పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్‌గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు.
రాజకీయపరమైన అంశాలు :
పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్‌కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్‌లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్‌ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు :
- అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
- నిరుద్యోగం
- డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
- దళిత బంధు
- ధరణి పోర్టల్
ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు :
బీఆర్ఎస్
- చల్లా ధర్మారెడ్డి (కన్‌ఫాం)
కాంగ్రెస్
- కొండ సురేఖ (ఆశావాహులు)
- ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు)
బీజేపీ పార్టీ
- పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు)
- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు)
వృత్తిపరంగా ఓటర్లు
- మేజారిటీ ఓటర్లు రైతులు.
- వ్యాపారులు.
మతం/కులం పరంగా ఓటర్లు
హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు.
నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :
పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది.
- చలివాగు ఉంది
- చంద్రగిరిగుట్టలు
- చెన్నకేశవ స్వామి జాతర
- కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర
Comments
Please login to add a commentAdd a comment