురు ఐపీఎస్‌లపై చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టింది. సీనియర్ ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, ఎన్.సంజయ్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది. వలపు వల విసిరి బడా బాబులను బ్లాక్‌మెయిలింగ్ చేయడమే పనిగా పెటు్టకున్న కాదంబరి జత్వానీ అనే ముంబై మోడల్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయడం అందర్నీ విస్మయపరిచింది. ⇒ చంద్రబాబు రాజగురువు రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను వెలికితీశారనే కక్షతోనే ఎన్.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్ చేశారు. కేవలం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కళ్లల్లో ఆనందం చూడడం కోసం డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించిన అభియోగాలపై ఆయనను సస్పెండ్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం.తమ కుట్రల అమలు కోసం కేంద్రానికి లేఖలు ఉన్న అధికారులనేమో వేధిస్తూ.. తమకు మరో ముగ్గురు ఐపీఎస్‌లు కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. మరీ ముఖ్యంగా యూపీ కేడర్‌లో పనిచేస్తున్న అధికారి కోసం పట్టుబడుతోంది. ఆయనైతే తమ కుట్రల అమలుకు, ప్రత్యర్థులను వేటాడేందుకు సమర్థంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. అయితే, డిప్యూటేషన్ నిబంధనలు అనుమతించకపోవడంతో కేంద్రం నుంచి స్పందన రాలేదు. కీలకమైనప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే క్షేత్రస్థాయి పోలీసులను కూడా చంద్రబాబు సర్కారు వేధిస్తోంది. నాన్ క్యాడర్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలిపి మొత్తం 195 మందికి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి పోస్టింగులు ఇవ్వకపోవడమే దీనిని నిదర్శనం. పాలనాపరమైన అంశాలతో నలుగురైదుగురిని స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సాధారణం. తర్వాత ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవడం రివాజు. ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. ఇలా పక్కనపెట్టినవారిలో నాన్ క్యాడర్ ఎస్పీలు పి.సత్తిబాబు, పి.వెంకటరత్నం, బి.లక్ష్మీనారాయణ, ఎ.సురేశ్‌బాబు ఉన్నారు. 27 మంది అదనపు ఎస్పీలు, ఒక ఏపీఎస్పీ కమాండెంట్, 42 మంది డీఎస్పీలు (సివిల్), ఇద్దరు ఏపీఎస్పీ డీఎస్పీలు, 119 మంది సీఐలనూ వెయిటింగ్లో పెట్టింది.జీతాలివ్వకుండా ‘పచ్చ’ పైశాచికత్వం ఏకంగా 199 మంది పోలీసులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. వెయిటింగ్లో ఉన్నారని చెప్పి వీరికి 10 నెలలుగా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఆర్ధికంగా పోలీసు అధికారులు ఇబ్బందులు పడుతూ ఉంటే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు అధికారులు ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
బాబు హయాంలో సీనియర్లకు అవమానం
-
ముదురుతున్న వివాదం : ఫేస్బుక్ కీలక అధికారిపై కేసు
రాయ్‌పూర్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అధికార బీజేపీకీ వత్తాసు పలుకుతోందన్న వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనంపై వివాదం మరింత ముదురుతోంది. తాజాగా ఫేస్బుక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్, మరో ఇద్దరిపై ఛత్తీస్గడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్ ద్వారా తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులకు అంకిదాస్ ఇచ్చిన ఫిర్యాదులో తివారీపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. (బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ) మతపరమైన మనోభావాలను దెబ్బతీసారని ఆరోపిస్తూ రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ అవేష్ తివారీ ఫిర్యాదు మేరకు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్, పబ్లిక్ పాలసీ హెడ్ అంకిదాస్తో పాటు, ముంగేలికి చెందిన రామ్ సాహు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వివేక్ సిన్హా అనే ఫేస్బుక్ వినియోగదారులపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఆధారంగా తాను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు, కాల్స్ వస్తున్నాయని తివారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అంకిదాస్, సాహు, సిన్హా తనను పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని, తాను నిరంతరం భయంతో బతుకుతున్నానంటూ ఆరోపించారు. ఫేస్బుక్ ప్రతినిధి తనపై వేసిన ఆరోపణలను తివారీ ఖండించారు. ఫిర్యాదులో తన పేరుకు ఎందుకు పేరు పెట్టారో తనకు అర్థం కాలేదన్నారు. గతంలో ప్రభుత్వ విధానాలను విమర్శించిన తన పోస్టులను ఫేస్బుక్ ఏకపక్షంగా సెన్సార్ చేసిందని తివారీ ఆరోపించారు. 25 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టుగా ప్రశ్నించడం తన కర్తవ్యమన్నారు. చదవండి : వాల్‌స్ర్టీట్ కథనం నేపథ్యంలో ఎఫ్బీ అధికారికి బెదిరింపులు -
మరో 15 మంది అధికారులపై కేంద్రం వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన 15 మంది అధికారులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటు వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్‌లో కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారులను నిర్బంధ పదవీ విరమణతో సాగనంపింది. వీరిపై లంచాలు స్వీకరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. కాగా, గత వారం 12 మంది సీనియర్ అధికారులపై సైతం కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు సంబంధించి నిబంధన 56(జే) కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
సంచలనం : 12 మంది సీనియర్ అధికారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, అవినీతి, దోపిడీ, అక్రమ ఆస్తులు, విధుల్లో నిర్లక్ష్యం, తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 12మంది సీనియర్ అధకారులపై కొరటా ఝుళిపించింది. నిర్బంద పదవీ విరమణ ఆదేశించింది. వీరంతా చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు కావడం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్టుగా పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. వీరిలో అశోక్ అగర్వాల్ (ఐఆర్ఎస్ 1985), జాయింట్ కమిషనర్ ఆదాయపు పన్ను (సిట్), ఎస్.కె. శ్రీవాత్సవ (ఐఆర్ఎస్, 1989), కమిషనర్ (అప్పీల్), నోయిడా, హోమి రాజ్వంశ్ (ఐఆర్ఎస్, 1985), బిబి రాజేంద్రప్రసాద్, అజయ్ కుమార్ సింగ్ (సిట్), బి.అరుళప్ప (సిట్)తో పాటు అలోక్ కుమార్ మిత్రా, చందర్ సైని భారతి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రామ్ కుమార్ భార్గవ ఉన్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలపై నోయిడా కమిషనర్ ఎస్.కే శ్రీవాస్తవకు ఉద్వాసన పలకడం సంచలనంగా మారింది. వీరితోపాటు బలవంతపు వసూళ్ల ఆరోపణలపై అశోక్ కుమార్ అగర్వాల్, అధికార దుర్వినియోగం, అక్రమార్జన కింద హోమీరాజ్ వంశ్, అవినీతి ఆరోపణలపై అజయ్ కుమార్, చందర్, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, భార్గవ బాధ్యతలనుంచి తప్పించి బలవంతపు రిటైర్మెంట్కు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. -
కిమ్‌తో దక్షిణ కొరియా అధికారుల భేటీ
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన అత్యంత సీనియర్ అధికారుల బృందం ఉత్తర కొరియాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను సోమవారం కలిసింది. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా అధికారులు ఉత్తర కొరియాకు రావడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తరఫున ప్రతినిధులుగా వచ్చిన ఈ బృంద సభ్యులు, అమెరికాతో చర్చలకు కిమ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి హాజరవడం తెలిసిందే. ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా మూన్‌ను ఆమె కిమ్ తరఫున అప్పట్లో ఆహ్వానించారు. -
కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు బదిలీ!
కొత్త కలెక్టర్‌గా శ్రీనివాసరాజు! కాకినాడ : కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బదిలీ కానున్నారని కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన బదిలీకి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద ఉందని, నేడో, రేపో ఉత్తర్వులు వెలువడవచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో ఇక్కడికి వచ్చేందుకు పలువురు సీనియర్ అధికారులు ఉబలాటపడుతున్నారని..ఫ్రధానంగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాగా అరుణ్‌కుమారే తనను ఇక్కడ నుంచి బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయగా జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమించే యోచనతో ఉన్న సర్కారు సానుకూలంగా స్పందించిందని తెలియవచ్చింది. బదిలీ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉందని, ఆయన ఆమోదించిన వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. పుష్కర తొక్కిసలాట నేపథ్యంలో.. పుష్కరాల తొక్కిసలాట ఘటన నేపథ్యంలోనే కలెక్టర్ అరుణ్‌కుమార్‌పై బదిలీవేటు వేస్తారన్న అభిప్రాయం, అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎక్కువ సమయం పుష్కరఘాట్ వద్ద ఉండడం వల్లే తొక్కిసలాట జరిగినట్టు అప్పట్లో అరుణ్‌కుమార్ ఇచ్చిన నివేదిక టీడీపీ నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది. అప్ప టి నుంచి కలెక్టర్‌పై గుర్రుగా ఉన్న వా రు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. అదే నేతలు టీటీడీ జేఈవో శ్రీనివాసరా జు పట్ల సానుకూలతను వ్యక్తం చేసిన ట్టు చెబుతున్నారు. మొత్తంగా మీద కలెక్టర్ బదిలీ కానున్నారన్న సమాచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. -
పోలీస్ బాస్‌ల బదిలీ
కాకినాడ క్రైం/ ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :జిల్లా నుంచి ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో విజయవాడ డీసీపీ రవిప్రకాష్ రానున్నారు. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి హైదరాబాద్ సీఐడీ విభాగానికి వెళుతుండగా ఆయన స్థానంలో పశ్చిమగోదావరి ఎస్పీ ఎస్.హరికృష్ణ బదిలీ అయ్యారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్‌కుమార్ గుంటూరు అ ర్బన్ ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు రానున్నారు. ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించిన విజయ్‌కుమార్ విజయ్‌కుమార్ మెదక్ ఎస్పీగా పనిచేస్తూ గత ఫిబ్రవరి 17న బదిలీపై జిల్లాకు వచ్చారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశారు. పోలీసు సిబ్బందితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారులు, ఉద్యోగులకు గణనీయమైన సేవలందించారు. జిల్లాకు కొత్త ఎస్పీగా రవిప్రకాష్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1999 గ్రూపు-1 బ్యాచ్‌కు చెందిన రవిప్రకాష్ పదోన్నతిపై ఇంటెలిజెన్స్ ఎస్పీ అయ్యారు. అక్కడ నుంచి విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ డీసీపీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. సాంకేతికతను జోడించిన రవికుమార్‌మూర్తి అర్బన్ జిల్లా ఎస్పీగా 2012 ఏప్రిల్ 16న బాధ్యతలు చేపట్టిన టి.రవికుమార్‌మూర్తి రాజమండ్రిలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచారు. గత ఏడాది సంచలనం సృష్టించిన ఏటీఎం సొమ్ము చోరీ కేసును త్వరితగతిన ఛేదించి మన్ననలు పొందారు. పోలీసుశాఖకు సాంకేతికతను జోడించి, మొబైల్ ట్రాకింగ్, బీట్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా కృషి చేసి వారి ఆదరం పొందారు. సిబ్బందిలో పనిచేసే తత్వాన్ని పెంచిన హరికృష్ణ అర్బన్ ఎస్పీగా రానున్న హరికృష్ణ అనంతపురం జిల్లాకు చెందిన వారు. 1998లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆ యన కాశీబుుగ్గ, జమ్మలమడుగు, కామారెడ్డి, నర్సారావుపేటల్లో పనిచేశారు. పదోన్నతిపై ఓఎస్డీగా గుంటూరు జిల్లా లో, ఏఎస్పీగా కరీంనగర్లో పనిచేశారు. తరువాత పోలీస్ అకాడమీలో పని చేస్తూ గవర్నర్ వద్ద ఏడీసీగా చేరారు. గత ఏడాది నవంబరు 13న పదోన్నతి పొంది పశ్చిమగోదావరి ఎస్పీ అయ్యారు. నేరాలను అరికట్టడంలో, పలు కేసులను ఛేదించే విషయంలో విశేష కృషి చేశారు. సిబ్బందిలో పనిచేసే తత్వాన్ని పెంపొందించారు. అల్ ఉమా ఉగ్రవాదుల్ని పట్టుకున్న ప్రభాకరరావు కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయిన ప్రభాకరరావు తెనాలికి చెందిన వారు. 1984 నుంచి 90 వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అధికారిగా పనిచేసిన ఆయన 1991 గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. గుంటూరు డీఎస్పీగా పనిచేసినప్పుడు టీడీపికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరుడైన డేగల శ్రీను ఆగడాలను అరికట్టి పేరు తెచ్చుకున్నారు. 1997 నుంచి 99 వరకు రాజమండ్రి డీఎస్పీగా పనిచేసిన సమయంలో అల్ ఉమా ఉగ్రవాదులను పట్టుకున్న ఘనత దక్కింది. అనంతరం పదోన్నతిపై కొత్తగూడెం ఓఎస్డీగా, కర్నూలు ఏఎస్పీగా పనిచేసి పదోన్నతిపై హైదరాబాద్‌కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా వెళ్లారు. అనంతరం గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా 2010 వరకు, తిరుపతి అర్బన్ ఎస్పీగా 2012 వరకు పని చేశారు. 2012 డిసెంబరులో కృష్ణాజిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. 2012లో ఇండియన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నారు. 2012 నవంబర్ 27న ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్‌కుమార్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు బదిలీపై గుంటూరు అర్బన్ ఎస్పీగా వెళుతున్నారు.