కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 మంది ప్రజాకూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండ డీసీసీ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి పౌరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న క్రమంలో ప్రజాకూటమి పొత్తుల్లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి అవకాశం దక్కడం అతడిని గెలిపించేందుకు సహకరించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు అన్నారు. ప్రజాకూటమి కార్యకర్తలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించినా మొక్కవోని ధైర్యంతో ప్రకాశ్‌రెడ్డి గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రజాకూటమి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైతం కలసి పోటీ చేస్తుందన్నారు. పనిచేసిన వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యముంటుందన్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయత్వం నుంచి హామీ పొందినట్లు తెలిపారు. ఈ నెల 11న వెలువడే ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికి చివరి ఘడియలని, రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతోందన్నారు.
ఓట్లు గల్లంతైనా పట్టించుకోని యంత్రాంగం
ఓటరు జాబితాల్లో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని పలుమార్లు ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పినా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. నయీంనగర్‌లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కుటుం బాల ఓట్లు లేవని, కాజీపేట డివిజన్‌లోని ఓట్లు హన్మకొండ డివిజన్‌లో వచ్చాయని ఫిర్యాదు చేసినా మార్పులు చేయడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు జరిగా యని, గల్లంతయ్యాయని ఎన్నికల సీఈఓ ప్రకటించడంతో తప్పు జరిగిందన్న విషయం స్పష్టమైందన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్ల జాబితాలను కొత్తగా తయారుచేయాలన్నారు.
సోనియా జన్మదిన వేడుకల్లో పాల్గొనాలి
యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆదివారం రోజున ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మండల, గ్రామ కేంద్రాలతో పాటు గ్రేటర్ వరంగల్‌లోని అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ భవన్‌లో జరిగే ఈవేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు ఈవీ.శ్రీనివాసారావు, బంక సంపత్‌యాదవ్, నాయినీ లక్షా్మరెడ్డి, నసీంజహాన్, రహత్‌పర్వీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment