
ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్‌లోనే ఉంచి..
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎర్త్ డేకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి ప్రకృతి పరిరక్షణ గురించి చెబుతున్న సందర్భం.. అదే సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్‌లోనే ఉంచి.. డ్రైవర్ ఏసీ వేసుకుని ఉన్నాడు.. ఇదేమిటి.. ఇన్ని గంటలు కారును ఆన్‌లోనే ఉంచావు అని అడిగితే ‘మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి’ అని సమాధానం.
ఇంతకు ఆ కారు ఎవరిదంటే.. బల్దియా ఎస్‌ఈ అధికారిక వాహనం. గ్రీవెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేంతవరకు కారును ఇలా ఆన్‌లోనే ఉంచడం గమనార్హం. ఇదేనేమో ఇంధన పొదుపు.. పర్యావరణ పరిరక్షణ అంటే.. !!