కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు బదిలీ! | Collector Arun Kumar transfer | Sakshi
Sakshi News home page

కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు బదిలీ!

Published Thu, Feb 11 2016 12:43 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

Collector Arun Kumar transfer

 కొత్త కలెక్టర్‌గా శ్రీనివాసరాజు!
 కాకినాడ : కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బదిలీ కానున్నారని కలెక్టరేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన బదిలీకి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్ద  ఉందని, నేడో, రేపో ఉత్తర్వులు వెలువడవచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో ఇక్కడికి వచ్చేందుకు పలువురు సీనియర్ అధికారులు ఉబలాటపడుతున్నారని..ఫ్రధానంగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాగా అరుణ్‌కుమారే తనను ఇక్కడ నుంచి బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాయగా జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమించే యోచనతో ఉన్న సర్కారు సానుకూలంగా స్పందించిందని తెలియవచ్చింది. బదిలీ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉందని, ఆయన ఆమోదించిన వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
 
 పుష్కర తొక్కిసలాట నేపథ్యంలో..
 పుష్కరాల తొక్కిసలాట ఘటన నేపథ్యంలోనే కలెక్టర్ అరుణ్‌కుమార్‌పై బదిలీవేటు వేస్తారన్న అభిప్రాయం, అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎక్కువ సమయం పుష్కరఘాట్ వద్ద ఉండడం వల్లే తొక్కిసలాట జరిగినట్టు అప్పట్లో అరుణ్‌కుమార్ ఇచ్చిన నివేదిక టీడీపీ నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది. అప్ప టి నుంచి కలెక్టర్‌పై గుర్రుగా ఉన్న వా రు బదిలీ చేయించేందుకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. అదే నేతలు టీటీడీ జేఈవో శ్రీనివాసరా జు పట్ల సానుకూలతను వ్యక్తం చేసిన ట్టు చెబుతున్నారు. మొత్తంగా మీద కలెక్టర్ బదిలీ కానున్నారన్న సమాచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement