ఆత్మకూరులో మృతుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్న సురేఖ
ఆత్మకూరు(పరకాల): రానున్న ఎన్నికల్లో పరకాల నుంచే పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని దమ్మన్నపేటలో మృతుల కుటుంబాల ను ఆమె పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. అనంతరం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో దొరల పాలన సాగుతోందన్నారు. పరకాల నియోజకవర్గానికి తాము వస్తున్నామంటేనే ఆనందంగా ఉన్నారన్నారు. ఎక్కడికెళ్లినా అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు.
ఎన్నికల ప్రచారం పరకాలలో తమకు కొత్త కాదన్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులకు కొండా దంపతులే కొండంత భరోసా అన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. నిరుద్యోగులు, విద్యావంతులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీ ఏసీఎస్ చైర్మన్ బీరం సుధాకర్‌రెడ్డి, రాజీవ్ యువసేన రాష్ట్ర ప్రతినిధి పర్వతగిరి రాజు, పరికిరాల వాసు, మానగాని శంకర్, కూతురు చంద్రారెడ్డి,గొల్లపెల్లి రాజు, జిన్నా వెంకన్న, వెల్దె వెంకటేశ్వర్లు, వైనాల రమేష్, స్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment