Praja Kutami
-
బదిలీ కాని ఓటు.. అంచనాలు తలకిందులు.!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మహా కూటమి మంత్రం పారలేదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిస్తే గణనీయమైన ఓట్లు వస్తాయని, తేలిగ్గా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ నాయకత్వం అంచనాలు తలకిందులయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఒక జట్టుగా.., టీడీపీ, బీజేపీ మరో జట్టుగా.. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో మహా కూటమి పేర కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. ఈసారి మహాకూటమి అభ్యర్థులకు తేలికైన విజయాలు దక్కాలి. కానీ, వాస్తవంలో అలా జరగకపోవడం, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలుకావడంతో కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లును కలిపితే, గెలుపోటములతో సంబంధం లేకుండా దాదాపు అన్ని స్థానాల్లో మహా కూటమికి ఖాతాలోనే ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నా యి. అయితే.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు (కూటమి పక్షనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేశారు) గంప గుత్తగా పడతాయని ఆశించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఆశాభంగం జరగగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు పోలయ్యాయి. బలపడిన టీఆర్ఎస్ గత ఎన్నికల్లో దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానంలో, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో రెండో స్థానంలో నిలవగా, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, ఈసారి నకిరేకల్, మునుగోడు స్థానాలను కోల్పోయి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐదేళ్లుగా జరిగిన మార్పులు, చేర్పులు, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ చాలా చోట్ల బలపడింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవరకొండ నియోజకవర్గంలో రెండో స్థానంలో నల్లగొండలో టీడీపీ రెబల్ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన ఓట్లు ఈ సారి కూటమికి బదిలీ కాలేదన్న అంశం తాజా ఓట్ల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి భా గస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు బదిలీ కాకపోగా, ఆ తేడా భారీగా కనిపిస్తోంది. పక్కాగా ఓటు బదిలీ జరిగి ఉం టే నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అవకాశం దక్కేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ఇలా.. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఇక్కడ కూటమి ఓట్లన్నీ కలిస్తే (2014 గణాంకాలు)నే బదిలీ కాకుండా పోయిన ఓట్లు 21,658. గతం కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. అంటే కూటమి బదిలీ అయి ఉంటే జానారెడ్డి ఓటమి కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 23,698 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఈ నియోజకవర్గంలో 35,907ఓట్లు కూటమి బదిలీ కాలేదు. దీంతో ఆయనకూ ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన (బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి)4523 ఓట్లును ఈ సారి మినహాయించినా కూటమికి బదిలీకాకుండా పోయిన ఓట్లు 31,384. ఈ లెక్కన చూసినా, కాంగ్రెస్‌కు అవకాశం ఉందేం టున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాం గ్రెస్‌తో జతకట్టిన టీడీపీ, సీపీఐ తదితర పార్టీల కూటమి పక్షాల ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీకాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఓటమిని కూటమి నేతలు లైట్ తీసుకున్నారా?
-
కూటమి కుదేలు.. పేలుతున్న జోకులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఓడించాలని చేతులు కలిపిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. హోరా హోరీగా ఫలితాలొస్తాయని చివరి వరకు ఆశగా ఎదురు చూసిన ప్రజాకూటమి నేతలకు ఎన్నికల ఫలితాలు మింగుడు పడటం లేదు. బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. తెలుగు దేశం పార్టీ ప్రజాకూటమిలో కలిసి ఇతర పార్టీ నేతల గెలిచే అవకాశాలను సైతం దెబ్బతీసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుపై నెటిజన్ల క్రియేటివిటీ నవ్వులు పూయిస్తోంది. -
తేడా కొడుతోందా!
-
ప్రజాకూటమి గెలవబోతోంది
-
ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులదే విజయం: రాజేందర్‌రెడ్డి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 మంది ప్రజాకూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండ డీసీసీ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి పౌరుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న క్రమంలో ప్రజాకూటమి పొత్తుల్లో టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి అవకాశం దక్కడం అతడిని గెలిపించేందుకు సహకరించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు అన్నారు. ప్రజాకూటమి కార్యకర్తలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించినా మొక్కవోని ధైర్యంతో ప్రకాశ్‌రెడ్డి గెలుపుకోసం పనిచేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రజాకూటమి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైతం కలసి పోటీ చేస్తుందన్నారు. పనిచేసిన వారికి లోకల్ బాడీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యముంటుందన్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయత్వం నుంచి హామీ పొందినట్లు తెలిపారు. ఈ నెల 11న వెలువడే ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికి చివరి ఘడియలని, రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతోందన్నారు. ఓట్లు గల్లంతైనా పట్టించుకోని యంత్రాంగం ఓటరు జాబితాల్లో ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని పలుమార్లు ప్రెస్మీట్లు పెట్టి చెప్పినా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. నయీంనగర్‌లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కుటుం బాల ఓట్లు లేవని, కాజీపేట డివిజన్లోని ఓట్లు హన్మకొండ డివిజన్లో వచ్చాయని ఫిర్యాదు చేసినా మార్పులు చేయడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు జరిగా యని, గల్లంతయ్యాయని ఎన్నికల సీఈఓ ప్రకటించడంతో తప్పు జరిగిందన్న విషయం స్పష్టమైందన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటర్ల జాబితాలను కొత్తగా తయారుచేయాలన్నారు. సోనియా జన్మదిన వేడుకల్లో పాల్గొనాలి యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఆదివారం రోజున ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మండల, గ్రామ కేంద్రాలతో పాటు గ్రేటర్ వరంగల్‌లోని అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ భవన్లో జరిగే ఈవేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు ఈవీ.శ్రీనివాసారావు, బంక సంపత్‌యాదవ్, నాయినీ లక్షా్మరెడ్డి, నసీంజహాన్, రహత్పర్వీన్ పాల్గొన్నారు. -
సంపన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. కానీ సంపన్నులైన బడా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పేరు మార్చి రూ.40వేల కోట్లు దోచి పెట్టారు. ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో రూ.50వేల కోట్లు కాంట్రాక్టర్లు అక్రమంగా సంపాదించుకోవడానికి దోహదం చేశారు. కేసీఆర్ అంటేనే ఖావో.. కమిషన్రావ్. మీ కుమారుడి ఆదాయం 400 శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి అప్పులు లేని సంపన్న రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల అప్పు ఉంది. ప్రతి కుటుంబంపై రెండున్నర లక్షల రూపాయల అప్పు మూటగట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కుటుంబానికి సంపూర్ణ సంపద చేకూరింది. కానీ తెలంగాణ ప్రజలకు నైరాశ్యమే మిగిలింది. మీ కుటుంబం మినరల్ వాటర్ తాగుతోంది. నల్లగొండ, కోదాడలోని పేద ప్రజలకు మాత్రం ఫ్లోరైడ్ నీళ్లు సరఫరా చేస్తున్నారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజాకూటమి నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. యువత, రైతులు, మహిళలు తమ రక్తాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. కానీ వారు ఏ కలల కోసం పోరాటం చేశా రో.. అవేవీ సాకారం కాలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ లేవని విమర్శించారు. కేసీఆర్ జిల్లాలను దత్తత తీసుకోవడం కాదని, తెలంగాణలోని రైతులను, యువతను, తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకున్నవారి కుటుంబాలను దత్తత తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఆధునీకరించి నల్లగొండ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కూటమిదే అధికారం.. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మొట్టమొదటి హామీగా రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతుందని రాహుల్ స్పష్టంచేశారు. వరికి క్వింటాల్‌కు రూ.2వేలు, పత్తి క్వింటాల్‌కు రూ.7వేలు, మిర్చికి రూ.10వేలు, పసుపు పంటకు రూ.10వేలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. సీఎంకి రూ.300 కోట్ల విలువైన ఇల్లు ఉం దని.. కానీ తెలంగాణ రైతులకు, పేదలకు, నిరుద్యోగులకు ఇళ్లే లేవని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిం చారు. తెలంగాణ ప్రజలను, పంచాయతీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణను ఒకే కుటుంబం పాలించడాన్ని అంగీకరించం. తెలంగాణను తెలంగాణ ప్రజలే పాలించాలి. అందరూ మీ స్వయంశక్తితో, పరిపాలనతో నయా తెలంగాణను నిర్మించాలి’ అని రాహుల్ సూచిం చారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో మార్పు అనే తుపాను రాబోతోందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత మోదీ ఇంటికే... తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని రాహుల్ పేర్కొన్నారు. మోదీ ఈ దేశాన్ని నష్టాలపాలు చేశారని, నోట్ల రద్దుతో చిరు వ్యాపారులను, దుకాణాలను ఖతం చేశారని దుయ్యబట్టారు. ప్రజలపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించి ప్రజల సొమ్మంతా పన్నుల రూపం లో లాక్కుని అత్యంత ధనవంతులకు ఇచ్చారని ధ్వజమెత్తారు. రూ.3.50 లక్షల కోట్లు కేవలం ముగ్గురికే మాఫీ చేశారని దుయ్యబట్టారు. మోదీ తమను విమర్శిస్తారని, కానీ కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అనరని రాహుల్ ఆరోపించారు. ‘మోదీ చేతిలో తెలంగాణ రిమోట్ కంట్రోల్ ఉంది. కేసీఆర్ అవి నీతిలో మునిగి తేలుతుంటే సీబీఐ, ఈడీ మోదీ చేతిలో ఉన్నాయి’ అని అన్నారు. టీఆర్ఎస్ అసలు పేరు టీ‘ఆర్ఎస్ఎస్’, అంటే తెలంగాణ ఆర్ఎస్ఎస్ అని అన్నారు. యువతకు ఉపాధి కల్పించడం.. దేశ సంపదను యువతకు, రైతులకు, చిరు వ్యాపారులకు అప్పగించడంతోపాటు అనిల్ అంబానీ, విజ య్మాల్యా, నీరవ్‌మోదీల జేబులోని ప్రజల సొమ్ము ను తీసుకొచ్చి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. సెల్‌ఫోన్, మైక్, దుస్తులు.. ఇలా అన్నింటిపైనా మేడ్ ఇన్ చైనా అని ఉంటుందన్నారు. కానీ తమ లక్ష్యం ప్రతి వస్తువుపైనా మేడ్ ఇన్ తెలంగాణ.. మేడ్ ఇన్ నల్లగొండ అని ఉండాలని.. ఇదే తెలంగాణ అసలు కల, అసలు భవిష్యత్ అని రాహుల్ పేర్కొన్నారు. టీఆర్ఎస్కు ఇవే చివరి ఎన్నికలు కావాలి... జాతీయస్థాయిలో రెండే కూటములున్నాయని.. ఒకటి మోదీ కూటమి కాగా, మరొకటి తామందరం ఉన్న ఆయన వ్యతిరేక కూటమి అని చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నారు.. ఎంఐఎం ఎవరికి సహకరిస్తుందో చెప్పాలన్నారు. హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు అని.. టీడీపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణను అభివృద్ధి చేశాయని వ్యాఖ్యానించారు. 2004లో తాను ఓడిపోయినప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అని రాహుల్ చెప్పారని పేర్కొన్నారు. మరి కేసీఆర్ హైదరాబాద్‌కు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలన్నారు. టీఆర్ఎస్తో తాము కలిసి ఉండకపోతే వారు బీజేపీతో వెళ్లిపోతారని ఎంఐఎం అధినేత, సీఎం స్నేహితుడు అక్బరుద్దీన్ అన్నారని.. టీఆర్ఎస్, బీజేపీ బంధానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని బాబు పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోదాడ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, సీపీఐ నాయకులు పల్లా వెంకటర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ, కేసీఆర్ నియంతలు: చంద్రబాబు రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో నరేంద్ర మోదీ నియంతల్లా తయారై రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించారని.. ఈ రెండు ప్రభుత్వాలు ఇంటికి పోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. కేసీఆర్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. తనను ఇక్కడకు ఎందుకు వచ్చావని, తెలుగుదేశం పార్టీ అవసరం ఏమిటని అడుగుతున్నారని.. అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. కేసీఆర్ తనతో పాటు తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని తిడుతున్నాడని, ఓడిపోతామన్న భయంతో ఆయనలో అసహనం పెరిగిందని ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ పెద్ద నియంతని, ఆయన సీనియర్ మోదీ అయితే, ఇక్కడ జూనియర్ మోదీ కేసీఆర్ అని, ఇద్దరు నియంతలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే పగటిపూట ఎంఐఎంతో, రాత్రిపూట బీజేపీతో స్నేహం చేస్తున్నాడని విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ప్రజాఫ్రంట్ బహిరంగ సభకు హాజరైన జనం -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి : బాలూ నాయక్
సాక్షి, చింతపల్లి : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మదనాపురం, చాకలిశేరిపల్లి, తక్కెళ్లపల్లి, రోటిగడ్డతండా, చౌళ్లతండా, ఉమ్మాపురం, లక్ష్మణ్‌నాయక్, లచ్చిరాంతండా, దేన్యతండా, నెల్వలపల్లి, రాయినిగూడెం, ప్రశాంతపురి, గొల్లపల్లి తదితర గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుట్రపన్నుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఎంపీపీ రవినాయక్, జెడ్పీటీసీ హరినాయక్, సీపీఐ మండల కార్యదర్శి యుగేందర్‌రావు, టీడీపీ మండల కార్యదర్శి ఆర్ఎన్.ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్‌యాదవ్, వెంకటయ్యగౌడ్, నాగభూషణ్, నర్సిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, సంజీవరెడ్డి, జంగిటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
వర్గీకరణపై రూట్‌మ్యాప్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల సందర్భంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ స్పష్టమైన రూట్‌మ్యాప్‌ను ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తమ డిమాండ్‌ను చిత్తశుద్ధితో ముందు కు తీసుకెళ్లడానికి వీలుగా రాజ్యసభ, లోక్‌సభలతోపాటు ఎమ్మెల్సీగానూ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తే కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పా రు. శనివారం మగ్దూంభవన్‌లో ఈ అంశంపై టీజేఎ స్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఈ నేపథ్యంలో తమ చిరకాల వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ, చట్టసభల్లో ప్రాతినిధ్యంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ప్రతిపాదన లు సమర్పించామని చెప్పారు. కూటమిలో ని భాగస్వామ్య పార్టీల మేనిఫెస్టోలతో పాటు ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోనూ వర్గీకరణపై ఒక రోడ్‌మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోగా పరిష్కరి స్తారో తెలపాలని కోరామన్నారు. ఈ అంశాన్ని పరి శీలిస్తామని, దీనిని జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా దానిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా న్యాయమైన డిమాండ్ అని, దీనికి తమ మద్దతు ఉంటుందని కోదండరాం తెలిపారు. గతం లో వర్గీకరణ అమలుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు కూడా దీని అమలుకు పూర్తి గా సహకరిస్తుందని రమణ చెప్పారు. ఈ డిమాండ్‌కు తమ జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారని, దీనిపై ఎమ్మార్పీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుం దని పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
గెలిచేది ప్రజాకూటమే
-
హడావుడంతా హస్తినలోనే..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రజాకూటమి పొత్తులపై చర్చలతో హస్తిన వేడెక్కింది. దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా ఢిల్లీ బాట పట్టింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బుధవారం ఉదయమే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై పొత్తులపై నివేదించారు. బుధవారం సాయంత్రానికి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. వీరంతా కలిసి ఏఐసీసీ కోర్ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీతో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన రాహుల్‌తో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ కానున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో ఉత్తమ్ ఇప్పటికే ఓసారి సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూలును ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీయేతర, భావసారూప్య పార్టీలను ఏకం చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తమ్మీద చర్చోపచర్చలు అన్నీ ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయానికి పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, మాజీ మంత్రి వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. రాహుల్ సమక్షంలో ఆయన గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. నేడు సోనియాతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కాంగ్రెస్ అభ్యర్థిత్వాల వడపోత అనంతరం భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ తొలి విడత జాబితా రూపొందించి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది. దీనిపై చర్చించేందుకు కేం ద్ర ఎన్నికల కమిటీ గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో సమావేశం కానుంది. పార్టీ సీని యర్ నేతలు అహ్మద్ పటేల్, ముకుల్ వాస్నిక్, ఏకే ఆంటోని, అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్ తదితరులు హాజరయ్యే ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతి యా కూడా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపా యి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించాయి. పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారుచేసిన తర్వాత దానిని ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడికి పంపిస్తారు. టీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించి రెండు నెలలవడం, ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుండటం వంటి అంశా ల నేపథ్యంలో ప్రజా కూటమి అభ్యర్థుల మొత్తం జాబితా 119 స్థానాలకు ఒకేసారి వెలువడే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. దీపావళిలోపే 119 స్థానాలకు టికెట్లు ఖరారు చేస్తే ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజస్తాన్ అభ్యర్థుల జాబితాపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ సోనియాగాంధీతో సమావేశమై చర్చించింది. పొత్తుల ప్రకటన తర్వాతే జాబితా.. పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడ్డాకే కాంగ్రెస్ జాబితా వెలువడితే రాజకీయ సానుకూలత ఉంటుందని, కాంగ్రెస్ జాబితా వెలువడ్డాక మిత్రపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తితే కూటమిలోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రజాకూటమి అభ్యర్థుల జాబితాను ఉమ్మడిగా ప్రకటిస్తే మూడు పార్టీల శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతుందని వివరించాయి. పొత్తులు, అభ్యర్థిత్వాల జాబితా తదితర అంశాలపై కాంగ్రెస్ అత్యంత గోప్యత పాటిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాల జాబితాను ప్రేరేపించేలా, కాంగ్రెస్‌లో టికెట్ల ఆశావహులకు వల విసిరేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. -
'విజయకాంత్ మా కూటమిలోకి రండి'
ఎరగా నగదు డీఎంకేపై వైగో ఆగ్రహం ప్రజా కూటమిలోకి విజయకాంత్‌కు ఆహ్వానం చెన్నై : ఎండీఎంకేను నిర్వీర్యం చేయడానికి మహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ వర్గాలకు నగదు, పదవుల్ని ఎరగా వేస్తూ డీఎంకే వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇక, ప్రజా కూటమిలోకి రావాలని డీఎండికే అధినేత విజయకాంత్‌కు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నుంచి వలసల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు మళ్లీ పాత గూటికే (డీఎంకే)లోకి చేరే పనిలో పడ్డారు. మరి కొందరు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఎండీఎంకేకు బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల మీద డీఎంకే కన్నేసింది. అక్కడి ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని తమ వైపు ఆకర్షించేందుకు శ్రీకారం చుట్టి, కార్యరూపం దాల్చే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ఎక్కడెక్కడ జంప్ జిలానీలు ఉన్నారో వారిని పసిగట్టే పనిలో పడ్డ ఎండీఎంకే నేత వైగో, వారు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బలం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీని దెబ్బతీసేందుకు మహా కుట్ర జరుగుతున్నదంటూ గురువారం వైగో తీవ్రంగానే స్పందించారు. ఈ కుట్రకు వ్యూహకర్త డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అని నిప్పులు చెరిగారు. పధకం ప్రకారం తనను, తన పార్టీని టార్గెట్ చేసి స్టాలిన్ ముందుకు సాగుతున్నట్లుందని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను, కుట్రను ఎదుర్కొని తన బలాన్ని చాటుకుంటానని ప్రకటించారు. కొన్ని చోట్ల తన పార్టీ వర్గాలకు నగదు, పదవులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీన్ని బట్టి చూస్తే, డీఎంకే ఎంతగా దిగజారుడు నీచ రాజకీయాలు సాగిస్తోందో స్పష్టమైందని దుయ్యబట్టారు. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ఏర్పడిన ఈ ప్రజా కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా రావాలని ఎదురు చూస్తున్నామని, ఆయనకు ఆహ్వానం సైతం పలికామన్నారు. ఒకవేళ విజయకాంత్ ప్రజా కూటమిలోకి వస్తే, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆయన వస్తే ఆనందమేనని, అయితే ప్రజా కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్నది అందరూ చర్చించుకుని సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.