‘గణపతిబప్పా మోరియా.. జై గణేశ జైజై గణేశా’ నినాదాలతో తిరుపతి నగరం దద్దరిల్లింది. మూడు రోజులపాటు పూజలు అందుకున్న ఆది దేవుడి నిమజ్జన మహోత్సవం బుధవారం కోలాహలంగా జరిగింది.
తిరుపతి, న్యూస్‌లైన్: ‘గణపతిబప్పా మోరియా.. జై గణేశ జైజై గణేశా’ నినాదాలతో తిరుపతి నగరం దద్దరిల్లింది. మూడు రోజులపాటు పూజలు అందుకున్న ఆది దేవుడి నిమజ్జన మహోత్స వం బుధవారం కోలాహలంగా జరిగిం ది. ఈ కార్యక్రమంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. తిరుపతిలో ఈ ఏడాది 320 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి ఆశీ స్సులు అందుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ముందుగా ప్రకటించిన రూట్ మ్యాప్ ప్రకారం విగ్రహాలను నిమజ్జనం కోసం వినాయకసాగర్‌కు తరలించారు. మేళతాళాలతో ఊరేగింపుగా విగ్రహాలను తరలించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ నిర్వాహకులు ముందు సాగారు. సాయంత్రం 4 గంట ల నుంచి నిమజ్జనం ప్రారంభమైంది. సాయంత్రం 5.45 గంటల వరకు 130 విగ్రహాలు వినాయకసాగర్‌కు చేరుకున్నాయి. వాటికి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామంచి శ్రీనివాస్, జీ.భానుప్రకాష్‌రెడ్డి, మాంగాటి గోపాల్‌రెడ్డి, వరప్రసాద్ సుభాష్‌నగర్ వద్ద స్వాగతం పలికారు.
నిమజ్జనం చేయడానికి వీలు గా చెరువులో రెండు నాటు పడవలను (తెప్పలు) ఏర్పాటు చేశారు. తిమ్మినాయుడుపాళెం సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను సిద్ధం చేసి ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, తుడా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు వినాయకసాగర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు భజనలు నిర్వహించారు. ఈస్ట్ డీఎస్పీ నరసింహారెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ బందోబస్తును పర్యవేక్షించారు. గత ఏడాది విగ్రహం వెంట వచ్చిన వారికి మినరల్ వాటర్ ప్యాకె ట్లు, అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈసారి అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. నిమజ్జనం సాఫీగా ముగిసింది.