బీజేపీ పరకాల అభ్యర్థిగా విజయచందర్‌రెడ్డి | BJP MLA Candidate Announced Parkal Constituency | Sakshi
Sakshi News home page

బీజేపీ పరకాల అభ్యర్థిగా విజయచందర్‌రెడ్డి

Published Sun, Oct 21 2018 12:49 PM | Last Updated on Mon, Oct 22 2018 1:09 PM

BJP MLA Candidate Announced Parkal Constituency - Sakshi

పెసరు విజయచందర్‌రెడ్డి

ఆత్మకూరు(పరకాల): బీజేపీ పరకాల నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డి పేరు ఎట్టకేలకు ఖరారైంది. శనివారం రాత్రి ఢిల్లీలో బీజేపీ బోర్డు సమావేశం అనంంతరం 31 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేశారు. దీంట్లో డాక్టర్‌ విజయచందర్‌రెడ్డికి చోటు దక్కింది. ఈ స్థానానికి డాక్టర్‌ పెసరు విజయచందర్‌రెడ్డితో పాటు, డాక్టర్‌ సిరంగి సంతోష్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా పోటీ పడగా విజయచందర్‌రెడ్డికి అవకాశం లభించింది. ఈ విషయాన్ని తనకు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి తెలిపినట్లు డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

  • అభ్యర్థి పేరు : డాక్టర్‌ విజయచందర్‌రెడ్డి
  • తల్లిదండ్రులు : ప్రమీల–సూర్యప్రకాశ్‌రెడ్డి
  • జన్మస్థలం : దామెర మండలం ల్యాదల్ల
  • చదువు : 1993లో కాకతీయ మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్‌ పట్టా 
  • ఉద్యోగం :1990 నుంచి 2012 వరకు  ప్రభుత్వ వైద్యుడిగా సేవలు
  • ఎమ్మెల్యేగా పోటీ: 2012లో జరిగిన ఉపఎన్నికలో ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశాడు.
  • పదవులు: ఐఎంఏ జాతీయ నాయకుడు, రెడ్‌క్రాస్‌ చైర్మన్, విద్యార్థి దశలో ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement