hanumakonda
-
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్‌గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్‌లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
వెంటాడి మరీ.. పట్టపగలే హనుమకొండలో దారుణం
హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది. మాచర్ల రాజ్‌కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్‌కుమార్‌ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సంతానం లేని వారికి ఒయాసిస్ ఫెర్టిలిటీ ఓ వరం
హనుమకొండ : సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావ్య రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అంజనీ దేవి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ భోజరాజు రోహిత్, డాక్టర్ ప్రసన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కావ్య రావు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, హన్మకొండ ఫెర్టిలిటీ సెంటర్, 2017 నుండి ప్రజలకు సేవలందిస్తున్న వరంగల్ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూతన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంది. జంటలు సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటిచెబుతుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కోఫౌండర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు, కిరణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులవ్వాలనే కలను సాధించడంలో ఎన్నో జంటలకు సహాయం చేశాం. అంతేగాకుండా, మా ఫెర్టిలిటీ కేర్ సేవలు ఎగ్, మరియు స్పెర్మ్ ఫ్రీజింగ్ వసతి ద్వారా భార్య భర్తలు లేదా నేటి తరం వారు వారి భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకునే ఎంపికను అందించడం ద్వారా కుటుంబ ప్రణాళిక గురించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారికత ఇస్తాయి అని అన్నారు. వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడం ద్వారా హన్మకొండ కేంద్రం ఒక సంవత్సరంలోపుగానే ఫెర్టిలిటీ వైద్యంలో అగ్రగామిగా మారింది. ఈ మైలురాయి సాధించడంపై ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ హన్మకొండలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలకు మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఈ చికిత్సల్లో 70% విజయం సాధించడం మా క్లినికల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 మంది జంటలకి సంతాన సాఫల్యత అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం పొందిన ఆయా దంపతుల కుటుంబాలు పిల్లలు హాజరవ్వడంతో వారి అనుభవాలను ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు సిబ్బంది, పిల్లలు, తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
సోనీ.. సో లక్కీ.. శునకానికి గణేశ్ లడ్డూ
నయీంనగర్: గణపతి లడ్డూను ఓ పెంపుడు శునకం దక్కించుకుంది. హనుమకొండ 54వ డివిజన్ కేయూ రోడ్ డబ్బాల్ జంక్షన్ వద్ద హనుమాన్ గజానన మండలి సభ్యులు గణపతి నవరాత్రుల లడ్డూకు లక్కీడ్రా నిర్వహించారు. ఇందులో స్థానికుడు పొలాల వాణి, రాజేశ్ కుటుంబ సభ్యులందరి పేర్లను రాసి డ్రాలో వేశారు. వారి పెంపుడు శునకం సోని పేరుతోనూ చీటీ వేశారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ దక్కడం విశేషం. -
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధి భీమారంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన హాస్టల్లో శుక్రవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తమ కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తికి చెందిన వలుగుల ప్రభాకర్, కవిత దంపతుల పెద్దకూతురు సాహిత్య (17) భీమారంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె అదే కళాశాల హాస్టల్లోనే ఉంటోంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో గత సబ్జెక్టుల్లో సాహిత్య అనుకున్నంత మేరకు పరీక్షలు రాయలేదు. దీంతో సాహిత్య మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. భవనంపై నుంచి దూకి..? సాహిత్య, కళాశాల హాస్టల్ భవనం పైనుంచి శుక్రవారం తెల్లవారు జామున దూకి ఉండవచ్చని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాహిత్య కింద పడి ఉండటం గమనించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. సూసైడ్ నోట్ లభ్యం.. ఇదిలా ఉండగా సాహిత్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జువాలజీ పరీక్ష రోజు చనిపోతున్నా’అని అందులో పేర్కొంది. అయితే పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆ సూసైడ్ నోట్ తన కూతురిది కాదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టారని తెలిపారు. భవనంపై నుంచి దూకితే చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. తమ కూతురు మృతదేహాన్ని గోప్యంగా ఎందుకు ఎంజీఎంకు తరలించారన్నారు. కళాశాల ఎదుట ఆందోళన తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. వారి ఆందోళనకు వి ద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ సంజీవ, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్‌లు ఆందోళనకారులను శాంతింపజేశారు. సాహిత్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సంజీవ తెలిపారు. కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూసైడ్ నోట్‌ను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించనున్నట్లు చెప్పారు. నేత్ర దానం సాహిత్య నేత్రాలు దానం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ సిబ్బంది నేత్రాలు సేకరించారు. -
దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..
ఎల్కతుర్తి/ఏటూరునాగారం: దైవదర్శనం కోసం కారులో వేములవాడ బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, శాంతినగర్ సమీపంలో హనుమకొండ–కరీంనగర్ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక కారు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రిపూట ప్రయాణంతో... ఎల్కతుర్తి ఎస్సై గోదారి రాజ్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన కాంతయ్య (72), మంతెన చందన (16)తోపాటు మంతెన రేణుక (55), మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి కలసి కారులో గురువారం రాత్రి ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ నుంచి పెంచికలపేట సమీపంలోకి రాగానే వరంగల్ వైపు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అవడంతోపాటు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భరత్‌తోపాటు ఆయన తండ్రి శంకర్, మంతెన కాంతయ్య, ఆయన కుమార్తె చందన అక్కడికక్కడే మృతిచెందగా వెనుక సీటులో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్‌లకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక మృతిచెందింది. నిద్రమత్తు, అతివేగం, పొగ మంచు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. హనుమకొండలో షాపింగ్ చేసుకొని.. మంతెన శంకర్, కాంతయ్యలు వరుసకు అన్నదమ్ములు. శంకర్ కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య శ్రీదేవికాగా చిన్న కుమారుడు భరత్ టీఎస్ఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా, పెద్ద కుమారుడు భార్గవ్ వాజేడులోని రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాంతయ్య కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య రేణుకకు చాలాకాలం తర్వాత చందన జన్మించింది. అయ్యప్ప మాల ధరించిన శంకర్ చిన్న కుమారుడు భరత్‌కు మేడారం జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో దానిలో భాగంగానే శ్రీదేవి అక్క కొడుకుకు చెందిన కారును తీసుకొని కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో హనుమకొండలో షాపింగ్ చేసుకొని తిరిగి వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ములుగు జిల్లాకు చెందిన పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. -
ముగ్గురూ జిల్లా పార్టీ అధ్యక్షులే..!
-
పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!
పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజకీయపరమైన అంశాలు : పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నిరుద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు ధరణి పోర్టల్ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ కొండ సురేఖ (ఆశావాహులు) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు) బీజేపీ పార్టీ పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు మేజారిటీ ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. చలివాగు ఉంది చంద్రగిరిగుట్టలు చెన్నకేశవ స్వామి జాతర కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర -
అక్క ఆశీర్వాదమే.. అతనికి ఆఖరి రోజు..
మహబూబాబాద్: అక్క ఆశీర్వాదం కోసం వచ్చిన తమ్ముడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తి గ్రామంలో జరిగింది. మామునూరుకు చెందిన ఎర్ర భానుప్రకాష్ (26) మంగళవారం రాత్రి కొండపర్తిలో నివాసమంటున్న తన అక్కాబావ మాదాసు భార్గవి, శ్రీధర్ ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై మామునూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో వరంగల్ నుంచి కొండపర్తికి ఆటో వస్తుంది. ఈ క్రమంలో కొండపర్తి గ్రామ చివర మలుపు వద్ద ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భాను ప్రకాష్‌కు తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు ఎంజీఎం తరలించారు. అయితే భానుప్రకాష్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భాను ప్రకాశ్‌కు గాయత్రితో వివాహం కాగా ఇటీవల కొడుకు జన్మించాడు. మంగళవారం కొడుకుకు 21 రోజు ఫంక్షన్‌ను చేశాడు. మరుసటి రోజు అక్క ఆశీర్వాదం తీసుకోవడం వారి సంప్రదాయం. దీంతో అతను కొండపర్తికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కొడుకు భరత్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. భాను ప్రకాష్ మామునూరు బెటాలియన్‌లో అవుట్ సోర్సింగ్ కుక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. -
తమ్ముడు.. అమ్మా నాన్నలను బాగా చూసుకో!
వరంగల్: తల్లిదండ్రులకు భారం అవుతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ(24) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, పోటీ పరీక్షలకు సిద్ధ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రాసిన పరీక్షల్లో ఉద్యోగం రాకపోవడంతో అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్ ఫోన్లో అమ్మానాన్నలను బాగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్ తెలిపారు. -
స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వస్తూ..
జనగాం/హన్మకొండ: ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్తున్న స్నేహితుడికి ఆనందంగా వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్లారు. రహదారి పక్కన పార్కింగ్ చేసిన లారీని.. బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులు రాకేశ్ చంద్ర గౌడ్ (29), సందీప్ (32) అక్కడిక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో శనివారం ఉదయం దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ గాంధీనగర్‌కు చెందిన వడ్లకొండ నరేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాజ్‌కుమార్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు రాకేశ్ చంద్ర గౌడ్ (29) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 2020లో ములుగుకు చెందిన నందినితో వివాహమైంది. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే, నయీంనగర్‌కు చెందిన వడ్డెపల్లి ఉపేందర్, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు విజయ్ కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు క్రాంతి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండో కుమారుడు సందీప్ (32) బీటెక్ చదివి బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. నిజామాబాద్‌కు చెందిన పరిమళతో 2018లో వివాహమైంది. వీరికి 18 నెలల చిన్నారి ఉంది. లారీ రూపంలో కబళించిన మృత్యువు.. యూఎస్ఏ వెళ్తున్న తమ స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చేందుకు రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ శుక్రవారం రాత్రి బొలెరోలో వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో స్నేహితుడితో గడిపి శనివారం ఉదయం 5 గంటలకు హన్మకొండకు బయలు దేరారు. కోమళ్ల టోల్గేట్ సమీపంలోని మలుపు వద్ద లారీ డ్రైవర్.. నిబంధనలు పాటించకుండా రహదారిపై లారీని నిలిపాడు. ముందు నిలిచి ఉన్న లారీని గుర్తించక బొలెరో ఢీకొంది. దీంతో లారీ కిందికి చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న సీఐ ఆర్ సంతోష్ , ఎస్సై రఘుపతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, స్నేహితులు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం.. పైగా ఇద్దరికి రెండేళ్లలోపు చిన్నారులు ఉండడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది. రాకేశ్ గౌడ్ తండ్రి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. ఇష్టారాజ్యంగా పార్కింగ్.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ జాతీయ రహదారిపై నిర్ణీత ప్రాంతాల్లోనే వాహనాలు నిలపాలి. ఇందుకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లారీలు పార్క్ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఇసుక తీసుకువచ్చే పదుల సంఖ్యలో లారీలను కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఇరువైపులా రోడ్డు పక్కన నిలుపుతున్నారు. అదే ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది. లారీలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే విషయం అనుమానాలకు తావిస్తోంది. -
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర సర్కారు తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ నిధులు ప్రాజెక్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, జాతీయ నాయకులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు. కాజీపేట అయోధ్యపురంలో పీఓహెచ్, వ్యాగన్ల తయారీ కేంద్ర నిర్మాణ ప్రాంతం, బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో మోదీ విజయసంకల్ప సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘బయ్యారం’ఏమైందో కేసీఆర్ చెప్పాలి.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివిధ కారణాలతో సాధ్యం కాలేదని, దీంతో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్‌తో పాటు అదనంగా వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8వ తేదీలోగా దీనికి భూమి కేటాయింపు కూడా పూర్తవుతుందన్నారు. కాగా సుమారు రూ.5,587 కోట్ల వ్యయంతో వరంగల్‌ను కలిపే, పలు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీదేనని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.26 వేల కోట్ల మేరకు ఖర్చవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని, సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, భూసేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు. అధ్యక్షుడి మార్పుపై ఎవరైనా చెప్పారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి నేరుగా స్పందించకుండా జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా మీకు చెప్పారా.. అందరం వేదికపై కలిసే ఉన్నాముగా.. ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది.. అలాంటిదేమీ లేదు’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కిరాణ దుకాణం లాంటిది.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంటేనే ద్రోహం, కుట్రలకు ప్రతిరూపమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందో అన్న భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో.. లేదో?
హనుమకొండ: హనుమకొండలో ఈనెల 8న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో.. అని బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు జన సమీకరణపై ఆదివారం సాయంత్రం హనుమకొండలో సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని.. వాస్తవమేనా? అని బండి సంజయ్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. బండి వల్లే రాష్ట్రంలో బీజేపీ గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని.. ఆయన పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొనగలుగుతున్నాం.. ప్రజల్లో గౌరవం పెరిగింది అని కార్యకర్తలు స్పష్టం చేశారు. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలి.. అని కన్నీటి పర్యంతమయ్యారు. మీ కష్టం వృథా కాదు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకే ఉంటాయి.. అని కార్యకర్తలు బండి సంజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు చెప్పారు. -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు ఊరట
సాక్షి, హన్మకొండ: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట లభించింది. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. కాగా బండి సంజయ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఈనెల 17న హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేసిన సమయంలో చేసిన సూచనలను బండి సంజయ్ ఉల్లంఘించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. విచారణకు సహకరించడం లేదని తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో విబేధించిన మెజిస్ట్రేట్.. బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. చదవండి: వారికే టికెట్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక! -
కాసేపట్లో హన్మకొండలో డీసీపీ కార్యాలయానికి ఈటెల
-
హనుమకొండ: డిబార్ అయిన టెన్త్ విద్యార్ధి పరీక్షకు హాజరు
-
మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎర్త్ డేకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి ప్రకృతి పరిరక్షణ గురించి చెబుతున్న సందర్భం.. అదే సమయంలో కలెక్టరేట్ ఆవరణలో ఓ ప్రభుత్వ వాహనం మూడు గంటలుగా ఆన్‌లోనే ఉంచి.. డ్రైవర్ ఏసీ వేసుకుని ఉన్నాడు.. ఇదేమిటి.. ఇన్ని గంటలు కారును ఆన్‌లోనే ఉంచావు అని అడిగితే ‘మా సార్ బయటికి వచ్చేటప్పటికి కారును చల్లగా ఉంచాలి’ అని సమాధానం. ఇంతకు ఆ కారు ఎవరిదంటే.. బల్దియా ఎస్ఈ అధికారిక వాహనం. గ్రీవెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. కార్యక్రమం ముగిసి బయటికి వచ్చేంతవరకు కారును ఇలా ఆన్‌లోనే ఉంచడం గమనార్హం. ఇదేనేమో ఇంధన పొదుపు.. పర్యావరణ పరిరక్షణ అంటే.. !! -
కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ
సిక్తా పట్నాయక్.. రెండున్నరేళ్లు ఆదిలాబాద్: పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తూ 2020 జూలై 17న ఆదిలాబాద్ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్ శ్రీదేవసేన నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు కలెక్టర్‌గా సేవలందించిన ఆమె ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. కోవిడ్ రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో జిల్లాలో వైరస్ కట్టడికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైరస్ కారణంగా పాలనకు ఇ బ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అమలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎక్కుమంది ఎస్సీలకు భూ పంపిణీ చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను ముందుంచేలా అధికా రులకు మార్గనిర్దేశం చేస్తూ వాటి ఫలితాలను రాబట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనలు సైతం చేపట్టి వారిని ప్రోత్సహించారు. ముఖ్యంగా 2021లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట లు, ఆదివాసీగూడేలు, తండాలను కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లి పరిశీలించారు. వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అండగా నిలిచా రు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారులనే తారతమ్యం లే కుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేశారు. వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించి రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ ఆదిలాబాద్ జిల్లా కొత్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్ నియామకమయ్యారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. అలాగే ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డిని నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌రాజ్ జిల్లా కలెక్టర్‌గా రానున్నట్లు కొద్ది రోజులుగా ఇక్కడి ప్రజల్లో జరుగుతున్న చర్చ నిజమైంది. కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌రాజ్‌ను ఆదిలాబాద్ కలెక్టర్‌గా నియమించారు. గతేడాది కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రసూతి సెలవులకు వెళ్లిన సందర్భంలో ఈయన నెల పాటు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయనే జిల్లా కలెక్టర్‌గా రానుండటంతో తన పనితీరుతో ఎలాంటి ముద్ర వేస్తారనే చర్చ సాగుతోంది. ఆయన గురువారం జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం. -
వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో తొక్కిసలాట
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి. అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగినట్లు సమాచారం. వీరయ్య విజయ విహారం పేరిట వాల్తేరు వీరయ్య చిత్రబృందం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహా మనోడే!) కాగా.. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది వాల్తేరు వీరయ్య. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హిట్‌ను అందుకుంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ తెచ్చుకుంది. -
వాయిదాల్లో ఏసీడీ సేకరణ
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు. -
దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేదు
హనుమకొండ: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయ సన్నిధిలో రామప్ప ఉత్సవాల నిర్వహణకు కేంద్రం అనుమతివ్వకపోవడం బాధాకరమని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయి అన్నారు. శనివారం హనుమకొండలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ పాపారావుతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తి స్థలమైన రామప్పలో చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావ వైరుధ్యాలను కళలకు ఆపాదించడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్ఏలోనే ఉన్నదని పేర్కొన్నారు. వేదాల్లోంచే ఇది వచ్చిందన్నారు. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నానన్నారు. రామప్ప ఆలయం ఆవరణలో ప్రదర్శన రద్దయినా, వెంటనే హనుమకొండలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని, బాధ్యత కలిగిన పౌరురాలిగా గుజరాత్ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత అని చెప్పడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటి పాలకులతో విభేదిస్తూనే ఉన్నానని, అదే కొనసాగుతుందని అన్నారు. -
ఎన్పీడీసీఎల్లో నోటిఫికేషన్ జారీచేయలేదు
హనుమకొండ: టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.గోపాల్‌రావు స్పష్టం చేశారు. ఆన్లైన్ వెబ్సైట్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న ప్రకటన, ప్రచురణతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు, కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటనలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి కథనాలను నమ్మవద్దని, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌కు చెందిన వెబ్సైట్లో చూసుకుని వాస్తవాలు నిర్ధారించుకోవాలని గోపాల్‌రావు సూచించారు. సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడితే అధికారికంగా పత్రికలు, చానళ్లలో నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు 157 యూనిట్లను ఆడిట్ చేయాలని ఎన్పీడీసీఎల్ వెబ్సైట్లో పొందుపరిస్తే.. దీన్ని కొన్ని వెబ్సైట్లు, పత్రికలు 157 పోస్టులుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని, నిరుద్యోగులు దీన్ని గమనించాలని సూచించారు. -
ప్రసూతి ఆస్పత్రి మహిళా సిబ్బంది నిర్వాకం వైరల్
-
ఉసురు తీసిన ఆన్లైన్ బెట్టింగ్
ధర్మసాగర్: ఆన్లైన్ గేమ్‌లో బెట్టింగ్ పెట్టి మోసపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్ శివారులో సోమవారం జరగగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామానికి చెందిన పెసరు రామకృష్ణారెడ్డి (26) రెండేళ్లుగా హనుమకొండలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ కమ్రంలో ఆన్లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్ కట్టి దాదాపు రూ.లక్ష వరకు నష్టపోయాడు. అతడికి మళ్లీ ఓ గేమ్ లింక్ రావడంతో ఆ గేమ్‌లో దాదాపు రూ.6లక్షలకుపైగా క్యాష్ ,క్రెడిట్‌కార్డుల ద్వారా పెట్టాడు. ఆన్లైన్ గేమ్‌ల మూలంగా సంపాదించిన డబ్బుతోపాటు అప్పులు కూడా చేసి నష్టపోయాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరుడు రాజేందర్‌రెడ్డి గ్రామంలో వెతుకుతూ ఉండగా రాంపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ధర్మసాగర్ పోలీసులు తెలిపారు. -
23 నెలలకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
కమలాపూర్: 23 నెలల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఓ చిన్నారి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దివంగత ఆకినపెల్లి కృష్ణ మనుమరాలు శ్రేయాన్వి కృష్ణ వయస్సు రెండేళ్లు కూడా నిండలేదు. ఆమె తల్లిదండ్రులు శ్రావణి–సాయిరాం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. శ్రేయాన్వి తెలుగు పాటలు, పద్యాలు, శ్లోకాల పఠనంతోపాటు తెలుగు సినిమా నటీనటులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను గుర్తించడం, రామాయణంలోని కథలు చెప్పడం, దేవుళ్ల పేర్లను గుర్తించడం, పజిల్స్ సాల్వ్ చేయడం, ఇంగ్లిష్ రైమ్స్ వంటివి చెబుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. తల్లిదండ్రులు.. చిన్నారి వీడియోలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం పంపించారు. -
ప్రజలు ‘కేసీఆర్ ముక్త్ తెలంగాణ’ కోరుకుంటున్నారు: తరుణ్‌ఛుగ్
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘బీజేపీ ముక్త్ భారత్’’పిలుపు హాస్యాస్ప దంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ‘కేసీఆర్ ముక్త్ తెలంగాణ’ కావాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. ‘కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి. ఆయనలో నిరాశ, నిస్పృహ పతాకస్థా యికి చేరుకున్నాయి. అందుకే ముక్త్.. ముక్త్ అంటూ పిచ్చికూతలు కూస్తు న్నారు’ అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారని, కేసీఆర్ కారు స్టీరింగ్ ఆ పార్టీ చేతిలో ఉందని తరుణ్ ఛుగ్ విమర్శించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో శనివారం జరిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య సంస్మరణసభలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో ఏనాడూ దాని గురించి మాట్లాడలేదన్నారు. చదవండి: టీఆర్ఎస్ ఇలానే ఉంటే సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు -
హైడ్రామా మధ్య హనుమకొండ బీజేపీ సభ!
సాక్షి, హైదరాబాద్: ఆంక్షలు, అరెస్టులు, అనుమతుల గందరగోళం మధ్య.. హైకోర్టు జోక్యంతో శనివారం (27వ తేదీన) హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. మునుగోడు ఉపఎన్నిక, రాజాసింగ్ వివాదాస్పద వ్యా ఖ్యల పరిణామాలతో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం హనుమకొండలో జరగాల్సిన బీజేపీ సభకు తొలుత కాలేజీ ప్రిన్సిపాల్, పోలీసులు అనుమతినివ్వడం, తర్వాత రద్దు చేయడంపై.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పలు ఆంక్షలతో సభకు అనుమతిచ్చింది. బీజేపీ నేత జేపీ నడ్డా ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు హైకోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్ర యధావిధిగా కొనసాగింది. జనగామ జిల్లా పాంనూరు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదంతా కేసీఆర్ పనేనని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె ప్రమేయం ఉన్న విషయం ప్రజల్లోకి వెళ్లకుండా యాత్రను అడ్డుకుంటూ బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ యాత్ర, బీజేపీ సభ రెండూ శనివారం పూర్తికానున్నాయి. -
27న హనుమకొండకు జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించడం, పార్టీ ‘ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్’, అనుకూల ప్రచారాన్ని ఉధృతం చేయడంలో భాగంగా బీజేపీ అగ్ర నేతలు వరుస పర్యటనలతో దుమ్మురేపుతు న్నారు. గత నాలుగు నెలల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పలుమార్లు తెలంగాణలో పర్యటించి వివిధ సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు అమిత్ షా రాగా, ఈ నెల 27న హనుమకొండలో సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర–3 ముగింపు బహిరంగసభకు నడ్డా రానున్నారు. ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో మూడుసార్లు పర్యటించగా, నడ్డా కూడా మూడోసారి రాను న్నారు. మే 26న ఐఎస్బీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టు సభ లో, జాతీయ కార్యవర్గభేటీ సందర్భంగా జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ బహిరంగసభలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే దాకా ప్రతీ నెలా రెండురోజులపాటు తెలంగాణలో పర్యటించేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు అమిత్ షా సైతం ప్రకటించారు. నడ్డా సమక్షంలో మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీలో చేరనున్నారు. -
విద్యార్థులను కొట్టి.. ఆపై జండూబామ్ రాసి
హసన్‌పర్తి: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తూ పిల్లల పాలిట విలన్‌గా మారాడు. ప్రతీ దానికి బూతులు తిట్టడమేకాదు.. తమను కొడుతూ.. నొప్పులు తగ్గేందుకు జండూబామ్ రాస్తున్నాడంటూ పలువు రు విద్యార్థులు ఆరోపించారు. విచారణ కోసం పాఠశాలకు వచ్చిన అధికారి ఎదుట తమ ఆవేదన ను వెలిబుచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో ముద్దలు గా అన్నం.. నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఆదివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. అనంతరం పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పూలే పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ (ఆర్సీఓ) మనోహర్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఓ టీచర్ ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ కొడుతున్న వైనాన్ని పిల్లలు వివరించారు. పాఠశాలలో ఎలుకల బెడద ఉందని, సాయి అనే విద్యార్థిని ఎలుకలు కొరకగా ఆస్పత్రికి తీసుకెళ్లమని ఓ ఉపాధ్యాయుడికి చెబితే.. బిర్యాని తినిపించాలని డిమాండ్ చేస్తున్నాడని వెల్లడించారు. విషయాలను హెచ్ఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. విచారణకు ఆదేశం విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తున్న ఉపాధ్యాయు డిపై ఆర్సీఓ విచారణకు ఆదేశించారు. అవన్నీ వాస్తవమని తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. -
కూలీలను లాక్కెళ్లిన మృత్యువు
సాక్షి ప్రతినిధి వరంగల్/శాయంపేట/ఎంజీఎం: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేటలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా కూలీలతో వెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ లారీ ఒరుసుకుంటూ వెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే వాహనంలో 45 మంది వెళ్తుండగా... శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వ్యవసాయ మహిళా కూలీలకు ఉపాధి లేక నిత్యం మొగుళ్లపల్లి మండల పరిధిలోని మిర్చి తోట ల్లో కూలికి వెళ్తున్నారు. రోజుమాదిరే గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 45 మంది మహిళా కూలీలు అదే గ్రామానికి చెందిన క్యాతం రాజుకు చెందిన ట్రాలీ వాహనంలో మొగుళ్లపల్లి మండలం మెదరమెట్ల గ్రామానికి బయలుదేరారు. ట్రాలీలో కుడివైపున 10 మంది, ఎడమ వైపు 10 మంది నిలబడగా మధ్యలో మిగతావారు ఉన్నారు. ట్రాలీకి ఇరువైపులా నిలబడిన వారు చేతులు, తల బయటికి పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో గోవిందాపూర్, తహరాపూర్ గ్రామాల శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న లారీని బూడిద లోడ్‌తో వెళ్తున్న లారీ ఓవర్టేక్ చేస్తూ ట్రాలీ కుడివైపున (డ్రైవర్ సీటువైపు) రాక్కుంటూ వెళ్లింది. దీంతో ఆ వైపు బయటికి చేతులు, తల పెట్టిన బాబు రేణుక (45), పూల మంజుల (45) అక్కడికక్కడే మృతి చెందారు. దండెబోయిన విమల (45), చల్లా అయిల్ కొమురమ్మ (45), కొడిమాల సరోజన, చల్లా రాధ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో సరోజన, రాధల చేతులు తెగిపడ్డాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా విమల, కొమురమ్మ కన్నుమూశారు. స్వల్పంగా గాయపడిన సురబోయిన రేణుక, జక్కుల ఐలమ్మ, గుండెబోయిన ఓదమ్మ శాయంపేటలోని ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతుండగా తలకు గాయమైన మరో క్షతగాత్రురాలు మేకల లక్ష్మి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. తెగిపడిన చేతులు, తలభాగాలతో ఘటనాస్థలిలో భీతావహ దృశ్యం నెలకొంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దేవుడు ఇలా చేస్తాడనుకోలేదు... నా భార్య కూలి కోసం వెళ్లిన అరగంటకే ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చింది. 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నా భార్యను అంబులెన్స్‌లో ఎక్కించా. చికిత్స పొందుతూ చనిపోయింది. దేవుడు ఇంత పనిచేస్తాడనుకోలేదు. – విమల భర్త దండబోయిన కొమురయ్య అమ్మా.. నేనెట్ల బతకాలి.. కూలి పనికి వెళ్లి కానరాని లోకాలకు పోయావా అమ్మా. పనికి పోయి ఇంటికి వస్తదనుకున్నాం. అమ్మ నువ్వు లేనిది నేను ఎట్ల బతకాలి అమ్మా. – మంజుల కుమార్తె, పూల నాగలక్ష్మి సీటీ స్కాన్ కోసం గంట నిరీక్షణ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర సేవ లు అధ్వానంగా తయారయ్యాయి. ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన మరువకముందే అత్యవసర సేవల్లోని డొల్లతనం బయటపడింది. శుక్రవారం మందారిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతల రాధ చేయి తెగింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు ఆమె కు సీటీ స్కాన్ రాయగా ఆస్పత్రిలో సీటీ స్కాన్ 3 నెలలుగా పనిచేయకపోవడంతో సిబ్బంది బాధితురాలిని కాకతీయ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆ సమయానికి టెక్నీషియన్ లేక, విద్యుత్ లేక గంటపాటు నిరీక్షించాల్సి వచ్చింది. -
‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
హసన్‌పర్తి: నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్‌పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. -
నిట్‌లో సైన్స్ వారోత్సవాలు ప్రారంభం
కాజీపేట అర్బన్: హనుమకొండ కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సైన్స్ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ ప్రసార్ సౌజ న్యంతో స్కోప్ ప్రాజెక్ట్ ద్వారా మంగళవారం నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ స్థాయి సైన్స్ వారోత్సవాలను న్యూఢిల్లీ కేం ద్రంగా ఆన్లైన్లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, జితేందర్‌సింగ్ ప్రారంభించారు. అదే సమ యంలో నిట్ క్యాంపస్‌లో సెంట్రల్ యూని వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ జేజే రావు ప్రారంభించారు. అటవీశాఖ ప్రదర్శన, శాస్త్ర వేత్తల ఛాయాచిత్రాల ప్రదర్శన, సైన్స్ ఎగ్జి బిట్స్, పుస్తకప్రదర్శనతో కూడిన సైన్స్ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యా ప్తంగా 75 కేంద్రాల్లో సైన్స్ వారోత్సవాలను ఆయా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండగా, ఏపీ, తెలంగాణల్లో సైన్స్ అండ్ టెక్నాల జీని తెలుగులో అందజేసేందుకు వేదికగా నిట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు
ఖిలా వరంగల్: వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన బోనాసి స్వర్ణలత అలియాస్ కావేరి కొన్నాళ్లుగా తన ఇంట్లో రహస్యంగా వ్యభిచారం సాగిస్తోంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్‌కు చెందిన ఒకరు, కాకినాడకు చెందిన మరో యువతిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: లిప్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని.. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు శివనగర్‌లోని ఆమె ఇంటిపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళల్ని, ఖిలా వరంగల్‌కు చెందిన విటుడు స్వామిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.5,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు నిందితులను అప్పగించి నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సంతోష్, శ్రీనివాస్‌జీ తెలిపారు. -
కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ
హన్మకొండ: కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని నిరసిస్తూ గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మాకు టీచర్లు కావాలి..
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల... మూసివేసే దశ నుంచి ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమ పాఠశాలగా రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది. అలాంటి పాఠశాలలో బదిలీల ప్రక్రియలో ఒక్కరే ఉపాధ్యాయుడు మిగిలారు. తమ భవిష్యత్‌ను కాపాడాలంటూ విద్యార్థులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. అసలు సమస్య ఇదీ.. 2015–16లో 8 మంది ఎస్జీటీ, ఒక టీపీటీ పోస్టుతో ఆంగ్ల మాధ్యమంలో 7వ తరగతి వరకు పునఃప్రారంభమైన ఈ పాఠశాల.. తరువాత పదవ తరగతి వరకు అప్గ్రేడైంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాకుండానే అప్‌గ్రేడ్ కావడంతో సమస్యలు మొదలయ్యాయి. విద్యాకమిటీ సొంత డబ్బులతో కొందరు ప్రైవేట్ టీచర్లను ఏర్పాటుచేసుకుంది. మరోపక్క ఏడవ తరగతి వరకే బోధించాల్సిన ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధించడం కష్టమైనప్పటికి, పాఠశాల అప్‌గ్రేడ్ అవుతున్న విధంగా వారూ అప్‌గ్రేడ్ అయ్యారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద తరగతులకు, ప్రాథమిక పాఠశాలకు ప్రైవేట్ ఉపాధ్యాయులతో బోధన కొనసాగించారు. ఉన్నతాధికారులు సాంకేతిక కారణాలతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మాత్రం మంజూరు చేయట్లేదు. ఈ క్రమంలో ఇటీవల చేపట్టిన బదిలీలతో పాఠశాలలోని 8 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఒకే ఉపాధ్యాయుడు మిగిలారు. దీంతో పాఠశాలలో ప్రస్తుతం ఉన్న 8 ఎస్జీటీ పోస్టులకు అదనంగా 7 స్కూల్ అసిస్టెంట్, ఒక పీజీ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో పాటు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దేవసేనకు 468 మంది విద్యార్థులు కార్డులు రాసి గురువారం పోస్టుచేశారు. -
వానాకాలం ధాన్యం కొనాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాల సందర్బంగా కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరంగల్, సిరిసిల్ల, సంగారెడ్డి తదితర చోట్ల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను టీఆర్ఎస్ యూత్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరివైపు మరొకరు తోసుకుంటూ వెళ్లేందుకు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆరోపించారు. కేంద్రం గత ఆగస్టులోనే 60 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనేందుకు లేఖ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆ తప్పును కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. పంట పొలాల్లో, కల్లాల వద్ద, రోడ్లపై, మార్కెట్ల వద్ద ధాన్యాన్ని రాశులుగా పోసి రోజుల తరబడి నిరీక్షిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళనలో జాతీయ కిసాన్‌మోర్చా నేత గోలి మధుసూదన్‌రెడ్డి, నల్లగొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సంకినేని వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి జిల్లాలో బొక్కా నర్సింహారెడ్డి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం తదితర జిల్లాల్లో బీజేపీ మోర్చా నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్చార్జులు పాల్గొన్నారు. -
‘విజయగర్జన’ దేవన్నపేటలోనే!
హసన్‌పర్తి: ఈ నెల 29న దీక్షాదివస్ రోజున టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభాస్థలి ఖరారైంది. రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించి చివరికి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేటలో బహిరంగసభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తొలుత ఇక్కడ సభానిర్వహణకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం విదితమే. సభాస్థలి కోసం తమ భూములను ఇచ్చేదిలేదని చెప్పిన రైతులు 3 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సభ నిర్వహించే ప్రాంతంలోనే రైతులతో మాట్లాడారు. సభ కోసం భూములు చదును చేసిన తర్వాత తిరిగి హద్దులు గుర్తించడం కష్టమవుతోందని రైతులు, వెంచర్ నిర్వాహకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతోపాటు పంటకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. దీంతో సభానిర్వహణకు భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేసి అంగీకారపత్రాలను అందించారు. దీంతో వెంటనే జేసీబీల ద్వారా భూమి చదును చేసే పను లు ప్రారంభించారు. కాగా, డ్రోన్ కెమెరాలతో సభ కోసం సేకరించనున్నట్టు భూమి మ్యాప్‌ను ప్రద ర్శించారు. విజయగర్జన సభకు దాదాపు పదిలక్షల మందిని తరలించనుండగా, ఇందుకోసం 1,100 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో 300 ఎకరాల్లో సభావేదిక, మరో 8 ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. 20 వేల బస్సులు, మరో 20 వేల వాహనాల్లో కార్యకర్తలను తరలించనున్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సభను విజయవంతం చేయాలి: ఎర్రబెల్లి విజయగర్జనసభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివా రం సాయంత్రం సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో పదిలక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్
కరీంనగర్ అర్బన్: హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో మొత్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల క్రమంలో కోడ్ పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరారు. -
Huzurabad Bypoll 2021:పెంచేటోళ్లు వాళ్లు.. పంచేటోళ్లం మేము
ఇల్లందకుంట/హుజూరాబాద్/ఎల్కతుర్తి: ‘బీజేపీ వాళ్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. నలుగురికి ఉపయోగపడేలా పంచేది టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు ధరలు పెంచేటోళ్ల వైపు ఉంటారా.. లేక పంచేటోళ్ల వైపు ఉంటారా.. ఆలోచించుకొని ఓటు వేయాలి’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల, బూజునూర్, లక్ష్మాజిపల్లి, పాతర్లపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు రోడ్డెక్కితే కార్లు ఎక్కించి చంపుతున్నది బీజేపీ కాదా..? డీజీల్ ధరలు పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ కాదా..? అని ప్రశ్నిం చారు. రైతులను ఉగ్రవాదులుగా పోల్చుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ అని ధ్వజమెత్తారు. రెండున్నర ఏళ్లుగా ఇక్కడి ఎంపీ సం జయ్ ప్రజలకు ఏమైనా ఖర్చు చేశారా అని నిలదీశారు. కాగా, ‘అబ్దుల్ భాయ్.. కైసే హో అంటూ హరీశ్‌రావు హుజూరాబాద్‌లోని చాయ్ హోటల్ యజమాని అబ్దుల్‌ను పలకరించారు. అతని టీస్టాల్లో చాయ్ తాగుతున్న హరీశ్‌రావును చూసి ఆ పక్కనే ఉన్న ఓ సోడా బండి వ్యాపారి వెంటనే బట్టల షాప్‌కి వెళ్లి శాలువా తెచ్చి మంత్రిని సన్మానించాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో ఆరేకుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్కు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. -
‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’
కమలాపూర్: ‘నువ్వు పీసీసీ అధ్యక్షుడివి అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. నీకు దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ తెచ్చుకో’అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘బిడ్డా రేవంత్‌రెడ్డి.. తెలంగాణ లో అక్కడక్కడ సభలు పెడుతున్నావు. కానీ, హుజూరాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతలేవు? ఈటలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నవా?’అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదని, అది విహారయాత్ర అని ఎద్దేవా చేశారు. -
ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. బలరాం నాయక్, పొదెం వీరయ్య, దొంతి మాధవరెడ్డిలకు ప్రజా ప్రతినిధుల కోర్టు వారెంట్లు జారీ చేసింది. విచారణకు హాజరుకానందున కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హన్మకొండలో అనుమతి లేకుండా ప్రదర్శన చేశారని 2018లో కేసు నమోదైంది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీతో బలరాం నాయక్ కోర్టుకు హాజరయ్యారు. బలరాం నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఉపసంహరించింది. విచారణను వచ్చేనెల 3కి ప్రజా ప్రతినిధులు కోర్టు వాయిదా వేసింది. ఇవీ చదవండి: Indira park: లవర్స్‌కు షాక్, వెంటనే వెనక్కి తగ్గిన అధికారులు Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు -
ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/హన్మకొండ కల్చరల్: ప్రఖ్యాత చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్టు, ఇలస్ట్రేషనిస్టు చంద్ర (75) ఇక లేరు. ఆయన అసలు పేరు మైదం చంద్రశేఖర్. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్.కె. మదర్ థెరెసా రిహాబిలిటేషన్ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి 1:40 గంటలకు కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. మూడేళ్ల క్రితం బాత్రూంలో కాలు జారిపడటంతో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడం, కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విజయభార్గవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి. చిన్ననాటి నుంచే చిత్రకళపై అభిరుచి... పూర్వ వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన మైదం రంగయ్య, సోమలక్ష్మి దంపతులకు 1946 ఆగస్టు 28న చంద్ర జన్మించారు. తల్లి ఎడ్లబండిలో వెళ్తున్న క్రమంలో నిండు పున్నమి రోజున జన్మించడంతో ఆయనకు చంద్రశేఖర్‌గా పేరు పెట్టారు. స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి ఆదివారం ఖిలా వరంగల్ వెళ్లి అక్కడి శిల్పాలను చూస్తూ వాటి బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లులో తొలుత పనిచేసిన ఆయన తండ్రి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆప్కోలో చేరడంతో కుటుంబం హైదరాబాద్‌కు మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పల్లా దుర్గయ్య ఇంట్లో వారు ఉండే సమయంలో వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య తదితర సాహితీవేత్తలతో చంద్రకు పరిచయం ఏర్పడింది. అలాగే సుల్తాన్ బజార్‌లోని లైబ్రరీ చంద్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. డాక్టర్ వద్దనుకొని చిత్రకారుడిగా.. బాపు బొమ్మలను చూస్తూ చిత్రాలను వేయడం మొదలుపెట్టిన చంద్ర.. పీయూసీ చదివే రోజుల్లోనే సిటీ ఇన్ ద లైట్ చిత్రం వేసి ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చారు. పీయూసీ పరీక్షల్లో పాసైతే తండ్రి తనను మెడిసిన్ చదివించే అవకాశం ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా రాయకుండా వచ్చేశారు. చిత్రకారుడిగా కావాలనే కృతనిశ్చయంతో హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశాక విజయభార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సినీరంగంతోనూ అనుబంధం... చంద్ర పలు నాటకాల్లో నటించారు. చిల్లర దేవుళ్లు చిత్రంతోపాటు మరో బెంగాల్ చిత్రంలోనూ హీరోగా నటించే అవకాశం వచ్చినా నటించలేదు. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, తరం మారింది, మంచు పల్లకి, డిటెక్టివ్ నారద తదితర 20 చిత్రాలు, 6 లఘుచిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. అలాగే రచయితగా, సాహితీవేత్తగా 150 కథలు, అనేక కవితలు రాశారు. యర్రంశెట్టి సాయి, పమ్మి వీరభద్రరావులతో కలసి గొలుసు నవల కూడా రాశారు. మల్లాది, సూర్యదేవర, యండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితల నవలలు చంద్ర ముఖచిత్రాలతో ఆకట్టుకొనేవి. స్వాతి, ఆంధ్రభూమి వంటి వారపత్రికలకు ఆయన క్రమం తప్పకుండా బొమ్మలు గీసేవారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు ప్రశంసలను అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య, పల్లా దుర్గయ్య, కాళోజీలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. సీఎం కేసీఆర్ సంతాపం... ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్ చంద్రశేఖర్ (చంద్ర) మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్ర మృతికి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డాక్టర్ తిరుక్కోవలూరు శ్రీరంగస్వామి, ఆర్టిస్ట్ మల్లిక్ తదితరులు సైతం సంతాపం తెలిపారు. ముఖ చిత్రాలు..వ్యంగ్య చిత్రాలకు పెట్టింది పేరు చంద్ర అనేక దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలలో వ్యంగ్య చిత్రాలు, కథలకు బొమ్మలు వేసేవారు. ప్రముఖుల రేఖా చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. నవలలు, పుస్తకాలకు ఆయన వేసిన ముఖ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి. 1970 నుంచి 2010 వరకు చంద్ర వేసిన ముఖచిత్రాలతో కొన్ని వేల పుస్తకాలు వెలు వడ్డాయి. మనుషుల మానసిక ప్రపంచాన్ని, స్త్రీ పురుషుల్లోని ఆంగిక సౌందర్యాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రించిన ప్రత్యేక శైలి ఆయనది. ప్రపంచంలో విప్లవాల దశ కొనసాగిన సమయాన తన కళను ఆయుధంగా చేయాలనుకొని విరసం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. -
యువతి గొంతు కోసి హత్య చేసిన యువకుడు
-
మరో ఉన్మాది
సాక్షి, వరంగల్: తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఓ ఉన్మాది ఆ యువతి ప్రాణాలు తీశాడు. కత్తితో గొంతు కోసి పాశవికంగా చంపేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్నా కనికరించకుండా అక్కడి నుంచి చక్కగా ఇంటికి వెళ్లి స్నానం చేసి మరీ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడు. ఈ దారుణమైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్ పరిధి క్రాంతినగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దగా మారి ఆ యువతి హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. యువతి హారతి డిగ్రీలో క్లాస్మేట్స్.. హన్మకొండ లష్కర్ సింగారానికి చెందిన మునిగాల ప్రదీప్– రేణుక దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురికి వివాహం కాగా, కుమారుడు ప్రణీత్ నాలుగేళ్ల కిందట రాంపూర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురు హారతి (27). ఆమె తండ్రి ప్రదీప్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. హారతి డిగ్రీ పూర్తిచేసి స్థానికంగా ఓ కాలేజీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. హన్మకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. కాజీపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహిద్ (28)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. షాహిద్ డిగ్రీ ఫెయిల్ కావడంతో కాజీపేటలో తన తండ్రి నిర్వహిస్తున్న మటన్షాపులోనే పనిచేస్తున్నాడు. రోదిస్తున్న హారతి తల్లి , నిందితుడు షాహిద్ (ఫైల్) అద్దె గదికి పిలిపించి.. రాంనగర్లో షాహిద్ గదిని అద్దెకు తీసుకున్నాడు. హారతి సోదరి నివాసముంటున్న ఇంటి సమీపంలోనే ఆరు నెలల కింద షాహిద్ ఓ గదిలో అద్దెకు దిగాడు. ఆ గదికి నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చి పోయేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అద్దె మాత్రం నెలనెలా చెల్లించేవాడు. ఈ గదికే శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసి హారతిని పిలిపించాడు. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకున్నట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ముందుగానే షాహిద్ దగ్గర మటన్ కత్తి ఉండటంతో ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కత్తితోనే హారతి గొంతు కోశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగానే గదికి తాళం వేసి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఇంటికి రెండు గేట్లు ఉన్నాయి. ముందువైపు ఉన్న గేటులో నుంచి కాకుండా హత్య చేశాక పక్క ఉన్న మరో గేటులో నుంచి నిందితుడు వెళ్లిపోయాడు. సెంట్రల్ జైలుకు.. ఆపై సుబేదారి పీఎస్‌కు హారతిని హత్య చేసిన షాహిద్.. చక్కగా విష్ణుపురిలోని తన ఇంటికి వెళ్లి స్నానం చేసి.. వేరే దుస్తులు మార్చుకున్నాడు. అనంతరం ఆటోలో వరంగల్‌లోని సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడి సిబ్బందిని కలసి హత్య చేసినట్లు చెప్పగా.. తాము అదుపులోకి తీసుకోబోమని.. సుబేదారి పోలీసుల వద్దకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. దీంతో మళ్లీ వేరే ఆటోలో సుబేదారి పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. తాను హత్య చేసిన విషయాన్ని చెప్పడంతో పాటు కత్తి, గది తాళాలు అప్పగించాడు. దీంతో పోలీసులు షాహిద్‌ను తీసుకుని హత్య జరిగిన గది వద్దకు వెళ్లారు. గది తాళం తీసి చూసే సరికి రక్తపు మడుగులో హారతి శవంగా పడిఉంది. కాగా, హారతి హత్యకు గురైనట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎవరి నుంచో ఫోన్ రాగానే ‘బయటకు వెళ్లొస్తాను’అని చెప్పి వెళ్లిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. హారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి తర్వాత యువతి పెళ్లి.. హత్యకు గురైన హారతికి సంక్రాంతి పండుగ తర్వాత వివాహం జరగాల్సి ఉంది. వరంగల్‌కే చెందిన ఓ యువకుడితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. ఇంతలోనే హత్యకు గురి కావడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కాగా, వేరే యువకుడితో సన్నిహితంగా ఉండటం.. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో కోపాన్ని పెంచుకున్న షాహిద్.. తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుండా పోతుందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిందితుడు చెబుతున్నాడు. ఆ ఇల్లు ఏఆర్ ఎస్సైది.. ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఎంతగా చెప్పినా వినిపించుకోవట్లేదని ఈ ఘటనతో మరోసారి అర్థమవుతోంది. నిందితుడు షాహిద్ అద్దెకు తీసుకున్న ఇళ్లు పోలీసు కమిషనరేట్‌లో పనిచేసే నర్సింగరావుది. ప్రస్తుతం ఆయన శిక్షణలో ఉన్నారు. షాహిద్ అద్దెకు తీసుకున్న గదిలో ఒక ఫ్యాన్, ఒక టీపాయ్, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. 6 నెలలుగా కిరాయికి ఉంటూ.. నెలలో ఒకట్రెండు సార్లు వచ్చి పోతున్నా ఎన్నడూ అతడిని ప్రశ్నించిన సందర్భాలు లేనట్లు తెలిసింది. కాగా, తాను ప్రేమించిన హారతి ఇటీవల మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం వల్లే తాను హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించి మంత్రి ఎర్రబెల్లి యువతి హత్య జరిగిన విషయం తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ వినయ్‌భాస్కర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు యువతి కుటుంబసభ్యులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ కూడా ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
ప్రియురాలి గొంతుకోసి చంపిన యువకుడు
సాక్షి, వరంగల్ : ఓ ఉన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వరంగల్ అర్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హన్మకొండ రాంనగర్లో షాహిద్ అనే యువకుడు...ఓ యువతిని గొంతుకోసి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు షాహిద్ పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మృతురాలు హారతిగా గుర్తించారు. కాగా గత కొంతకాలంగా షాహిద్‌కు హారతికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు హారతి తనను నిర్లక్ష్యం చేస్తోందనే అనుమానంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేయూలో అధికారి సంతకం ఫోర్జరీ
సాక్షి, కేయూ: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న ఒకరు అధికంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో అక్రమానికి తెగపడ్డాడు. ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకం ఫోర్జరీ చేసి.. వాల్యుయేషన్ చేసినట్లుగా కొందరు అధ్యాపకుల పేర్లతో బిల్లులు తీసుకునేందుకు యత్నించాడు. అయితే, ఈ బిల్లును పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగం అధికారులు గుర్తించడంతో సదరు క్యాజువల్ లేబర్ మోసం బయటపడింది. ఈ మేరకు ఆయనను తొలగిస్తూ రిజిస్ట్రార్ కె.పురుషోత్తం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీజీ పరీక్ష జవాబుపత్రాలు దిద్దినట్లుగా... కేయూ పీజీ కోర్సుల వివిధ సెమిస్టర్ పరీక్షలు జరిగాక జవాబుపత్రాల వాల్యూయేషన్ చేయిస్తారు. ఇందులో పాల్గొ నే అధ్యాపకులు తాము ఎన్ని పేపర్లు దిద్దామో చెబుతూ బిల్లులు సమర్పించాలి. వీటిని తొలుత అదనపు పరీక్షల నియంత్రణాధికారి పరిశీలించి సంతకం చేస్తే అకౌంట్స్ విభాగం ఉద్యోగులు పాస్ చేసి అకౌంట్లలో రెమ్యూనరేషన్ జమ చేస్తారు. దీనిని పరీక్షల విభాగం పీజీ సెక్షన్లో కొన్నేళ్ల నుంచి క్యాజువల్ లేబర్‌గా పనిచేసే రవి అనే వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వివిధ సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలు ముగ్గురు అధ్యాపకులు వాల్యూయేషన్ చేసినట్లుగా.. ఒకరు ఓయూ అధ్యాపకుడు, మరో ఇద్దరు కేయూ అధ్యాపకుల పేరిట దొంగ బిల్లులు తయారు చేశాడు. మూడు బిల్లులు కలిపి రూ.37వేలకు పైగా సమర్పించాడు. ఆ బిల్లులపై ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సురేఖ సంతకం పోర్జరీ చేశారు. ఆ తర్వాత బిల్లులును ఇటీవల పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగంలో అందజేయగా అక్కడి ఉద్యోగులకు అనుమానం వచ్చింది. ముగ్గురు అధ్యాపకుల పేరిట సమర్పించిన బిల్లుల్లో పక్కన ఒకే బ్యాంకు అకౌంట్ నంబర్ ఉండడంతో ఆరా తీయగా అది రవి భార్య అకౌంట్‌గా తేలింది. దీంతో విషయాన్ని గుర్తించి బిల్లులు ఆపేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పాత బిల్లులను కూడా పరిశీలించగా గత ఏడాది కూడా దొంగబిల్లు సమర్పించి రూ.2,600 కాజేసినట్లు తేలింది. క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశాలు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న రవి వ్యవహారాన్ని అధికారులు ఇన్చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిని తొలగించాలని సూచించగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.మహేందర్‌రెడ్డిని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మానవమృగం
హన్మకొండ చౌరస్తా: మానవత్వమే కన్నీరు పెట్టింది. తాను మనిషిని అని మరిచిన ఓ మృగం అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండలోని కుమార్‌పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం. రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. పాప ఆధార్ కార్డు నమోదు కోసం ఈనెల 17న కూతురుని తీసుకుని హన్మకొండలోని తల్లిగారింటికి రచన భర్త జగన్‌తో వచ్చింది. మరుసటి రోజు ఆధార్ సెంటర్‌కు వెళ్లగా జనం అధికంగా ఉండటంతో మరుసటి రోజు రావాలని నిర్వాహకులు సూచించారు. అయితే జగన్‌కు ఆఫీసులో అత్యవసర పని ఉండటంతో భార్య, కుమార్తెను ఇక్కడే ఉంచి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అర్ధరాత్రి అపహరణ రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్‌ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ జంక్షన్లో ఆందోళన చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, శ్రీహిత (ఫైల్) ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. పంచనామా చేసిన హన్మకొండ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం చితకబాదారు నిందితుడు వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం వసంతపూర్‌కు చెందిన పోలెపాక ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. రెండేళ్లుగా హన్మకొండ కుమార్‌పల్లిలో అద్దె గదిలో ఉంటూ స్థానికంగా ఓ రెస్టారెంట్లో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసైన ప్రవీణ్..మత్తులో సైకోగా మారుతాడని తెలిసింది. రెండు నెలల క్రితం అర్ధరాత్రి ఓ ఇంట్లో నిద్రిస్తున్న దంపతుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తుండటంతో గమనించిన స్థానికులు చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు చెబుతున్నారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన పోలీసుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోస్టుమార్టం చేయనిచ్చేది లేదని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఎంజీఎం మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. అలాగే.. హన్మకొండ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు. కఠిన చర్యలు తీసుకోండి ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యాచారం చేసి ఆపై హత్య ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి ఎంజీఎం : శ్రీహిత మృతదేహానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి తలపై రెండు ప్రదేశాల్లో గాయాలైనట్లు నిర్ధారించారు. -
నామినేషన్ వేస్తున్నారా..
సాక్షి,హన్మకొండ :ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు రిటర్నింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతిపాదకులు, అఫిడవిట్ ఫొటోలు అందజేయాలి. ఫారాలు పూర్తిగా నింపాలి. ఇందులో ఏ మాత్రం తేడాలు ఉన్నా నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లలో అందజేయాల్సిన వివరాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. నామినేషన్ వేసేందుకు 2బీ ఫారం ఉచితంగా రిటర్నింగ్ అధికారుల వద్ద లభిస్తుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు పత్రాల నామినేషన్లు వేయొచ్చు. నామినేషన్ కోసం రెండు స్టాంప్ సైజ్ ఫొటోలు అవసరం. వాటిలో ఒకటి నామినేషన్ పత్రంపై, మరొకటి ఫారం 26పై (అఫిడవిట్) అతికించాల్సి ఉంటుంది. పోటీచేసే జనరల్ అభ్యర్థులు 10 వేల రూపాయల డిపాజిట్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదు వేలు జమచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జతచేయాలి. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ (రాష్ట్రీయ) పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులకు తమ నామినేషన్లో అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఫారం 2బీలో పార్ట్–1లో అడుగుతారు. పోటీ చేయడానికి నామినేషన్ వేసే ఇతర అభ్యర్థులు ..అంటే రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు అదే నియోజకవర్గంలోని 10 మంది ఓటర్లు, ఫారం 2బీలోని పార్ట్–2లో ప్రతిపాదించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంలో ఫారం 2బీ లోని పార్ట్–3లోని కాలం–సీ లో ఎన్నికల సంఘం సూచించిన వాటిలో మూడు గుర్తులను ప్రాధాన్యతా క్రమంలో తెలపాల్సి ఉంటుంది. అభ్యర్థి ఆ నియోజక వర్గం స్థానికుడు కానట్లైతే అతడు ఓటరుగా ఉన్న నియోజక వర్గం నుంచి ఈఆర్ఓ ధృవీకరణ చేయించిన పత్రం నామినేషన్‌తో జతచేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ప్రతిపాదకులు నిరక్షరాస్యులు అయితే రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. పోటీచేసే అభ్యర్థి తన ఎన్నికల ఖర్చుల లెక్కలకు సంబంధించి నామినేషన్ వేయడానికి 48గంటలముందు తన పేరుతో కొత్తగా బ్యాంక్ ఖాతా ప్రత్యేకంగా ప్రారంభించి అందజేయాల్సి ఉంటుంది. గతంలో తెరిచిన ఖాతాలు అందజేయడానికి వీలులేదు. నామినేషన్ పత్రంలోని ప్రతికాలం తప్పనిసరిగా పూర్తిచేయాలి. ఒకవేళ వదిలేస్తే అక్కడ..లేదు... వర్తించదు అని తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క కాలం కూడా ఖాళీగా వదలకూడదు. (–)లతో కాలం నింపవద్దు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్, గుర్తింపు పొందని పార్టీలు ఫారం–ఏ, ఫారం బీ ఇంకు సైన్ చేయబడిన ప్రతిని నామినేషన్ల చివరి రోజు డిసెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఫారం–26 నోటరైజ్డ్ అఫిడవిట్లో అన్ని కాలమ్స్ నింపాలి. అభ్యర్థి తన నామినేషన్ పత్రంలో తనపైగల క్రిమినల్ కేసుల వివరాలు పార్ట్–3ఏ లో తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది. కరంటు బిల్లు, ఇంటిపన్ను, నీటిపన్ను , ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్నట్లైతే గత 10 సంవత్సరాలుగా బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే ముందు భారత ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రతిజ్ఞ/శపథం/ తెలుగు లేదా ఇంగ్లీష్‌లో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞతను నచ్చిన దేవుని పేరుతోగానీ, మనస్సాక్షి ప్రకారం చేయొచ్చు. అభ్యర్థి తన యొక్క స్పెసిమెన్ సంతకం రిటర్నింగ్ అధికారికి అదజేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తన పేరు బ్యాలెట్ పేపర్లో ఏవిధంగా ముద్రించాల్సి ఉంటుందో పేపర్ పైన రాసి ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి నుంచి పొందాల్సినవి.. చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రసీదు. స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు ఎన్నికల వ్యయం నమోదు రిజిస్టర్ కరపత్రాలు, పోస్టర్లు, ప్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రి ముంద్రించేందుకు చట్టంలోని సెక్షన్ 127–ఏ కింద సూచనలు ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధృవీకరణ పత్రం నామినేషన్ పత్రంలోని లోపాలు, ఇంకా జత చేయాల్సిన పత్రాల సూచిన(చెక్ మెమో) -
మద్యం మత్తులో యువకుడి దారుణ హత్య
హన్మకొండ చౌరస్తా : ‘మా అన్న కొడుకు పుట్టిన రోజు మీరంతా తప్పకుండా రావాలి రా..’ అన్న స్నేహితుడి ఆహ్వానంతో వచ్చిన ఐదుగురు మిత్రుల్లో ఒకరు విగతజీవిగా మారాడు. అప్పటి వరకు పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న వారంతా.. వేడుక అనంతరం మందు పార్టీలో మునిగిపోయారు. పుల్లుగా తాగిన స్నేహితుల్లో ఇద్దరి మధ్య రాజుకున్న చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి క్షణికావేశానికి తోటి స్నేహితుడి నిండు ప్రాణం తీసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీతో సందడిగా ఉన్న హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగిన హత్యోదంతం కలకలం సృష్టించింది. హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రతాప్‌నగర్‌కు చెందిన శ్రీపతి అభిలాష్ అన్న కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం సాయంత్రం హన్మకొండలో నిర్వహించారు. పుట్టిన రోజు ఫంక్షన్‌కు ఒకే ఊరికి చెందిన తన స్నేహితులైన ప్రతాప్ సురేష్(30), మోతె స్వామి అలియాస్ శ్యాం, కిరణ్, హరీష్‌లను ఆహ్వానించారు. వారంతా హన్మకొండకు చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8.45గంటల సమయంలో నక్కలగుట్టలోని హోటల్ ల్యాండ్‌మార్క్ లో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడ బాగా మద్యం తాగారు. కాగా ప్రతాప్ సురేష్ , మోతె స్వామి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్ పై స్వామి చేయి చేసుకున్నాడు. అక్కడ గొడవు ముదురుతున్న సమయంలో బార్లో నుంచి సెల్లార్ కు చేరుకున్నారు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఇంటికి వెళ్లేందుకు సురేష్‌ను వదిలేసి మిగిలిన నలుగురు హన్మకొండ బస్టాండ్ కు చేరుకున్నారు. మనస్థాపం చెందిన ప్రతాప్సురేష్ హన్మకొండలోనే ఉంటున్న తన పెద్దమ్మ కొడుకు మేకల సతీష్‌కు ఫోన్ చేసి తనను శ్యామ్ కొట్టాడని నువ్వు త్వరగా రావాలని మాట్లాడాడు. దీంతో సతీష్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అప్పటికే ఊరెళ్లడానికి బస్సు ఎక్కేందుకు వెళ్తున్న స్వామిని సురేష్ రెచ్చగొట్టాడు. స్వామి కోపోద్రిక్తుడై సురేష్ ఛాతి పై బలంగా గుద్దగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా నిందితుడు మోతె స్వామి సెంట్రింగ్ పనిచేస్తున్నారు. కాగా నిందితుడు స్వామి , అతడి స్నేహితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలపారు. కాగా తెల్లవారుజామునే నిందితుడు స్వామితో పాటు స్నేహితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్‌లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్‌లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు. -
ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం
హన్మకొండ (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లా హన్మకొండలో 'ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. శనివారం హన్మకొండలోని ఏనుగుల గడ్డలో ప్రొ. జయశంకర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ప్రమాద బీమా వస్తుందని గుర్తుచేశారు. జీవితబీమా సౌకర్యం కల్పించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
-
ఏసీబీ వలలో అవినీతి చేప
హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణమూర్తి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హన్మకొండ పీఏసీఎస్ వైస్ చైర్మన్ కంకల సదానందం నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు. పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు సదానందంను కృష్ణమూర్తి రూ.2 లక్షలు లంచం అడిగాడు. సదానందం ఇంతకు ముందే రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.50 వేలు కూడా ఇచ్చేందుకు సదానందం సిద్ధమయ్యగా.. మరో పదివేల రూపాయలు అదనంగా ఇవ్వాలని కృష్ణమూర్తి డిమాండ్ చేయడంతో సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పధకం ప్రకారం ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడ్ని జైలుకు తరలించారు. -
బేరం కుదిరింది!
సాక్షి, హన్మకొండ : అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఊరుకోం.... కేసులు పెడతాం... జరిమానాలు విధిస్తాం.... పోలీస్, రెవెన్యూ అధికారులు చెప్పిన మాటలివి. ఈ హెచ్చరికలు మూన్నాళ్ల ముచ్చటగానే మారారుు. మాఫియూతో సయో ధ్య కుదరడంతో నిబంధనలు సైతం ఇసుకలోనే కలిసిపోయూరుు. పట్టుమని పది రోజులు కాలే దు... అధికారులు తోకముడవడంతో ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు... ఆరు ట్రిప్పులు అన్నట్లుగా సాగుతోంది. ఆకేరు దందాకు అడ్డే లేదు స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల గుం డా ఆకేరు వాగు ప్రవహిస్తోంది. ఈ వాగుకు సంబంధించిన ఇసుకు మాఫియాకు వర్ధన్నపేట మండలమే కేంద్రం. ఇక్కడి నుంచి వాగు లో ఉన్న ఇసుకతోపాటు వాగు వెంట ఉన్న భూముల్లోకి చొచ్చుకుని వెళ్లి భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతోపాటు ఆకేరు గట్టు వెంబడి ఉన్న తోటలు సైతం ధ్వంసమవుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్ర మ రవాణాను పూర్తి స్థాయిలో నివారించలేకపోయూరు. ఇసుక మాఫియూ దందాకు ఆకేరు వాగుకు ఇరువైపులా ఉన్న ఇల్లంద శివారు 551-ఏలో 6.5 ఎకరాలు, కొత్తపెల్లి శివారు సర్వే నంబర్ 275లో 10 ఎకరాలు, ల్యాబర్తి శివారులోని 166 సర్వే నంబర్లో 10 ఎకరాలు, 170 సర్వే నంబర్లో 22 ఎకరాల ప్రభుత్వ అసైన్ట్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఇసుక మాఫియాపై నలువైపులా విమర్శలు వెల్లువెత్తాయి. వాత పెట్టారు... ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విషయం మండలంలో చర్చనీయాంశంగా మారి... ఆయా శాఖల అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పందించి న అధికారులు పది రోజుల క్రితం ఆకేరు వాగులో దాడుల నిర్వహించి భారీ సంఖ్యలో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమో దు చేశారు. అధికారులు వస్తున్నారనే సమాచారం ముందస్తుగానే తెలుసుకున్న కొంత మంది యజమానులు ట్రాక్టర్లను తీసుకుని పారిపోయారు. రెండు రోజులపాటు ఇసుక అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇసుక రవాణాను అడ్డుకున్నట్లు ఇరు శాఖల అధికారులు ప్రకటనలు ఇచ్చారు. కానీ... ఆ తర్వాత విచారణ పేరిట కాలయాపన చేశారు. అదే బాటలో రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ బాటలోనే రెవెన్యూ అధికారులు నడిచారు. ఇల్లంద శివారు 551-ఏ సర్వే నంబర్లోని 6.5 ఎకరాల అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన మల్లెపాక యాకయ్య, పీరయ, బొందయ్య, కన్నెబోయిన అయిలయ్య, జోగుల సాయిలు, దొమ్మటి మల్లయ్యకు 1977లో లావని పట్టాలు ఇచ్చారు. నిరుపేద రైతులకు అందించిన అసైన్డ్ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇసుక వ్యాపారుల చేతుల్లోకి వెళ్లేలా మార్గం సుగమం చేశారు. అసైన్డ్ భూమిని అమ్ముకున్న రైతులకు నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. కొందరికి ఆ నోటీసులు కూడా ఇవ్వలేదు. ముడుపులు అందించారు... తమ ఆర్థిక మూలాలకు గండిపడుతోందని భావించిన అక్రమార్కులు ఇసుక మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తితో సమాలోచనలు జరిపారు. ఓ దళారీ ద్వారా రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులతో చర్చలు ప్రారంభించారు. ఇరువర్గాలతో చర్చలు జరిపిన దళారులు దాడు లు చేయకుండా ఉండేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులకు చెరో రూ.లక్ష చెల్లించే విధంగా బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ప్రతి ట్రిప్పు ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున పోలీసు శాఖకు చెల్లించే ప్రతిపాదనలు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే ముడుపులు ముట్టినట్లు ప్రచారం సాగుతోం ది. ‘అందరికీ ముడుపులు అందాయి.. గొడవ సద్దుమణిగింది.’ అని ఓ రెవెన్యూ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
రైతుల పాలిట వ్యాగన్
సాక్షి, హన్మకొండ: వ్యాగన్ పరిశ్రమ కలసాకారమయ్యే వేళ మరో చిక్కుముడి వచ్చి పడింది. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరే ఇందుకు కారణం. 2009-10 రైల్వే బడ్జెట్లో కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రక టించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మిస్తామని వెల్లడిం చారు. ఇందులో భాగంగా మడికొండ సమీపంలోని మెట్టుగుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధీనంలోని 54.38 ఎకరాల భూమిని వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైనదిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ.. ఆలయ భూములను ఇచ్చేందుకు దేవాదాయ శాఖ విముఖత వ్యక్తం చేయడంతో వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు అటకెక్కింది. కొంత కాలానికి పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని కోరుతూ హై కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 2013 ఫిబ్రవరిలో హై కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు రూ.18 కోట్లు కేటాయిస్తూ 2013 నవంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదాయశాఖకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాగం పనులు మొదలు పెట్టింది. ఎట్టకేలకు పనులు మొదలుపెట్టే సమయం ఆసన్నమైన తరుణంలో మరో వివాదం వ్యాగన్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తోంది. వ్యాగన్ ఫ్యాక్టరీకి కేటాయించిన 54 ఎకరాలపై 20 రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. తమకు జీవన భృతి చూపకుండా మెట్టుగుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములను వ్యాగన్ పరిశ్రమకు ఎలా కేటాయిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేస్తున్నామని... ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను అడ్డుకోవడంతో వివాదం ముదురుతోంది. నిర్లక్ష్య ఫలితమే... వాస్తవానికి దేవాదాయశాఖకు చెందిన భూములను ఎటువంటి అనుమతి లేకుండానే రైతులు సాగు చేసుకుంటున్నారు.ముప్పై ఏళ్లుగా దేవాదాయశాఖ అధికారులు ఈ రైతులకు నోటీసులు ఇవ్వడం కానీ, కౌలు రైతులుగా గుర్తించేందుకు కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మరోవైపు గడిచిన ఐదేళ్లుగా కాజీపేట వ్యాగన్ పరిశ్రమ వ్యవహారం రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలుగుతోంది. ఈ సందర్భంలో అయినా వ్యాగన్‌కు కేటాయించే భూములపై సర్వే చేయించి ఆ భూములపై ఆధారపడ్డ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించింది. వ్యాగన్ పరిశ్రమకు ఆలయ భూములు కేటారుుస్తారనే ప్రచారం జరగడంతో తమను కౌలు రైతులుగా గుర్తించడమో... లేకుంటే తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఇక్కడి రైతులు గ్రీవెన్స్‌సెల్‌లో పలుదఫాలుగా దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ బుట్టదాఖలు కావడంతో సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. మరో నెల రోజుల వ్యవధిలో కేంద్రం 2014-15 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ వివాదానికి అధికారులు సత్వర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. సాధ్యమైనంత త్వరగా భూమిని సేకరించి రైల్వేశాఖకు అప్పగించకపోతే.. మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తాతల నాటి నుంచీ దున్నుకుంటున్నాం మేము తాతల కాలం నుంచి దేవాలయ భూములను దున్నుకుంటున్నం. ఇప్పుడు వ్యాగన్ పరిశ్రమకు భూములు ఇస్తే మేము ఎట్ల బతకాలే. నష్టపరిహరం చెల్లించి, ఇంటికొక్కరికి ఉద్యోగం కల్పించాలి. అప్పుడే భూములను అప్పగిస్తాం. ఇన్నేళ్లుగా గ్రామ పంచాయతీకి భూమి సిస్తు చెల్లించినం, బావుల కాడ కరెంట్ బిల్లులు ఉన్నాయి. ఈ భూమిపై మాకే హక్కుంది. - ఉల్లేంగుల శ్రీనివాస్ 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నం నేను 60 ఏళ్ల్ల సంధి భూమి సాగు చేస్తున్న. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని తీసుకుంటే ఎట్ల... నష్ట పరిహారం కట్టియ్యాలే. ఇంట్లో ఒకరికి వ్యాగన్ పరిశ్రమలో కొలువు ఇయ్యాలే . - మామిండ్ల ఉప్పలయ్య మొత్తం వ్యాగన్ పరిశ్రమకే పోతున్నది నాకు ఉన్న నాలుగెకరాల భూమి మొ త్తం వ్యాగన్ ఫ్యాక్టరీకే పొతున్నది. నేను 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుం టున్నా. ఇప్పుడు భూములు తీసుకుంటే కుటుంబం ఎట్లా గడుస్తది. - ఎల్పుల వెంకటయ్య -
కట్టబెట్టేదిఎవరికో...
=రూ .72 లక్షల విలువైన పనుల టెండర్లు రద్దు =చక్రం తిప్పిన ఐటీడీఏ ఇంజినీర్లు =కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించేలా ఎత్తుగడ =డిపార్ట్మెంట్ పేరిట అనుంగు కాంట్రాక్టర్‌కు అప్పగించే యత్నం మేడారం మహా జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ... అధికారులు తమ తమ ఆలోచనలకు పదునుపెట్టారు. వనదేవతల సందర్శనార్థం వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకని అనుకుంటే మాత్రం పొరపాటే. తమ దగ్గరివారికి పనులు కట్టబెట్టి.. జేబులు నింపుకునేందుకు వారు కొత్త ఎత్తులు వేశారు. ఇన్‌ఫిల్టరేషన్ పనుల్లో ఏకంగా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి... టెండర్ల పద్ధతికి స్వస్తి పలికించి... దోపిడీకి దారి సుగమం చేసుకున్నారు. సాక్షి, హన్మకొండ: గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్ ఎస్ఈ లేకపోవడంతో... ఐటీడీఏ ఇంజినీర్ల హవా నడుస్తోంది. పలువురు అధికారులు చక్రం తిప్పి.. డిపార్ట్మెంట్ పేరిట తమ అనుంగు కాంట్రాక్టర్‌కు ఇన్‌ఫిల్టరేషన్ పనులు అప్పగించేందుకు తెగబడ్డారు. వాటాల కోసం సర్కారు ఖజానాకు ఎసరు తెచ్చారు. టెండర్ల దాఖలు చివరి రోజున రద్దు చేసినట్లు ప్రకటించి తమ చాణక్యతను చాటుకున్నారు. మహా జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలుకలగుట్ట వద్ద ఇన్‌ఫిల్టరేషన్ వెల్, పైపులైన్ నిర్మాణాలకు సంబంధించి ఒక్కో పనికి రూ.36 లక్షల వంతున గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన టెండర్లను ఆన్లైన్లో ఆహ్వానించారు. ఈ పనులకు టెండర్లు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2014 జనవరి 2 అని కూడా ప్రకటించారు. ఈ మేరకు పనులు దక్కించుకునేందుకు చాలా మంది కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. కానీ... దాఖలు చివరి రోజు గురువారం చివరి నిమిషంలో ఈ టెండర్లు రద్దయినట్లు ఆన్లైన్లో ఉత్తర్వులు రావడంతో కాంట్రాక్టర్లు షాక్ తిన్నారు. వాస్తవానికి ఈ టెండర్లు రద్దు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 27వ తేదీనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులు వెంటనే ధ్రువీకరించకుండా... టెండర్ దాఖలుకు చివరి రోజున వెల్లడించడాన్ని బట్టి వారి పన్నాగం ఏంటో ఇట్టే గ్రహించవచ్చు. తెరవెనుక ఒప్పందం తమకు అనుకూలంగా ఉండే ఓ కాంట్రాక్టర్‌తో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సదరు కాంట్రాక్టర్‌తో పని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైపులను సైతం అధికారులే దగ్గరుండి తెప్పించారు. అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందని వారు అనుకుంటుండగా... హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో గత ఏడాది డిసెంబర్ 26న ఈ పనులకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులకు దిక్కుతోచకుండా పోయింది. వెంటనే రంగంలోకి దిగి చ క్రం తిప్పారు. ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఆలస్యంగా నిధులు విడుదలయ్యాయి.... ఇప్పుడు టెండర్లు అంటే మరింత ఆలస్యమవుతుంది.... దాని వల్ల జాతరకు ముందుగా పనులు పూర్తి కావనే ఉద్దేశంతో ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ తరఫున పనులు ప్రారంభించామంటూ కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచిన మరుసటి రోజే కలెక్టర్ కిషన్ వాటిని రద్దు చేశారు. అయితే ఈ విషయాన్ని వెంటనే తెలిపితే తమ బండారం బట్టబయలవుతుందని గ్రహించిన అధికారులు మరో ఎత్తుగడ వేశారు. టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజున వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.