Reservation for SCs
-
వర్గీకరణపై రూట్‌మ్యాప్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల సందర్భంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ స్పష్టమైన రూట్‌మ్యాప్‌ను ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తమ డిమాండ్‌ను చిత్తశుద్ధితో ముందు కు తీసుకెళ్లడానికి వీలుగా రాజ్యసభ, లోక్‌సభలతోపాటు ఎమ్మెల్సీగానూ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తే కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పా రు. శనివారం మగ్దూంభవన్‌లో ఈ అంశంపై టీజేఎ స్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఈ నేపథ్యంలో తమ చిరకాల వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ, చట్టసభల్లో ప్రాతినిధ్యంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ప్రతిపాదన లు సమర్పించామని చెప్పారు. కూటమిలో ని భాగస్వామ్య పార్టీల మేనిఫెస్టోలతో పాటు ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోనూ వర్గీకరణపై ఒక రోడ్‌మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోగా పరిష్కరి స్తారో తెలపాలని కోరామన్నారు. ఈ అంశాన్ని పరి శీలిస్తామని, దీనిని జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా దానిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా న్యాయమైన డిమాండ్ అని, దీనికి తమ మద్దతు ఉంటుందని కోదండరాం తెలిపారు. గతం లో వర్గీకరణ అమలుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు కూడా దీని అమలుకు పూర్తి గా సహకరిస్తుందని రమణ చెప్పారు. ఈ డిమాండ్‌కు తమ జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారని, దీనిపై ఎమ్మార్పీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుం దని పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
‘నితీష్ కోటా వ్యతిరేకి’
సాక్షి,పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అన్నారు. దళిత కోటాపై పాలక జేడీ(యూ) నేతలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లాలూ సమర్ధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి, మాజీ మంత్రి శ్యామ్ రజక్‌లు రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. ప్రమోషన్లలో కోటాను రద్దు చేశారని, ఎస్సీ,ఎస్ట్ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వీరు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడిందని విమర్శించారు. జేడీ(యూ) నేతల అభిప్రాయంతో లాలూ ప్రసాద్ ఏకీభవించారు. ఉదయ్, శ్యామ్ రజక్‌లు చెప్పింది నూరు శాతం నిజమని లాలూ సమర్ధించారు. దళితుల కోటాపై భిన్న పార్శ్వాల నుంచి దాడి జరుగుతోందని, దీనిపై జేడీ(యూ) చీఫ్ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని లాలూ అన్నారు. నితీష్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని తనకు తెలుసునన్నారు. మధ్యనిషేధం లోపభూయిష్టంగా మారిందని లాలూ ధ్వజమెత్తారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. -
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై డేగకన్ను
జిల్లా వ్యాప్తంగా 200 మందికిపైగా బైండోవర్ సీఎం స్వగ్రామం కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకట్ట అయినా వెళ్లేందుకు కొందరు నేతల యత్నం ప్రజాస్వామ్యం ఖూనీ :బ్రహ్మయ్య మాదిగ ఒంగోలు క్రైం : ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ కోసం సీఎం చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సమరభేరి మోగించాలనుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఈ నెల 10న సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ముట్టడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండు రోజులుగా పోలీసు యంత్రాంగం ఎమ్మార్పీఎస్ నాయకుల కదలికలపై డేగ కన్ను వేసింది. శనివారం, ఆదివారాల్లో మొత్తం 200 మందికిపైగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. ఒక్క ఒంగోలు నగరంలోనే దాదాపు 50 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేయించుకున్నారు. కొన్ని చోట్ల నేరుగా పోలీసుస్టేషన్లలోనే బైండోవర్ చేయగా జిల్లాలోని మరికొన్ని చోట్ల తహసీల్దార్ల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయించుకున్నారు. నారావారిపల్లెకు వె ళ్తే నాన్ బెయిల్‌బుల్ కేసులు పెడతామన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. చంద్రబాబు గత ప్రభుత్వంలోనే ఎస్సీలను వర్గీకరిస్తామని చెప్పి మోసం చేశాడంటూ ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కొన్నేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. రథయూత్రకు బ్రేకులు అందులో భాగంగా వర్గీకరణ సాధించుకునేందుకు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె నుంచి రథయాత్ర చేపట్టాలని ఎమ్మెర్పీఎస్ నేతలు తీర్మానించారు. అందుకు ఈ నెల 10న ముహూర్తంగా నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకోవాలని పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. జిల్లా నుంచి ఒక్క కార్యకర్త కూడా నారావారిపల్లెకు వెళ్లకూడదని డీఎస్పీలను ఆదేశించింది. పోలీసుస్టేషన్లవారీగా ఎవరెవరు రథయాత్రకు వెళుతున్నారన్న సమాచారాన్ని నిఘా వ్యవస్థ ద్వారా సమాచారం తెప్పించుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం.. అన్ని పోలీసుస్టేషన్ల హెచ్ఎస్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఎమ్మార్పీఎస్‌లో చురుకుగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకొని రెండు రోజులుగా వారి కదలికలపై నిఘా ఉంచింది. కొంతమంది ఏ విధంగానైనా నారావారిపల్లెకు చేరుకోవాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.