సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల సందర్భంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ స్పష్టమైన రూట్‌మ్యాప్‌ను ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తమ డిమాండ్‌ను చిత్తశుద్ధితో ముందు కు తీసుకెళ్లడానికి వీలుగా రాజ్యసభ, లోక్‌సభలతోపాటు ఎమ్మెల్సీగానూ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తే కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పా రు.
శనివారం మగ్దూంభవన్‌లో ఈ అంశంపై టీజేఎ స్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఈ నేపథ్యంలో తమ చిరకాల వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ, చట్టసభల్లో ప్రాతినిధ్యంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ప్రతిపాదన లు సమర్పించామని చెప్పారు. కూటమిలో ని భాగస్వామ్య పార్టీల మేనిఫెస్టోలతో పాటు ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోనూ వర్గీకరణపై ఒక రోడ్‌మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోగా పరిష్కరి స్తారో తెలపాలని కోరామన్నారు.
ఈ అంశాన్ని పరి శీలిస్తామని, దీనిని జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా దానిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా న్యాయమైన డిమాండ్ అని, దీనికి తమ మద్దతు ఉంటుందని కోదండరాం తెలిపారు. గతం లో వర్గీకరణ అమలుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు కూడా దీని అమలుకు పూర్తి గా సహకరిస్తుందని రమణ చెప్పారు. ఈ డిమాండ్‌కు తమ జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారని, దీనిపై ఎమ్మార్పీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుం దని పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment