parakala constituency
-
పరకాల: ఆసక్తిగా పరకాల పోరు!
పరకాల అంటే ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ సాయుధ పోరాటంలో పరకాల కీలక భూమిక పోషించింది. మరో జలియన్ వాలా బాగ్గా పెరొందింది. దీంతో పరకాలలో అమరధామం నిర్మించారు. నియోజకవర్గానికి తలమానికంగా సంగెం మండలం మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. రాజకీయపరమైన అంశాలు : పరకాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన చల్లా దర్మారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి, 2015లో బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖపై గెలుపొందారు. కొండా సురేఖ సైతం ఒకసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొండ సురేఖ రాజీనామా చేయగా ఉత్పన్నమైన ఉపఎన్నికలో సురేఖ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సురేఖ వరంగల్ తూర్పుతో పాటు పరకాలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు నాగూర్ల వెంకటేశ్వరరావుకు బీఆర్ఎస్ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నప్పటికి ఇటీవల కేటిఆర్ పరకాల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయనకే టిక్కెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. బీజేపీ నుంచి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ నిరుద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దళిత బంధు ధరణి పోర్టల్ ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ కొండ సురేఖ (ఆశావాహులు) ఇనుగాల వెంకట్రామిరెడ్డి (ఆశావాహులు) బీజేపీ పార్టీ పెసరు విజయచందర్ రెడ్డి (ఆశావాహులు) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు మేజారిటీ ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కులం పరంగా చూస్తే బిసిలు 141369 మంది ఓటర్లు, ఎస్సీలు 47854 మంది ఓటర్లు, ఎస్టీలు 10308 మంది ఓటర్లు, ముస్లీంమైనార్టీ ఓటర్లు 8279 మంది ఉన్నారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. చలివాగు ఉంది చంద్రగిరిగుట్టలు చెన్నకేశవ స్వామి జాతర కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర -
పరకాల నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ ఎవరు..?
పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన చల్లా దర్మారెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ధర్మారెడ్డి టిడిపి తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి కొండా సురేఖపై 46519 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. 2014 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుంచి టిఆర్ఎస్ తరపున గెలిచిన కొండా సురేఖ 2018 ఎన్నికల ముందు పార్టీ నాయకత్వంపై అలిగి పార్టీని వీడి కాంగ్రెస్ ఐలో చేరి పరకాల నుంచి పోటీచేశారు. అయినా ఫలితం దక్కలేదు. దర్మారెడ్డికి 105903 ఓట్లు రాగా, కొండా సురేఖకు 59384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన యు.శ్రీనివాస్‌కు సుమారు నాలుగువేల ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో చల్లా దర్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి టిఆర్ఎస్ నేత సహోదర రెడ్డిపై 9108 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఇ. వెంకట్రామిరెడ్డికి 30283 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత దర్మారెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత నియోజకవర్గం అయిన శాయంపేట రద్దు కావడంతో 2009లో కొండా సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించారు. అంతేకాక డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా పొందగలిగారు. వైఎస్ మరణం తర్వాత కొండాసురేఖ కొంతకాలం రోశయ్య క్యాబినెట్లో కొనసాగి రాజీనామా చేశారు. కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్‌లో ముఖ్యనేతగా కొనసాగి, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురి అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో 1562 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్ధి బిక్షమయ్య చేతిలో సురేఖ ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సమైక్యవాదానికి అనుకూలంగా మొగ్గు చూపుతోందని విమర్శిస్తూ, సురేఖ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. తదుపరి ఆమె టిఆర్ఎస్లో చేరి 2014 లో వరంగల్ తూర్పులో గెలుపొందారు. 2018 ఎన్నికల సమయానికి తిరిగి కాంగ్రెస్ ఐలో చేరి ఓటమి చెందారు. కొండా సురేఖ భర్త మురళి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. పరకాల నియోజకవర్గం నుంచి 1952 నుంచి 1972 వరకు జనరల్‌గాను, ఆ తర్వాత 2004 వరకు రిజర్వుడుగాను, 2009 నుంచి మళ్ళీ జనరల్‌గా మారింది. పరకాలలో పిడిఎఫ్ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, భారతీ యజనసంఫ్ు, భారతీయ జనతాపార్టీ కలిసి మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. బిజెపి సీనియర్ నాయకుడు సి. జంగారెడ్డి ఇక్కడ ఒకసారి, శాయంపేటలో రెండుసార్లు గెలుపొందారు. ఆయన హన్మకొండ లోక్‌సభ స్థానంలో మాజీప్రధాని పి.వి నరసింహారావును ఓడిరచి చరిత్ర సృష్టించారు. ఆర్. నరసింహరామయ్య ఇక్కడ ఒకసారి హసన్‌పర్తిలో రెండుసార్లు గెలిచారు. రెండుసార్లు గెలిచిన బచ్చు సమ్మయ్య ఒకసారి, హసన్‌పర్తిలో మరోసారి గెలిచారు. బిజెపి అభ్యర్ధి అయిన జయపాల్ ఇక్కడ రెండుసార్లు, బి. రాజయ్య ఇక్కడ ఒకసారి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మరోసారి గెలిచారు. 2004లో టిఆర్ఎస్ పక్షాన గెలిచిన శారారాణి ఆ తర్వాత అసమ్మతిలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ విఫ్‌కు విరుద్ధంగా కాసాని జ్ఞానేశ్వర్ మద్దతు ఇచ్చినందుకుగాను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈమెను అనర్హురాలిని చేస్తూ అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం తొమ్మిదిమంది ఈ విధంగా అనర్హతకు గురి అయితే వారిలో ఈమె ఒకరు. అయితే ఈమె తీర్పు రావడానికి ఒకరోజు ముందే పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి గెలిచిన సమ్మయ్య గతంలో భవనం, కోట్ల మంత్రి వర్గాలలో ఉంటే, సి. ధర్మారెడ్డి అప్పట్లో జలగం క్యాబినెట్లో ఉన్నారు.పరకాలలో ఐదుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, తొమ్మిదిసార్లు ఎస్.సిలు, ఒకసారి ఇతరులు గెలిచారు. పరకాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బీజేపీ పరకాల అభ్యర్థిగా విజయచందర్‌రెడ్డి
ఆత్మకూరు(పరకాల): బీజేపీ పరకాల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి పేరు ఎట్టకేలకు ఖరారైంది. శనివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ బోర్డు సమావేశం అనంంతరం 31 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు. దీంట్లో డాక్టర్ విజయచందర్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ స్థానానికి డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డితో పాటు, డాక్టర్ సిరంగి సంతోష్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా పోటీ పడగా విజయచందర్‌రెడ్డికి అవకాశం లభించింది. ఈ విషయాన్ని తనకు డాక్టర్ లక్ష్మణ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తెలిపినట్లు డాక్టర్ విజయచందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభ్యర్థి పేరు : డాక్టర్ విజయచందర్‌రెడ్డి తల్లిదండ్రులు : ప్రమీల–సూర్యప్రకాశ్‌రెడ్డి జన్మస్థలం : దామెర మండలం ల్యాదల్ల చదువు : 1993లో కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్ పట్టా ఉద్యోగం :1990 నుంచి 2012 వరకు ప్రభుత్వ వైద్యుడిగా సేవలు ఎమ్మెల్యేగా పోటీ: 2012లో జరిగిన ఉపఎన్నికలో ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశాడు. పదవులు: ఐఎంఏ జాతీయ నాయకుడు, రెడ్‌క్రాస్ చైర్మన్, విద్యార్థి దశలో ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. -
పరకాల నుంచే పోటి చేస్తా: కొండా
ఆత్మకూరు(పరకాల): రానున్న ఎన్నికల్లో పరకాల నుంచే పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని దమ్మన్నపేటలో మృతుల కుటుంబాల ను ఆమె పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. అనంతరం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో దొరల పాలన సాగుతోందన్నారు. పరకాల నియోజకవర్గానికి తాము వస్తున్నామంటేనే ఆనందంగా ఉన్నారన్నారు. ఎక్కడికెళ్లినా అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం పరకాలలో తమకు కొత్త కాదన్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులకు కొండా దంపతులే కొండంత భరోసా అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. నిరుద్యోగులు, విద్యావంతులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీ ఏసీఎస్ చైర్మన్ బీరం సుధాకర్‌రెడ్డి, రాజీవ్ యువసేన రాష్ట్ర ప్రతినిధి పర్వతగిరి రాజు, పరికిరాల వాసు, మానగాని శంకర్, కూతురు చంద్రారెడ్డి,గొల్లపెల్లి రాజు, జిన్నా వెంకన్న, వెల్దె వెంకటేశ్వర్లు, వైనాల రమేష్, స్వామి పాల్గొన్నారు. -
చల్లా చేరికపై లొల్లి!
* పరకాల టీఆర్ఎస్లో విభేదాలు * సహోదర్‌రెడ్డి, మొలుగూరి వర్గాలు నారాజ్ * వీరికి ప్రాధాన్యం ఇవ్వాలని కేడర్ పట్టు * గులాబీ అధినాయకత్వంపై అసంతృప్తి * ధర్మారెడ్డి చేరిక తేదీపై స్పష్టత కరువు సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరే అంశం గులాబీ పార్టీలో కొత్త రాజకీయానికి తెర తీస్తోంది. పరకాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్లో ఇప్పటికే మూడు వర్గాలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా తాము ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు తమకు నాయకుడిగా వస్తుండడంపై మూడు వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. టీఆర్ఎస్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ధర్మారెడ్డి పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ అధినాయకత్వం ఆగ్రహానికి గురికావద్దనే ఉద్దేశంతో ధర్మారెడ్డి రాకను బహిరంగంగా ఎవరూ వ్యతిరేకించడం లేదు. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన ఆయనకు విధేయంగా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సంగెం, ఆత్మకూరు మండలాల్లో ఇప్పటికే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా కొందరు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించిన రోజే ఈ రెండు మండలాల్లోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి రాకముందే ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి కొందరు టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలకడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తమ తో ప్రమేయం లేకుండా టీఆర్ఎస్ జిల్లా నేతలు కలవడాన్ని వీరు తప్పుబడుతున్నారు. సాధారణ ఎన్నికల వరకు పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి ఆ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. న్యాయవాదుల కోటాలో ముద్దసాని సహోదర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచర వర్గం ఉంది. సాధారణ ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ మూడు వర్గాల్లోని ద్వితీ య శ్రేణి నేతలు.. టీడీపీ అభ్యర్థులతోనే పోటీ పడ్డారు. ధర్మారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరితే ఆయనతో పార్టీలోకి వచ్చే వారికే ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రాధాన్యం ఉంటుందని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. ఉద్యమంలో మొదటి నుంచి తాము పాల్గొనగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చే రిన వారికి ప్రాధాన్యం పెరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొత్త రాజకీయం షురూ.. సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి 9,108 ఓ ట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి సహోదర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పరకాల నియోజకవర్గంలో ఈ పార్టీకి పట్టు ఉంది. సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల పవనాలు ఉన్నాయి. ఇ లాంటి పరిస్థితుల్లోనూ పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించలేదు. టీఆర్ఎస్లోని మూడు గ్రూపుల రాజకీయంతో నే ఇలా జరిగిందని గులాబీ నేతలే చెబుతున్నారు. మూడు వర్గాలను సమన్వయం చేసే విషయాన్ని పట్టించుకోని టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేర్చాలనుకోవడంపై ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీఆర్ఎస్లో చేరితే పరకాల నియోజకవర్గంలోని ఈ పార్టీలో కొత్త రకమైన రాజకీయం మొదలుకానుంది. ప్రస్తుతం పరకాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి తానేనని సహోదర్‌రెడ్డి చెబుతుండగా.. మొలుగూరి బిక్షపతి వర్గం ఇదే అభిప్రాయంతో ఉం ది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ధర్మారెడ్డి చేరిన తర్వాత ఆయనే నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉంటారు. దీంతో సహోదర్‌రెడ్డి, బిక్షపతి వర్గాలు భవిష్యత్‌లో తమ పరిస్థితిపై ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాయి. మార్చిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశంపై వారు దృష్టి పెట్టారు. వీరిద్దరికి ఏదైనా అవకాశం ఇచ్చిన తర్వాతే ధర్మారెడ్డి పార్టీలో చేరుతారనే అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. సహోదర్‌రెడ్డి, బిక్షపతి విషయంలో నిర్ణయం జరిగాకే.. చేరితే ఇబ్బంది ఉండదని ధర్మారెడ్డి కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల ముందే టీఆర్ఎస్లో చేరుతారని, టీఆర్ఎస్ అధినాయకత్వం దీన్ని నిర్ణయిస్తుందని ధర్మారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.