Route Map
-
గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్ ఇదే
-
సీఎం జగన్ 16వ రోజు బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే
-
సీఎం జగన్ బస్సు యాత్ర...డే-3 రూట్ మ్యాప్..
-
సీఎం జగన్ బస్సు యాత్ర మొదటిరోజు రూట్ మ్యాప్ ఇదే
-
టర్నింగులున్నాయి.. డ్రైవింగ్ జాగ్రత్త
సాక్షిప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ నుంచి మేడారం 245 కిలోమీటర్లు. కారులో వెళ్లేవారికి 5.20 గంటల సమయం పడుతుంది. ఎన్‌హెచ్–163 రహదారిపై ప్రయాణించే భక్తులు హైదరాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవాలి. ► ఈ రోడ్డుపై పెంబర్తి శివారులో 90–90.5 కి.మీ. లు, వీఓ హోటల్ నుంచి అక్షయ హోటల్ 9.5–94 కి.మీ.లలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ► జనగామ– నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు. పెంబర్తి, నిడిగొండ, యశ్వంతాపూర్, రాఘవాపూర్, చాగళ్లు, పెండ్యాల అండర్‌పాస్‌లు లేకపోవడంతో జాతీయరహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ► నెల్లుట్ల బైపాస్ రోడ్డు ఆర్టీసీ కాలనీ బ్రిడ్జి, నడిగొండ యూటర్న్, రఘునాథపల్లి శివారు, ఛాగల్, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం, ధర్మసాగర్ మండలం రాంపూర్క్రాస్రోడ్డు, మడికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైఓవర్, సుబేదారి ఫారెస్టు ఆఫీసు, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌రోడ్, కటాక్షపూర్‌లను ‘బ్లాక్‌స్పాట్’లుగా అధికారులు గుర్తించారు. ► మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మూలమలుపుల ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్టే. ప్రత్యేక చర్యలు చేపట్టాం మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు వెళ్లే వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. నిబంధనలకు మించి ఎక్కువ మందిని వాహనాల్లో తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. - పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, హనుమకొండ హైదరాబాద్ నుంచి మేడారం245 కిలోమీటర్లు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్‌స్టేజీ నుంచి వంగాలపల్లి–కరుణాపురం బస్‌స్టేజీల వరకు మూడు యూటర్న్లు ఉన్నాయి. ► చిన్నపెండ్యాల నుంచి ఘన్పూర్ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్ సమీపంలో యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్ సమీపంలో రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. ► హనుమకొండ నుంచి చిన్నపెండ్యాల గ్రామంలోకి వెళ్లాల్సిన వాహనాలు దాబా ముందు యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు గ్రానైట్ వద్ద రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. దీంతో ఈఏడాది 10 రోడ్డు ప్రమాదాలు జరగగా ఐదుగురు మృతిచెందారు. జాతర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. వరంగల్ నుంచి మేడారం95.5 కిలోమీటర్లు వరంగల్ నుంచి మేడారం 95.5 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుంటే భక్తులు ఎన్‌హెచ్ 163 రహదారి గుండా 2.20 గంటల నుంచి 2.40 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరెపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లపూర్ ద్వారా మేడారం చేరుకుంటారు. ► ములుగు గట్టమ్మ సమీపంలో మూడు మలుపులుంటాయి. ఇదివరకు ఇక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ► హనుమకొండ–మలుగు మధ్య 163 జాతీయ రహదారి ఆరెపల్లి–గుడెప్పాడ్ మధ్య రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా, ఎక్కడా సూచిక బోర్డులు లేనందున జాగ్రత్తగా వెళ్లాలి. హైదరాబాద్ టు మేడారం : 3 టోల్గేట్లు హైదరాబాద్ నుంచి మేడారం జాతర వచ్చే ప్రయాణికులు మూడు టోల్గేట్లు దాటాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్‌నగర్ వద్ద ఇంకో టోల్గేట్ ఉంటుంది. అయితే జాతర జరిగే 4 రోజులపాటు జవహర్‌నగర్ వద్ద టోల్ ఎత్తేస్తారు. మహబూబాబాద్ నుంచి మేడారం134 కి.మీ. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంలో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3.20 గంటల్లో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవచ్చు. ► నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు గుర్తించారు. తాడ్వాయి మీదుగా అనుమతి వీరికే... ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ పాస్‌లు ఉన్న వాహనాలు హనుమకొండ, ములుగు రోడ్డు, గుడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళతాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా తాడ్వాయి వద్ద వెనక్కి పంపుతారు. కరీంనగర్ నుంచి మేడారం153 కి.మీ. కరీంనగర్ టు మేడారం 153 కి.మీ.లు. కరీంనగర్, కేశవపట్నం, హుజూరాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకుని వెంకటాపూర్, చల్వాయిల మీదుగా మేడారానికి 3.40 గంటల సమయం పడుతుంది. ► భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కిలోమీటర్లు.మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లపూర్‌ల మీదుగా 1.10 గంటల నుంచి 1.30ల వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు. ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం– మహదేవపూర్ మధ్య మూలమలుపులు ప్రమాద భరితంగా ఉన్నాయి. ► కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353 సీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తాయి. ఒక్కోసారి వీటిని రోడ్డు పక్కనే నిలుపుతారు. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ► భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ శివారు ప్రాంతాల్లోనూ రహదారి పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ నుంచి భూపాలపట్నం, బీజాపూర్ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్ల నుంచి ఈ దారిగుండా మేడారం జాతరకు వస్తారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాటారం వరకు 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 353(సీ) పైన 18 అతి ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. దీంతో త్వరగా గమ్యం చేరాలని వాహన దారులు ఆదమరిచి వాహనం నడిపితే మృత్యుఒడిలోకి చేరినట్టే. ఈ రహదారిపై అంతర్రాష్ట్ర వంతెన నుంచి ఎస్సీకాలనీ వద్ద, అన్నారం మూలమలుపు, అడవి మధ్యలోని డేంజర్ క్రాసింగ్‌ల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి. కనీసం ఇక్కడ ఎన్‌హెచ్ అధికారులు కూడా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. చల్వాయి బస్టాండ్ : జర చూసి నడపండి ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామం మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. రెండు మాత్రమే యూటర్న్ పాయింట్లు ఉండడం వల్ల వాహనాల్లో ప్రయాణించే వారు, గ్రామస్తులు ఈ పాయింట్స్ నుంచే రోడ్డు క్రాస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ► పస్రా, గోవిందరావుపేట గ్రామాల మధ్యలో ఉన్న చర్చి మూలమలుపు ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎక్కువగా ప్రమాదాలు ఇక్కడే జరుగుతాయి. రోడ్డు పై ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, ఈ ప్రాంతానికి రాగానే రోడ్డు వెడల్పుగా కనిపిస్తుంది. దగ్గరలో గ్రామాలు లేకపోవడంతో వాహనదారులు అధికవేగంతో రావడం వల్ల వాహనాన్ని కంట్రోల్ చేయలేక, మూలమలుపు తప్పించలేక ప్రమాదాలు జరుగుతుంటాయి. భక్తులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. ఇవి తప్పనిసరిగా పాటించండి ► వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిమితికి మించిన వేగం మంచిది కాదు. ► ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్టేక్ చేయకపోవడమే బెటర్. ►మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతరకు వెళ్లే వాహన చోదకులు మద్యానికి దూరంగా ఉండాలి. ► మూలమలుపులు, ఇరుకు వంతెనలు, రహదారుల వద్ద వేగం తగ్గించాలి. నిర్ణిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలి జాతరకు వచ్చే భక్తులు వాహనాలను జాతరలో కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలి. భక్తులకు తెలిసేలా అన్నిచోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేశాం. జాతర పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి కరెంట్, నీటి సరఫరా అందుబాటులో ఉంచాం. రోడ్లపై అడ్డంగా నిలిపే వాహనాలను ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోకి టోయింగ్ వాహనాలతో తరలిస్తాం. - అంబర్ కిషోర్ ఝా ,మేడారం జాతర, ట్రాఫిక్ ఇన్చార్జ్,వరంగల్ సీపీ -
మేడారం జాతరకు రూట్ మ్యాప్
-
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
'దీపెన్' దారి దీపం..
'సమస్య గురించి నిట్టూర్చేవారు కొందరు. సమస్యకు పరిష్కారం వెదకాలని ప్రయత్నించేవారు కొందరు. దీపెన్ బబారియా రెండో కోవకు చెందిన వ్యక్తి. కాలేజీ రోజుల్లో ఎదురైన సమస్య స్టార్టప్ ఐడియాకు ఊపిరి పోసింది. ఇనోవేటర్గా, ‘రోడ్మాట్రిక్స్’ రూపంలో సక్సెస్ఫుల్ ఎంటర్ ప్రెన్యూర్‌గా దీపెన్ను మార్చింది..' దీపెన్ బబారియా అతని ఫ్రెండ్ ఒకరోజు రాత్రి పనిపై బైక్‌పై ఎక్కడికో వెళుతున్నారు. లొకేషన్ తెలియక నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేశారు. ‘ఫాస్టెస్ట్ రూట్’ అని చూపించింది. తీరా చూస్తే అది గుంతలతో కూడిన రోడ్డు. మరోవైపు స్ట్రీటు లైట్లు లేకపోవడంతో బైక్ ముందుకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురైంది. ‘దూరం, వేగాన్ని లెక్కలోకి తీసుకొని ఈ మ్యాప్స్ షార్టెస్ట్ రూట్‌ను గుర్తిస్తాయి తప్ప అధ్వానంగా ఉన్న రోడ్లను మాత్రం గుర్తించవు’ అంటున్న దీపెన్ ఈ సమస్యకు ఏఐ ద్వారా పరిష్కారం చూపాలని కాలేజిరోజులలో గట్టిగా అనుకున్నాడు. సూరత్(గుజరాత్)కు చెందిన దీపెన్ ఏఐ స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లో రోడ్ల స్థితిగతులను తెలిజేసే అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్ల కోసం రూపొందించానుకున్నాడు. ఈ ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదై స్టార్టప్ రూపం తీసుకుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనే కలతో స్టార్టప్‌ల కేంద్రం అయిన బెంగళూరులో అడుగు పెట్టాడు దీపెన్. అక్కడ దీపెన్ ఐడియాపై నిఖిల్ ప్రసాద్ ఆసక్తి చూపించాడు. యూఎస్‌లో ఆటోమోటివ్ కారు కంపెనీలలో పని చేసిన నిఖిల్ ఇండియాకు తిరిగి వచ్చాడు. స్టార్టప్ కో–ఫౌండర్లలో నిఖిల్ ఒకరు. తక్కువ సమయంలోనే ఈ స్టార్టప్‌పై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శించారు. 100ఎక్స్.వీసి ఫస్ట్ ఫండింగ్ చేసింది. రోడ్ మేనేజ్మెంట్ ప్లానును అందించే ఏఐ–బేస్డ్ స్టార్టప్ ‘రోడ్‌మెట్రిక్స్’ బెంగళూరు కేంద్రంగా ్రపారంభమైంది. ‘కాలేజీరోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్‌ల్లో పనిచేసిన నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. రోడ్డు సేఫ్టీ అనేది ముఖ్యమైన అంశం. అయితే రోడ్డు హెల్త్‌ను తెలియజేసే సాఫ్ట్వేర్లు మన దగ్గర లేవు. ఈ లోటును పూరించేలా రోడ్మెట్రిక్స్ను తీసుకువచ్చాం’ అంటాడు దీపెన్. మొబైల్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని మొదట్లో అనుకున్న ఐడియాపై వర్క్ చేశాడు దీపెన్. మొబైల్ అప్లికేషన్‌గా పనిచేసే సెన్సర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం బాగున్నప్పటికీ వైబ్రేషన్స్‌ను క్యాప్చర్ చేయడానికి రోడ్డు ప్రతి భాగంలో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక సమస్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇతర కో–ఫౌండర్లతో కలిసి దీపెన్ మరింత రిసెర్చ్ చేసి ఇమేజ్ బేస్డ్, కంప్యూటర్ విజన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశాడు. వీరు రూపొందించిన ఏఐ అల్గారిథమ్ పది రకాల రోడ్ డిఫెక్ట్స్‌ను గుర్తిస్తుంది. ఫాస్టెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, ట్రాఫిక్లెస్ రోడ్లను గుర్తించడానికి వినియోగదారులకు ఉపకరించే రోడ్‌మెట్రిక్స్ మ్యాప్స్‌ను కూడా అభివృద్ధి చేశారు. మొదట బెంగళూరు, ముంబై రోడ్లను మ్యాపింగ్ చేసిన తరువాత అస్సాం, బిహార్లలో కూడా పనిచేశారు. ‘మా సాఫ్ట్వేర్ అంచనా వేసిన డ్యామేజ్ రిపోర్ట్‌ల ఆధారంగా మున్సిపాలిటీలు, ప్రైవేటు సంస్థలు నిధుల కేటాయింపు గురించి సరిౖయెన నిర్ణయం తీసుకోవచ్చు’ అంటున్న దీపెన్ రోడ్డు సమస్యలను గుర్తించడంలో జంషెడ్‌పూర్‌లోని టాటాగ్రూప్‌నకు సహాయం అందించాడు. టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్న ‘రోడ్‌మెట్రిక్స్’ ప్రభుత్వ మున్సిపాలిటీలతో పనిచేయడానికి చర్చలు జరుపుతోంది. మన దేశంలో వేలాది కిలోమీటర్లు కవర్ చేసిన కంపెనీ ఇక్కడితో ఆగిపోలేదు. ‘సిటీ ఆఫ్ లండన్’ మ్యాపింగ్ కూడా స్టార్ట్ చేసింది. అక్కడ కూడా స్టార్టప్‌కు క్లయింట్స్ ఉన్నారు. ‘మన రహదారులను సాధ్యమైనంత సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలనుకుంటున్నాం’ అంటున్నాడు దీపెన్ బబారియ. ‘రోడ్ మెట్రిక్స్’ స్టార్టప్ మొబిలిటీ ఏఐ గ్రాండ్ ఛాలెంజ్, బెస్ట్ ఏఐ స్టార్టప్ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్‌లను సొంతం చేసుకుంది. ఇవి చదవండి: వీధి కుక్క దాడిలో చేతిని కోల్పోయిన మహిళ..ట్విస్ట్ ఏంటంటే..? -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ యాత్ర.. ఫోకస్ అంతా అక్కడే!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ జనవరి 14 నుంచి మణిపూర్‌లోని ఇంపాల్‌లో ప్రారంభం కానుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లను మీదుగా.. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో సాగనుంది. రాబోయే 2024 సాధారణ పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టబోయే యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన ‘భారత్ న్యాయ యాత్ర’ద్వారా ప్రధానంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఫోకస్ చేయనున్నట్లు తెలుసోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు ఈ రెండు రాష్ట్రాలను యాత్ర కొనసాగిస్తారని సమాచారం. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఎంపీ స్థానంలో గెలుపొంది. సోనియా గాంధీ రాయ్‌బరేలి సెగ్మెంట్లో గెలుపొందారు. అదే విధంగా గుజరాత్లో గత రెండు సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ కనీసం కనీసం ఒక్కసీటు కూడా గెలవకపోవటం గమనార్హం. అయితే పార్టీ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడానికి రాహుల్ గాంధీ యాత్రను ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి స్థానిక నేతల అభ్యర్థనలు, పార్టీ రాజకీయ ప్రయోజనాలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో యూపీ, గుజరాత్లో రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ సుమారు వారంరోజుల సాగనుంది తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీ, గుజరాత్లో రాహుల్ యాత్ర కొనసాగాలని భావిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ మొదలైంది. అయితే గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ గుజరాత్ అడుగు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం మూడు రోజులు మాత్రమే రాహుల్ గాంధీ యాత్ర కొనసాగించారు. మణిపూర్‌లో యాత్ర ప్రారంభమై నాగాలాండ్‌లో ఒకరోజు, ఆస్సాంలో 3 లేదా 4 రోజులు రోజుల పాటు యాత్ర కొనసాగి పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమైతమైనంది. బెంగాల్‌లోని ఉత్తర బెంగాల్ ప్రాంతంలో యాత్ర ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తోంది. నార్త్ బెంగాల్లో ఉన్న మూడు స్థానాలు రిజర్వడ్ కాగా.. అక్కడ కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంక్ ఉండటం విశేషం. గత యాత్రలో యాత్రలో రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటించకపోవటనికి కారణం రూట్ సమస్యలేనని, కానీ ‘భారత్ న్యాయ యాత్ర’లో గుజరాత్లో చాలా ప్రాంతాల్లో రాహుల్ యాత్ర కొనాసాగుతుందని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. 14 రాష్ట్రాల్లో చేపట్టబోయే రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ 358 ఎంపీ నియోజకవర్గాల కుండా సాగుతుంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌పార్టీ రాహుల్ గాంధీ యాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగిసే రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’కు సంబంధించిన అధికారిక ఫైనల్ రూట్ మ్యాప్ సిద్ధం కాలేదు. చదవండి: కాంగ్రెస్ కు పరీక్షా కాలం -
నదిలో విహరిస్తూ...దేవాలయాలను దర్శిస్తూ..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా నది జల విహారం పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని పంచనుంది. నదీ తీరంలోని ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్ టూరిజానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ చుట్టు పక్కల ఉన్న 7 ప్రధాన దేవాలయాలను ఒకే రోజు సందర్శించేలా ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కృష్ణా నది ద్వారా టెంపుల్ టూరిజంకు సంబంధించిన జెట్టీల నిర్మాణం, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో పర్యాటక, దేవాలయాలను కలిపే విధంగా ప్రణాళిక రచించింది. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, జలవిహారం చేస్తూ 80 కిలోమీటర్లు ప్రయాణం చేయటం ద్వారా7 ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఇన్ లాండ్ వాటర్ వేస్ చర్యలు తీసుకొంటోంది. జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చూస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో పిల్లలకు ఆట వస్తువులు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, ఓపెన్, ఎడ్వంచర్ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. జలవిహారం సాగనుంది ఇలా... ♦ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఉదయం దుర్గాఘాట్ నుంచి భవానీ ద్వీపానికి జెట్టీ వెళ్తుంది. అక్కడ గంట సేపు ద్వీపం అందాలను ఆస్వాదించవచ్చు. ♦ అక్కడ నుంచి జెట్టీ పవిత్ర సంగమంకు చేరుకుంటుంది. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి గుంటూరు జిల్లా వైకుంఠపురంలో ఉన్న వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. ♦ అక్కడ నుంచి అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళతారు. ఆ తరువాత జగ్గయ్యపేట వద్దనున్న వేదాద్రికి చేరుకొని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. సాయంత్రానికి ముక్త్యాల భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడంతో జలవిహారం ముగుస్తుంది. అక్కడ స్వామి వారి దర్శనం పూర్తయిన తర్వాత ..బస్సులో రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుస్తారు. మౌలిక వసతులకు ప్రతిపాదనలు... ప్రస్తుతం ఆయా ప్రదేశాల్లో జెట్టీ నిర్మాణాలు, దేవస్థానాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు,వెయిటింగ్ లాంజ్‌లు, టికెట్ కౌంటర్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నుంచి ఓ జెట్టీ, ముక్త్యాల నుంచి ఓ జెట్టీ ప్రతి రోజు ఉదయం బయలుదేరే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదనలు ఇలా.. 2 యాంత్రీకరణ బోట్లు కొనుగోలుకు అయ్యే ఖర్చు: రూ.22 కోట్లు 7 ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, సౌకర్యాలకు: రూ.24 కోట్లు జెట్టీలు ని ర్మించే ప్రాంతంలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి: రూ. 4 కోట్లు మొత్తం అయ్యే ఖర్చు : రూ.50 కోట్లు జలవిహారానికి ఏర్పాట్లు... కృష్ణా నదిలో జలవిహారం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించే విధంగా టెంపుల్‌టూరిజం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఒక్క రోజులోనే కృష్ణా నదిలో 80 కిలోమీటర్ల మేర జలవిహారం చేస్తూ, ఏడు ప్రదేశాలను సందర్శించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. విజయవాడ నుంచి శ్రీశైలానికి నదీమార్గంలో వెళ్లే విధంగా లాంచీ సర్విసులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. – ఎస్వీకే రెడ్డి, సీఈవో, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ -
‘భారత్ జోడో యాత్ర’ 7 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల మీదుగా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’రాష్ట్రంలో 15 రోజులపాటు 375 కి.మీ. సాగనుంది. ఈ మేరకు రూపొందించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌లను టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం ఆమోదించింది. గురువారం సాయంత్రం ఇందిరాభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవగా ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాత్ర సాగే రూట్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 23న నారా యణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే యాత్ర 7 పార్లమెంటు నియోజకవర్గాలు, 16 శాసనసభా సెగ్మెంట్ల మీదుగా సాగనుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మీదుగా సాగే ఈ పాద యాత్ర హైదరాబాద్ పరిధిలో 60 కి.మీ. మేర నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 31న శంషా బాద్ నుంచి ఆరాంఘర్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించే రాహుల్ పాదయాత్ర... చార్మినార్ నుంచి గాంధీభవన్, నెక్లెస్‌రోడ్డు, బోయినపల్లి వరకు చేరుకోనుంది. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని 31న నెక్లెస్‌రోడ్డు వద్ద బహిరంగ సభ జరగనుంది. ఆ రోజు రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడి యాలజీ సెంటర్లో రాహుల్ రాత్రి బస చేస్తారు. నవంబర్ 1న బాలానగర్, కూకట్పల్లి, పటాన్చెరు మీదుగా ఓఆర్ఆర్ వద్ద ముత్తంగి నుంచి సంగారెడ్డిలోకి ప్రవేశించే లా మ్యాప్ రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాదయాత్రకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వేణుగోపాల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. పార్టీ ఐక్యతను చాటండి రాహుల్ చేపట్టిన పాదయాత్రను తెలంగాణలో విజ యవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోరారు. టీపీసీసీ విస్తృత కార్యవర్గ భేటీ లో ఆయన మాట్లాడు తూ.. తెలంగాణలో కాంగ్రె స్ ఐక్యంగా ఉందని ఈ యా త్ర ద్వారా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 375 కి.మీ.పాటు సాగే పాదయాత్రలో అన్ని వ ర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని.. బీజేపీ, సంఘ్ పరివార్ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రాహుల్ పాదయాత్ర రూట్‌మ్యాప్... ►ఈ నెల 23న కర్ణాటక–నారాయణపేట జిల్లా సరిహద్దునున్న కృష్ణా నది బ్రిడ్జి నుంచి మక్తల్ వరకు.. ►24, 25 దీపావళి నేపథ్యంలో యాత్రకు విరామం ►26న మక్తల్–దేవరకద్ర ►27న దేవరకద్ర–మహబూబ్‌నగర్ పట్టణం ►28న మహబూబ్‌నగర్–జడ్చర్ల ►29న జడ్చర్ల–షాద్‌నగర్ ►30న షాద్‌నగర్–శంషాబాద్ (29 కి.మీ.) ►31న శంషాబాద్ నుంచి ఆరాంఘర్–చార్మినార్–గాంధీభవన్–నెక్లెస్‌రోడ్డు–బోయిన్పల్లి ►నవంబర్ 1న బాలానగర్–కూకట్పల్లి–పటాన్చెరు మీదుగా ముత్తంగి ►నవంబర్ 2న పటాన్చెరు నుంచి శివంపేట (సంగారెడ్డి) ►నవంబర్ 3 యాత్రకు విరామం ►నవంబర్ 4న సంగారెడ్డి నుంచి జోగిపేట ►నవంబర్ 5న జోగిపేట–శంకరంపేట ►నవంబర్ 6న శంకరంపేట నుంచి మద్నూర్ -
భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై సమీక్ష
స్టేషన్ మహబూబ్‌నగర్/మరికల్/కృష్ణా/కోస్గి/మక్తల్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. గురువారం జడ్చర్ల నుంచి ఆయన తన వాహనం నుంచే మహబూబ్‌నగర్ పట్టణంలోని గోపాల్‌రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జేపీఎన్సీఈ కళాశాల, మన్యంకొండ స్టేజీలను పరిశీలించి దేవరకద్ర మీదుగా వెళ్లారు. కోస్గి, మక్తల్‌లోనూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా పార్టీ నాయకులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ కర్ణాటకలోని రాయచూర్‌కు వెళ్లారు. అక్కడ మాజీ ఎంపీ బోస్‌రాజ్, బివినాయక్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రలో తీసుకోవాల్సిన చర్యలు, జన సమీకరణ తదితర అంశాలపై సమీక్షించినట్లు సమాచారం. రేవంత్ వెంట మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఉన్నారు. రేవంత్ నివాసానికి దిగ్విజయ్, జైరాం, మాణిక్యం దసరా పండుగ సందర్భంగా ఏఐసీసీ నేతలకు రేవంత్‌రెడ్డి అల్పాహార విందు ఇచ్చారు. భారత్ జోడో యాత్రపై సమీక్ష కోసం ఏఐసీసీ ముఖ్యనేతలు దిగ్వి జయ్సింగ్, జైరాం రమేశ్, కొప్పుల రాజు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అంతకుముందు రోజు హైదరాబాద్‌లో ఉన్నారు. దసరా పండుగ కావడంతో వీరందరిని తన నివాసానికి ఆహ్వానించిన రేవంత్ వారికి ఘనంగా అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో టీపీసీసీ నేతలు సంపత్ కుమార్, రేణుకా చౌదరి, హర్కర వేణుగోపాల్‌తోపాటు మాజీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై నేతలు చర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురించి కూడా కాంగ్రెస్ నేతల మధ్య చర్చ జరిగిందని, ఈ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. -
రాష్ట్రంలో ‘భారత్ జోడో’ రూట్ మ్యాప్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తెలంగాణ రూట్ మ్యాప్ ఖరారైంది. టీపీసీసీ ఆధ్వర్యంలో రూపొందించిన పాదయాత్ర రూట్ మ్యాప్‌కు ఏఐసీసీ ఆమోదం లభించింది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ గాంధీ.. కర్ణాటక నుంచి నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తారు. అక్కడినుంచి మక్తల్, మహబూబ్‌నగర్ టౌన్, జడ్చర్ల, షాద్‌నగర్‌ల మీదుగా యాత్ర శంషాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బార్కస్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, బేగంబజార్, గాంధీభవన్, నాంపల్లి, విజయనగర్ కాలనీ, మాసాబ్‌ట్యాంక్, పంజగుట్ట, అమీర్‌పేట, మూసాపేట, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ముత్తంగిల మీదుగా యాత్ర సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లనుంది. అనంతరం సంగారెడ్డి నుంచి జోగిపేట, పెద్దశంకరంపేట, మద్నూరుల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో రూట్ మ్యాప్‌కు ఏఐసీసీ అనుమతి లభించడంతో టీపీసీసీ నేతలు రాహుల్ యాత్రకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చార్మినార్ ప్రాంతంలో పర్యటించి యాత్ర మార్గాన్ని పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించాల్సి ఉంది. అయితే, ఒకట్రెండు రోజులు షెడ్యూల్లో మార్పు ఉండవచ్చని, అక్టోబర్ 26 నుంచి ఏ రోజైనా రాహుల్ తెలంగాణలోకి వస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. కీలక సమావేశం..: భారత్ జోడో యాత్ర షెడ్యూల్‌పై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్, కొప్పుల రాజు సోమవారమే హైదరాబాద్‌కు వచ్చారు. తొలుత ఈ నాయకులు మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లి ఏపీలో రాహుల్ యాత్రపై అక్కడి నేతలతో చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుని టీపీసీసీ ముఖ్యులతో భేటీ కానున్నారు. భారత్ జోడో యాత్రతో పాటు యాత్ర తర్వాత నిర్వహించనున్న ‘సంవిధాన్ బచావో మార్చ్’పై కూడా కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నట్లు తెలిసింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ -
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం పూర్తి
-
కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపే.. నిమజ్జన రూట్‌మ్యాప్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇంకొద్ది క్షణాల్లో ఉద్విగ్న ఘట్టానికి తెర లేవనుంది. మహా యజ్ఞానికి ముహూర్తం పడనుంది. గణేష్ సామూహిక ఊరేగింపులు, నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. కళ్లన్నీ.. కాళ్లన్నీ సాగర తీరం వైపు కదలనున్నాయి. దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు. ►శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, ఏపీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీసు ఫోర్స్ బందోబస్తులో ఉంటాయి. 120 బృందాలను షీ–టీమ్స్ రంగంలోకి దింపింది. ►బాలాపూర్– హుస్సేన్‌సాగర్ మధ్య 18.9 కి.మీ మేర ప్రధాన శోభాయాత్ర మార్గం ఉంది. ఇది 11 పోలీసుస్టేషన్ల పరిధిల మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 261 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 739 అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ►పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎన్టీఆర్ మార్గ్, గాంధీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం ఊరేగింపుల్లో డీజేలు నిషేధించారు. ఖైరతాబాద్ బడా గణేషుడి వద్ద, ఆ చుట్టుపక్కల కలిపి 53 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 2.5 కి.మీ మేర జరిగే ఈ ఊరేగింపుపై నిఘా ఉంచడానికి అదనంగా మరో 24 కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ►ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్ కెమెరాలు ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ.. ఎంఎంటీఎస్.. మెట్రో సేవలు హుస్సేన్‌సాగర్ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. ఇబ్బందులు రానీయొద్దు: మేయర్ నిమజ్జనం సందర్భంగా కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండాలని, వ్యర్థాలు పోగవకుండా పారిశుద్ధ్యం సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు నగర మేయర్ విజయలక్ష్మి సూచించారు. నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెకిలి చేష్టలు వద్దు శోభా యాత్రలో అమ్మాయిలు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలకు అరదండాలు తప్పవు. వాటర్ ప్యాకెట్లు చింపి మహిళల మీద చల్లడం, పేపరు ముక్కలను వేయటం, పూలు చల్లడం వంటివి చేస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దు. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు, వీడియోలు తీయటం చేయకూడదు. పోకిరీల వెకిలి చేష్టలను సీసీ కెమెరాలలో రికార్డ్ చేసి, ఆధారాలతో సహా న్యాయస్థానంలో హాజరుపరుస్తాం. – రాచకొండ షీ టీమ్స్ డీసీపీ ఎస్కే సలీమా 196 తాగునీటి శిబిరాలు భక్తులకు తాగునీటిని అందించేందుకు జలమండలి 196 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరగనున్న ప్రధాన మార్గాలు, ట్యాంక్ బండ్ పరిసరాలు, నిమజ్జన కొలనుల వద్ద ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో మొత్తంగా 30.72 లక్షల నీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అవసరమైన చోట్ల డ్రమ్ముల్లో తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు జలమండలి అధికారులు తెలిపారు. నీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. వినాయకుడికో కోడ్! నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్ చేసుకున్న గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ గణేష్ నిమజ్జనం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలకు ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు. గురువారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 20, 315 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 7, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 43 సహా 13 కిలోమీటర్ల ఎల్టీ కేబుల్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100/1912/ 7901530966/ 790153086లను సంప్రదించాలి. డ్రోన్లతో డేగకన్ను గణేష్ నిమజ్జనానికి సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి. -
Hyderabad: గంగమ్మ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి
► ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడి చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ►తుది దశకు చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ►క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ గణపతి ►ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు.. ► ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. ట్యాంక్ బండ్లో నిమజ్జనం సందర్భంగా గణేషుడు తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు చేరుకున్నాడు. అశేష భక్తజన సమూహంలో గణనాథుడు నాలుగో నెంబర్ క్రైన్ వరకు తరలివెళ్తున్నాడు. ►ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడిని చివరిసారిగా భక్తజనం భారీగా తరలివచ్చారు. గణపతిబప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేషున్ని నిమజ్జనం చేయనున్నారు. ►హుస్సేన్ సాగర్ వద్ద ఒక్క సారిగా వాతావరణం చల్లబడింది. వర్షం పడే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున వడివడిగా యాత్ర సాగించనున్నారు. మరి కొద్ది సేపటిలో టాంక్ బండ్ వద్దకు బడా గణేష్ విగ్రహం రానుంది. ► గత ఏడాది కన్నా ఈ ఏడాది నిమజ్జన ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. తను దగ్గరుండి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత వ్యర్ధాలను తీసివేసే పని మొదలు పెడతామన్నారు. ► ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ►ఖైరతాబాద్ గణేష్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా వినాయకుని నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో కెల్లా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేకత ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భారీ జనసమూహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి శోభ యాత్ర #KhairatabadGanesh pic.twitter.com/h31teOJMeW — Latha (@LathaReddy704) September 9, 2022 ►సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని తెలిపారు. 10వేలమంది పోలీసులు, 10వేలమంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ రాత్రి నుంచి రేపటి ఉదయం వరకూ నిమజ్జనాలు జరుగుతాయనిచ రాత్రి ఎక్కువగా వర్షం కురవడంతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆలస్యం అయిందన్నారు. ► ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న మంత్రి తలసాని. ►బడా గణేషుడిని టస్కర్ మీదికి ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ క్రేన్ సహాయంతో గణేషుడిని విగ్రహాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రక్రియ మొదలైంది. వంద టన్నులు బరువు మోయగల బరువున్న లారీ, క్రేన్ సహాయంతో నిమర్జన శోభాయాత్ర ఏర్పాట్లు చేశారు. సాక్షి, హైదరాబాద్: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్లనున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే ఆర్టిస్టు జోగారావు నేతృత్వంలో శిల్పి చిన్నస్వామి సారథ్యంలో 30 మంది క్లే ఆర్టిస్టులు మట్టి మహాగణపతి తయారీలో పాల్గొన్నారు. ► గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి బరువు రెట్టింపైంది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60– 70 టన్నులకు చేరింది. ►మహాగణపతిని సాగర తీరానికి ట్రయిలర్ వాహనంపై తరలిస్తారు. లేటెస్ట్ మోడల్ మెకానికల్ ట్రయిలర్ ఓల్వో ఇంజిన్ సామర్థ్యం. డీఎస్–6 పర్యావరణ కాలుష్య ప్రీ వాహనం. ఈ ట్రయిలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోస్తుంది. ►ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి 2010 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్నారు. ►మహాగణపతికి గురువారం రాత్రి 11.10 గంటలకు చివరి పూజ నిర్వహించి కలశాలను కదిలించారు. క్రేన్ నంబర్ 4 వద్దకు.. ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నంబర్–4 వద్దకు మహాగణపతి మధ్యాహ్నం 1 గంటలకల్లా చేరుకోగానే వెల్డింగ్ తొలగింపు, చివరి పూజలు అనంతరం మధ్యాహ్నం 2 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు తెలిపారు. రూట్ మ్యాప్ ఇలా.. ఖైరతాబాద్ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్ థియేటర్ ముందు నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నం– 4 వద్దకు చేరుకుంటుంది. -
చలో మేడారం: రూట్‌మ్యాప్, వాహనాల పార్కింగ్ వివరాలు
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర ఇప్పటికే భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోయేదారి.. వచ్చేదారి అంటూ వన్‌వే చేశారు. జాతరకు భక్తులు ఎక్కువగా అటవీ ప్రాంతంలోని చిన్నచిన్న పల్లెల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్, తిరుగు ప్రయాణం ఎలా అన్న అనుమానాలు చాలామందిలో ఉంటాయి. భక్తుల అవసరార్థం.. ప్రయాణం సాఫీగా సాగేందుకు పోలీసులు రూట్‌మ్యాప్‌ను విడుదల చేశారు. ఆ మ్యాప్‌ను మరింత సరళతరం చేసి ‘సాక్షి’ మీకు అందిస్తోంది. – సాక్షిప్రతినిధి, వరంగల్ హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తులు నేషనల్ హైవే–163 ద్వారా జనగామ మీదుగా రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో భువనగిరి–ఆరెపల్లి బైపాస్ ఎక్కాలి. ఆరెపల్లి నుంచి నేరుగా ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, పస్రా.. నార్లాపూర్ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడ్, హనుమకొండ మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : నార్లాపూర్ ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట ఖమ్మం, ఇల్లెందు, మహబూబాబాద్,నర్సంపేట, మల్లంపల్లి , పస్రా నుంచి నార్లాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, రేగొండ, పరకాల మీదుగా గుడెప్పాడు, వరంగల్ నుంచి పోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్, నార్లాపూర్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ హుజూరాబాద్, పరకాల, రేగొండ, గణపురం, వెంకటాపురం(ఎం), జగాలపల్లి క్రాస్ నుంచి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, భూపాలపల్లి, గారెపల్లి నుంచి మంథని, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. పార్కింగ్ : నార్లాపూర్, కొత్తూరు లింగాల, గుండాల ఇల్లెందు, రొంపేడు, గంగారం, పూనుగొండ్ల, లింగాల, పస్రా, నార్లాపూర్, మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. వీరు తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి, పరకాల, రేగొండ మీదుగా గూడెప్పాడ్, వరంగల్ నుంచి నర్సంపేట చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : వెంగ్లాపూర్ రామగుండం, మంథని రామగుండం, గోదావరిఖని, మంథని, కాటారం, గారెపల్లి ఎడమవైపు నుంచి కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్లోనే వెళ్లాలి. పార్కింగ్ : కాల్వపల్లి, నార్లాపూర్ కాళేశ్వరం, మహారాష్ట్ర.. కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వ పల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దూదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాలి. పార్కింగ్ : ఊరట్టం వాజేడు, ఛత్తీస్‌గఢ్ వెంకటాపురం(కె) ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలు వాజేడు, జగన్నాథపురం నుంచి ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, మల్యాల, ఊరట్టం నుంచి మేడారం చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో వచ్చిన రూట్‌మీదుగా వెళ్లాలి. పార్కింగ్ : ఊరట్టం మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం నుంచి చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం వరకు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవాలి. అదే మార్గంలో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ రూట్లో ఏదైనా ట్రాఫిక్ సమస్య వస్తే అత్యవసరంగా ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ పార్కింగ్ ప్రాంతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ : ఊరట్టం ఆర్టీసీ బస్సులు హనుమకొండ, ములుగు రోడ్డు, గూడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళ్తాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రానుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. పొరపాటున వెళ్లినా వెనక్కి పంపుతారు. తిరుగు ప్రయాణం మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు వెళ్లే వాహనాలు నార్లాపూర్ క్రాస్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్, భూపాలపల్లి, పరకాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజీ, వరంగల్ బైపాస్, పెండ్యాల మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. (క్లిక్: మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఫొటోలు) అందుబాటులో హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. చార్జీలు ఇలా.. ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. -
ఆర్టీసీ రూట్ మ్యాప్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్లతో తిప్పేందుకు అనుమతించే విషయంలో కేబినెట్ ఆమోదం తెలపడంతో మిగతా సగం బస్సులను ఆర్టీసీ పరిధిలో ఎలా నిర్వహించాలన్న అంశాన్ని ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ అధీనంలో సగం బస్సులను ఉంచి మిగతా సగం రూట్లను ప్రైవేటు బస్సులు తిప్పుకునేలా వాటి యజ మానులకు స్టేజీ క్యారియర్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఉన్నపళంగా ప్రైవేటు పర్మిట్లు జారీ చేయాలా లేక కొంతకాలం ఆగాక ఈ ప్రక్రియ ను చేపట్టాలా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఆ ప్రక్రియ ఎలా ఉం డాలనే అంశంపై ఇప్పటికే ఆర్టీసీ–రవాణాశాఖ అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేశారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తే నోటిఫికేషన్ జారీ కానుంది. గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై మరోసారి చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమించిన నేపథ్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రివర్గ భేటీలో సర్కారు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి...: మంత్రివర్గ భేటీ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు, జేటీసీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీ నిర్వహణపై అధికారులను ఆయన ప్రశ్నించగా ప్రస్తుతానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం, ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను చెల్లిస్తే కొంత ఉపశమనం ఉంటుందని, యథావిధిగా బస్సులు తిప్పితే క్రమంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ. వెయ్యి కోట్లు కేటాయించే పరిస్థితి లేదని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో అంతమేర ఆర్టీసీ ఆస్తుల విక్రయం అంశాన్ని అధికారులు ప్రస్తావించగా రూ. వెయ్యి కోట్లు వచ్చే ఆస్తులెక్కడివని సీఎం వ్యాఖ్యానించినట్లు, ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించాలని సూచించినట్లు తెలియవచ్చింది. ఇంత మంది సిబ్బందినేం చేస్తారు? సగం బస్సులను ప్రైవేటీకరిస్తే మిగతా సగం బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీకి తక్కువ మంది సబ్బందే అవసరమవుతారు. కానీ సమ్మె చేసిన 49,300 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటే సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. దీంతో వీఆర్ఎస్ పథకాన్ని అమలు చేసి అదనంగా ఉన్న వారిని ఇళ్లకు పంపే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చేపట్టిన సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. ఒకవేళ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ విషయం చర్చకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ అంశంపై కసరత్తు చేసి కేబినెట్ సమావేశమయ్యేలోగా వివరాలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి వీఆర్ఎస్ వర్తింపజేయాలనే దిశగా సమాచారాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు నాలుగైదేళ్ల తర్వాత ప్రైవేటు పర్మిట్ల విధానం ప్రారంభిస్తే ఈలోగా పదవీవిరమణ రూపంలో సిబ్బంది సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం. షరతులతోనే విధుల్లోకి! సమ్మె చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే కచ్చితంగా షరతుల ఆధారంగానే తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యూనియన్లు ఉండకుండా చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేసేలా కార్మికులు అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలనే షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై సమ్మెల జోలికి వెళ్లబోమని కూడా కార్మికులు నిర్దిష్ట హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి లేని నేపథ్యంలో వేతన సవరణ గడువును నాలుగేళ్ల నుంచి సడలించి ఐదారేళ్ల గడువు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ షరతులను కూడా ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రెండు రోజులు ‘మంత్రాంగం’! ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరుసటి రోజు, అంటే శుక్రవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశముందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ, కార్మికుల భవితవ్యంపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ భవితవ్యంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏజెండా బుధవారం ఖరారు కానుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. -
వర్గీకరణపై రూట్‌మ్యాప్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల సందర్భంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ స్పష్టమైన రూట్‌మ్యాప్‌ను ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తమ డిమాండ్‌ను చిత్తశుద్ధితో ముందు కు తీసుకెళ్లడానికి వీలుగా రాజ్యసభ, లోక్‌సభలతోపాటు ఎమ్మెల్సీగానూ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తే కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పా రు. శనివారం మగ్దూంభవన్‌లో ఈ అంశంపై టీజేఎ స్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఈ నేపథ్యంలో తమ చిరకాల వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ, చట్టసభల్లో ప్రాతినిధ్యంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ప్రతిపాదన లు సమర్పించామని చెప్పారు. కూటమిలో ని భాగస్వామ్య పార్టీల మేనిఫెస్టోలతో పాటు ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోనూ వర్గీకరణపై ఒక రోడ్‌మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోగా పరిష్కరి స్తారో తెలపాలని కోరామన్నారు. ఈ అంశాన్ని పరి శీలిస్తామని, దీనిని జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా దానిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా న్యాయమైన డిమాండ్ అని, దీనికి తమ మద్దతు ఉంటుందని కోదండరాం తెలిపారు. గతం లో వర్గీకరణ అమలుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు కూడా దీని అమలుకు పూర్తి గా సహకరిస్తుందని రమణ చెప్పారు. ఈ డిమాండ్‌కు తమ జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారని, దీనిపై ఎమ్మార్పీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుం దని పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌కు రూట్‌మ్యాప్ తప్పనిసరి
ఆదాయానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆదా యానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలకు సబ్రిజిస్ట్రార్లనే పూర్తి బాధ్యులుగా పరిగణించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్థిరాస్తి రిజి స్ట్రేషన్‌కు సదరు ఆస్తి ఉన్న ప్రదేశం రూట్‌మ్యాప్‌ను తప్పనిసరిగా సమర్పించాలని శాఖ నిబంధన పెట్టింది. అలాగే, రిజిస్ట్రేషన్ చేయా ల్సిన స్థిరాస్తి భవనం అయితే, తప్పనిసరిగా ముందువైపు నుంచి ఫొటోను తీసి దస్తావేజుకు జత చేయాలి. కొత్త నిబంధనల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన స్థిరాస్తిని ఆడిట్ అధికారులు తనిఖీ చేసేందుకు వీలువుతుందని, దస్తావేజులో పేర్కొన్న భవన విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపేందుకు వీలుకాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ తరహా నిబంధనలను పాటించకుండా తక్కువ మొత్తంలో స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేస్తే సదరు సబ్ రిజిస్ట్రార్లనే బాధ్యులుగా పరిగణించాలని నిర్ణయించారు. వ్యవస్థను నీరుగార్చవద్దు... రిజిస్ట్రేషన్ సేవల నిమిత్తం ఫీజు, స్టాంప్‌డ్యూటీలను వసూలు చేయడం కూడా పన్నుల చట్టం కిందకే వస్తుందని, ఈ నేపథ్యంలో శాఖాపరంగా ఎటువంటి లోపాలకు గానీ, వ్యవస్థను పలుచన చేసేందుకు అధికారులు తావివ్వరాదని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసిం ది. ఈ మేరకు తొలుత హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ జిల్లాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహించి, 45 రోజుల్లోగా బకాయిలన్నింటినీ క్లియర్ చేసేందుకు కృషి చేయాలని, భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ పురోగతిని సాధించే విధంగా పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. -
డేంజర్ జోన్స్ పై ఆరా..!
► పర్యవేక్షణ చేస్తున్న ఆర్టీఏ అధికారులు ►నెలరోజుల్లో నివేదికలు తయారు సిరిసిల్ల క్రైం : జిల్లాలోని 13 మండలాల ద్వారా ఇతర జిల్లాలను కలిపే మార్గాల్లో గల డేంజర్ జోన్స్ ను గుర్తించడానికి జిల్లా రవాణాశాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలను నిర్మూలించాలనే కోణంలో డేంజర్ జోన్స్‌పై కచ్చితమైన నివేదిక కోసం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూట్ మ్యాప్‌లతో తనిఖీలు... జిల్లా కేంద్రంగా సిరిసిల్ల నుంచి కామారెడ్డి, సిరిసిల్ల నుంచి సిద్దిపేట, సిరిసిల్ల నుంచి రుద్రంగి, సిరిసిల్ల నుంచి సిరికొండ, సిరిసిల్ల నుంచి కొదురుపాక వరకు ఉన్న రహదారులపై ప్రమాద స్థలాలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రూట్స్‌లో ఉన్న వివిధ రకాల పాత బావులు, ప్రమాద మలుపులు, ఇరుకైన రోడ్లు వంటి అంశాలను నిర్ణీత నమూనాలో పొందుపరుస్తున్నారు. వీటన్నింటినీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు నెల రోజుల వ్యవధిలో అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రవాణాశాకాధికారులు తెలిపారు. దీని ఆధారంగా ప్రమాదాల నివారణకు చెక్ పెట్టడానికి కావాల్సిన చర్యలను జిల్లా ఉన్నతాధికారులు ఆయా శాఖలకు ఆదేశాలిస్తారని వివరించారు. జిల్లా పునర్ విభజన అనంతరం ప్రమాదాలకు జిల్లాలో తావులేకుండా చూడాలన్న స్థాయిలో పర్యవేక్షణ చేయడంతోపాటు స్థానికులతో అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటునట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యాలయాల వద్ద ప్రత్యేక ఫోకస్.. భావిభారత పౌరులుగా ఎదిగే విద్యార్థులుంటే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను తీసుకోవాలని జిల్లా అధికారులు ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నట్లు పర్యవేక్షణలోని అధికారులు చెబుతున్నారు. విద్యాలయాల ఎదుట హెచ్చరికల బోర్డులు, జీబ్రా క్రాసింగ్ లైన్లు, స్టాపర్లు ఏర్పాటు చేసుకోవాలన్న కోణంలో సలహాలిస్తున్నట్లు తెలిసింది. దీని విషయంలో విస్తృతంగా ఆయా విద్యాలయాల యాజమాన్యాలతోను మాట్లాడాలని మౌళిక అదేశాలలో ఉన్నట్లు తెలిసింది -
రూటు మారేనా?
తలైమన్నార్‌కు వంతెన మార్గం పాంబన్‌లో మరో ట్రాక్ సాక్షి, చెన్నై: తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహదకారిగా గతంలో ప్రకటించిన సేతు సముద్రం ప్రాజెక్టు రూట్ మ్యాప్ మారేనా అన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కేంద్రం వేగవంతం చేసినట్టుంది. రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ఈ ప్రాజెక్టును కొత్త మార్గంలో తీసుకెళ్లేందుకు తగ్గ పరిశీలనలను నిపుణులు వేగవంతం చేశారు. అలాగే, ధనుస్కోడి నుంచి తలైమన్నార్‌కు వంతెనతో రోడ్డు మార్గం పరిశీలనులు సాగుతుండడం గమనార్హం. శ్రీలంక తో పాటు సముద్ర తీర దేశాల మధ్య భారత్ నుంచి నౌకాయాన మార్గాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టుకు 2005లో యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి నౌకలు దక్షిణ భారత్‌లోకి రావాలంటే, శ్రీలంకను చుట్టి రావాల్సి ఉంది. దీంతో సమయం వృథా. దూరంతో పాటు ఖర్చులు ఎక్కువే. అందుకే శ్రీలంకను చుట్టకుండా నేరుగా రవాణా సాగే రీతిలో సేతు సముద్రం కాలువను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి ధనుస్కోడి మీదుగా నాగపట్నం తీరం వెంబడి భారత సరిహద్దుల గుండా 167 కి.మీ దూరం ఈ ప్రాజెక్టుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు వేలాది కోట్లతో అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించారు. పనులు ముందుకు సాగుతున్న మార్గంలో శ్రీరాముడు నిర్మించిన రామ సేతు వంతెన బయట పడింది. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా, వివాదం కోర్టుకు చేరడంతో ఇక, పనులు ఆగినట్టే అన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే సర్కారు రాముడు నిర్మించిన వంతెనను కూల్చేందుకు వీలు లేదని, ఆ వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చింది. ఈ పరిణామాలతో సేతు ప్రాజెక్టు శకం ముగిసినట్టే అన్నది తేట తెల్లమైంది. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ సేతుకు జీవం పోయడానికి తగ్గ కసరత్తుల్ని చేపట్టి ఉన్నట్టుంది. కేవలం తమిళనాడు ప్రగతిని పరిగణలోకి తీసుకోకుండా, దేశ ప్రగతికి దోహద పడే విధంగా ఈ ప్రాజెక్టు రూపు రేఖల్ని మార్చేందుకు నిర్ణయించినట్టుంది. పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రూటు మారేనా: గత ఏడాది కేంద్ర నౌకాయాన, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన వేళ హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ సేతు సముద్ర ప్రాజెక్టు మార్గాన్ని పరిశీలించి వెళ్లారు. తదుపరి దక్షిణ తమిళనాడు ప్రగతి మీద దృష్టి పెట్టే విధంగా రహదారుల విస్తరణ, కన్యాకుమారి జిల్లా కులచల్లో హార్బర్ తదితర పనుల ప్రకటనలు ఒక దాని తర్వాత మరొకటి వెలువడిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో గత వారం చెన్నైలో జరిగిన ప్రాంతీయ మీడియా సంపాదకుల సదస్సులో సేతు ప్రాజెక్టు పరిస్థితిపై ప్రశ్నల వర్షం కురిసినా, అధికారులు దాటవేత దోరణి అనుసరించారు. అదే సమయంలో ఆ ప్రాజెక్టు వివాదం కోర్టులో ఉందని, ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశాలు ఉన్నాయని సమాధానాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సేతు సముద్ర ప్రాజెక్టును పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో తీసుకెళ్లడానికి తగ్గ ప్రక్రియకు శ్రీకారం చుట్టే విధంగా పరిశీలనల వేగం పెరగడం ఆలోచించాల్సిందే. ధనుస్కోడి మీదుగా కాకుండా, పాంబన్ వంతెన మార్గం గుండా దారి మళ్లించి రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు ఎదురు కాని విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగి ఉన్నట్టుంది. ఇందు కోసం కేంద్రనౌకాయాన శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల క్రితం ఆ మార్గాల్లో పరిశీలన జరిపింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త మార్గంలో పనులకు తగ్గ కార్యాచరణను కేంద్రం ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్త మార్గంలో ఈ ప్రాజెక్టును తీసుకెళ్లడంతో పాటు రామేశ్వరం లోని ధనుస్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌కు సముద్రంలో వంతెన మార్గంలో రోడ్డు నిర్మాణాలకు తగ్గ పరిశీలన జరిగి ఉండటం విశేషం. అలాగే, ప్రఖ్యాతి గాంచిన పాంబన్ రైల్వే వంతెన విస్తరణకు తగ్గ ప్రక్రియకు చర్యలు చేపట్టి ఉన్నారు. వేలాడి వంతెన తరహాలో భారీ ట్రాక్ నిర్మాణానికి తగ్గట్టు రైల్వే శాఖ దృష్టి పెట్టి ఉండడం బట్టి చూస్తే, తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహద పడే విధంగా మున్ముందు పరిణామాల వేగం పుంజుకునేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన రూట్ మ్యాప్
-
వంతెనలున్నాయ్...గుర్తుంచుకోండి!
-ఊరేగింపు జరిగే మార్గాల్లో 15 ఫ్లైఓవర్లు -ఇవి కాక మెట్రో పనులతో ఇబ్బందులు -అధ్వాన రోడ్డులతో మరికొన్ని సమస్యలు సాక్షి, సిటీబ్యూరో నగరానికి సంబంధించి ప్రధాన నిమజ్జన రోజు ఏమాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రక్రియ ఆగిపోయినా పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడానికి విగ్రహాల ఎత్తు కూడా ఓ కారణమయ్యే అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా ప్రధాన ఊరేగింపులు జరిగే మార్గాల్లో 15 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి ఎత్తును, విగ్రహాల ఎత్తుతో పోల్చుకుని అందుకు తగ్గ ఊరేగింపు మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఊరేగింపు సమయంలో విగ్రహాలు వంతెనల వద్ద ఇరుక్కుపోయి తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్... ఒక్కోసారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గణేష్ విగ్రహం వెళ్లే ఊరేగింపు మార్గంలోని వంతెనల కన్నా కనీసం 5 అడుగులు తక్కువగా విగ్రహం ఎత్తు ఉండాలి. వంతెన కింది నుంచి ఉన్న రోడ్డు దగ్గర ఈ ఎత్తును పరిగణలోకి తీసుకుంటారు. ‘గణేష్’ని తీసుకువెళ్లే వాహనం (లారీ, వ్యాన్ తదితరాలు) ఎత్తు గరిష్టంగా 5 అడుగులు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహం ఎత్తు వంతెన కంటే కనిష్టంగా 5 తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా సరిపోయే ఊరేగింపు మార్గాన్ని మండపాల నిర్వాహకులు ఎంపిక చేసుకోవాలి. ముందుగా మీరు అనుకున్న మార్గంలో ఉండే ఈ ‘అవాంతరాలను’ పరిగణలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసుకుంటే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కీలక ఘట్టం ముగుస్తుంది. వీటికి తోడు ఈసారి ‘మెట్రో మార్గం’లో పిల్లర్ల నిర్మాణాలు, సాయిల్ టెస్ట్‌లు, ఇతర పనులు జరుగుతున్న విషయాన్నీ నిర్వాహకులు గుర్తుంచుకోవాలి. ‘మెట్రో’తో బహుపరాక్: పోలీసు విభాగం గణేష్ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని చోట్ల కొత్తగా మెట్రో స్టేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ నిర్వాహకులు దష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ప్రధానంగా ఎంజే మార్కెట్ మీదుగా 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు వెళ్ళడం కష్టసాధ్యం. వీటిని మండప నిర్వహకులు దష్టిలో పెట్టుకుని, ముందుగానే వారు ఊరేగింపు వెళ్లే దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. విగ్రహము ఎత్తుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా హెల్ప్‌లైన్ లేదా కంట్రోల్‌రూం, స్థానిక పోలీసుల్ని సంప్రదించాలి. రోడ్లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే..: గడిచిన రెండుమూడు రోజులుగా కురిసిన వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఏమాత్రం విరామం లేకుండా రోజూ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆయా మార్గాలను మరమ్మతు చేయడం సైతం పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. అయితే ఇలాంటి రహదారుల వల్ల ఊరేగింపునకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. భారీ విగ్రహాలతో వస్తున్న లారీల టైర్లు ఈ గుంతల్లో పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్‌తో పాటు ప్రమాదాలకూ ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఎక్కడికక్కడ సెక్టార్లుగా విభజించుకుని ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు, ఊరేగింపులో ఉండే వారు సైతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఉండదు. -
రూట్ మ్యాప్ ఖరారు
విజయవాడ : కృష్ణా పుష్కర యాత్రీకుల సౌకర్యార్థం అధికారులు రూట్ మ్యాప్‌లు ఖరారు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా ఘాట్లకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు, దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఈ ర్యూట్ మ్యాప్‌లు రూపొందించారు. ఈ రూట్ మ్యాప్‌లను నగరపాలక సంస్థ అధికారులు విజయవాడకు నలువైపులా, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వచ్చే యాత్రికులు ఎలా వెళ్లాలి... ఎక్కడ పుష్కరనగర్లు ఉన్నాయి.. ఏయే ప్రాంతాల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి... తదితర వివరాలను ఆ మ్యాప్‌లలో వివరించారు. రూట్ మ్యాప్‌ల ఏర్పాటు ఇలా.. – ఏలూరు నుంచి వచ్చే భక్తులు నగరంలోకి ప్రవేశించగానే కనిపించే విధంగా రామరవప్పాడు రింగ్ వద్ద రూట్ మ్యాప్ బోర్డులు ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లే మార్గాలను యారో మార్కుల ద్వారా సూచించారు. ఆ తర్వాత అదే రూట్లో వచ్చే వారికి కనిపించే విధంగా ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద మరో రూట్ మ్యాప్‌ను పెట్టారు. అదే మార్గంలో రమేష్ ఆస్పత్రి జంక్షన్, బెంజిసర్కిల్ వద్ద కూడా రూట్ మ్యాప్‌లు ఏర్పాటుచేశారు. – మచిలీపట్నం వైపు నుంచి 65వ నంబరు జాతీయ రహదారిలో వచ్చే భక్తులకు తెలిసేలా సిటీ జంక్షన్లో రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. – జాతీయ రహదారి మీదుగా గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ వారధి వద్ద రూట్ మ్యాప్‌లు పెట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు వెళ్లకుండానే ఘాట్లకు చేరుకునే విధంగా మ్యాప్‌ను రూపొందించారు. – హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి మీదుగా వచ్చే వారికి అర్థమయ్యే విధంగా ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద రూట్ మ్యాప్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఎవరు ఏ ఘాట్లకు వెళ్లాలి... ఎలా చేరుకోవాలి... నగరంలో చూడదగిన ప్రదేశాలకు ఎలా వెళ్లాలి.. అనే వివరాలను ఆ రూట్æమ్యాప్‌లో వివరించారు. -
శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు
-
నేటి నుంచి దసరా మహోత్సవాలు
వినాయకుడు గుడి నుంచి ప్రత్యేక క్యూలైన్లు స్నానఘట్టాలు, కేశఖండనశాలల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం రూట్ మ్యాప్ రంగంలోకి దిగిన అదనపు పోలీసు బలగాలు సాక్షి, విజయవాడ : తొమ్మిది రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై అంగరంగవైభవంగా జరిగే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం నుంచి వచ్చే నెల 3 వతేదీ వరకు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవస్థానం అధికారులు చేశారు. ముఖ్యంగా స్నానఘట్టాలు, కేశఖండనశాలలు, క్లోక్‌రూమ్‌లు, చెప్పులు భద్రపరచుకునే ప్రదేశాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వారికి దేవస్థానానికి చేరుకునేందుకు వీలుగా ఎక్కడకు అక్కడ రూట్ మ్యాప్‌లు ఏర్పాటు చేశారు. తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలపై అధికారుల ప్రత్యేక దృష్టి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, జాయింట్‌కలెక్టర్ మురళి, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మూలనక్షత్రం, దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలకు అదనంగా ఆరువేల మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఇతర దేవస్థానాల నుంచి సిబ్బందిని రప్పించి వారి సేవలు వినియోగిస్తున్నారు. -
చురుగ్గా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
కర్నూలు: రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా కర్నూలులో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషినల్ డీజీ సురేంద్రబాబు, ఐజీపీ ఆర్కే మీనన్, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ తదితరులు శుక్రవారం పటాలంలోని మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. రూట్ మ్యాప్, ఎలైటింగ్ పాయింట్, శకటాల ప్రదర్శన, హెలిప్యాడ్, వీఐపీ గేట్ల ఏర్పాటు.. ఏ1, ఏ2, ఏ3, ఎఫ్1, ఎఫ్2 పాసుల జారీ తదితర అంశాలపై స్థానిక అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం పెరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. ఆరు జిల్లాల నుంచి సాయుధ బలగాలు, పెరేడ్ నిర్వహణకు కర్నూలుకు చేరుకున్నాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం వరకు పటాలం మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు. -
ఎన్నికలకు ఏర్పాట్లు
కామారెడ్డి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పకడ్బం దీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ముందస్తు ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇదివరకే ఓటరు జాబితాలను సిద ్ధం చేసిన యంత్రాంగం ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు, వసతుల పరిశీలన, రూట్ మ్యాప్‌ల రూపకల్పన పనులు చేపడుతోంది. బూత్ నంబర్లను కేటాయించిన అధికారులు కేంద్రాల వద్ద వాటిని వేయిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. అధికారులు జిల్లావ్యాప్తంగా పోలింగ్‌కు సం బంధించిన పనులు చేపడతున్నారు. ఇందులో భా గంగా బూత్‌లు, రూట్ మ్యాప్‌ల తయారీ, వసతులపై దృష్టిపెట్టారు. కామారెడ్డి డివిజన్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. గతం లో కామారెడ్డి నియోజక వర్గంలో 219 బూత్‌లు ఉం డగా ఇపుడు 223కు చేరాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 227 ఉండగా, ఇప్పుడు 229కి చేరాయి. ఆయా బూత్‌లకు సంబంధించిన పూర్తి సమాచారా న్ని సేకరించిన అధికారులు వసతులను కూడా పరి శీలించారు.ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డివిజన్లోని ఆయా మండలాల్లో తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇలా జిల్లాలోని మిగతా డివిజన్లలోనూ పోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. సమస్యలు లేకుండా సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతులు ఉన్నాయా.. లేవా అని అధికారులు పరిశీలిస్తున్నారు. వెబ్ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత చాలా వరకు రెవెన్యూ యంత్రాంగంపైనే ఉండడంతో ఆ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పకడ్బందీగా నిర్వహణ నోటిఫికేషన్ రాకముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవ డం ద్వారా ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూ సుకోవచ్చన్న భావనతో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు గాను ఇప్పటికే పోలీసు యం త్రాంగం కూడా సంసిద్ధమైంది. జిల్లాలోని సమస్యాత్మక బూత్‌లను గుర్తించారు. అక్కడ ఎలాంటి చర్య లు చేపట్టాలో ముందే అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేం దుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. -
కోలాహలంగా నిమజ్జనోత్సవం
తిరుపతి, న్యూస్‌లైన్: ‘గణపతిబప్పా మోరియా.. జై గణేశ జైజై గణేశా’ నినాదాలతో తిరుపతి నగరం దద్దరిల్లింది. మూడు రోజులపాటు పూజలు అందుకున్న ఆది దేవుడి నిమజ్జన మహోత్స వం బుధవారం కోలాహలంగా జరిగిం ది. ఈ కార్యక్రమంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. తిరుపతిలో ఈ ఏడాది 320 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఆశీ స్సులు అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ముందుగా ప్రకటించిన రూట్ మ్యాప్ ప్రకారం విగ్రహాలను నిమజ్జనం కోసం వినాయకసాగర్‌కు తరలించారు. మేళతాళాలతో ఊరేగింపుగా విగ్రహాలను తరలించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నిర్వాహకులు ముందు సాగారు. సాయంత్రం 4 గంట ల నుంచి నిమజ్జనం ప్రారంభమైంది. సాయంత్రం 5.45 గంటల వరకు 130 విగ్రహాలు వినాయకసాగర్‌కు చేరుకున్నాయి. వాటికి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామంచి శ్రీనివాస్, జీ.భానుప్రకాష్‌రెడ్డి, మాంగాటి గోపాల్‌రెడ్డి, వరప్రసాద్ సుభాష్‌నగర్ వద్ద స్వాగతం పలికారు. నిమజ్జనం చేయడానికి వీలు గా చెరువులో రెండు నాటు పడవలను (తెప్పలు) ఏర్పాటు చేశారు. తిమ్మినాయుడుపాళెం సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను సిద్ధం చేసి ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, తుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు వినాయకసాగర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భజనలు నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ బందోబస్తును పర్యవేక్షించారు. గత ఏడాది విగ్రహం వెంట వచ్చిన వారికి మినరల్ వాటర్ ప్యాకె ట్లు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. నిమజ్జనం సాఫీగా ముగిసింది. -
విజయమ్మ దీక్షకు మద్దతు
అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆమరణదీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు కదిలి రావాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈ నెల 22 నుంచి జిల్లాలో పార్టీ చేపట్టే సమైక్య బస్సు యాత్రలను విజయవంతం చేసే బాధ్యత అందరిదీ అన్నారు. బస్సు యాత్రల విషయమై మాట్లాడేందుకు జిల్లా పార్టీ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పార్టీ రాష్ర్ట నేత కొణతాలను కలిశారు. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్, పార్టీ శ్రేణుల పాత్రపై మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గ నేతలను కొణతాల ఆరా తీశారు. విజయమ్మ దీక్షకు సంఘీభావంగా నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ మద్దతుదారులను నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో అభినందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కొణతాలను కలిసినవారిలో గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిశోర్, మండల నాయకులు గొర్లి హరిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు చోడవరం నియోజవర్గానికి చెందిన అడపా నర్సింహమూర్తి, సూర్యనారాయణ, కర్రి తమ్మునాయుడు ఉన్నారు.